ఒకప్పుడు చెప్పులు కొనలేని స్థితి!.. నేడు రూ.3000 కోట్ల సామ్రాజ్యం | Thyrocare Technologies Founder A Velumani's Success Story | Sakshi
Sakshi News home page

ఒకప్పుడు చెప్పులు కొనలేని స్థితి!.. నేడు రూ.3000 కోట్ల సామ్రాజ్యం

Published Tue, May 28 2024 10:46 AM | Last Updated on Tue, May 28 2024 1:58 PM

Thyrocare Technologies Founder A Velumani Success Story

ఒక వ్యక్తి సక్సెస్ సాధించాడు అంటే.. దాని వెనుక ఓ యుద్ధమే జరిగి ఉంటుంది. అయితే ఈ మాట అందరికి వర్తించకపోవచ్చు. తాతలు, తండ్రుల ఆస్తులతో కుబేరులైనవారు కొంతమంది ఉంటే.. అప్పులు చేసి, కష్టపడి పైకొచ్చినవారు మరికొందరు ఉన్నారు. ప్రారంభం నుంచి ఎన్నో ఆటుపోట్లను అధిగమించి.. వేలకోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన 'థైరోకేర్ టెక్నాలజీస్' ఫౌండర్ 'వేలుమణి' గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

1959లో తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని అప్పనైకెన్‌పట్టి పుదూర్ గ్రామంలో వేలుమణి జన్మించారు. ఆయన తండ్రికి వ్యవసాయ భూమి కూడా లేదు. దీంతో కుటుంబ పోషణకు గేదెల పెంపకాన్ని ఎంచుకుని, వాటిద్వారా వచ్చిన పాలను అమ్మి కుటుంబాన్ని పోషించేవారు. అయితే పిల్లలకు బట్టలు, చెప్పులు వంటివాటిని కొనుగోలు చేయడానికి కూడా వేలుమణి తండ్రి చాలా కష్టపడ్డాడు.

ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా వేలుమణి చిన్నప్పటి నుంచే దృఢంగా ఉన్నారు. ప్రాధమిక విద్యను అప్పనాయికెన్‌పట్టి పూదూర్‌లో, ఆ తరువాత మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న రామకృష్ణ మిషన్ విద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1955లో థైరాయిడ్ బయోకెమిస్ట్రీలో డాక్టర్ డిగ్రీ పొందారు. థైరోకేర్ ప్రారంభించడానికి ముందు, ఈయన భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబైలో 15 సంవత్సరాలు పనిచేశారు.

వేలుమణి న్యూక్లియర్ హెల్త్‌కేర్ లిమిటెడ్ ఎండీగా కూడా పని చేశారు. ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే ఆంకాలజీ, రేడియాలజీ వంటి వాటిలో ఉపయోగించే టెక్నాలజీలను గురించి తెలుసుకోవడం ప్రారంభించారు.

వేలుమణి 1996లో తన స్వంత థైరాయిడ్ టెస్టింగ్ లాబొరేటరీ, థైరోకేర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే డయాగ్నస్టిక్ లాబొరేటరీలో ఫ్రాంఛైజీ మోడల్‌ను ప్రవేశపెట్టాడు. అనుకున్న విధంగా ముందుకు సాగుతున్న సమయంలో స్టార్టప్ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఏకంగా రూ.1400 కోట్ల నష్టాలను చూడాల్సి వచ్చింది. అయినప్పటికీ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ముందుకు సాగారు.

థైరోకేర్ టెక్నాలజీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ నేడు రూ.3300 కోట్లుగా ఉంది. నా మొదటి 24 సంవత్సరాల మనుగడ నా తల్లి పొదుపు వల్ల, నా వ్యాపార విజయం నా భార్య పొదుపు వల్ల సాధ్యమైందని ఓ సందర్భంలో వేలుమణి చెప్పుకున్నారు. బాల్యం నుంచే కష్టాలు చూసి.. జీవితంలో స్థిరపడాలని ఉద్దేశ్యంతో కష్టపడి వేలకోట్ల సంపదను సృష్టించారు. వేలుమణి నాయకత్వంలో థైరోకేర్ భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, మధ్యప్రాచ్య దేశాల్లో సుమారు 1000 కంటే ఎక్కువ అవుట్‌లెట్‌లను కలిగి ఉంది.
ఇదీ చదవండి: రూ.3 లక్షల అప్పుతో రూ.1300 కోట్లు సంపాదన.. అసిన్‌ భర్త సక్సెస్ స్టోరీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement