
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, పెదవాల్తేరు (విశాఖ తూర్పు): నగరంలోని ఒక స్పా సెంటర్‌లో పనిచేస్తున్న ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌కి చెందిన శర్ల జోసఫ్ (21) కొంత కాలంగా సీబీఎం కాంపౌండ్ వీఐపీ రోడ్డులో గల ఒక స్పా సెంటర్‌లో పనిచేస్తుంది. స్పా సెంటర్ పైభాగంలో గల గదిలో ఆమె నివసిస్తుంది.
ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున తాను నివసిస్తున్న గదిలో ఫ్యానుకి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్పా సెంటర్ నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో మూడో పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ కేసుని త్రీటౌన్ సీఐ కోరాడ రామారావు పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: (ఉక్రెయిన్‌లో తనయుడి వేదన.. టీవీ చూస్తూ ఆగిన తల్లి గుండె!)
Comments
Please login to add a commentAdd a comment