JaggerCane CEO Navnoor Kaur: చదివిన తరువాత ఉద్యోగం వస్తే చాలు అనుకునే రోజులివి, అయితే మంచి శాలరీ వచ్చే ఉద్యోగం వదిలేసి సొంతంగా వ్యాపారం మొదలెట్టి లాభాలను ఆర్జిస్తున్న వారు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు 'నవ్‌నూర్ కౌర్'. ఇంతకీ ఈమె ఏ ఉద్యోగం చేసింది? ఎందుకు వదిలేసింది? ఇప్పుడేం చేస్తోంది? ఎంత సంపాదిస్తోంది? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. రండి.
నవ్‌నూర్ కౌర్ ఇప్పుడు కోట్లలో సంపాదిస్తున్న ఒక వ్యాపారవేత్త, కానీ వారి కుటుంభంలో అంతకు ముందు ఎవరూ వ్యాపారవేత్తలు కాకపోవడం గమనార్హం. ఆమె తండ్రి ప్రొఫెసర్, తల్లి స్కూల్ ప్రిన్సిపాల్. కావున చదువులో బాగా రాణించింది, తల్లిదండ్రుల మాదిరిగా మంచి ఉద్యోగం చేస్తుందని ఆశించారు.
నవ్‌నూర్ లూథియానాలో చదువుకుంది. ఆ తరువాత దేశంలోని అగ్రశ్రేణి బిజినెస్ స్కూల్‌లలో ఒకటైన IMT ఘజియాబాద్‌లో MBA పూర్తి చేసి చదువు పూర్తయిన తరువాత తల్లిదండ్రుల మాదిరిగానే గుర్గావ్‌లోని కోటక్ బ్యాంక్‌లో మంచి ఉద్యోగం సంపాదించింది. ఇందులో మంచి జీతం కూడా వచ్చేది. కానీ ఈమెకు మొదటి నుంచి ఆహారానికి సంబంధించిన వ్యాపారం చేయాలని కోరిక ఉండేది.
కొత్త ఆలోచన..
నవ్‌నూర్ కుటుంబ సభ్యుల్లో చాలా మందికి మధుమేహం (షుగర్) ఉండటంతో క్వాలిటీ బెల్లం అమ్మాలనే ఆలోచన వచ్చిందని, ఉద్యోగం చేస్తూనే పాటు టైమ్ మాదిరిగా ఈ వ్యాపారం చేయడం ప్రారంభించిందని ఒక సందర్భంలో తెలిపింది. వ్యాపారం మొదలైన కేవలం రెండు సంవత్సరాల్లో మంచి ఆదాయం రావడం కూడా ప్రారంభమైంది. దీంతో నవ్‌నూర్ ఉద్యోగం వదిలి పూర్తిగా తన వ్యాపారం మీదే ద్రుష్టి పెట్టింది.
నిజానికి శుద్ధి చేసిన చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాన్ని కనుక్కోవడానికి ఆమె బెల్లంతో ప్రయోగాలు చేయడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇందులో మరిన్ని ఉత్పత్తులు తయారు చేసింది. మొదట్లో ఆమె డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసింది. ప్రజలు వాటిని రుచి చూసిన తర్వాత పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ప్రారంభించిన తర్వాత తన ఉత్పత్తిపై తనకు మరింత నమ్మకం కలిగింది.
తన వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచనతో పంజాబ్‌లో మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నడుపుతున్న తన తండ్రి విద్యార్థి కౌశల్‌ను కలిసి వారిద్దరూ పనిచేయడం ప్రారంభించారు. ఇందులో కౌశల్ మ్యాన్యుఫ్యాక్షరింగ్ కార్యకలాపాలను చూసుకుంటాడు, ఆమె బ్రాండింగ్ ఇతర కార్యకలాపాలను నిర్వహించడం ప్రారంభించింది.
వ్యాపార విస్తరణ..
నవ్‌నూర్ తన వ్యాపారం కోసం అనేక సవాళ్ళను ఎదుర్కొంది. చాలా మంది దుకాణదారులు మొదట్లో తక్కువ మార్జిన్లు, చిన్న షెల్ఫ్-లైఫ్ కారణంగా ఆమె ఉత్పత్తులను తిరస్కరించారు. అయినప్పటికీ ఆమె ఏ మాత్రం నిరాశ చెందకుండా ముందడుగు వేసింది. మొత్తానికి అనుకున్న విజయం సాధించగలిగింది.
(ఇదీ చదవండి: లక్షతో కంపెనీ ప్రారంభించి, రూ. 50 కోట్ల సంస్థగా.. 27ఏళ్ల యువతి సాహసమిది!)
ప్రస్తుతం భారతదేశంలో తన వ్యాపారాన్ని 22 జిల్లాల్లో విస్తరించింది. కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా తన ఉత్పత్తులను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం ఈమె 25 మందికి ఉద్యోగం కల్పిస్తోంది. ఇందులో ఎనిమిది మంది మహిళలే కావడం గమనార్హం.
(ఇదీ చదవండి: 21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!)
ప్రారంభంలో ఉద్యోగం చేస్తూ వ్యాపారం మొదలు పెట్టిన నవ్‌నూర్ కౌర్ రోజంతా ఉద్యోగం చేసి రాత్రి వేళల్లో తన వ్యాపార కార్యకలాపాలను చూసుకునేది. తన జాగర్‌కేన్ సంస్థ గత ఏడాది రూ. 2 కోట్ల టర్నోవర్ సాధించింది. రానున్న మరో ఐదేళ్లలో కంపెనీ టర్నోవర్ రూ. 100 కోట్లు సాధించేలా లక్ష్యంగా పెట్టుకుని దానికోసం ముందడుగు వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment