ఇప్పటివరకు మనం గతంలో చాలా మంది సక్సెస్ పీపుల్స్ గురించి తెలుసుకున్నాం. ఈ కథనంలో కంప్యూటర్ సైన్స్ రంగంలో విశిష్టమైన పేరు, తన అద్భుతమైన విజయాల కోసం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 'అనిరుధ్ దేవగన్' (Anirudh Devgan) గురించి తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, అనిరుధ్ దేవగన్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఢిల్లీ పూర్వ విద్యార్ధి. ఈయన ప్రస్తుతం ప్రముఖ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన కాడెన్స్ డిజైన్ సిస్టమ్స్ ప్రెసిడెంట్, సీఈఓ అండ్ బోర్డు మెంబర్‌గా పనిచేస్తున్నారు. స్ఫూర్తిదాయకమైన అనిరుధ్ అసాధారణ విజయాలు అతని దూరదృష్టి గల నాయకత్వానికి నిదర్శనంగా నిలుస్తాయి.
ప్రఖ్యాత సంస్థను నడిపిస్తూ.. తన రంగంలో అసమానమైన విజయాలతో చెరగని ముద్ర వేసి, అతని అనుభవం, గొప్ప నైపుణ్యంతో పాటు కంపెనీ పథాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది. ఇదే అతని వ్యక్తిగత వృద్ధిని ప్రోత్సహించింది. చివరికి అతని డొమైన్‌లో అతనిని ప్రముఖ వ్యక్తిగా మార్చింది.
ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. ఆ రంగాల్లో 50వేల కొత్త ఉద్యోగాలు!
నిజానికి 2012లో అనిరుధ్ దేవగన్ కాడెన్స్ డిజైన్ సిస్టమ్స్‌లో చేరి అనేక స్థానాల్లో పనిచేశాడు. కాగా 2017లో చివరకు కంపెనీ ప్రెసిడెంట్ అయ్యాడు. 2021లో అతనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో స్థానం లభించింది. ఆ తరువాత సీఈఓ అయ్యాడు. అనిరుధ్ ఢిల్లీలో పుట్టి పెరిగినప్పటికీ అమెరికాలోని కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో MS & PhD పూర్తి చేశాడు.
ఇదీ చదవండి: అందులోని వాహనాల ఖరీదే వేలకోట్లు.. ఆ ప్యాలెస్ గురించి తెలిస్తే షాకవుతారు!
కొన్ని నివేదికల ప్రకారం, 2022లో కాడెన్స్ సీఈఓ అయిన అనిరుధ్ దేవగన్ వార్షిక వేతనం రూ. 2,201 కోట్లు (సుమారు $264 మిలియన్లు) అని తెలుస్తోంది. ఈయన జీతం రోజుకి రూ.72 లక్షల కంటే ఎక్కువ అని చెబుతారు. దీంతో ఎక్కువ వేతనం తీసుకుంటున్న అమెరికన్ సీఈఓల జాబితాలో ఈయన కూడా ఒకరుగా ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment