Balagopal
-
జనుల కోసం తపించాడతడు!
పుట్టిన ప్రతి జీవి జీవితం బాగుండాలని తపించారాయన. జీవించే హక్కు కోసం తన చివరి ఊపిరి వరకు ఆయన పోరాడారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల పరి రక్షణ కోసం ఉద్యమించారాయన. చట్టాల ఉల్లంఘనను నిలదీశారు. ఆయనే కె. బాల గోపాల్! హింస ఏదైనా, ఎవరు చేసినా ఈ హక్కుల నేత, ప్రజల న్యాయవాది వ్యతి రేకించే వారు. అది రాజ్యహింస అయినా, ప్రైవేట్ వ్యక్తుల హింస అయినా దేనినీ సహించే వారు కాదు. అభివృద్ధి పథకాల పేరిట ప్రజల జీవించే హక్కును ప్రభుత్వాలు హరిస్తు న్నాయనీ; నేల, నీరు, అడవులు వంటి ప్రకృతి ఇచ్చిన సంపదను కోట్లాదిమంది జీవనోపాధికి ఉపయోగించాలనీ సెజ్‌లను వ్యతి రేకిస్తూ పోరాటం చేశారు. భూ నిర్వాసితుల పక్షాన నిలబడ్డారు. బాలగోపాల్ సర్ 2009 అక్టోబర్ 8న ఆకస్మికంగా హైదరాబాద్‌లో మరణించారు. ప్రముఖ జర్నలిస్ట్, ఆయన సహచరి వసంత లక్ష్మి, వారి కొడుకు కళ్ళ ముందే ఆయన ఊపిరి వదిలారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పౌరహక్కుల నిజమైన ఉద్యమ గొంతు మూగ వోయింది. సర్ ఇలా అకస్మాత్తుగా వెళ్ళిపోయి 14 ఏండ్లు దాటు తున్నా ఆయన ఎక్కడో ఇంకా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆయన చివరి సారిగా మంచిర్యాలలోని మా ఇంటికి భార్యాకుమారులతో కలిసి వచ్చి భోజనం చేసి శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించి నిర్వాసితులతో మాట్లాడిన విషయాలూ, ఆయన నింపిన మనో ధైర్యం నేటికీ గుర్తుకు వస్తున్నాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన మరణవార్త కలిచి వేసింది. హడావిడిగా మిత్రులతో హైదరాబాద్ వెళ్లి ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నాను. ఎన్కౌంటర్లపై న్యాయ విచా రణ జరపాలనీ, పోలీసుల మీద హత్యా నేరం కింద కేసులు నమోదు చేయాలనీ, సంఘటనా స్థలానికి వెళ్లి నిజనిర్దారణ చేసి మరీ డిమాండ్ చేసే వారు బాలగోపాల్. లాయర్‌గా ప్రాక్టీస్ మొదలు పెట్టిన తర్వాత చాలా కేసులను ఆయన తీసుకుని వాదించారు. రాజ్యానికి ఆయనంటే గుబులు, ఆందోళన. అందుకే ఆయన్ని భౌతిక దాడులతో భయపెట్టే ప్రయత్నం చేశారు. కొత్తగూడెంలో పోలీసులు బాల గోపాల్ మీద ప్రీ ప్లాన్డ్గా దాడి చేసి కొట్టి, గాయపరిచి చచ్చి పోయాడని భావించి కాలువలో పడేసి వెళ్లిపోయారు. అప్పుడు ఆయనను చూసిన కొందరు అభిమానులు కాపాడారు. కష్టపడే వారికి కనీస వేతనాల కోసం, ఆదివాసీల హక్కుల కోసం; బొగ్గు గని కార్మికుల, కాంట్రాక్టు కార్మికుల జీవితాల మెరుగు కోసం; కాలుష్య రహిత సమాజం కోసం... మొత్తంగా మానవ హక్కుల కోసం ఆయన పోరాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా బూటకపు ఎన్కౌంటర్లు జరిగినపుడు బాలగోపాల్ వెంట వచ్చిన టీమ్‌తో నేనూ వెళ్లే వాడిని. ఆయన, నేను కలిసి కాగజ్ నగర్ నుంచి ఒక సంఘటనలో ఒకే సైకిల్ మీద నిజ నిర్ధారణకు వెళ్లిన సందర్భం ఇంకా గుర్తుంది. ఓపెన్ కాస్ట్ గనులు సృష్టించే విధ్వంసం మీద పోరాట సందర్భం అది. ఆ గనులు వద్దని ప్రజలు చేసిన ఉద్యమంలో బాలగోపాల్ పాత్ర కీలకంగా ఉండేది. లాకప్ డెత్‌లకు వ్యతిరేకంగా కూడా ఆయన కేసులు వేశారు. రాజ్యంతో పోరాడారు. కార్మికుల న్యాయమైన సమ్మె పోరాటాలను కూడా సమర్థించి వాటిల్లో పాల్గొని మద్దతు ఇచ్చేవారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఆకాంక్షించే వారు. ఉద్యమానికి మద్దతు కూడా ఇచ్చారు. ఆయన లేని లోటు ఆయన మరణించి 14 ఏండ్లు దాటినా ఇంకా భర్తీ చేసేవారు రాలేదు. బాల గోపాల్ లాంటి మనుషుల కొరత ఈ సమాజానికి ఉంది. ప్రశ్నించే వారి మీద ఉపా లాంటి కేసులు పెరిగాయి. మానవ హక్కులు ఎక్కడికక్కడ హరించ బడుతున్నాయి. దేశంలో ఒక వర్గానికి చెందిన వారిని కులం, మతం పేరు ఎమీద తీవ్ర అణచివేతకు గురి చేస్తున్నారు. లాకప్ లలో పెట్టి, పబ్లిక్‌గా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. విద్వేషాలను రెచ్చగొట్టే ఉపన్యాసాలు, పెరుగుతున్న అమానవీయ చర్యలు, తద్వారా అధి కారం నిలబెట్టుకునే ప్రయత్నం, దేశంలో పెరిగిన నిరుద్యోగం, అసమానతలు, ఆకలి, అధిక ధరలు, ఆర్థిక ఇబ్బందులు, దేశ ప్రజలను విడదీసి పాలించే విధానం... ఇన్నింటి మధ్య నలుగుతున్న జనం హక్కుల గురించి ప్రశ్నించేవారు కరవవుతున్నారు. బాల గోపాల్ మళ్ళీ రావడం కుదరదు. కాబట్టి బుద్ధిజీవులే అందుకు సిద్ధం కావాలి. అందుకు సమయం ఇదే, ఛలో ఛలో కాలం పిలుస్తోంది. బాల గోపాల్ పిలుపు ఎక్కడి నుంచో వినిపిస్తున్నట్లుంది. ఛలో ఛలో కహీన్ దేర్ న హోజాయే! ఎం.డి. మునీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు ‘ 99518 65223 (నేడు హైదరాబాద్ ఎస్వీకేలో బాలగోపాల్ 14వ సంస్మరణ సభ) -
అనుకున్నదాని కోసం ఐఏఎస్ వదిలేసాడు - ఎవరీ బాలగోపాల్ చంద్రశేఖర్!
Balagopal Chandrasekhar Success Story: జీవితంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఐఏఎస్ ఉద్యోగాలు కొట్టిన వ్యక్తుల గురించి మనం గతంలో తెలుసుకున్నాం.. అయితే తనకు నచ్చిన పని చేయడానికి ఐఏఎస్ ఉద్యోగాన్ని సైతం వదిలేసిన వ్యక్తి 'బాలగోపాల్ చంద్రశేఖర్' గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. 1952 అక్టోబర్ 02న కేరళలోని కొల్లంలో జన్మించిన బాలగోపాల్ చెన్నైలోని లయోలా కాలేజీలో ఎకనామిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి, కేరళ యూనివర్సిటీలో PhD చదువుతున్న రోజుల్లో తల్లిదండ్రుల కోరిక మేరకు ఐఏఎస్ రాయాలనుకున్నాడు. 1976లో యుపిఎస్సి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి 1977 జులైలో ఐఎఎస్‌లో చేరాడు. అయితే ఆరు సంవత్సరాలకే ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలి తన సోదరుడు సి పద్మకుమార్‌తో కలిసి పెన్పోల్ బయోమెడికల్ పరికరాల తయారీ కంపెనీ ప్రారంభించాడు. భారతదేశపు అతిపెద్ద బ్లడ్ బ్యాగ్.. ఈ పెన్పోల్ సంస్థ 1987లో కోటి రూపాయలతో బ్లడ్ బ్యాగ్‌ల తయారీని ప్రారంభించింది. భారతదేశంలో బ్లడ్ బ్యాగ్ తయారీలో అగ్రగామిగా ఉన్న చంద్రశేఖర్ 1999లో గ్లోబల్ లీడర్, జపనీస్ కంపెనీ టెరుమోతో జాయింట్ వెంచర్లోకి ప్రవేశించడం ద్వారా తన వెంచర్‌ను కొత్త ఎత్తులకు తీసుకెళ్లారు. ఆ తరువాత ఇది భారతదేశపు అతిపెద్ద బ్లడ్ బ్యాగ్ మేకర్ టెరుమో పెన్పోల్గా ఆవిర్భవించింది. చంద్రశేఖర్ 2012లో కంపెనీలోని తన వాటాను జపాన్ భాగస్వామికి విక్రయించారు, 26 సంవత్సరాల సుదీర్ఘమైన, విజయవంతమైన వ్యవస్థాపక వృత్తికి విరామం ప్రకటించి 2021 నుంచి ఫెడరల్ బ్యాంక్‌లో ఇండిపెండెంట్ డైరెక్టర్ అండ్ బోర్డు ఛైర్మన్ పదవులలో ఉన్నారు. (ఇదీ చదవండి: అమ్మేది పాత బూట్లు.. సంపాదన రూ. కోట్లు - ఓ యువకుని సక్సెస్ స్టోరీ) ఎందరో పారిశ్రామిక వేత్తలకు ఆదర్శంగా నిలిచిన బాలగోపాల్ చంద్రశేఖర్ ఐఏఎస్ ఔత్సాహికులకు కూడా స్ఫూర్తిగా నిలిచాడు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్‌గా తన తల్లిదండ్రుల కలల ఉద్యోగాన్ని సాధించి, తరువాత వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ఐఏఎస్ వదులుకున్నాడు. నిజంగా బాలగోపాల్ యువతకు ఎంతో ఆదర్శం.. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
ఇదేనా రాజ్యాంగ స్ఫూర్తి?
కథ కొత్త మలుపులు తిరిగినట్టే, కేరళ ప్రభుత్వానికీ, ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌కూ మధ్య వరుస వివాదాల్లో కొత్త అంకం వచ్చి చేరింది. కేరళ ఆర్థిక మంత్రి కె.ఎన్. బాలగోపాల్పై తాను విశ్వాసాన్ని కోల్పోయాననీ, ఆయనపై చర్య తీసుకోవాలనీ ముఖ్యమంత్రిని గవర్నర్ కోరడం దిగ్భ్రాంతికరం. నిన్న గాక మొన్న 11 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లపై కినిసిన మహాప్రభువులకు ఇప్పుడు మంత్రి గారిపై విరక్తి కలిగింది. దానికి ఆయన కారణాలు ఆయనకున్నాయి. దేశ సమైక్యతకు భంగం కలిగేలా మంత్రి మాట్లాడారనీ, పదవీ ప్రమాణాన్ని ఉల్లంఘించారనీ, కడకు గవర్నర్‌గా తన విశ్వాసాన్ని మంత్రి కోల్పోయారనీ... ఆరిఫ్ ఆరోపణ. అధికార ఎల్డీఎఫ్ సర్కార్ సారథి పినరయ్ విజయన్ మాత్రం సదరు మంత్రిపై తనకు పూర్తి విశ్వాసం ఉందంటూ, గవర్నర్ డిమాండ్‌ను తోసిపుచ్చాల్సి వచ్చింది. గవర్నర్ చర్యను తప్పుబడుతూ అధికార, ప్రతిపక్షాలు ఒకే స్వరం వినిపిస్తున్నాయంటే ఆరిఫ్ గీత దాటేశారని అర్థమవుతోంది. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలకూ, రాజ్‌భవన్‌కూ పెరుగుతున్న దూరంపై అర్థవంతమైన చర్చ అవసరమని గుర్తుచేస్తోంది. కేరళలో తలుచుకుంటే మంత్రులను సైతం ఇంటికి పంపే అధికారం తనకు ఉందని కొద్దివారాల క్రితం రాష్ట్రపెద్ద హూంకరించారు. ఆ వివాదం సద్దుమణగక ముందే సుప్రీమ్ కోర్ట్ ఓ నియామకంలో ఇచ్చిన ఉత్తర్వును సాకుగా తీసుకొని, 11 విశ్వవిద్యాలయాల వీసీల నియామక ప్రక్రియను తప్పు పడుతూ, తప్పుకోవాల్సిందిగా ఆదేశించారు. అదీ అవాంఛనీయంగా ట్విట్టర్లో చెప్పారు. హైకోర్ట్ జోక్యంతో ఆ కథలో కొత్త దృశ్యం నవంబర్ మొదటి వారానికి వాయిదా పడిందో లేదో, ఓ విశ్వ విద్యాలయంలో ఆర్థిక మంత్రి ప్రసంగాన్ని తప్పుబడుతూ ఆరిఫ్ కొరడా తీశారు. అన్ని ప్రాంతాల వారినీ కలుపుకొనిపోతూ కేరళ విశ్వవిద్యాలయాలు ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నాయని మంత్రి గత వారం అన్నారు. విద్యార్థి నేతగా యూపీలోని విశ్వవిద్యాలయంలో చూసిన కాల్పుల ఘటనల్ని ప్రస్తావించారు. అది ఆరిఫ్‌కు సుతరామూ నచ్చినట్టు లేదు. దాంతో పరోక్షంగా పదవీచ్యుతుణ్ణి చేయమనే ప్రతిపాదన తెచ్చారనుకోవాలి. వరస చూస్తే– కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నియుక్తులైన గవర్నర్, కేరళలో ప్రజలెన్నుకున్న వామపక్ష ప్రభుత్వంపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారనిపిస్తుంది. అలాగని కొన్నిసార్లు ప్రజాప్రభుత్వాలు గవర్నర్ గౌరవాన్ని మరీ తేలికగా తీసుకున్న ఘటనలూ లేవనీ అనలేం. వీసీల నియామకంలో గవర్నర్ అధికారాలకు కత్తెర వేస్తూ వివాదాస్పద విద్యాబిల్లు తెచ్చినప్పటి నుంచి కేరళ సర్కార్‌కూ, ఆరిఫ్కూ మధ్య అగాధం ఏర్పడినట్టుంది. నిజానికి వీసీలు సహా వివిధ నియామకాల్లో లాంఛనపూర్వక పాత్ర పోషించాల్సిన గవర్నర్లు లక్ష్మణరేఖ దాటుతున్నా రనే ఆరోపణ తరచూ వింటున్నాం. గవర్నర్ పాత్రను మరింత పరిమితం చేసేందుకు ఆ మధ్య తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల్లోనూ ప్రయత్నాలు సాగడం గమనార్హం. రాజ్యాంగబద్ధమైన ఉన్నత నియామక పదవుల్లో ఉన్నవారు రాజకీయాలకు అతీతంగా ఉండాలి. కనీసం ఉన్నట్టయినా కనిపించాలి. అలాంటిది... కూర్చున్న కుర్చీని మర్చిపోయి, ఆ పదవికి కారణమైనవారి పట్ల మునుపటి ప్రభుభక్తిని ప్రదర్శించాలనుకుంటేనే సమస్య. గవర్నర్ పదవిలో రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలను మించి వ్యక్తిగత అజెండాకు తగ్గట్టు ప్రవర్తిద్దామనీ, ఆభిజాత్యం ప్రదర్శిద్దామనీ అనుకుంటే పదే పదే అగ్గి రాజుకుంటుంది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ, పుదుచ్చేరి, తెలంగాణ రాష్ట్రాలు సహా ఇప్పుడు కేరళలోనూ జరుగుతోంది అదే. ఒకప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ సారథ్య ప్రభుత్వాలున్నప్పుడు పలు రాష్ట్రాల గవర్నర్లు ఇలాగే నాటి ప్రధానమంత్రుల చిత్తానుసారం వ్యవహరించేవారనే విమర్శలున్నాయి. అప్పట్లో వివిధ సందర్భాల్లో పలు రాష్ట్ర ప్రభుత్వాల రద్దు, ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధింపు ఇలాంటి ప్రభుభక్తి పరాయణత పర్యవసానమే. తెలుగునాట ప్రజాబలంతో గద్దెనెక్కిన ఎన్టీఆర్‌ను గవర్నర్ రామ్‌లాల్ పక్కకు తప్పించడం, ప్రజా ఉద్యమంతో ఎన్టీఆర్ తిరిగి పగ్గాలు చేపట్టడం, రామ్‌లాల్ కథ కంచికి చేరడం లాంటివన్నీ చరిత్రలో మర్చిపోలేని పాఠాలు. తమిళనాట గవర్నర్ చెన్నారెడ్డి వర్సెస్ సీఎం జయలలిత లాంటి కథలూ చూశాం. తాజాగా వివిధ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు కయ్యానికి కాలు దువ్వుతున్న తీరు అంతకన్నా ఒక మెట్టు పైనే ఉంది. పైకి ఇది సీఎంలకూ, గవర్నర్లకూ మధ్య కయ్యంగా కనిపించినా, అంతకన్నా లోతైన రాజకీయమే ఉంది. కేంద్ర పెద్దల ఆదేశంతో వీరిలా చేస్తున్నారో లేదో కానీ, అండ లేకుండానే ఈ దుస్సాహసాలకు దిగుతారనుకోలేం. రాష్ట్రం చేసే చట్టాలు, నియామకాలపై అభ్యంతరాలుంటే పునఃపరిశీలన కోరే అధికారం రాజ్యాంగం గవర్నర్లకిచ్చింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అంతకు మించి ఆ విచక్షణాధికారాల్ని ఉపయోగించే ప్రయత్నాలతోనే తంటా. అందుకే, కొందరు గవర్నర్ల తీరు మొత్తం ఆ వ్యవస్థకే అప్రతిష్ఠ తెస్తోంది. సమాఖ్య వ్యవస్థలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలనూ, వాటి నిర్ణయాలనూ పరి హాసం చేస్తున్న గవర్నర్ వ్యవస్థపై చర్చను ప్రేరేపిస్తోంది. ఇటు ప్రజాతీర్పుతో గద్దెనెక్కినవారు, అటు రాజ్యాంగ పదవిలో ఉన్నవారు తమ హక్కులు, బాధ్యతల్ని గుర్తెరిగి ప్రవర్తిస్తే వ్యవహారం ఇంత దూరం రాదు. మరీ ముఖ్యంగా, ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి నుంచి ఆ హుందాతనం మరింతగా ఆశిస్తాం. ఆ సంగతి ఆరిఫ్ లాంటి వారికి పదే పదే గుర్తుచేయాల్సి రావడమే విచారకరం. నిలువునా చీలిన నేటి రాజకీయ వాతావరణంలో ఈ పరిస్థితి మారుతుందా అన్నది అనుమానమే! -
ముదురుతున్న వివాదం.. కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎం
తిరువనంతపురం: కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి, గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్‌కు వివాదం ముదురుతోంది. ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టేలా వర్సిటీ విద్యార్థుల దగ్గర ప్రసంగాలు చేశారని, ఆయనపై రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం పినరయి విజయన్‌కు గవర్నర్ సూచించారు. ఆర్థిక మంత్రిపై తాను విశ్వాసం కోల్పోయానని, ఆయన్ను పదవి నుంచి తొలగించాలన్న అర్థం వచ్చేలా బుధవారం లేఖ రాశారు. గవర్నర్ డిమాండ్‌ను సీఎం తోసిపుచ్చారు. యూపీ నుంచి వచ్చే విద్యార్థులకు కేరళలో పరిస్థితులు అర్థం కావడం సంక్లిష్టంగా ఉంటుందని ఈ నెల 18న కేరళ వర్సిటీలో విద్యార్థుల సమావేశంలో బాలగోపాల్ అన్నారు. ‘‘మంత్రి తన ప్రమాణాన్ని మరిచారు. దేశ ఐక్యత, సమగ్రతలను తక్కువ చేసి చూపిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి పదవిలో ఉండకూడదు. ఆయన నా విశ్వాసాన్ని కోల్పోయారు’’ అంటూ లేఖలో పేర్కొన్నారు. మంత్రిపై తనకు పరిపూర్ణ విశ్వాసముందంటూ సీఎం ఘాటుగా బదులిచ్చారు. ఆయనను తప్పించడానికి ఏ కారణాలూ లేవన్నారు. కేరళలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకం అంశంలో ఇప్పటికే ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. -
K.Balagopal: మానవ హక్కుల వకీలు
అసాధారణ మేధస్సు, నిరంతర అధ్యయనం, విస్తృత విషయ పరిజ్ఞానం, వాగ్ధాటి, రచనా కౌశలం, ఆత్మీయత, ఆచరణశీలత, నిబద్ధత, నిమగ్నత, కార్యదీక్ష, అంకితభావం, మానవీయతా సుగుణం వంటి లక్షణాలన్నింటినీ తనలో మూర్తీభవింపజేసుకున్న అపురూప మేధావి బాలగోపాల్. కశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా తలెత్తిన హక్కుల ఉల్లంఘనలపై ఆయన ఉద్యమించారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హక్కుల ఉద్యమాలకు ఆయన దశ–దిశని నిర్దేశించి వెన్నుదన్నుగా నిలిచారు. బాలగోపాల్ మధ్య తరగతి పండిత కుటుంబంలో 1952, జూన్ 10 నాడు నాగమణి, పార్థనాథశర్మ దంపతులకు జన్మించారు. అయినా ఆయన నిరంతరం పేద, దళిత, గిరిజన, మైనారిటీ, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. ఆయన గణితశాస్త్ర విద్యార్థి అయినా... చరిత్ర, తత్వశాస్త్రం, అర్థశాస్త్రాలను విస్తృతంగా అధ్యయనం చేసి సమాజ పోకడలను సునిశితంగా పరిశీలించారు. రాజ్యాంగంలో హక్కుల అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నా నిరంకుశ ప్రభుత్వాల అణచివేత విధానాల వల్ల పౌరులు ఆయా హక్కులు పొందలేకపోవడాన్ని చూసి చలించిపోయారు. బాలగోపాల్ వరంగల్‌లోని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎమ్మెస్సీ అప్లైడ్ మాథ్స్ని అభ్యసించి అక్కడే డాక్టరేట్ చేస్తున్న క్రమంలో రాడికల్ విద్యార్థి సంఘం కార్యకలాపాలను చూస్తూ వాటికి ప్రభావితులయ్యారు. కమ్యూనిస్టులు వాస్తవాన్ని అతిశయం చేసి చెప్తారని మొదట్లో నమ్మిన బాలగోపాల్... కమ్యూనిస్టులు తమ విశ్వాసాల కోసం ప్రాణాలు పణంగా పెట్టడాన్ని గమనించి ముఖ్యంగా విప్లవ కమ్యూనిస్టుల పట్ల తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నారు. రాడికల్ విద్యార్థి సంఘం నాయకులు సూరపనేని జనార్ధన్ ఎన్కౌంటర్, జన్ను చిన్నాలు హత్యా సంఘటనల తర్వాత ప్రజల కోసం ఒక క్రియాశీల కార్యకర్తగా పనిచేయాలని బాలగోపాల్ బలంగా నిర్ణయించుకొని 1981లో ‘ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం’లో చేరారు. వరంగల్ రాజకీయ పరిస్థితులు లెక్కల మేధావిగా ఉన్న బాలగోపాల్‌ని హక్కుల కార్యకర్తగా తీర్చిదిద్దాయి. 1983లో ఖమ్మంలో జరిగిన పౌర హక్కుల సంఘం రాష్ట్ర రెండవ మహాసభలో ఆయన ఆ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో తాను చేస్తున్న గణితశాస్త్ర అధ్యాపక ఉద్యోగం ఉద్యమాలకు అడ్డు రావడంతో ఆ ఉద్యోగాన్ని సైతం తృణీకరించి పూర్తికాలపు హక్కుల కార్యకర్తగా మారారు. బాలగోపాల్ పౌర హక్కుల సంఘంలో గుణాత్మక మార్పులు తీసుకువచ్చి హక్కుల ఉద్యమంలో నూతన ఒరవడితో ఉద్యమించారు. కానీ కాల క్రమంలో తానే తీర్చిదిద్దిన పౌర హక్కుల సంఘం నుండి ఆయన వైదొలిగి 1998, అక్టోబర్ 11 నాడు ‘మానవ హక్కుల వేదిక’ను స్థాపించారు. బాలగోపాల్ పౌర హక్కుల సంఘంలో పనిచేస్తున్న సమయంలో బెంగళూర్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న వివేకానంద న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ డిగ్రీని అభ్యసించారు. 1997లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా తన పేరుని నమోదు చేయించుకున్నారు. ఆయన న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించక పూర్వమే చట్టాలు, న్యాయశాస్త్రంలో ఉన్న ఆనుపానులు, తర్కాన్ని సమగ్రంగా అవగాహన చేసుకోవడం వల్ల... పెద్దగా సీనియర్ న్యాయవాదుల అవసరం రాలేదు. కాని చట్టం పని విధానంలో ముందుకు వెళ్తున్నప్పుడు ప్రొసీజర్ విధానంలో ఆయన సీనియర్ న్యాయవాది కేజీ కన్నాభిరాన్ దగ్గర సలహాలు తీసుకొని ఆ ప్రకారం ముందుకు సాగారు. బాలగోపాల్ ప్రధానంగా హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులలో బాధితుల పక్షం నిలబడి చట్ట ఫలితాలను వారికి అందించారు. దళితులు, గిరిజనులు, కార్మికులు, ఉద్యోగులు, భూవివాదాలకు సంబంధించిన అన్ని కేసులను ఆయన వాదించారు. అలాగే లేబర్ కోర్ట్, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటిటివ్ ట్రిబ్యునల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటిటివ్ ట్రిబ్యునల్, లేబర్ కమిషన్ ఆఫీసుల కేసులను కూడా ఆయన వాదించారు. నక్సలైట్లకు సంబంధించి అనేక హెబియస్ కార్పస్ పిటిషన్లను వేసి సబంధిత వ్యక్తులను కోర్టులకు హాజరుపరిచేలా నిరంతర కృషి చేశారు. చుండూరు హత్యాకాండ కేసులో బాలగోపాల్ బాధిత దళితులకు అండగా నిలబడి హైకోర్టులో అత్యున్నత వాదనలు వినిపించి దళిత హక్కులకు బాసటగా నడిచారు. అదేవిధంగా ‘షెడ్యూల్డ్ ట్రైబల్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ యాక్ట్’ని అమలు చేయడం కోసం గిరిజనులు చేసిన పోరాటానికి ఆయన బాసటగా నిలిచారు. కోర్టులో ఆ చట్టాన్ని గెలిపించడంలో అసామాన్యమైన కృషి చేశారు. ఈ చట్టం ద్వారా గిరిజనులకు 2009లో భూములు పంచబడ్డాయి. బాలగోపాల్ చేపట్టిన ముఖ్యమైన కేసులలో అత్యంత ముఖ్యమైన కేసు ఎన్కౌంటర్ల కేసు. ‘పోలీసులకు ప్రాణం తీసే హక్కు లేదనీ, పోలీసులు ఎన్కౌంటర్ల నుండి తప్పించుకోవడానికి వీలు లేదనీ, పోలీసులపై కూడా హత్యాచారం కింద కేసులు పెట్టవచ్చ’నీ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఆయన బలమైన వాదనలు వినిపించి ‘పోలీసులపై కూడా న్యాయ విచారణని జరిపించాలి’ అనే తీర్పుని తీసుకురాగలిగారు. ఆ తీర్పు రావడం వెనకాల బాలగోపాల్ 30 ఏళ్ల నిర్విరామ కృషి ఉంది. అనేక హక్కుల సంఘాలు మిళితమైన ఈ కేసులో బాలగోపాల్‌తో పాటు కేజీ కన్నాభిరాన్, బొజ్జా తారకం తదితరులు తమ వాదనలు వినిపించారు. (క్లిక్ చేయండి: వికేంద్రీకరణతోనే సమన్యాయం) హక్కుల నిరాదరణకు గురైనప్పుడు ప్రజలు చైతన్యంతో గొంతెత్తి ప్రశ్నిస్తే హక్కులు అమలు కాబడుతాయని బాలగోపాల్ విశ్వసించారు. ప్రజా హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న ఆయన 2009, అక్టోబర్ 8 నాడు తుది శ్వాస విడిచినా ‘చెరగని హక్కుల స్ఫూర్తి’గా వెలుగొందుతున్నారు. (క్లిక్ చేయండి: మంచి అడుగే... మార్పులు అవసరం) - జె.జె.సి.పి. బాబూరావు పరిశోధక విద్యార్థి (అక్టోబర్ 8న కె.బాలగోపాల్ వర్ధంతి) -
హక్కుల ఉద్యమ కరదీపిక
‘అందరికీ ఒకే విలువ ‘ అన్న అంబేడ్కర్ కాగడాను స్వతంత్ర భారత హక్కుల ఉద్యమ చరి త్రలో మూడు దశాబ్దాల పాటు కొనసాగించిన అసాధారణ వ్యక్తి బాలగోపాల్. మేధావిగా, రచయితగా, కార్యకర్తగా ఉన్నత మానవ విలువల దిశగా సమాజాన్ని మార్చడం కోసం ప్రజాతంత్ర ఉద్యమాల హక్కుల పరిరక్షణ ఉద్యమాల నిర్మాణంలో చిరస్మరణీయ పాత్రను పోషించాడు. జూన్ 10, 1952లో పార్థనాధ శర్మ, నాగమణి దంపతులకు బళ్లారిలో జన్మించిన బాలగోపాల్ నెల్లూరు, తిరుపతిలో పాఠశాల, కళాశాల విద్యను పూర్తి చేసుకున్నాడు. రీజనల్ ఇంజనీరింగ్ కళాశాల వరంగల్‌లో ఎంఎస్సీ అప్లయిడ్ మాథ్‌్సను, అలాగే స్వల్పకాలంలో పీహెచ్‌డీని పూర్తి చేసిన అసాధారణ ప్రతిభావంతుడు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్సిస్టిట్యూట్ ఢిల్లీ నుండి పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్‌ను సాధించాడు. తెలంగాణ రైతాంగ సాయుధపోరు, ఎమర్జెన్సీ వ్యతిరేక పోరు, నక్సల్బరీ పోరాటలకు భూకంప కేంద్రంగా ఎరుపెక్కిన వరంగల్ బాలగోపాల్‌లో తీవ్రమైన మేధోమథనాన్ని కల్గించింది. శివసాగర్, కాళోజీ, కేఎస్, వరవరరావు వంటి ఉద్యమ సారథులతో పరిచయాలు, సాన్నిహిత్యం, మార్క్స్, గ్రాంసీ, రస్సెల్ తత్వశాస్రా్తల అధ్యయనంతో నిబద్ధత, సామాజిక బాధ్యతతో పనిచేసే అధ్యాపకునిగా మారిపోయాడు. 1981–1985 వరకు కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశాడు. దున్నేవారికే భూమి కావాలనే పోరాటకారులను బూటకపు ఎన్కౌంటర్లతో అంతం చేయడాన్ని తీవ్రంగా ప్రతిఘటించాడు. ప్రభుత్వమైనా, ఉద్యమసంస్థలైనా జీవించే హక్కును కాలరాయడం అమానవీయమైన నేరంగా ప్రకటించాడు. 1984లో పౌరహక్కుల సంఘ ప్రధాన కార్యదర్శిగా మరింత క్రియాశీలకంగా పనిచేశాడు. ప్రజల డాక్టర్ రామనాథం హత్య తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి కార్యకర్తగా మారాడు. తన సహచరులు నర్రా ప్రభాకర్ రెడ్డి, అజం ఆలీ, లక్ష్మారెడ్డిలను కోల్పోయినా చెదరని స్థైర్యంతో హక్కుల ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించాడు. ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక ప్రతిపత్తిని కాపాడే రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూళ్లను పటిష్టంగా అమలు చేయాలని కోరాడు. అనుమానం ఉంటే చాలు.. చంపేసే ‘సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం’ను ఉపసంహరించాలని కోరాడు. తన జీవిత కాలంలో సందర్శించిన ఏకైక దేశం’ జమ్మూకశ్మీర్ అని ప్రకటించాడు. కశ్మీర్ రాజా హరిసింగ్‌తో కుదుర్చుకున్న షరతుల ఒప్పం దాన్ని భారత పాలకులు ఉల్లంఘించడం వల్లే కలల లోయ కల్లోల లోయగా మారిందని, 1995 నుంచి 2005 వరకు ఐదుసార్లు కశ్మీర్లో పర్యటించి వాస్తవాలను ప్రపంచానికి తెలియచేశాడు. బ్రిటిష్ కాలంనుంచి ఇప్పటిదాకా దేశం సాధించిన అభివృద్ధి పేరుతో జరిగిన విధ్వంసాలకు అధికంగా నష్టపోతున్నది గిరిజనులేనని, ఎక్కువగా తిరుగుబాట్లు చేసిందీ వారేనని చెప్పాడు. ఇంద్రవెల్లి నుండి వాకపల్లి వరకు ఆదివాసీలపై జరిగే దాడులను ఖండిస్తూ వారి ఉద్యమాలకు సంఘీభావం ప్రకటిస్తూ న్యాయ సహాయాన్ని అందించాడు. కృష్ణా, గోదావరి జలాల పంపిణీలో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కడం లేదని, ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర డిమాండ్ అత్యంత ప్రజాస్వామికమని చెప్పాడు. సామాజిక ప్రయోజనార్థం అంబేడ్కర్ తర్వాత అధికంగా రాసిన వ్యక్తిగా బాలగోపాల్ ప్రఖ్యాతి గాంచాడు. దుఃఖిత మానవాళిపై అనుకంపన, విసుగు ఎరగని, విరతి లేని జ్ఞానాన్వేషణతో సామాజిక కార్యకర్తలకు కరదీపిక అయ్యాడు. తల్లిదండ్రులకు, గురువుకు, దేశానికి ప్రతి మనిషీ రుణపడి ఉంటాడు. మేధావికి మరో రుణం కూడా ఉంది. తన తలను పొలంగా మార్చి, దున్ని ఎరువులు వేసి పంట లను ప్రజలకు పంచడం. ఇది తీర్చవలసిన బాకీ. తల బీడు పడిపోయేదాక, ఆ తర్వాత ప్రపంచం శాశ్వతంగా ఆ మేధావికి బాకీ పడి ఉంటుంది. బాలగోపాల్‌ను ప్రేమిద్దాం, కొనసాగిద్దాం. (నేడు బాలగోపాల్ 10వ వర్ధంతి) వ్యాసకర్త : అస్నాల శ్రీనివాస్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం సభ్యులు సెల్ : 96522 75560 -
ప్రజాస్వామిక సంస్కృతిని కాపాడుకుందాం!
రెండేళ్ల క్రితం ఎన్నికలు జరిగి కేంద్రంలో, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడినపుడు ఏదైతే జరుగుతుందని ఊహించామో, భయపడ్డామో, ఆందోళన చెందామో ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రజాస్వామ్య సంస్కృతి, విలువలపట్ల ప్రభుత్వాలకు, వాటి అండ గల శక్తుల్లో అసహనం తారస్థాయికి చేరింది. భిన్నాభిప్రాయాలు కలిగిన వారిపై వారు చేస్తున్న బౌద్ధిక, భౌతిక దాడులకు లెక్కే లేదు. యూనివర్సిటీల నుంచి ఉడీ దాకా ‘దేశభక్తి’ పేరిట తమను వ్యతిరేకించిన అందరినీ దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. గోర క్షణ నెపంతో రాజకీయాలు నడుపుతున్నారు. మతం, జాతీయత, దేశభక్తి పదాలతో వారు ప్రజలను మానసికంగా బ్లాక్మెయిల్ చేస్తున్నందువల్ల సరిహద్దుల్లోనే కాదు దేశంలోనూ యుద్ధోన్మాద విద్వేష ప్రచారం నాట్యం చేస్తోంది. మనం ఆందోళన చెందవల సింది ప్రజాస్వామ్య విలువలకు ఎదురవుతున్న ప్రమాదాన్నే. ఈ ప్రయత్నాలు జరగడం లేదని కాదు. అన్యాయమైన ఆరో పణలు ఎదుర్కొని రోహిత్ వేముల మరణించినప్పుడు హైదరా బాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పెల్లుబికిన విద్యార్థి ఆందోళన అలాంటి ప్రయత్నాల్లో ఒకటి. భూసేకరణ చట్టాన్ని పక్కనపెట్టి అన్యాయమైన జీవో ఒకటి జారీచేసి పంట పొలాల స్వాధీనానికి తెలంగాణ ప్రభుత్వం పూనుకున్నప్పుడు మల్లన్నసాగర్ రైతులు చేసిన ఆందోళన అలాంటి ప్రయత్నాల్లో ఒకటి. ఢిల్లీలోని జేఎన్ యూలోను, గుజరాత్‌లోని ఉనాలోను, చాలాకాలంగా కశ్మీర్ లోను, ఛత్తీస్‌గఢ్‌లోను జరుగుతున్న ఆందోళనలన్నీ కూడా అప్ర జాస్వామిక ధోరణులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలే. బాలగోపాల్ ఏడో వర్ధంతి సందర్భంగా అలాంటి కొన్ని ఆందోళనలలో పాల్గొన్న వ్యక్తులను వక్తలుగా ఆహ్వానించాం. జూలై 8న బుర్హాన్ వాని (22) ఎన్కౌంటర్ తర్వాత కశ్మీర్ ఎంతగా రగిలిపోయిందో గత 3 నెలలుగా చూస్తూనే ఉన్నాం. 60 రోజుల కర్ఫ్యూ, 88 మంది మృతి, పెల్లెట్ గాయాలకు వందల మంది కంటిచూపు కోల్పోవడం.. ఇంత జరిగినా భారత రాజ్యా నికి, పౌర సమాజానికి కశ్మీర్ భూభాగం తప్ప మనుషులు కనబ డటం లేదు. ప్రజా ఆకాంక్షల మేరకే సరిహద్దులు ఏర్పడాలి, సమసిపోవాలి అని మాట్లాడటమే రాజ ద్రోహమై కూర్చుంది. కశ్మీర్‌ను ఎప్పటికీ సరిహద్దు తగాదాగానే చూద్దామా? అదొక నెత్తురోడుతున్న గాయంలా మనకు ఎప్పుడు కనిపిస్తుంది? ప్రస్తుత కశ్మీర్ పరిస్థితిని చెప్పేందుకు ఈ సభకు రావాల్సిన జేకేసీసీఎస్ నాయకుడు ఖుర్రం పర్వేజ్‌ను అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఆయన స్థానంలో అదే సంస్థకు చెందిన జమీర్ అహ్మద్ కశ్మీర్ పరిస్థితి మీద మాట్లాడనున్నారు. ఇతరులను జాతిద్రోహులని ముద్రలు వేసే ఈ ప్రభుత్వాలు ఛత్తీస్‌గఢ్‌లో మటుకు ‘బైట’ రాష్ట్రాల మేధావులను తరిమికొట్టి, రాజపక్సే ఫార్ములాను అమలు పరచాలని చూస్తున్నాయి. ‘బైట’ రాష్ట్రాల న్యాయవా దులు అక్కడ వాదించకూ డదు. ‘బైట’ రాష్ట్రాల విలేక రులు అక్కడ ఉండి వార్తలు రాయకూడదు. పోలీసులు స్థాపించిన ‘అగ్ని’ సంస్థ మావో యిస్టులకు వ్యతిరేకంగా ‘లల్కార్’ యాత్రలు తీస్తుంది కాని సోని సోరిని మట్టుకు తిరంగా యాత్ర తీయనీయదు. దుర్గ-మహి షాసురుని కథపై తమకే గుత్త ఉన్నట్లు.. దానికి వేరే భాష్యం చెప్పిన వామపక్ష ఆదివాసీ ఉద్యమ కారుడు మనిష్ కుంజంపై కేసు పెట్టింది. కల్లోల ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుతం ఏమి జరుగుతున్నదో మనిష్ కుంజం మనతో పంచుకోనున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఆలోచనలకు పహారా కాస్తున్నారు. విద్యార్థులెవరూ కశ్మీర్, ఛత్తీస్‌గఢ్ గురించి మాట్లాడకూడదు. ముజఫర్‌నగర్ గురించి, అక్కడి సహాయక శిబిరాల్లో చనిపోతున్న పిల్లల గురించి మాట్లాడకూడదు. అఖ్లాక్ హత్యపై అసలే మాట్లాడ కూడదు. మాట్లాడితే రోహిత్ వేములను నెట్టినట్లే మృత్యువు నోట్లోకి నెడతారు. ఒక చేతిలో బాబాసాహెబ్ పటాన్ని, మరో చేతిలో పక్కబట్టలను పట్టుకుని వెనక్కి తిరిగి చూసుకుంటూ రోహిత్ తారలను వెతుక్కుంటూ వెళ్లిపోయాడు. రోహిత్ నమ్మకా లను పంచుకున్న మనం రాధిక గారి కడుపుకోతను చూసి బాధప డుతున్నాం కానీ వీసీ అప్పారావు దగ్గర నుంచి కేంద్ర మంత్రుల వరకు ఒక్కరికీ తప్పు చేసామన్న అపరాధ భావం లేదు. ఆదివాసీలపై, పేదవారిపై, స్త్రీలపై, ప్రతి అణగారిన వర్గంపై జరుగుతున్న జులుంకి వ్యతిరేకంగా ‘హల్లా బోల్’ అంటున్న జేఎన్‌యూ ఉద్యమ విశేషాలను (బసొ) కార్యకర్త అయిన జేఎన్ యూ విద్యార్థి ఉమర్ ఖాలిద్ వివరించనున్నారు. ప్రేమ, బాధ, జీవితం, మృత్యువు వంటి విషయాలలో సైతం మహా మొరటుగా వ్యవహరించే కుల వ్యవస్థ విషపరిష్వంగంలో కూరుకుపోయిన విశ్వవిద్యాలయాలను సంస్కరించాల్సింది ఎలాగో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కేవై రత్నం చెబుతారు. హిందుత్వవాదం మన మెదళ్లకు చుడుతున్న ఉరితాళ్లన్నిటినీ తెంచే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఊపిరి సలపడం లేదు. బాల గోపాల్ 7వ వర్ధంతి సందర్భంగా అందరం కలుద్దాం. విందాం. పరిస్థితులు మెరుగవుతాయో ఆలోచిద్దాం. అందరూ రండి. బాలగోపాల్ 7వ వర్ధంతి సందర్భంగా నేడు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల దాకా హైదరాబాద్ బాగ్‌లింగం పల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మానవహక్కుల వేదిక ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరుగనుంది. బాలగోపాల్ రాసిన నాలుగు పుస్తకాలు కూడా ఈ సభలో ఆవిష్కృతమవుతాయి. బాల గోపాల్ తెలుగు ఉపన్యాసాల డీవీడీ, సీడీని కూడా నేడు విడుదల చేయడం జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. - వీఎస్ కృష్ణ, మానవహక్కుల వేదిక 94404 11899 -
స్వగ్రామం చేరుకున్న బాలగోపాల్ మృతదేహం
విజయవాడ: అమెరికాలో దొంగల చేతిలో దారుణ హత్యకు గురైన కృష్ణాజిల్లా వాసి పి. బాలగోపాల్ మృతదేహం గురువారం స్వగ్రామం చల్లపల్లి మండలం చిట్టూర్పు చేరింది. యూఎస్‌లోని సౌత్ కరోలినా మెరిడియన్ బీచ్ ప్రాంతంలో పి. బాలగోపాల్ అతడి స్నేహితులతో కలసి గ్యాస్ స్టేషన్ నిర్వహిస్తున్నాడు. అయితే శనివారం గ్యాస్ స్టేషన్లో దొంగలు చోరీ పాల్పడ్డారు. ఆ సమయంలో అక్కడే ఉన్న బాలగోపాల్పై దాడి చేసి... కాల్పులు జరిపాడు. దాంతో ఆయన రక్తపు మడుగులో కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచారు. దాంతో బాలగోపాల్ కుటుంబ సభ్యులు మృతదేహన్ని గురువారం కృష్ణాజిల్లా చిట్టూర్పుకు తీసుకువచ్చారు. -
ఆదివాసీల హక్కుల కోసం పోరాడాలి
అణచివేతను దీటుగా ఎదుర్కోవాలి సీహెచ్ఆర్ఈ ఫ్యాకల్టీ మెంబర్ షమీమ్ మోదీ కాకతీయ యూనివర్సిటీలో బాలగోపాల్ స్మారకోపన్యాసం కేయూ క్యాంపస్ : ఆదివాసీల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఎడ్యుకేషన్(సీహెచ్ఆర్ఈ-ముంబై), టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్‌సెన్సైస్(టీఐఎస్ఎస్) ఫ్యాకల్టీ మెంబర్ షమీమ్ మోదీ అన్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిపాలనా భవనంలోని సెనేట్హాల్లో బుధవారం బాలగోపాల్ ఐదో స్మారకోపాన్యాసం నిర్వహించారు. ఈ మేరకు ‘ట్రైబల్ స్ట్రగుల్స్ అండ్ ఇండియన్ స్టేట్’ అంశంపై ఆమె ప్రసంగించారు. ఆదివాసీలు స్వేచ్ఛాయుత జీవనం గడిపేందుకు పోరాడుతున్న వారందరూ ఒక వేదికపై రావాలని సూచించారు. మధ్యప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో ఆదివాసీలు దుర్భర జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. అడవి నుంచి వంట చెరుకు తెచ్చుకునే వి షయంలోనూ పిల్లలను సైతం జైళ్లకు పంపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భూస్వాము లు చెప్పిన వారికే ఆదివాసీలు ఓటు వేస్తుం డడం వారి అమాయకత్వానికి నిదర్శనమని తెలిపారు. జీవనాధారం కోల్పోయేలా చేస్తారన్న భయంతో వారు భూస్వాములకు ఓట్లు వేయాల్సిన దుర్భర పరిస్థితి ఉందన్నారు. తాను 18 ఏళ్లుగా తాను ఆదివాసీల తరఫున పోరాడుతున్నానని, ఈ క్రమంలో తనపై ఓ సారి హత్యాయత్నం సైతం జరిగిందని వివరించారు. ఆదివాసీల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృత నిశ్చయంతో పోరాటాలు చేసినప్పుడే ఆశించిన మేర ఫలితాలు సాధించగలుగుతామన్నారు. ఫైట్ ఫర్ జస్టిస్ నినాదంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి సామాజిక సమస్యలపై యువత స్పందిస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. పెట్టుబడిదారీ వ్యవస్థ వల్లే.. పెట్టుబడిదారీ వ్యవస్థ వల్లే మానవ హక్కుల ఉ ల్లంఘనలు జరుగుతున్నాయన్నాని ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు. ప్రొఫెసర్ బాలగోపాల్ జీవించి ఉన్నప్పుడే ఏర్పాటైన పర్స్పెక్టివ్ సంస్థ ద్వారా ఇప్పటివరకు సుమారు 50 పుస్తకాలను ప్రచురించామన్నారు. బాలగోపాల్ ఆ లోచన విధానాలతో సామాజిక అంశాలపై పు స్తకాలను ప్రచురిస్తూనే ఉన్నామన్నారు. మరో 25 పుస్తకాలను ప్రచురించేందుకు సభ్యులుగా తాము కృషి చేస్తున్నామన్నారు. అంతకుముందు డాక్టర్ బాలగోపాల్ చిత్రపటానికి షమీమ్మోదీ పూలమాలవేసి నివాళులర్పించా రు. కార్యక్రమంలో షమీమ్ మోదీని ఇన్చార్జ్ రిజిస్ట్రార్ రంగారావు సన్మానించారు. కార్యక్రమంలో క్యాంపస్ ప్రిన్సిపాల్ ఎన్.రామస్వామి, ప్రొఫెసర్ కె.సీతారామారావు, న్యాక్ మాజీ డెరైక్టర్ శివలింగ ప్రసాద్, నర్సింహారెడ్డి, జీవన్‌కుమార్, అంపశయ్య నవీన్, కె.కాత్యాయనీ విద్మహే, నాగిళ్ల రామశాస్త్రి, కవి లోచన్, వసంతలక్ష్మి, ఎం.సారంగపాణి, వి.కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
హక్కుల తాత్వికుడు
బాలగోపాల్ కన్ను మూసి నేటికి ఐదేళ్లు ఇటీవల హైదరాబాద్‌లో బాలగోపాల్ సంస్మరణపై మానవ హక్కుల వేదిక సద స్సు నిర్వహించింది. దాంట్లో పాల్గొన్న ఇద్ద రు వక్తలు ఆయన కార్యాచరణపై రెండు విలువైన వ్యాఖ్యలు చేశారు. హక్కుల ఉద్య మాన్ని బాలగోపాల్ ఉద్యమంలోకి రాకముం దు, వచ్చిన తర్వాత వేరువేరుగా అంచనా వేయవలసి ఉంటుందని ఢిల్లీ యూనివర్సిటీ విశ్రాంత రాజకీయ ఆచార్యులు ప్రొ॥అచన్ వనాయక్ అభిప్రాయపడ్డారు. బాలగోపాల్ హక్కుల ఉద్యమంలోకి వచ్చిన తర్వాతే దళితు లపై సామూహిక వివక్ష, దాడులు, అత్యాచార అంశాలు మానవ హక్కుల ఉల్లంఘన పరిధి లోకి తేబడ్డాయని.. చుండూరు ప్రత్యేక కోర్టు లో, తర్వాత హైకోర్టులో వాదనలు వినిపించిన దళిత న్యాయవాది శివనాగేశ్వరరావు చెప్పారు. ఈ వ్యాఖ్యలను వివరంగా విశ్లేషించుకుంటే తప్ప హక్కుల తాత్విక ధోరణిని బాలగోపాల్ విస్తృతపరచిన వైనం అర్థం కాదు.1993లో జరిగిన ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం (ఏపీసీఎల్సీ) రాష్ట్ర మహాసభల్లో, సంస్థ లక్ష్య ప్రకటనలో మార్పులపై బాలగో పాల్ ప్రవేశపెట్టిన కార్యదర్శి నివే దిక, హక్కుల తాత్విక ధోరణిలో మైలురాయి. కారంచేడు మారణ కాండ నుంచి మౌలికమైన వాస్త వాన్ని మనం నేర్చుకోవాలని ఆయన సూచించారు, వ్యవస్థాగత మైన అణచివేత కేవలం భూ స్వామ్య, పెట్టుబడిదారీ ఆధిప త్యంలోనూ, వాటిని కాపాడే రాజ్య హింసలోనూ లేదనీ, పౌర సమాజం లేక సభ్య సమాజం అని పిలిచే రాజ్యేతర సామాజిక వ్యవ స్థలోనూ అది ఉందనీ స్పష్టం చేశారు. భార తీయ సమాజంలో కులం అణచివేత ప్రధాన రూపాలలో ఒకటని, అధిక భాగం మనుషు లకు, జీవన ప్రమాణాలను జీవిత అవకాశా లనూ నిరాకరించడమే కాకుండా నిండైన మనుషులుగా ఎదిగే అవకా శాన్ని కూడా కుల వ్యవస్థ ప్రజలకు లేకుండా చేసిందనే సత్యాన్ని ఆయన ప్రకటించారు. కాని బాలగోపాల్ హక్కుల రంగంలోకి వచ్చే వరకు వ్యవ స్థీకృత ఆధిపత్యం వల్ల జరిగే హక్కుల ఉల్లంఘనపై పెద్దగా చర్చ జరగలేదు, ఆ ఉల్లంఘనలు విపులీకరించే ప్రయత్నం జరగ లేదు. వివిధ ప్రకృతి వనరుల మీద, జీవనాధారమైన ప్రకృతి సం పదపైన ప్రజలకు ఉన్న సంప్రదాయ హక్కులకు శాసన రూపం ఇవ్వడానికి హక్కుల సం ఘాలు కృషి చేయవలసిన తరుణంలోనే, రాష్ట్రం లో నూతన ఆర్థిక విధానాలు అమలు లోకి వచ్చాయి. ఇది విధ్వంసకర అభివృద్ధి అని నిర్వ చించాడు. సెజ్‌ల వల్ల, భారీ ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులయ్యే ప్రజల స్థితిని అన్యాయమైన ‘‘విస్తాపన’’గా పేర్కొన్నాడు. మానవ హక్కుల చట్రం పరిధిని విశాలం చేసుకున్న క్రమంలో ఆయన దేశంలో, సమా జంలో ఇంత వరకు ఎవరూ స్పృశించని రం గాలను కూడా విశ్లేషించి కార్యాచరణకు పుర మాయించాడు. ప్రతి చిన్న ఆందోళనను, సంఘటనను హక్కుల కోణంలో చూడటం ప్రారంభించాడు. ‘ప్రజాతంత్ర’ పత్రికలో రాసిన 333 వ్యాసాలతోపాటు ఆయన చేసిన ఇతర రచనల్లో అతి మామూలు అంశం అయిన జేబు దొంగల నుంచి కాశ్మీర్ సమస్య వరకు, అతి చిన్న సంఘటనలో కూడా బీజరూపంలో ఉండే నైతిక విలువను హక్కుల కోణాన్ని చూపెట్టారు. హక్కుల ఉద్యమం సమానత్వాన్ని సహజమైన భావనగా స్వీకరించి, సూత్ర ప్రాయంగా హక్కులంటేనే సమానత్వం అనే భావనతో ముందుకుపోవాలి అంటాడు. హక్కుల ఉద్యమ అవగాహనను పొరలు పొర లుగా విడదీసి అందులో రాజకీయ ఉద్యమాల అవసరాల నుంచి ప్రజాతంత్ర విలువలను వేరుచేసి చూపారు. హక్కుల ఉద్యమానికి సొం త అస్థిత్వం, అవగాహన, విశాల ప్రాపంచిక దృక్ఫథం ఉండవలసిన అవసరాన్ని స్పష్టంగా చూపెట్టి, కార్యాచరణలో ఈ అవగాహనను పరీక్షకు పెట్టి మనందరకు చూపెట్టిన హక్కుల తాత్వికుడు మానవీయ విలువల పరిమళాలను వెదజల్లిన మనిషి బాలగోపాల్. (వ్యాసకర్త మానవ హక్కుల కార్యకర్త) - ఎస్.జీవన్‌కుమార్