M P Ramachandran Success Story: సక్సెస్.. ఈ పదం వినటానికి లేదా చూడటానికి చాలా చిన్నదిగానే ఉండొచ్చు. కానీ సాధించాలంటే అహర్నిశలు కష్టపడాల్సి ఉంటుంది, ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అయితే సంకల్పం ఉంటే తప్పకుండా విజయం సొంతమవుతుందని ఇప్పటికే చాలా మంది నిరూపించారు, ఈ కోవకు చెందిన వారిలో ఒకరు జ్యోతి ల్యాబ్స్ ఫౌండర్ 'మూతేడత్ పంజన్ రామచంద్రన్' (M. P. Ramachandran). ఈయన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
1983లో కేరళ త్రిస్సూర్‌లో జన్మించిన రామచంద్రన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ముంబైలో అకౌంటెంట్‌గా పనిచేయడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాలు అక్కడ పనిచేసిన తరువాత ఆ కంపెనీ మూసివేశారు. దీంతో ఏమి చేయాలో తోచక ఇంటికి వచేసాడు.
లిక్విడ్ ఫ్యాబ్రిక్ వైట్‌నర్ ఉజాలా
ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపనతో ఉండే రామచంద్రన్.. అప్పట్లో తెలుపు రంగు దుస్తులకు సరైన లిక్విడ్ అందుబాటులో ఉండేది కాదు, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక లిక్విడ్ ఫ్యాబ్రిక్ వైట్‌నర్ 'ఉజాలా'ను తయారు చేసాడు.
రామచంద్రన్ ఈ లిక్విడ్ ఫ్యాబ్రిక్ వైట్‌నర్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, సోదరుడి నుంచి రూ. 5000 తీసుకుని తమకున్న కొంత భూమిలోనే ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేసాడు. దీనికి తన కూతురు జ్యోతి పేరు పెట్టాడు. ప్రారంభంలో అనుకున్న రీతిలో ఉజాలా అమ్మకాలు ముందుకు సాగలేదు, కానీ పట్టు వదలకుండా కొంతమంది సేల్స్ గర్ల్స్‌ని నియమించి ఆ ఏడాది రూ. 40000 ఆదాయం పొందాడు.
ఇదీ చదవండి: బాలీవుడ్ బ్యూటీ 'కిమ్ శర్మ' కొత్త లగ్జరీ కారు.. ధర తెలిస్తే అవాక్కవుతారు!
ఇతర ఉత్పత్తులు & వార్షిక ఆదాయం
క్రమంగా తమ ప్రొడక్ట్ మీద నమ్మకం భారీగా పెరిగింది. దీంతో జ్యోతి లేబొరేటరీస్ మరిన్ని ఉత్పత్తులను తయారు చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఎక్సో, ప్రిల్, మిస్టర్ వైట్, మార్గో, మాక్సో వంటి అనేక ఉత్పతులు పుట్టుకొచ్చాయి. దెబ్బకు విదేశీ కంపెనీలు సైతం మూసుకోవాల్సి వచ్చింది.
ప్రారంభంలో ఎన్నో ఆటంకాలు, ప్రత్యర్థులు జిత్తులను ఎదుర్కొని కంపెనీని దినదినాభివృద్ధి చెందించడంలో రామచంద్రన్ కృషి చేసాడు. కేవలం రూ. 5000తో ప్రారంభమైన జ్యోతి ల్యాబ్స్ వార్షికాదాయం నేడు ఏకంగా రూ. 14,000 కోట్లకు చేరినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment