స్వగ్రామం చేరుకున్న బాలగోపాల్ మృతదేహం
విజయవాడ: అమెరికాలో దొంగల చేతిలో దారుణ హత్యకు గురైన కృష్ణాజిల్లా వాసి పి. బాలగోపాల్ మృతదేహం గురువారం స్వగ్రామం చల్లపల్లి మండలం చిట్టూర్పు చేరింది. యూఎస్లోని సౌత్ కరోలినా మెరిడియన్ బీచ్ ప్రాంతంలో పి. బాలగోపాల్ అతడి స్నేహితులతో కలసి గ్యాస్ స్టేషన్ నిర్వహిస్తున్నాడు.
అయితే శనివారం గ్యాస్ స్టేషన్లో దొంగలు చోరీ పాల్పడ్డారు. ఆ సమయంలో అక్కడే ఉన్న బాలగోపాల్పై దాడి చేసి... కాల్పులు జరిపాడు. దాంతో ఆయన రక్తపు మడుగులో కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచారు. దాంతో బాలగోపాల్ కుటుంబ సభ్యులు మృతదేహన్ని గురువారం కృష్ణాజిల్లా చిట్టూర్పుకు తీసుకువచ్చారు.