Balagopal Chandrasekhar Success Story: జీవితంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఐఏఎస్ ఉద్యోగాలు కొట్టిన వ్యక్తుల గురించి మనం గతంలో తెలుసుకున్నాం.. అయితే తనకు నచ్చిన పని చేయడానికి ఐఏఎస్ ఉద్యోగాన్ని సైతం వదిలేసిన వ్యక్తి 'బాలగోపాల్ చంద్రశేఖర్' గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
1952 అక్టోబర్ 02న కేరళలోని కొల్లంలో జన్మించిన బాలగోపాల్ చెన్నైలోని లయోలా కాలేజీలో ఎకనామిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి, కేరళ యూనివర్సిటీలో PhD చదువుతున్న రోజుల్లో తల్లిదండ్రుల కోరిక మేరకు ఐఏఎస్ రాయాలనుకున్నాడు. 1976లో యుపిఎస్‌సి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి 1977 జులైలో ఐఎఎస్‌లో చేరాడు. అయితే ఆరు సంవత్సరాలకే ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలి తన సోదరుడు సి పద్మకుమార్‌తో కలిసి పెన్‌పోల్ బయోమెడికల్ పరికరాల తయారీ కంపెనీ ప్రారంభించాడు.
భారతదేశపు అతిపెద్ద బ్లడ్ బ్యాగ్..
ఈ పెన్‌పోల్ సంస్థ 1987లో కోటి రూపాయలతో బ్లడ్ బ్యాగ్‌ల తయారీని ప్రారంభించింది. భారతదేశంలో బ్లడ్ బ్యాగ్ తయారీలో అగ్రగామిగా ఉన్న చంద్రశేఖర్ 1999లో గ్లోబల్ లీడర్, జపనీస్ కంపెనీ టెరుమోతో జాయింట్ వెంచర్‌లోకి ప్రవేశించడం ద్వారా తన వెంచర్‌ను కొత్త ఎత్తులకు తీసుకెళ్లారు. ఆ తరువాత ఇది భారతదేశపు అతిపెద్ద బ్లడ్ బ్యాగ్ మేకర్ టెరుమో పెన్‌పోల్‌గా ఆవిర్భవించింది.
చంద్రశేఖర్ 2012లో కంపెనీలోని తన వాటాను జపాన్ భాగస్వామికి విక్రయించారు, 26 సంవత్సరాల సుదీర్ఘమైన, విజయవంతమైన వ్యవస్థాపక వృత్తికి విరామం ప్రకటించి 2021 నుంచి ఫెడరల్ బ్యాంక్‌లో ఇండిపెండెంట్ డైరెక్టర్ అండ్ బోర్డు ఛైర్మన్ పదవులలో ఉన్నారు.
(ఇదీ చదవండి: అమ్మేది పాత బూట్లు.. సంపాదన రూ. కోట్లు - ఓ యువకుని సక్సెస్ స్టోరీ)
ఎందరో పారిశ్రామిక వేత్తలకు ఆదర్శంగా నిలిచిన బాలగోపాల్ చంద్రశేఖర్ ఐఏఎస్ ఔత్సాహికులకు కూడా స్ఫూర్తిగా నిలిచాడు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్‌గా తన తల్లిదండ్రుల కలల ఉద్యోగాన్ని సాధించి, తరువాత వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ఐఏఎస్ వదులుకున్నాడు. నిజంగా బాలగోపాల్ యువతకు ఎంతో ఆదర్శం.. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.
Comments
Please login to add a commentAdd a comment