Vineeta Singh Success Story: భారతదేశంలో ప్రస్తుతం గొప్ప వ్యాపారవేత్తలుగా పేరుపొందిన వారిలో చాలా మంది ఉన్నత చదువులు చదువుకున్న వారు ఉన్నారు. అలాంటి కోవకు చెందిన వారిలో 'వినీత సింగ్' (Vineeta Singh) ఒకరు. ఐఐఎమ్, ఐఐటి వంటివి పూర్తి చేసిన ఈమె మంచి ప్యాకేజి వదిలి సొంతంగా బిజినెస్ ప్రారంభించి ఇప్పుడు కోట్లలో టర్నోవర్ చేస్తోంది. ఇంతకీ ఈమె చేసే బిజినెస్ ఏది? నెట్ వర్త్ ఎంత? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతదేశంలో విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరైన వినీత సింగ్ కోటి రూపాయల జాబ్ ఆఫర్ వదిలిపెట్టి 'షుగర్ కాస్మెటిక్' (Sugar Cosmetics) బిజినెస్ ప్రారంభించింది. వినీత 1987 నుంచి 2001 వరకు ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ & ఆర్.కే పురం పాఠశాల విద్యను పూర్తి చేసి ఆ తరువాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టా పొందింది.
2004లో మూడు నెలలు పాటు కోల్‌కతాలోని ITC లిమిటెడ్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసింది. 2005లో అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. లండన్, న్యూయార్క్‌లోని డ్యుయిష్ బ్యాంక్‌లో మూడు నెలల ఇంటర్న్‌షిప్ చేసిన తరువాత స్ట్రాటజిక్ ఈక్విటీ ట్రాన్సాక్షన్స్ యూనిట్, ఎమర్జింగ్ మార్కెట్స్ స్ట్రక్చర్స్ విభాగం ప్రాజెక్ట్‌లపై పనిచేసింది.
(ఇదీ చదవండి: ఈ మారుతి కార్లను ఇప్పుడే కోనేయండి.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదేమో!)
చిన్నప్పుడు ముంబైలో ఒక చిన్న ఇంట్లో నివాసమున్నప్పుడు వర్షాకాలంలో తరచూ వరదలను ఎదుర్కొని ఇబ్బందులు పడినట్లు నివేదికల ద్వారా తెలిసింది. అయితే ఇప్పుడు పొవాయ్‌లోని ఓ విలాసవంతమైన ఇంట్లో నివసిస్తోంది. చదువు పూర్తయిన తరువాత మంచి జాబ్ వచ్చినప్పటికీ వదులుకుని షుగర్ కాస్మటిక్స్ అనే సంస్థ స్థాపించింది. ఈమె నికర ఆస్తుల విలువ ప్రస్తుతం రూ. 300 కోట్లకంటే ఎక్కువ అని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: 27 ఏళ్ల తర్వాత ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు.. రిజిస్ట్రేషన్ ఇలా చేయండి)
షుగర్ కాస్మెటిక్ కంటే ముందు వినీత సింగ్ మరో రెండు వెంచర్లు ప్రారంభించి సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తరువాత దీనిని 2015లో ప్రారంభించి గొప్ప పురోగతిని పొందింది. అప్పట్లో మార్కెట్లో చెప్పుకోదగ్గ సౌందర్య సాధనాల లేకపోవడం ఆమెకు బాగా కలిసి వచ్చింది. ఈమె రియాలిటీ షో షార్క్ ట్యాంక్ ఇండియాలో జడ్జ్‌గా కూడా పనిచేసింది. చదువుకునే రోజుల్లో ప్రేమించిన కౌశిక్ ముఖర్జీని 2011లో వివాహం చేసుకుంది. ఈయన షుగర్ కాస్మెటిక్స్ సంస్థ కో-ఫౌండర్. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment