దేశంలోనే అతి పెద్ద లాజిస్టిక్ కంపెనీల్లో ఒకటైన వీఆర్‌ఎల్ వ్యవస్థాపకుడు విజయ్ శంకేశ్వర్ బయోపిక్‌గా రూపొందిన చిత్రం ‘విజయానంద్’. విజయ్ శంకేశ్వర్ పాత్రలో నిహాల్ నటించిన ఈ చిత్రానికి రిషికా శర్మ దర్శకత్వం వహించారు. ఆనంద్ శంకేశ్వర్ నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీని డిసెంబర్ 9న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
‘‘తన తండ్రిపై ఆధారపడకుండా విజయ్ శంకేశ్వర్ సొంత తెలివితేటలతో లారీల వ్యాపారంలోకి ఎలా ప్రవేశించారు? ఆ తర్వాత క్రమంగా ఎదుగుతూ ఓ పెద్ద లాజిస్టిక్ కంపెనీకి అధినేత ఎలా అయ్యారు? అనే నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: కీర్తన్.
Comments
Please login to add a commentAdd a comment