హైదరాబాద్ కు శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ సర్వీసులు | Sri Lankan Airlines flies to Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ కు శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ సర్వీసులు

Published Fri, Jul 24 2015 1:35 AM | Last Updated on Sun, Sep 3 2017 6:02 AM

Sri Lankan Airlines flies to Hyderabad

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : విమానయాన రంగంలో ఉన్న శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ భారత్‌లో మరిన్ని నగరాలకు సర్వీసులను పరిచయం చేయనుంది. వీటిలో హైదరాబాద్‌తోసహా వైజాగ్, చండీగఢ్ నగరాలు సంస్థ పరిశీలనలో ఉన్నాయని శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన శ్రీలంకన్ హాలిడేస్ మేనేజర్ గయన్ పేరిస్ గురువారమిక్కడ తెలిపారు. ‘ప్రస్తుతం భారత్‌లో ఏడు నగరాలకు వారానికి 86 సర్వీసులను శ్రీలంక నుంచి నడుపుతున్నాం.

భారత్‌లో కొత్త నగరాల్లో అడుగుపెట్టడం ద్వారా వీటి సంఖ్య పెంచుతాం’ అని చెప్పారు. కాగా భారత్ నుంచి 2014లో శ్రీలంకకు వెళ్లిన పర్యాటకుల సంఖ్య 2.4 లక్షలు. 2020 నాటికి ఈ సంఖ్య మూడింతలకుపైగా ఉంటుందని శ్రీలంక కన్వెన్షన్ బ్యూరో  సీఈవో విపుల వానిగశేఖర తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement