సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లాలో సంపులో పడి ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. నిన్న(మంగళవారం) అర్ధరాత్రి సంధ్య ఫోన్ నుంచి ఆటో డ్రైవర్‌కు ఫోన్ వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, సంధ్య పిల్లల్ని సదరు ఆటో డ్రైవర్ ప్రతీరోజూ స్కూల్‌కు తీసుకువెళ్తాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు.
ఇదిలా ఉండగా.. మర్రిపాలెం ప్రకాశ్ నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లోని నీటి సంపులో ముగ్గురు మృతదేహాలు బుధవారం లభించాయి. మృతులను తల్లి సంధ్య, పిల్లలు గౌతమ్, అలేఖ్యలుగా గుర్తించారు. కాగా, చనిపోయిన వారు అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌గా కుటుంబంగా స్థానికులు చెబుతున్నారు. కాగా, పది నెలల క్రితమే వీరంతా విశాఖకు వచ్చారు. ఇంతలోనే ఇంత ఘోరం జరగడంతో అక్కడున్నవారంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఇక, వీరి మృతిపై సమాచారం అందుకున్న విశాఖ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను సంపు నుంచి బయటకు తీశారు. అయితే వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం, వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: కీచక టీచర్ అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment