'శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస' అవుతుంది అనేది లోకోక్తి. ఆ మాటను నిజం చేసాడు రెడ్ కౌ డైరీ ఓనర్ 'నారాయణ్ మజుందార్'. ఇంతకీ అతడు ఏం చేసాడు? ఎలా సక్సెస్ అయ్యాడు.. అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
1975లో ఒక పేదరైతు కుమారుడు 17 ఏళ్ల వయసులో నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NDRI) బయట పాలు అమ్మి కొంత డబ్బు సంపాదించాడు. అతని చదువు కోసం పలు అమ్మడం పార్ట్‌టైమ్ ఉద్యోగం ప్రారంభించి, ఈ రోజు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు.
బెంగాల్‌లోని నదియా జిల్లాలో జన్మించిన నారాయణ్ మజుందార్ తన గ్రామంలోనే పాఠశాల విద్యను పూర్తి చేసిన తరువాత 'ఎన్‌డిఆర్‌ఐ'లో చదువుకోడానికి వెళ్ళాడు. అప్పట్లో అతడు తీసుకున్న కోర్సుకి అయ్యే ఖర్చు రూ. 250. ఇది అప్పట్లో ఎక్కువ మొత్తం అనే చెప్పాలి. తన చదువు కోసం ఏదైనా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుని ఉదయం 5 నుంచి 7 గంటల వరకు పాలు అమ్మేవాడు. అంతే కాకుండా అతనికి స్కాలర్‌షిప్‌గా రూ.100, అతని తండ్రి నెలకు రూ. 100 అందేవి.
(ఇదీ చదవండి: 2023 Skoda Kodiaq: కొత్త రూల్స్‌తో విడుదలైన లేటెస్ట్ కారు - పూర్తి వివరాలు)
కాలేజీ విద్య పూర్తయ్యేనాటికి ఆ కుటుంభం వ్యవసాయ భూమిని అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ తరువాత నారాయణ్ కోల్‌కతాలోని క్వాలిటీ ఐస్‌క్రీమ్‌లో డైరీ కెమిస్ట్‌గా ఉద్యోగం ప్రారభించారు. అప్పుడు అతని నెల జీతం సుమార్చు రూ. 600. తన ఉద్యోగం ఉదయం 4 నుంచి రాత్రియే 11 వరకు ఉండేది.
అక్కడ ఉద్యోగం వదిలేసి సిలిగురి (హిమాలయన్ కోఆపరేటివ్)లో చేరాడు. ఆ తరువాత మదర్ డెయిరీలో మేనేజర్‌గా ఉన్న 'డాక్టర్ జగ్జీత్ పుంజార్థ్'ను కలిశారు. ఈ పరిచయం అతని జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. 1981లో మదర్ డెయిరీలో చేరి 1955లో హౌరాలోని ఒక కంపెనీలో జనరల్ మేనేజర్‌గా పనిచేశాడు.
(ఇదీ చదవండి: భారత్‌లో చీప్ అండ్ బెస్ట్ స్కూటర్లు - రోజువారీ ప్రయాణానికి మంచి ఆప్షన్..!)
నారాయణ్ మజుందార్ 1999లో రూ.10 లక్షల పెట్టుబడితో చిల్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేశాడు. ఆ తరువాత ఏడాది పాల ట్యాంకర్ కొనుగోలు చేసి తన భార్య భాగస్వామ్యంతో ఒక సంస్థను స్థాపించాడు. 2003లో రెడ్ కౌ డైరీని తయారు చేశాడు. ఎప్పటికప్పుడు వ్యాపారంలో ఎదుగుతూనే ఉన్నాడు. 2007లో కోల్‌కతా డెయిరీతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుని, పాలీ పౌచ్ కూడా ప్రారంభించారు. ప్రస్తుతం వారికి మూడు ఉత్పత్తి కర్మాగారాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన కంపెనీలో 1000 మంది పనిచేస్తున్నారు. అంతే కాకుండా బెంగాల్‌లోని 12 జిల్లాల్లో సుమారు 3 లక్షల మందికి పైగా రైతులతో సత్సంబంధాలు పెట్టుకున్నారు.
నారాయణ్ మజుందార్ కంపెనీ ఇప్పుడు ప్రతిరోజు 4 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది. వీరికి 35 మిల్క్ చిల్లింగ్ ప్లాంట్లతో పాటు 400 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. మొత్తం మీద సైకిల్ మీద పార్ట్‌టైమ్ ఉద్యోగిగా ప్రారంభించి ఈ రూ. 800 కోట్ల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. తాతలు, తండ్రులు సంపాదనతోనే బ్రతికేయాలనుకునే వారికి 'నారాయణ్ మజుందార్' గొప్ప ఆదర్శం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment