![BSNL 365 day plan offers 2GB of data daily](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/bsnl01.jpg.webp?itok=zFw9juUv)
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారుల కోసం కొత్త ప్లాన్‌ను ఆవిష్కరించింది. సంస్థ యూజర్లకు దీర్ఘకాలిక సర్వీసు అందించే లక్ష్యంతో 365 రోజుల వ్యాలిడిటీతో ఆకర్షణీయమైన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రోజూ 2 జీబీ డేటాను అందించే ఈ ప్యాక్ సంవత్సరం పొడవునా ఇంటర్‌నెట్ అవసరమయ్యే వారికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది.
కొత్త ప్లాన్ వివరాలు..
వాలిడిటీ: ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. అంటే వినియోగదారులు ఒకసారి రీఛార్జ్‌తో ఏడాది పొడవునా నిరంతరాయ సేవలను పొందవచ్చు.
రోజువారీ డేటా: వినియోగదారులకు రోజూ 2 జీబీ డేటా లభిస్తుంది. రోజువారీ లిమిట్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40 కేబీపీఎస్‌కు తగ్గుతుంది.
ధర: ఈ ప్లాన్ ధర రూ.1515.
వాయిస్ కాల్స్ ఉండవు..
ఈ ప్లాన్‌లో ప్రధానంగా డేటాపై దృష్టి సారించారు. ఇందులో ఉచిత వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్‌లు ఉండవు. అయితే బీఎస్ఎన్ఎల్ అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ వంటి అదనపు ప్రయోజనాలతో ఇతర ప్లాన్లను అందిస్తోంది. ఏడాది పొడవునా స్థిరమైన ఇంటర్నెట్ అవసరమయ్యే విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్ ప్రవేశపెట్టినట్లు బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.
ఇదీ చదవండి: ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ డీల్ దక్కించుకున్న రిలయన్స్
బీఎస్ఎన్ఎల్ విభిన్న ప్రయోజనాలతో ఇతర ప్లాన్లను కూడా అందిస్తుంది. రూ.1198 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వాలిడిటీ ఉంటుంది. నెలకు 300 నిమిషాల ఉచిత కాల్స్, 3 జీబీ డేటా, 30 ఎస్ఎంఎస్‌లు, ఉచిత రోమింగ్ అందిస్తుంది. వినియోగదారులకు ఈ ప్లాన్ కోసం నెలకు రూ.100 వరకు ఖర్చు అవుతుంది. డేటా, వాయిస్ సర్వీసులు కావాలనుకునే వినియోగదారులకు ఇది అనుకూలంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment