sandhya
-
నమ్మకమే పునాది.. కోల్పోతే కష్టమే!
సంధ్య, రాజీవ్ ఐదేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. ఇద్దరూ యాంబిషస్ ప్రొఫెషనల్స్. సంధ్య ఒక సాఫ్ట్వేర్ డెవలపర్‌గా, రాజీవ్ ప్రోడక్ట్ మేనేజర్‌గా ఒక అభివృద్ధి చెందుతున్న టెక్ కంపెనీలో పనిచేస్తున్నారు. పెళ్లి, పిల్లలు, ఫ్యామిలీ లైఫ్, ఇల్లు కట్టుకోవడం, వివిధ దేశాలకు టూర్ వెళ్లడం వంటి కలల గురించి తరచుగా మాట్లాడుకునేవారు. పరస్పర గౌరవం, ఎమోషనల్ ఇంటిమసీతో ఉండేవారు. అయితే, పెళ్లికి ఆరునెలల ముందు పరిస్థితులు మారడం ప్రారంభమయ్యాయి. కొత్త ప్రాజెక్ట్ రావడంతో ఆఫీస్‌లోనే ఎక్కువ సమయం గడపాల్సి రావడం, డెడ్‌లైన్‌కు ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే ఒత్తిడి, పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన పనుల కారణంగా ఒకరికొకరు సమయం కేటాయించుకోలేకపోయారు. ఎప్పుడైనా మాట్లాడుకున్నా, అతిథుల జాబితాలు, బడ్జెట్లు, లాజిస్టిక్స్ చుట్టూ తిరిగేవి. డేట్ నైట్స్, ఫిజికల్, ఎమోషనల్ ఇంటిమసీలు తగ్గిపోయాయి.సంధ్య మామూలుగానే రిజర్వ్డ్ వ్యక్తి. ఈ ఒత్తిడిని అధిగమించేందుకు పనిలో మరింతగా మునిగిపోయింది. తన కెరీర్లో రాణించి, పెళ్లి సజావుగా జరిగితే మిగతావన్నీ సవ్యంగా సాగుతాయని భావించింది. కాని, రాజీవ్ మాత్రం ఎమోషనల్‌గా ఒంటరితనం అనుభవిస్తున్నాడు. తరచుగా మాట్లాడే ప్రయత్నం చేసేవాడు. ‘పెళ్లి పనులన్నీ సక్రమంగా జరగనివ్వు రాజీవ్. పెళ్లి తర్వాత అన్నీ సెట్ అవుతాయి. అప్పుడు టైమ్ అంతా మనదే కదా’ అంటూ అతని మాటలను తోసివేసేది సంధ్య. ఆ సమయంలోనే రాజీవ్ టీమ్‌లోకి ప్రియ అనే కొత్తమ్మాయి చేరింది. చురుగ్గా, సరదాగా ఉండే వ్యక్తి. ప్రాజెక్ట్ టైమ్‌కి పూర్తిచేయాలని లేట్ అవర్స్‌లో కూడా పనిచేసేది. మొదట్లో రాజీవ్, ప్రియల సంభాషణలు ప్రొఫెషన్‌కు సంబంధించినవే ఉండేవి. క్రమేపీ అవి పర్సనల్ స్థాయికి చేరాయి. రాజీవ్ ఆలోచనలను ప్రియ ప్రశంసించేది. అతని పని ఒత్తిడి పట్ల సహానుభూతి చూపించి, సంధ్య నుంచి అందని మద్దతును అతనికి అందించగలిగింది. ఫ్రెండ్లీ బాంటర్ త్వరగా ఫ్లర్ట్గా మారింది. తాను చేస్తున్నది తప్పని తెలిసినా, అదేమీ హానికరం కాదని, తన పెళ్లిపై ఎలాంటి ప్రభావం చూపించదని రాజీవ్ సమర్థించుకునేవాడు. వారాలు గడిచేకొద్దీ అతను తన ఫోన్‌ను సంధ్య నుంచి దాచడం ప్రారంభించాడు. ఓ రోజు ఇద్దరూ కలిసి ఔటింగ్‌కు వెళ్లారు. డ్రింక్స్ తీసుకెళ్లడానికి రాజీవ్ పక్కకు వెళ్లిన సమయంలో వచ్చిన నోటిఫికేషన్ చూడటానికి సంధ్య అతని ఫోన్ ఓపెన్ చేసింది. ప్రియ, రాజీవ్‌ల మధ్య జరిగిన చాటింగ్ ఆమె కంటపడింది. అంతే, ఆమె మనసు ముక్కలైంది. రాజీవ్‌పై పెట్టుకున్న నమ్మకం ధ్వంసమైంది. ఆ తర్వాత రాజీవ్‌తో సమయం గడపడం సంధ్య జీవితంలో అతి కష్టమైన పని అయింది. కోపం, బాధ, అవమాన భావాలతో సతమతమయ్యేది. ఇదంతా భరించలేక ఒకరోజు రాజీవ్‌ను అడిగేసింది. రాజీవ్ తన తప్పును ఒప్పుకున్నాడు. కానీ సంధ్య అతన్ని క్షమించలేకపోయింది. తీవ్ర పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచాడు. అయినా రాజీవ్ పై మళ్లీ నమ్మకం ఉంచడం చాలా కష్టమనిపించింది. అతనికి మరో అవకాశం ఇవ్వాలా? లేక పెళ్లిని రద్దు చేసుకోవాలా? అనే సందేహంలో ఉంది సంధ్య. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్‌కి వెళ్లింది. ఇద్దరికీ మూడు నెలల కౌన్సెలింగ్ తర్వాత, ఒకరిపై ఒకరికి మళ్లీ పూర్తిగా నమ్మకం ఏర్పడ్డాక పెళ్లి చేసుకున్నారు. నమ్మకాన్ని పునర్నిర్మించుకోవడానికి పది సూత్రాలు..» క్రమబద్ధమైన మంచి చర్యల ద్వారా నమ్మకం పెరుగుతుంది.» మోసం చేసిన వ్యక్తి పూర్తి బాధ్యతను స్వీకరించాలి, మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలి.» తప్పు చేసినవారిని క్షమించడం మీ మానసిక శాంతి కోసమే, అది నిదానంగా జరుగుతుంది.» ఎమోషనల్ ఓపెన్నెస్ బంధంలో నమ్మకాన్ని బలపరుస్తుంది.» హద్దులను నిర్దేశించుకోవడం, గౌరవించడం ఆరోగ్యకరమైన బంధానికి కీలకం.» నమ్మకాన్ని పునరుద్ధరించుకోవడానికి భాగస్వాములిద్దరూ కృషి చేయాలి.» భాగస్వాములిద్దరూ సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవడం వ్యక్తిగత వృద్ధికి, బంధం బలమవ్వడానికి దోహదం చేస్తుంది.» బంధానికి విలువ ఉందా లేదా అన్నది ఆలోచించి, ఆ దిశగా చర్యలు చేపట్టాలి.» బంధాన్ని బలంగా, మంచి పునాదితో తిరిగి నిర్మించుకోవడానికి దీన్ని ఒక అవకాశంగా మలచుకోవాలి.» అవసరమైతే సైకాలజిస్ట్‌ను సంప్రదించి కౌన్సెలింగ్ తీసుకోవాలి. -
సంధ్య థియేటర్: పవన్ కల్యాణ్ ఎవర్గ్రీన్ రికార్డ్‌ను కొట్టేసిన 'పుష్ప'
తెలుగు సినిమా చరిత్రలో సంధ్య థియేటర్‌కి ప్రత్యేక స్థానం ఉంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఉన్న స్క్రీన్‌లో తమ అభిమాని హీరో సినిమా చూడాలని చాలామంది అభిమానులు కోరుకుంటారు. సుమారు 1000 సీట్లతో 70MM స్క్రీన్ ఉంటుంది. ఒకప్పడు ఈ థియేటర్లో తమ సినిమా ప్రదర్శిస్తే చాలు అనుకునే హీరోలు చాలామంది ఉన్నారు. అలాంటిది మెగా హీరోలకు అడ్డాగా సంధ్య థియేటర్‌కు ప్రత్యేక స్థానం ఉంది.సంధ్య థియేటర్లో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా పవన్ కల్యాణ్ నటించిన 'ఖుషి' ఉంది. 2001లో విడుదలైన ఈ చిత్రానికి ఎస్.జే సూర్య దర్శకత్వం వహించారు. ఈ మూవీ సంధ్య థియేటర్లో రూ. 1 కోటి 56 లక్షలు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, సుమారు 23 ఏళ్ల తర్వాత ఆ రికార్డ్‌ను పుష్ప2తో అల్లు అర్జున్ కొల్లగొట్టాడు. 24 రోజులకు గాను రూ. 1 కోటి 59 లక్షలతో పుష్పరాజ్ దాటేశాడు. అయితే, ప్రభాస్ కల్కి సినిమా కూడా ఇక్కడ రూ. 1 కోటి 43 లక్షలు కలెక్ట్ చేసింది. పవన్ కల్యాణ్ నటించిన తొలిప్రేమ చిత్రం 220 రోజులకు గాను రూ. కోటి 10 లక్షలు వసూళు చేసింది. అలా ఇప్పటి వరకు ఈ థియేటర్‌కు సంబంధించి ఉన్న రికార్డ్స్‌ను పుష్ప2తో బన్నీ అందుకున్నాడు. -
సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్
-
కటకటాల్లో అల్లు అర్జున్.. రేవంత్ సాధించిందేమిటి?
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. సినిమా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అర్జున్ను అరెస్ట్ చేయడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి సాధించిందేమిటి? అన్నది మొట్టమొదటి ప్రశ్న. అలాగే.. దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటి? ఈ అంశంపై సినీ రంగం తగు రీతిలో స్పందించిందా? ఈ ఘటనకు ఏపీ రాజకీయాలకు ఉన్న సంబంధాలేమిటి? పుష్ప2 విజయంతో కొందరిలో ఏర్పడ్డ ఈర్ష్య అసూయలే ఈ అరెస్ట్‌కు కారణమా? అల్లూ అర్జున్ ఎదుగుదలను ఎవరు సహించలేకపోతున్నారు? ఇలా.. బోలెడన్ని ప్రశ్నలపై రెండు రాష్ట్రాల్లోనూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. డిసెంబరు నాలుగున జరిగిన తొక్కిసలాట, శుక్రవారం అర్జున్ అరెస్ట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందన అంత అర్థవంతంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే సెలెబ్రిటీలు, సినీ నటులు ప్రజల్లోకి వెళ్లినప్పుడు తొక్కిసలాటలు జరుగుతూంటాయి. అయితే ఇందుకు వారే కారణమవుతారా? అభిమాన నటుడిని చూసే ప్రయత్నంలో ఎగబడే ప్రజలది తప్పు అవుతుందా? గుంపును కట్టడి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయని థియేటర్ యాజమాన్యం బాధ్యత ఎంతవరకూ? సెలిబ్రిటీ రాక గురించి ముందస్తు సమాచారం ఇచ్చినా సీరియస్‌గా తీసుకోని పోలీసుల తప్పేమీ ఉండదా? ఆ మాటకు వస్తే గతంలో పలు రాజకీయ సభలలో, మతపరమైన ఉత్సవాలలోనూ తొక్కిసలాటలు జరిగాయి. ఆయా సందర్భాలలో రాజకీయ నేతలను, మతపరమైన పెద్దలను అరెస్టు చేశారా? అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అర్జున్ను శుక్రవారం మధ్యాహ్నం అరెస్టు చేసిన తదుపరి కోర్టు రిమాండ్‌లో చంచల్‌గూడ జైలుకు తీసుకువెళ్లారు. హైకోర్టు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయినా అర్జున్ దాదాపు పన్నెండు గంటలసేపు చంచల్ గూడ జైలులోనే ఉండాల్సి వచ్చింది. శుక్రవారం అరెస్టు చేస్తే, శని, ఆదివారాలు సెలవు దినాలు కనుక అర్జున్‌కు బెయిల్ రాదన్న కుట్రతో ఇది జరిగిందని చాలామంది సందేహిస్తున్నారు. అయితే అర్జున్ లాయర్లు వెంటనే స్పందించి హైకోర్టును ఆశ్రయించి తగు ఉత్తర్వులు పొందినా జైలు అధికారులు సాంకేతిక కారణాలతో విడుదల లేట్ చేసినట్లు ఈ పరిణామం క్రమంపై మీడియా విశేషంగా వార్తలు ఇచ్చింది. యథాప్రకారం టీడీపీ మీడియా తన రాజకీయ కుయుక్తులను ప్రదర్శించింది. అర్జున్ను జైలు నుంచి అప్పుడే విడుదల చేయడం ఏమిటి? అన్న బాధ వారిలో ఉన్నట్లు కవరేజిని బట్టి అర్థమవుతుంది. ఈ అంశానికంటే ముందు రేవంత్ ఢిల్లీలో చేసిన వ్యాఖ్యల మీదే ఎక్కువగా అభ్యంతరాలు కనిపిస్తున్నాయి. సినిమా నటులు ఏమైనా సైనికులా?ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో యుద్దం చేసి వచ్చారా? అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే.. ‘‘సినిమా తీశారు..డబ్బులు సంపాదించుకుంటున్నారు’’ అని కూడా చెప్పారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యాపకం ఉంటుంది. సంపాదన అన్నది ప్రతి వ్యక్తి చేసేదే. అలాగే కొంతమంది సినీ రంగంలోకి వెళతారు. వారిలో కొద్దిమందే సఫలం అవుతుంటారు. ఇదీ చదవండి: సినీ నటులు సైనికులా?ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తించాల్సి ఉంటుంది. ప్రజల జీవితాలను ప్రభావితం చేసేవాటిలో సినిమా రంగం ముఖ్యమైంది. ఈ ప్రాముఖ్యతను గుర్తించే ఒకప్పుడు చెన్నైలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్ కు తరలించడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పలువురు కృషి చేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు వంటివారు సినీ పరిశ్రమ ఇక్కడ అభివృద్ది కావడానికి వీలుగా పలు రాయితీలు ఇచ్చారు. ప్రఖ్యాత నటులు అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీ రామారావు, కృష్ణ తదితర ప్రముఖులు సినీ స్టూడియోలు ఏర్పాటు చేయడానికి, నివాసానికి అవసరమైన స్థలాలు కేటాయించారు. ఫిలింనగర్ పేరుతో ఇప్పుడు వెలుగొందుతున్న ప్రాంతం అంతా అప్పుడు ప్లాన్ చేసినదే. ఆనాటి ప్రభుత్వాలు సినిమాను వ్యాపారంగానే చూసి ఉంటే, హైదరాబాద్‌కు సినీ రంగ పరంగా ఇప్పుడు ఇంత ప్రాధాన్యత వచ్చేదా? ఇన్ని వేల మంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న సంగతి రేవంత్ కు తెలియదా? 1985 ప్రాంతంలో అన్నపూర్ణ స్టూడియో వద్దకు వెళ్లడానికి సరైన దారే ఉండేది కాదు. అలాంటి ఇబ్బందులను ఎదుర్కుని నాగేశ్వరరావు దానిని అభివృద్ధి చేశారు. సినీ రంగంలో తిరుగులేని స్థాయిలో ఉన్న ఎన్టీఆర్ నాచారం వద్ద, అలాగే ముషీరాబాద్ లోను స్టూడియాలు ఏర్పాటు చేశారు. అమీర్ పేట వద్ద సారధి స్టూడియో ఏర్పాటైంది. ఆ తర్వాత పలు రికార్డింగ్ ధియేటర్లు వచ్చాయి. కోట్ల విజయభాస్కరరెడ్డి టైమ్ లో ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్.రెడ్డికి , మరి కొందరికి రికార్డింగ్ థియేటర్ల ఏర్పాటుకు బంజారాహిల్స్‌లో స్థలం ఇచ్చారు. అంతేకాదు. రామోజీఫిలిం సిటీకి కీలకమైన రహదారి కోసం అవసరమైన ఐదెకరాల స్థలాన్ని మరో పారిశ్రామిక వేత్త అయిన సంఘీ నుంచి కోట్ల ప్రభుత్వం వెనక్కి తీసుకుని మరీ ఇచ్చింది. కృష్ణ నగర్ ప్రాంతం జూనియర్ ఆర్టిస్టులకు కేంద్రంగా మారింది. ఖాజాగూడ వద్ద సినీ కార్మికులకోసం ప్రత్యేక కాలనీ చిత్రపురిని ఏర్పాటు చేశారు. ఆనాటి ప్రభుత్వాలు ఇవన్ని ఎందుకు చేశాయి? ఈ సంగతులు రేవంత్ రెడ్డికి తెలియవా? లేక ఆవేశంలో జరిగిన తప్పును సమర్థించుకోవడానికి సిని పరిశ్రమ వారిని ఉద్దేశించి డామేజింగ్ వ్యాఖ్యలు చేశారా? అన్న భావన కలుగుతుంది. ప్రముఖ నటుడు కృష్ణ ఆర్థిక కష్టాలలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వపరంగా సాయం చేశారు. అంతే కాదు. మంచి సినిమాలు తీసేవారి కోసం,ఉత్తమ నటీనటులకు ఉమ్మడి ఏపీలో నంది అవార్డులను ప్రవేశపెట్టారు. రేవంత్ ప్రభుత్వమే ప్రఖ్యాత గాయకుడు గద్దర్ పేరుతో తెలంగాణలో అవార్డులు ఇవ్వడానికి సంకల్పించింది. సినీ నటులను వ్యాపారులుగా చూస్తున్నట్లయితే ఈ అవార్డులు ఎందుకు ఇస్తున్నట్లు? అలాగే జాతీయ స్థాయిలో అవార్డులు ఇస్తారు.జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా అల్లు అర్జున్ పొంది తెలుగు వారికి ఒక ఘనత తెచ్చిపెట్టారు. సినీ పరిశ్రమ ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధితో పాటు, ప్రభుత్వానికి కూడా గణనీయంగా ఆదాయం వస్తుంటుంది. ఉదాహరణకు పుష్ప2 సినిమా ద్వారా సుమారు రూ.300 కోట్ల పన్ను వచ్చిందట. అందువల్ల సినిమా పరిశ్రమను, హీరోలను తక్కువ చేసి మాట్లాడడం రేవంత్‌కు తగదని చెప్పాలి. ఇలాంటి వ్యాఖ్యలు ఆయన అనుభవ రాహిత్యాన్ని సూచిస్తాయన్న విమర్శ ఉంది. సినీ పరిశ్రమకే కాదు..ఇతర రంగాలకూ ప్రభుత్వాలు భూములు ఉచితంగా లేదా, తక్కువ ధరకు కేటాయిస్తాయి. రాయితీలు ఇస్తాయి. రేవంత్ సైతం ఇలాంటి ప్రోత్సహకాలతోనే పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడానికి డావోస్ వరకు వెళ్లి ప్రయత్నించారు. ఇప్పటికే అక్కినేని నాగార్జున ఎన్.కన్వెన్షన్ ను ఆకస్మికంగా కూల్చిన తీరు, నటి సమంతపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వానికి నష్టం చేశాయి. మెగాస్టార్ చిరంజీవిని ఇంకా కాంగ్రెస్ వ్యక్తిగానే రేవంత్ చెప్పడం చిత్రంగానే ఉంది. అలాగే అర్జున్ మామ చంద్రశేఖరరెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న మాట నిజమే కావచ్చు. కానీ ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని అర్జున్ విషయంలో జాగ్రత్తగా ఎందుకు అడుగులు వేయలేదు. అర్జున్ తదితరులు థియేటర్ వద్దకు వస్తున్నారని సంధ్యా ధియేటర్ యాజమాన్యం పోలీసులకు లేఖ రాసినా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అర్జున్ వెళ్లారని చెప్పడం సీఎం స్థాయి వ్యక్తికి తగునా?హోం మంత్రి బాధ్యతలు కూడా రేవంత్ చేతిలోనే ఉన్నాయి. ఆయనకు తెలియకుండా ఈ అరెస్టు జరిగే అవకాశమే లేదు. పోలీసులు తమ తప్పు కప్పి పుచ్చుకునేందుకు రేవంత్‌కు పూర్తి సమాచారం ఇవ్వలేదన్న భావన కలుగుతుంది. దీనివల్ల రేవంత్‌కే అప్రతిష్ట. శాఖమీద సరైన కంట్రోల్ లేదు అనిపిస్తుంది. రేవంత్ చర్యలు అభద్రతాభావంతో చేసినవని మాజీ మంత్రి కేటీఆర్, స్పెషల్షోలకు అనుమతిచ్చినందుకు రేవంత్‌నే అరెస్ట్ చేయాలని ఇంకో మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా రేవంత్ ప్రభుత్వం అర్జున్ను లక్ష్యంగా పెట్టుకని పనిచేసిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా అర్జున్ అరెస్ట్‌ను తప్పుపట్టారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే ఇందులో కుట్ర, అసూయలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఏపీలో చంద్రబాబు తప్పిదాల వల్ల పుష్కరాలలో 29 మంది, కందుకూరు సభలో ఎనిమిది మంది, గుంటూరులో టీడీసీ సభలో చీరల పంపిణీ కారణంగా నలుగురు మరణించారని, అయినా ఆయనపై కేసులు పెట్టలేదని అన్నారు. తెలంగాణలో అర్జున్‌కు సంబంధం లేకపోయినా తొక్కిసలాటలో ఒకరు మరణించారన్న అభియోగంపై అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. అర్జున్ అరెస్ట్ సమాచారం తెలిసిన వెంటనే చిరంజీవి, నాగబాబు తదితరులు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. కానీ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం సరైన పద్ధతిలో స్పందించ లేకపోయారన్న విమర్శలు వచ్చాయి. ఎన్నికల సమయంలో నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్ధి రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా వెళ్లడమే అల్లు అర్జున్ చెసిన పెద్ద తప్పా? అని కొందరు ప్రశ్నించారు. ఈ కక్షతోనే టీడీపీ, జనసేన ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ ద్వారా ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చన్నది పలువురి డౌటుగా ఉంది. ఇందులో నిజం ఉండవచ్చు. లేకపోవచ్చు కానీ టీడీపీ, జనసేనలు అర్జున్ అరెస్టును ఖండించకపోవడంతో అనుమానాలు వస్తాయి. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రముఖులు కూడా ఒకరిద్దరు తప్ప ఈ ఘటనపై పెద్దగా స్పందించకుండా జాగ్రత్తపడ్డారు. వారిలో ఎక్కువ మంది రేవంత్ చేసిన వ్యాఖ్యలు, అర్జున్ అరెస్టు తీరుపై అంత సంతృప్తిగా లేకపోవచ్చు. మాజీ మంత్రి కేటీఆర్ పై ఈఫార్ములా రేసు నిధుల దుర్వినియోగం కేసు పెట్టడానికి గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయనను అరెస్టు చేయడానికి ముందు, తమ ప్రభుత్వం ఎవరినైనా అరెస్టు చేస్తుందని చెప్పడానికి ఏమైనా ట్రయల్ వేశారా? అన్నది మరో పాయింట్‌గా చెబుతున్నారు. పోలీసులు అర్జున్ను ముందు విచారణకు పిలిచి, తొక్కిసలాట ఘటనలో ఆయన ప్రమేయం ఏ మేరకు ఉంది.అందుకు ఆధారాలు ఏమిటి అన్న అంశాలపై దర్యాప్తు చేసి ఉండాల్సింది.అలా చేయకుండా శుక్రవారం నాడు నేరుగా ఇంటికి వెళ్లి అర్జున్ ను అదుపులోకి తీసుకోవడం లో కుట్ర కోణం ఉందన్నది చాలామంది భావన. పోలీసుల అరాచకాలపై ఏపీలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాము వెనుకబడి పోకూడదన్నట్లుగా తెలంగాణ పోలీసులు కూడా ఇలాంటి అనుచిత చర్యలకు దిగితే వారికే పరువు తక్కువ. అనేక మంది సినీ నటులు పలు కార్యక్రమాలకు అటెండ్ అవుతుంటారు. వస్త్రాల షాపుల ప్రారంభోత్సవాలకు హీరో, హీరోయిన్ లు హాజరవుతుంటారు. ఆయా రాజకీయ పార్టీలకు మద్దతుగా సభలలో పాల్గొంటుంటారు. ప్రభుత్వాలు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాయో తెలియని స్థితిలో ఇకపై వారు భయపడే అవకాశం ఉంటుంది. కానీ ప్రముఖులు నాని, రామ్ గోపాల్ వర్మ వంటి కొద్ది మంది తప్ప మిగిలిన సినీ పరిశ్రమ పెద్దలు ప్రభుత్వాన్ని తప్పు పట్టినట్లు లేదు. చంద్రబాబుతో ఉన్న సంబంధాల రీత్యా, ప్రభుత్వంతో గొడవపడడం ఎందుకు అన్న భయంతో వారు మాట్లాడడం లేదని కొందరు అంటున్నారు. పుష్ప2 సినిమా రికార్డు స్థాయిలో సుమారు రూ.1,500 కోట్ల మేర వసూళ్లు చేయడంపై కొంతమంది సినిమా వారిలో ఈర్ష్యం ఉండవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా మరో సంగతి చెబుతున్నారు. రేవంత్ స్వగ్రామంలో ఒక మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఒక లేఖ రాసి అందులో సీఎం సోదరులపై కొన్ని ఆరోపణలు చేశారు. దానిపై పోలీసులు కేసు పెట్టకుండా, ముందస్తు విచారణ చేసి, వారి తప్పు ఏమీ లేదని తేల్చేశారట. అదే రూల్ అల్లు అర్జున్‌కు వ్యర్తించదా అన్న ప్రశ్న వస్తుంది. ఏది ఏమైనా ఇప్పటికే హైడ్రా కూల్చివేతలు, మూసి గందరగోళంతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ దెబ్బ తిన్నదని అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం సినీ పరిశ్రమపై కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న భావన వస్తే రేవంత్ కు అది మరింత నష్టం చేస్తుంది.విశేషం ఏమిటంటే పార్లమెంటులో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తొలి ప్రసంగం చేసిన రోజున రేవంత్ ప్రభుత్వం ఇక్కడ అర్జున్ అరెస్టుకు పూనుకోవడంతో దేశవ్యాప్తంగా ఈ అంశానికే ప్రాధాన్యత వచ్చిందట. ఫలితంగా ప్రియాంక గాంధీ ఉపన్యాసం ఊసే ఎవరూ పట్టించుకోలేదట. దీనివల్ల కాంగ్రెస్ కు ఏమి లాభం వచ్చింది. రేవంత్ తనకు తానే స్టార్ అని అభివర్ణించుకోవడం తప్పు కాకపోవచ్చు. కాని జనం కూడా ఆయనను స్టార్ అనుకునేలా వ్యవహరించాలి. పాలన సాగించాలి. అలా చేస్తున్నానా? లేదా?అన్నది ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. -
రేవతి మృతిపై స్పందించిన అల్లు అర్జున్
-
సినిమా థియేటర్ ఎదుట - డీవైఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆందోళన
-
చిన్నారికి జీవితకాలం ఉచిత బస్సు పాస్
గద్వాల క్రైం: గద్వాల ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణికి స్టాఫ్‌నర్సు సహాయంతో కండక్టర్ సుఖ ప్రసవం చేయడంపై ఆర్టీసీ యాజమాన్యం, ఎండీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులో పురుడు పోసుకున్న ఈ చిన్నారికి జీవితకాలంపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. గద్వాల మండలంలోని కొండపల్లికి చెందిన గర్భిణి సంధ్య సోమవారం రాఖీ పండుగ కోసం ఆర్టీసీ బస్సులో వనపర్తికి వెళ్తుండగా పురిటి నొప్పులు రావడంతో మార్గమధ్యలోనే కండక్టర్ భారతి స్టాఫ్‌నర్సు అలివేలు సహాయంతో సుఖ ప్రసవం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం మంగళవారం హైదరాబాద్‌లోని బస్ భవన్లో కండక్టర్ భారతి, స్టాఫ్‌నర్సు అలివేలు, బస్సు డ్రైవర్ అంజిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. మహిళకు ప్రసవం చేసేందుకు సహకరించిన స్టాఫ్‌నర్సు అలివేలుకు ఏడాదిపాటు డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సీవోవో రవీందర్, సిబ్బంది మునిశేఖర్, కృష్ణకాంత్, శ్రీదేవి, జ్యోతి, గద్వాల డిపో మేనేజర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
వలంటీర్‌పై టీడీపీ నాయకుల దాడి
హిందూపురం అర్బన్: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని 28వ వార్డు వలంటీరు సంధ్యపై సోమవారం రాత్రి టీడీపీ నాయకులు దాడిచేశారు. స్థానిక సూరççప్ప కట్టకింద (బోయపేట) ప్రాంతంలోని వలంటీర్ సంధ్య ఇంటివద్దకు సోమవారం రాత్రి కొందరు అవ్వాతాతలు వచ్చి పింఛన్ విషయమై ఆరాతీశారు. ఈ నెల 3వ తేదీ నుంచి వార్డు సచివాలయంలో ఇస్తారని ఆమె చెబుతుండగా.. సమీపంలోనే ఉన్న టీడీపీ నాయకులు నవీన్, అనిల్, అశోక్, విజి తదితరులు ఆమెపై దాడిచేశారు. గర్భిణి అని కూడా చూడకుండా దాడిచేయడంతో ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. టీడీపీ వర్గీయులు అక్కడికి కూడా వెళ్లి గొడవ చేశారు. తరువాత సంధ్య స్థానిక రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారిస్తున్నామని సీఐ రియాజ్ అహమ్మద్ తెలిపారు. -
యువతను చిత్తు చేస్తున్న మత్తు
-
సంధ్య ఆక్వా డ్రగ్స్ కేసు: సీబీఐ మరో కీలక నిర్ణయం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ డ్రగ్స్ కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో నలుగురు ప్రతినిధులకు సీబీఐ నోటీసులు పంపించింది. వివరాల ప్రకారం.. విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డ్రగ్స్ కేసుపై సీబీఐ విచారణను వేగవంతం చేసింది. కేసు విచారణలో భాగంగా సీబీఐ తాజాగా సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో నలుగురు ప్రతినిధులకు నోటీసులు ఇచ్చింది. కంపెనీకి సంబంధించి పూర్తి స్థాయిలో డేటా కావాలని నోటీసుల్లో సీబీఐ పేర్కొంది. ఇదే సమయంలో ఏపీలో పలువురు ఆక్వా బిజినెస్ ప్రతినిధులను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. పెద్ద మొత్తంలో ఈస్ట్ ఆర్డర్ చేసుకోవడంలో ఆంతర్యమేంటనే దానిపై ప్రశ్నలు సంధించనున్నట్టు సమాచారం. మరోవైపు.. సీబీఐ అడిగిన ప్రశ్నలకు సంధ్య ఆక్వా ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ‘సంధ్యా’ యాజమాన్యంపై ప్రశ్నల వర్షం తమ సంస్థ తీసుకొచ్చిన డ్రైఈస్ట్లో డ్రగ్స్ ఎలా వచ్చాయో తమకు తెలియదని సంధ్యా ఆక్వా సంస్థ చెబుతోంది. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ఇటీవల మరికొన్ని బ్యాగుల్ని పరీక్షించగా.. 70 శాతం డ్రైఈస్ట్ బ్యాగుల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. సంధ్యా ఆక్వా యాజమాన్యాన్ని సీబీఐ విచారిస్తోంది. ఎప్పటి నుంచి వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు. బ్రెజిల్ నుంచి ఫీడ్‌ని ఎప్పుడు బుక్ చేశారు.. అక్కడి నుంచి తెప్పించుకోడానికి గల కారణాలేంటి.. విశాఖ పోర్ట్‌నే ఎందుకు ఎంచుకున్నారు. ఇంత భారీగా తెప్పించుకున్న సరుకును నిర్ణీత వ్యవధిలో ఎలా విక్రయిస్తారు? తదితర విషయాలపై ప్రశ్నించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. సంధ్య ఆక్వా యాజమాన్యం కాల్ డేటాపై సీబీఐ దృష్టి సారించింది. అలాగే, విశాఖ పోర్టులో కస్టమ్స్ కార్యకలాపాలపై కూడా ఫోకస్ పెట్టింది. డ్రగ్ కంటైనర్ తనిఖీలకు వచ్చిన సీబీఐకి తొలుత ఆశించిన సహకారం లభించలేదని సమాచారం. పోర్ట్ నుంచి సీఎఫ్‌ఎస్‌కు వెళ్లే కంటైనర్ల తనిఖీలకు అనుసరించే విధానంపై సీబీఐ ఆరా తీస్తోంది. కస్టమ్స్ పనితీరులో లోపాలు నిర్ధారణ జరిగితే ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది. -
ఇద్దరు కుమారులను పక్కింట్లో వదిలి, ఇంటికెళ్లి.. నోట్ బుక్‌లో రాసి..
సాక్షి, మెదక్/తూప్రాన్: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మున్సిపల్ పరిధిలోని బ్రహ్మణపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శివానందం తెలిపిన వివరాల ప్రకారం.. బ్రహ్మణపల్లికి చెందిన శివసాయికి ఆరేళ్ల కిందట మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన సంధ్య(25)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కొన్ని నెలల కిందట శివసాయికి రోడ్డుప్రమాదం జరగడంతో ఇంటిపట్టునే ఉంటున్నాడు. దీంతో కుటుంబ పోషణ భారమైంది. ఈ క్రమంలోనే సంధ్య అనారోగ్యానికి గురై తీవ్ర మనస్థాపానికి లోనైంది. సోమవారం తన ఇద్దరు కుమారులను పక్కింట్లో వదిలి, ఇంటికెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు.. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నా’ అని నోట్ బుక్‌లో రాసి చనిపోయిందని ఎస్ఐ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించామన్నారు. తల్లి మృతిచెందడంతో ఇద్దరు కుమారులను చూసి ప్రతి ఒక్కరూ కన్నీటిపర్యంతమయ్యారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఆమెపై ఆగని అకృత్యాలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అని గొప్పగా చెప్తున్నా.. ఆధునికంగా ప్రపంచం ఎంత వేగంగా ముందుకు పయనిస్తున్నా.. మహిళలపై వేధింపులు, హింస తగ్గడం లేదు. వివక్ష అంతరించడం లేదు. పరువు హత్య లు, వరకట్న హత్యలు, అత్యాచారాలు, వేధింపులు.. ఎక్కడా మహిళలకు రక్షణ లేని దుస్థితి. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని ఉజ్జయినిలో జరిగిన సంఘటన దీనికి మరో నిదర్శనం. అత్యాచారానికి గురైన పన్నెండేళ్ల బాలిక భయంతో వణికిపోతూ, అర్ధనగ్నంగా కిలోమీటర్ల దూరం సాయం కోసం పరుగెత్తడం.. సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి. మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసి నగ్నంగా ఊరేగించిన ఘట నా ఇలాంటిదే. పోలీసు వ్యవస్థ ఎంత ఆధునిక పోకడలు పోతున్నా.. దేశంలో ఇంకా అనాగరిక దుష్కృత్యాలు కొనసాగడం ఆందోళనకరం. 2011–2021 మధ్య 87 శాతం పెరుగుదల.. గత దశాబ్దంలో మహిళలపై హింసాత్మక సంఘటనలు దాదాపు 87 శాతం మేర పెరగడం ఏ అభివృద్ధికి సంకేతమన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. మన దేశంలోనేగాక ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింస/వేధింపులు కొనసాగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం.. పోలీస్స్టేషన్లలో నమోదైన కేసుల సంఖ్య ఆధారంగానే 2011లో 2,28,650 మంది మహిళలపై హింసాత్మక ఘటనలు జరిగితే.. 2021నాటికి ఈ సంఖ్య 4,28,478కు అంటే.. 87శాతం మేర పెరగడం ఆందోళనకరం. అయితే దీనిని పోలీసు యంత్రాంగం మరో విధంగా చూస్తున్నట్టు సమాచారం. గతంలో మహిళలు కేసులు పెట్టడానికి ముందుకు వచ్చేవారు కాదని.. పెరిగిన విద్యావకాశాలు, పోలీసుల ఔట్రీచ్ కారణంగా ముందుకొచ్చి కేసులు పెడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. దేశ మహిళా జనాభాలో 7.5శాతం పశ్చిమ బెంగాల్లో ఉంటే.. అక్కడ మహిళలపై జరిగిన నేరాలు 12.7 శాతమని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మహిళలు హింసను భరించాలని దేశంలోని దాదాపు 65శాతం మంది పురుషులు అభిప్రాయంతో ఉన్నారని ‘ఇంటర్నేషనల్ మెన్ అండ్ విమెన్ జెండర్ ఈక్వాలిటీ సర్వే (ఇమేజెస్)’స్పష్టం చేసింది. కుటుంబం కలసి ఉండాలంటే మహిళలు ఈ హింసను భరించాల్సిందేనన్న ధోరణి ప్రమాదకరంగా మారుతోందని పేర్కొంది. ఇక గృహ హింసకు సంబంధించి కుటుంబ పరువు పేరిట చాలా వరకు మహిళలు కేసులు పెట్టడం లేదని నిపుణులు చెప్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ప్రపంచ మహిళా జనాభాలో కనీసం 33.7% మంది ఏదో ఒక సమయంలో నేరాలు/వేధింపులకు గురైనవారే. పరువు పేరిటహత్యలెన్నో.. దేశంలో ఇటీవలి కాలంలో పరువు హత్యలు పెరిగిపోయాయి.కుటుంబ పెద్దల అంగీకారం లేకుండా ప్రేమించి కుల, మతాంతర వివాహాలు చేసుకుంటున్నవారిని.. పరువుకు భంగం కలిగించారనే భావనతో వారి కుటుంబాలే హత్య చేయిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే ఖాప్ పంచాయతీలు నిర్వహించి మరీ మరణ శాసనాలు లిఖిస్తున్నారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అత్యాచార దారుణాలు.. మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలూ దారుణంగా పెరుగుతున్నాయి. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం.. గత దశాబ్దకాలంలో ఇలాంటి దారుణాలపై కేసులు బాగా పెరిగాయి. 2008లో దేశంలో 21,467 అత్యాచార కేసులు నమోదవగా.. 2021లో ఈ సంఖ్య 31,677కు పెరిగింది. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదులు కూడా.. తమపై వేధింపులకుసంబంధించి జాతీయ మహిళా కమిషన్‌కు వస్తున్న ఫిర్యాదులూపెరిగాయి. 2022లో మొత్తం 33,906 నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. ఇందులో అత్యధికంగా ఒక్క ఉత్తరప్రదేశ్ నుంచే 54.5 శాతం ఫిర్యాదులు ఉండగా.. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, మహారాష్ట్ర, బిహార్, హరియాణావంటి రాష్ట్రాలు ఉన్నాయి. ప్రజల్లో చైతన్యం పెరిగితేనే ప్రయోజనం దేశంలో మహిళలపై అకృత్యాలు, అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో మహిళలపై హింస మరింత పెరిగి క్రూరమైన రూపాలను సంతరించుకుంటోంది. కరోనా లాక్డౌన్ కాలంలో స్త్రీలపై హింస విపరీతంగా పెరిగినట్టు మేం గమనించాం. మతం పేరిట, ఇతర రూపాల్లో ద్వేషం, విషపూరిత వాతావరణం నెలకొని గతంలోని స్నేహపూర్వక పరిస్థితి లేకుండా పోయింది. ఇది అన్నిరకాల హింసలకూ దారితీస్తోంది. నిర్భయ చట్టం తీసుకొచ్చినపుడు.. స్త్రీల హక్కులేమిటి? వారిపై హింసకు ఎందుకు పాల్పడకూడదన్న అంశాలపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యికోట్లు కేటాయించింది. ఇప్పుడైతే మహిళల హక్కులు అనే స్పృహ లేకుండా చేస్తున్నారు. మíహిళలకు సంబంధించిన రంగాలు, అంశాలపై బడ్జెట్ కేటాయింపులను కూడా తగ్గించడం దురదృష్టకరం. మహిళలపై ఎలాంటి దాడులకు పాల్పడినా తమకేమీ కాదులే అన్న మొండి ధైర్యం హింసకు దారితీస్తోంది. చట్టాలను అమలుచేయాల్సిన పోలీసు, ఇతర వ్యవస్థలు అవినీతితో పారదర్శకతను కోల్పోతున్నాయి. ప్రజల్లో చైతన్యం పెరిగినప్పుడే చట్టాలను అమలు చేసేందుకు ప్రభుత్వాలు దిగొస్తాయి. - వి.సంధ్య సామాజిక కార్యకర్త,పీవోడబ్ల్యూ -
డిపార్ట్మెంట్లో కాకుండా వేరే ఎక్కడైనా ఉద్యోగం ఇవ్వాలని కోరా: సంధ్య
-
నా భర్త మృతికి కారణం వాళ్లిద్దరే: రవీందర్ భార్య
సాక్షి, హైదరాబాద్: హోంగార్డ్ రవీందర్ సూసైడ్ కేసు ఊహించని మలుపు తిరిగింది. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే అధికారుల వేధింపులూ కూడా తన భర్త మరణానికి కారణమంటూ చెబుతూ వచ్చిన రవీందర్ భార్య సంధ్య.. తాజాగా సంచలన ఆరోపణలకు దిగారు. ‘‘నా భర్తను తగలబెట్టారు. కానిస్టేబుల్‌చందు, ఏఎస్ఐ నర్సింగరావులు కలిసి నా భర్తపై పెట్రోల్ పోశారు. కానీ, ఈ ఇద్దరూ ఇప్పటివరకు అరెస్ట్ కాలేదు. హోంగార్డ్ ఆఫీస్ సీసీటీవీ ఫుటేజీ అందుబాటులో లేదు. అది దొరికితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి’’ అని పేర్కొన్నారామె. తన భర్తను తీవ్రంగా వేధించారన్న ఆమె.. ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయింది. "నా భర్త ఫోన్ అన్‌లాక్ చేసి మొత్తం డేటా డిలీట్ చేశారు. హమీద్ అనే అధికారి నా దగ్గరకు వచ్చి పెట్రోల్ బంక్‌లో ప్రమాదం జరిగిందని చెప్పాలన్నారు. అలా అయితేనే బెనిఫిట్స్ వస్తాయని చెప్పి.. నన్ను పక్కదారి పట్టించే యత్నం చేశారు" అని సంధ్య ఆరోపించారు. తన భర్తను చంపిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని కన్నీళ్లతో డిమాండ్ చేస్తున్నారామె. జీతం పడకపోవడంతో.. మనస్తాపానికి గురైన రవీందర్.. మంగళవారం సాయంత్రం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. తీవ్ర గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవీందర్ మృతి చెందారు. రవీందర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియాకు తరలించారు పోలీసులు. ఈ క్రమంలో రవీందర్ భార్య కోసం ఎదురు చూస్తున్నారు. ఆమె సంతకం చేస్తేనే మృతదేహానికి పోస్ట్‌మార్టం చేస్తారు వైద్యులు. దీంతో ఉస్మానియా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ఆమె ఆరోపణలపై పోలీస్ శాఖ స్పందించాల్సి ఉంది. -
విశాఖ: సంధ్య ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లాలో సంపులో పడి ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. నిన్న(మంగళవారం) అర్ధరాత్రి సంధ్య ఫోన్ నుంచి ఆటో డ్రైవర్‌కు ఫోన్ వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, సంధ్య పిల్లల్ని సదరు ఆటో డ్రైవర్ ప్రతీరోజూ స్కూల్‌కు తీసుకువెళ్తాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. మర్రిపాలెం ప్రకాశ్ నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లోని నీటి సంపులో ముగ్గురు మృతదేహాలు బుధవారం లభించాయి. మృతులను తల్లి సంధ్య, పిల్లలు గౌతమ్, అలేఖ్యలుగా గుర్తించారు. కాగా, చనిపోయిన వారు అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌గా కుటుంబంగా స్థానికులు చెబుతున్నారు. కాగా, పది నెలల క్రితమే వీరంతా విశాఖకు వచ్చారు. ఇంతలోనే ఇంత ఘోరం జరగడంతో అక్కడున్నవారంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక, వీరి మృతిపై సమాచారం అందుకున్న విశాఖ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను సంపు నుంచి బయటకు తీశారు. అయితే వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం, వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: కీచక టీచర్ అరెస్ట్ -
Waltair Veerayya : ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద మెగా ఫ్యాన్స్ సందడి (ఫొటోలు)
-
మెటా ఇండియా హెడ్ గా విశాఖకు చెందిన సంధ్య నియామకం
-
Sandhya Devanathan: మెటా పవర్
‘బిగ్గెస్ట్ రిస్క్ ఏమిటో తెలుసా? రిస్క్ చేయకపోవడమే’ అంటాడు మెటా సీయీవో మార్క్ జుకర్ బర్గ్. మెటాలో భాగమైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లు ప్రస్తుతం రకరకాల సమస్యలు, సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి క్లిష్టపరిస్థితులలో రానున్న జనవరిలో ‘మెటా ఇండియా’ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించబోతోంది సంధ్యా దేవనాథన్. ఆంధ్రా యూనివర్శిటీ నుంచి ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ వరకు ఎన్నో ప్రసిద్ధ విద్యాలయాల్లో చదువుకున్న సంధ్య నిత్య విద్యార్థి. అదే ఆమె నైపుణ్యం. నాయకత్వ బలం... ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృసంస్థ ‘మెటా’ సంధ్యా దేవనాథన్‌ను ‘మెటా ఇండియా’ వైస్ ప్రెసిడెంట్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఆంధ్రాయూనివర్శిటీ(ఏయూ, విశాఖపట్టణం)లో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన సంధ్య దిల్లీ యూనివర్శిటీలో ఎంబీఏ చేసింది. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో ‘లీడర్షిప్’ కోర్స్ చేసింది. సిటీబ్యాంక్‌లో ఉద్యోగం చేసిన సంధ్య ఆ తరువాత స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులో చేరి మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్ బ్యాంకింగ్ అండ్ పేమెంట్ ప్రొడక్ట్స్) స్థాయికి ఎదిగింది. జనవరి 2016లో మెటాలో చేరిన సంధ్య ఆగస్ట్‌లో మెటా మేనేజింగ్ డైరెక్టర్(సింగపూర్), మెటా బిజినెస్ హెడ్ (వియత్నాం)గా పనిచేసింది. మెటాకు సంబంధించి ఆగ్నేయాసియా ఇ–కామర్స్ వ్యవహారాలను పర్యవేక్షించింది. మెటా ప్రకటనకు ముందు వరకు ఆసియా–పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి గేమింగ్–వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తోంది సంధ్య. మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించే అవకాశం రావడం సాధారణ విషయం ఏమీ కాదు. ఇంతకీ సంధ్య బలం ఏమిటి? వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే నైపుణ్యం, సమర్థవంతులైన ఉద్యోగులతో బృందాన్ని ఏర్పాటు చేసుకొని అత్యున్నత ఫలితాలు రాబట్టడం... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ‘ఇది నా బలం’ అని ఆమె ఎప్పుడూ చెప్పలేదు. మీడియాలో పెద్దగా ఇంటర్య్వూలు కూడా కనిపించవు. అయితే ఆమె ట్రాక్ రికార్డ్ ఆమె బలం ఏమిటో చెప్పకనే చెబుతుంది. పెప్పర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్, నేషనల్ లైబ్రరీ బోర్డ్(సింగపూర్), సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్శిటీ, మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ (సింగపూర్), ఉమెన్స్ ఫోరమ్ ఫర్ ది ఎకా నమీ అండ్ సొసైటీ... మొదలైన వాటిలో బోర్డ్ మెంబర్‌గా పనిచేసిన సంధ్యకు స్త్రీ సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలు అంటే ఆసక్తి. మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహాన్ని ఇచ్చే మెటా ఉమెన్స్, ఏపీఏసీలో ఎగ్జిక్యూటివ్ స్పాన్సరర్‌గా విధులు నిర్వహించింది. డిటిటల్ రంగంపై మన ఆసక్తిని గమనించిన మెటా తన టాప్ ప్రాడక్ట్స్‌ను ఇండియాలోనే లాంచ్ చేసింది. మన దేశంలోని లీడింగ్ బ్రాండ్స్, క్రియేటర్స్, అడ్వర్టైజర్లతో కంపెనీకి ఉండే స్ట్రాటిజిక్ రిలేషన్‌ను బలోపేతం చేయడానికి బలమైన వ్యక్తి కోసం వెదికింది మెటా. తమ భవిష్యత్ లక్ష్యాలను నెరవేర్చే శక్తి సామర్థ్యాలు సంధ్యలో ఉన్నాయి అనే బలమైన నమ్మకంతో పెద్ద బాధ్యతను అప్పగించి ఘన స్వాగతం పలికింది. లీడర్షిప్ పాఠాలలో నొక్కి వక్కాణించి చెప్పే మాట... ‘లీడర్షిప్, లెర్నింగ్ అనేవి వేరు వేరు ధ్రువాలు కాదు. ఒకదానిపై ఒకటి అనివార్యంగా ఆధారపడతాయి’ సిటీబ్యాంకులో సాధారణ ఉద్యోగిగా పనిచేసినా, మెటా లాంటి సంస్థలో బాస్‌గా కీలక విధులు నిర్వహించినా నేర్చుకోవడాన్ని మాత్రం సంధ్య ఎప్పుడూ ఆపలేదు. వ్యక్తులు మొదలు సామాజిక పరిస్థితుల వరకు ఎన్నో విషయాలు నేర్చుకొని తనను తాను తీర్చిదిద్దుకుంది. ప్రసిద్ధ విద్యాలయాల్లో ఆమె నేర్చుకున్న పాఠాలు ఎన్నో సందర్భాలలో తనకు దారి చూపాయి. ప్రస్తుతం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లు రకరకాల సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. వాటిని అధిగమించి ఆదాయాన్ని పెంచడం చిన్న విషయమేమీ కాదు. బ్యాంకింగ్, పేమెంట్స్, టెక్నాలజీ రంగాలలోఅంతర్జాతీయ స్థాయిలో 22 సంవత్సరాల అనుభవం ఉన్న సంధ్యా దేవనాథన్‌కు సవాళ్లు కొత్త కాదు. విజయాలు సాధించడమూ కొత్త కాదు. బెస్టాఫ్ లక్ సంధ్య గారూ! -
ప్రఖ్యాత గాయని సంధ్యా ముఖర్జీ కన్నుమూత
కోల్‌కతా: ప్రముఖ గాయని, బంగ బిభూషణ్ సంధ్యా ముఖర్జీ(91) కోల్‌కతాలో మంగళవారం రాత్రి 7.30 గంటలకు గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందారు. ఎస్.డి.బర్మన్, నౌషద్, సలీల్ చౌదరి తదితరుల సంగీత దర్శకత్వంలో హిందీ, బెంగాలీ భాషల్లో ఎన్నో మధురైన పాటలు పాడిన సంధ్యా ముఖర్జీ దశాబ్దాలపాటు అభిమానులను అలరించారు. సంధ్యా ముఖర్జీ మృతిపట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సంతాపం ప్రకటించారు. చదవండి: (యాంకర్ శ్రీముఖి పెళ్లి చేసుకోనుందా? ఆ ఫోటోతో సర్ప్రైజ్) -
కబడ్డీ... కబడ్డీ...
‘కబడ్డీ.. కబడ్డీ’.. అని కూత పెట్టే ఆటగాళ్లు పాయింట్ కోసం బరిలో దిగుతారు. వేగం, ఒడుపు ఉండే ఆ ఆటలో తప్పొప్పులను ఎంచే రిఫరీ పని చాలా కష్టమైనది. నేడు ప్రో కబడ్డీ లీగ్‌లో పని చేస్తున్న పది మంది మహిళా రిఫరీలలో సంధ్య అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా, గృహిణిగా, తల్లిగా ఉంటూనే ఆమె కబడ్డీ రిఫరీగా ఆ ఉపాధి పట్ల యువతులకు కుతూహలం రేపుతోంది. కూత ఆపకూడదు. ప్రత్యర్థి శిబిరానికి చిక్క కూడదు. ఒకరినో ఇద్దరినో చిరుతలా తాకి సొంత శిబిరానికి చేరుకోవాలి. కబడ్డీ అసలు సిసలు భారతీయ పల్లె క్రీడ. ప్రధానంగా పురుష క్రీడ. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఆట ఆ తర్వాత క్రికెట్ దెబ్బకు చతికిల పడింది. తిరిగి కార్పొరేట్ అవసరాల కొద్దీ ప్రాణం పోసుకుంది. ఇసుక మైదానాల నుంచి ఖరీదైన ఇండోర్ స్టేడియంలలోకి, లైవ్ టెలికాస్ట్లలోకి, స్పాన్సరర్ల పూనికలోకి మారిన ఈ ఆట నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులను అలరిస్తోంది. అందుకు కొత్త కొత్త మార్గాలను అవలంబిస్తోంది. 2014లో ‘ప్రో కబడ్డీ లీగ్’ మొదలైతే 2018 నుంచి మహిళా రిఫరీలను కూడా ఈ ఆటలో ఉపయోగిస్తున్నారు. అందుకు సాగిన సెలక్షన్లలో తమిళనాడు వెల్లూరు నుంచి ఎంపికైన రిఫరీయే ఎంకె. సంధ్య. సీజన్ 6తో మొదలయ్యి ప్రస్తుతం బెంగళూరులో డిసెంబర్ 22 నుంచి సాగుతున్న సీజన్ 8లో కూడా రిఫరీగా పని చేస్తున్న సంధ్య అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కబడ్డీ ప్లేయర్ ‘8వ తగతిలో ఉండగా మా స్కూల్ మైదానంలో కొంత మంది సీనియర్ అమ్మాయిలు కబడ్డీ ఆడటం చూశాను. నాకు ఆ ఆట నచ్చింది. అక్కా... నన్ను కూడా చేర్చుకోండి అని అడిగితే చిన్న పిల్లవు... వచ్చే సంవత్సరం టీమ్‌లోకి వద్దువులే అన్నారు. నేను వినలేదు. పీటీని అడిగి వెంటనే చేరిపోయాను’ అంటుంది సంధ్య. మరో ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉన్న సంధ్య తాను మాత్రమే ఈ ఆటను ఎంచుకున్నందుకు ఎప్పుడూ నిరాశ పడలేదు. ఇంటర్లో చేరగానే సబ్ జూనియర్స్ నేషనల్ జట్టుకు ఆ తర్వాత జూనియర్స్ నేషనల్ జట్టుకు (2008) ఆడింది. ఆ తర్వాత కూడా ఆమె ఆట జోరుగా సాగేదేమో కాని జీవితం మారింది. ప్రేమ పెళ్లి సీనియర్ ఇంటర్లో ఉండగా సంధ్యకు కబడ్డీ క్రీడాకారుడు కాంతివరన్తో పరిచయమైంది. వెంటనే ప్రేమ ఆ వెంటనే పెళ్లి జరిగిపోయాయి. ‘మా పెళ్లి మా పెద్దలకు ఇష్టం లేదు. అందుకని మేము వెల్లూరు వదిలి చెన్నైకు వచ్చేశాము’ అంది సంధ్య. ఆ మరుసటి సంవత్సరమే ఆమెకు కొడుకు పుట్టాడు. జ్యూస్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న కాంతివరన్కు సంధ్య టాలెంట్ తెలుసు. ‘మళ్లీ నువ్వు కబడ్డీ ఆడు’ అని ఆమెతో చెప్పాడు. ఆమెను తీర్చిదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. కాని వివాహం అయ్యి, బిడ్డకు జన్మనిచ్చాక తిరిగి పూర్వపు ఫిట్నెస్తో ఆడటం అంత సులభం కాదు. ‘మేమిద్దం చాలా కష్ట పడ్డాం. ఉదయం 5 నుంచి ఆరున్నర వరకూ కబడ్డీ ఆడేదాన్ని. తిరిగి నా భర్త సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్లీ ఆడేదాన్ని. అతను నా కోసం స్పెషల్ డైట్ కూడా ఫిక్స్ చేశాడు. కొత్తల్లో ఇదంతా చాలా కష్టంగా అనిపించేది. కాని పట్టుదలగా ఫిట్నెస్ సాధించి తిరిగి కబడ్డీ ప్లేయర్‌గా మారాను’ అంది సంధ్య. ఇప్పుడు సంధ్య దక్షిణ భారత మహిళ కబడ్డీ టీమ్‌లతో కలిసి కబడ్డీ ఆడటం మొదలెట్టింది. అంతే కాదు భర్త ప్రోత్సాహంతో డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, యోగాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా చేసింది. 2015 వరకూ మహిళా కబడ్డీ ప్లేయర్‌గా ఉన్న సంధ్య వెల్లూరులో తల్లి అనారోగ్యం వల్ల కొంత, పిల్లాణ్ణి ఒక్కణ్ణే వదిలేసి టోర్నమెంట్లకు వెళ్లే వీలు లేక కొంత కబడ్డీ ఆటకు దూరమైంది. తిరిగి ఆ దంపతులు వెల్లూరు చేరుకున్నారు. పిఈటీగా... వెల్లూరులో స్ప్రింగ్ డేస్ స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా చేరింది సంధ్య. వెల్లూరులో పని వెతుక్కున్న భర్త ‘కబడ్డీ రిఫరీలకు డిమాండ్ ఉంది. ఆ పరీక్షలు రాయి’ అని ప్రోత్సహించాడు. సంధ్య ‘అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ నిర్వహించే రిఫరీ పరీక్షను రాసి పాసైంది. ఆ వెంటనే ఆమెకు డిస్ట్రిక్ లెవల్, ఇంటర్ జోన్ మేచ్లకు రిఫరీగా ఉండే అవకాశాలు రావడం మొదలయ్యింది. స్కూల్లో పని చేస్తూనే, కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూనే, మేచ్ ఉన్నప్పుడు రిఫరీగా బయలుదేరి వెళుతోంది సంధ్య. ప్రొ కబడ్డీ లీగ్ రిఫరీగా ప్రో కబడ్డీ లీగ్ మేచెస్ కోసం మహిళా రిఫరీల సెలక్షన్స్ జరుగుతున్నాయని తెలిసి వాటిలో పాల్గొని ఎంపికైంది సంధ్య. ఇది పెద్ద విజయమే. ఎందుకంటే ప్రో కబడ్డీ లీగ్ మేచెస్ చాలా ప్రొఫెషనల్‌గా సాగుతాయి. స్పాన్సర్‌షిప్‌లతో ముడిపడిన వ్యవహారం. లైవ్ టెలికాస్ట్ ఉంటుంది కనుక రిఫరీలు తప్పులు చేయడానికి లేదు. ‘టోర్నమెంట్ సాగుతున్నన్ని రోజులు మేము ఉదయాన్నే మా ఫిట్నెస్ను నిరూపించుకోవాలి. ఆ తర్వాత ముందు రోజు ఆటను అవలోకించాలి. ఆ రోజు జరిగే ఆటను అంచనా వేయాలి. అప్పుడు మేము మేచ్‌కు రెడీ అవుతాం’ అంటుంది సంధ్య. ప్రతి మేచ్‌కు ఒక మెయిన్ రిఫరీ, ఇద్దరు అంపైర్లు, ఇద్దరు లైన్ రిఫరీలు, ఇద్దరు అసిస్టెంట్ రిఫరీలు ఉంటారు. మెయిన్ రిఫరీగా వీరిని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది సంధ్యకు. ‘మేచ్లలో సిగ్నల్స్‌ను సాధన చేస్తాం మేము. అలాగే ఒక్కోసారి ఆటగాళ్లు పాయింట్స్ కోసం వాదనకు దిగుతారు. వారికి మా నిర్ణయం సరైనదే అని చెప్పాల్సి వస్తుంది. వారు ఆగ్రహంలో ఉంటారు. మేము స్థిమితంగా మాట్లాడాలి. మేము కూడా కోప్పడితే అంతా రసాభాస అవుతుంది’ అంటుంది సంధ్య. మారుతున్న కాలానికి మారుతున్న మహిళా క్రీడా ప్రతినిధి సంధ్య. -
పద్మ పురస్కారాలు మాకొద్దు.. మేం తీసుకోం
న్యూఢిల్లీ: తమకు ప్రకటించిన పద్మ పురస్కారాలను పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ, ప్రముఖ నేపథ్య గాయని సంధ్యా ముఖర్జీ తిరస్కరించారు. పద్మభూషణ్ అవార్డు స్వీకరించేందుకు తాను సిద్ధంగా లేనని బుద్ధదేవ్ చెప్పినట్టు సీపీఎం తెలిపింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి పురస్కారాలు తీసుకోరాదన్నది తమ పార్టీ విధానమని స్పష్టం చేసింది. తాము ప్రజల కోసం పనిస్తామని, అవార్డుల కోసం కాదని ప్రకటించింది. గతంలో కేరళ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ నాయకుడు ఇఎంఎస్ నంబూద్రిపాద్‌కు ‘పద్మ’ పురస్కారాన్ని ప్రకటించగా.. ఆయన దానిని తిరస్కరించారని సీపీఎం వెల్లడించింది. 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వ హయాంలో తనకు ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డును నంబూద్రిపాద్ నిరాకరించారు. దేశాన్ని అవమానించడమే.. గులాం కావాలనుకోవడం లేదు పద్మభూషణ్‌ను తిరస్కరించడం ద్వారా భట్టాచార్జీ దేశాన్ని అవమానించారని, బీజేపీ నాయకురాలు ప్రీతి గాంధీ అన్నారు. పద్మ అవార్డులు ఏ ఒక్క పార్టీకి లేదా సిద్ధాంతానికి చెందినవి కాదని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందిస్తూ.. ‘ఆయన ఆజాద్‌గా ఉండాలనుకుంటున్నారు. గులాం అవ్వాలను కోవడం లేద’ని వ్యాఖ్యానించారు. (చదవండి: కొందరు కావాలనే అలా చేశారు: గులాం నబీ ఆజాద్) అవమానంగా ఉంది.. అవార్డు వద్దు: సంధ్యా ముఖర్జీ నేపథ్య గాయని సంధ్యా ముఖర్జీ కూడా పద్మశ్రీ పురస్కారాన్ని నిరాకరించినట్లు పీటీఐ తెలిపింది. ఆలస్యంగా ఎంపిక చేసినందుకు ఆమె అవార్డును వద్దనుకున్నట్టు సమాచారం. ‘90 సంవత్సరాల వయస్సులో సుమారు ఎనిమిది దశాబ్దాల పాటు స్వర ప్రస్థానం సాగించిన సంధ్యా ముఖర్జీకి ఇంత ఆలస్యంగా పద్మశ్రీ పురస్కారం ప్రకటించడం ఆమెను కించపరచడమేన’ని ఆమె కుమార్తె సౌమీ సేన్‌గుప్తా అన్నారు. అవార్డును తిరస్కరించడం వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. ఆ దశను ఎప్పుడో దాటాను: అనింద్య ఛటర్జీ ప్రముఖ తబలా విద్వాంసుడు పండిట్ అనింద్య ఛటర్జీ కూడా పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించినట్టు వెల్లడించారు. అవార్డు కోసం తన సమ్మతిని కోరుతూ ఢిల్లీ నుండి తనకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు ప్రతికూలంగా స్పందించినట్టు ‘పీటీఐ’కు తెలిపారు. ‘పద్మ పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించాను. నాకు అవార్డు ఇవ్వాలని అనుకున్నందుకు ధన్యవాదాలు చెప్పాను. నా కెరీర్లో ఈ దశలో పద్మశ్రీని అందుకోవడానికి సిద్ధంగా లేనని.. ఆ దశను ఎప్పుడో దాటాన’ని అన్నారు. కాగా, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ‘పద్మ’ అవార్డులు ప్రకటించింది. నలుగురు పద్మవిభూషణ్, 17 మంది పద్మ భూషణ్, 107 మంది పద్మశ్రీకి ఎంపికయ్యారు. (చదవండి: బిపిన్, ఆజాద్‌లకు పద్మవిభూషణ్..) -
పూర్ కోసం ప్యూర్...
ఆమె వయసు ఏడు పదులు.. మనసుకు మాత్రం రెండు పదులే.. అందుకే కాబోలు ఎక్కడ ఎవరికి అవసరం ఉన్నా.. నేనున్నానంటూ చకచక పరుగులు తీస్తారు.. ప్యూర్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి.. ప్రపంచవ్యాప్తంగా ఐదు దేశాలలో 350 మంది కార్యకర్తలతో వేలాదిమందికి సేవలు అందిస్తున్నారు. నిరాడంబర జీవితం.. నిరంతర సేవానిరతి... అన్నీ కలిపితే... హైదరాబాద్ కిస్మత్పూర్లో పచ్చని చెట్ల మధ్య ఫలవృక్షంలా జీవిస్తున్న సంధ్య గోళ్లమూడి.. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పుట్టిన సంధ్య తమ ఇంట్లో తాతముత్తాతల నుంచి దేశసేవ చేయటం చూస్తూ పెరిగారు. దాంతో తాను కూడా బడుగు, బలహీన వర్గాల వారికోసం ఏదో ఒకటి చేయాలనే ఆలోచనకు బీజం పడింది. భర్త బ్యాంకు ఉద్యోగి డాక్టర్ శాంతారామ్... రైతుల కోసం ఏర్పాటు చేసిన ఫార్మర్స్ సొసైటీలకు మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేశారు. ఉద్యోగరీత్యా అనేక పల్లెసీమలకు తిరిగేవారు. ఈ క్రమంలో తనకు తారసపడిన నిరుపేదలకు అండగా నిలబడాలనుకున్నారామె. అందుకోసం బుట్టలు అల్లటం,పెట్టీకోట్స్ కుట్టడం, ఎంబ్రాయిడరీ... వంటి పనులు నేర్చుకున్నారు. పేద స్త్రీలకు వీటన్నింటినీ ఉచితంగా నేర్పించారు. పేదలకు అండగా.. నెల్లూరు వచ్చాక, ట్యూషన్లు చెబుతూ డబ్బు సంపాదించి, సంఘసేవ కోసం ఖర్చుచేశారు. తన సేవాకార్యక్రమాలకోసం భర్త మీద ఆధారపడదలచుకోలేదు. తన సంపాదన నుంచే ఖర్చు పెట్టేవారు. అందుకోసం టీచింగ్ దగ్గర నుంచి చిరు వ్యాపారాల వరకు ఎన్నో పనులు చేసేవారు. ఖమ్మంలో ఒక స్కూల్లో పుస్తకాలు లేక తండా పిల్లలు చదువు మానేసి మిరప చేలలో కూలికి వెళ్తున్న సంగతి తెలుసుకున్న సంధ్య తమ కుమార్తె శైలజ సహకారంతో సుమారు యాభైవేల రూపాయలు సేకరించి ఆ మొత్తాన్ని ఆ పిల్లలకు అందించి, వారి చదువు సజావుగా సాగేలా చూశారు. ‘‘అదే సమయంలో స్వచ్ఛంద సంస్థను స్థాపించి, దాని ద్వారా అవసరంలో ఉన్నవారికి సహాయ పడాలనుకున్నాను. మా అమ్మాయి, తన స్నేహితులు అందరూ లక్ష రూపాయల చొప్పున డిపాజిట్ చేశారు. సంస్థకు pure (people for rural and urban education) అని పేరు పెట్టి, 2016 మార్చిలో రిజిస్టర్ చేశాం. నేను చలాకీగా ఉండటంతో డైరెక్టర్‌గా కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు నా వయసు 69 సంవత్సరాలు’’ అంటారు సంధ్య గోళ్లమూడి. విపత్తు సమయంలో అండగా... కేరళలో వరదలు వచ్చిన సమయంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని, సహాయ కార్యక్రమాలు చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద పిల్లలకు కావలసిన ఆర్వో వాటర్, బెంచీలు, లైబ్రరీ, కిచెన్ డెవలప్మెంట్, నోట్‌బుక్స్, టాయిలెట్స్, ఆడపిల్లలకు ప్యాడ్స్.. ఇలా ఇబ్బంది లేకుండా చదువుకోవటానికి అవసరమైన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు. 2017 – 2018 మధ్య ప్రాంతంలో 1,75,000 కి.మీ. డ్రైవర్ ని పెట్టుకుని ఒంటరిగా వివిధ పాఠశాలలకు ప్రయాణించారు. హైదరాబాద్‌లో ఉన్న ఏడువేల స్లమ్స్‌లో ప్రతి బుధవారం ఒక్కో స్లమ్‌లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వాస్తవ్యులకు మోదుగ ఆకుల విస్తర్లు కుట్టడానికి అనువుగా రెండు మెషీన్లు అందించారు. వారే మా వలంటీర్లు.. ‘‘సమాజసేవ చేయాలనుకునే టీచర్లే మాకు ప్రతినిధులు. ఆయా ప్రాంతాల ఎన్జీఓ ల సహాయంతో ఈ పనులు చేయగలుగుతున్నాం. కడపలో కోవిడ్ కారణంగా మరణించిన వారి కోసం వ్యాన్, ఐస్ బాక్స్ అందచేశాం’’ అని చెబుతారు సంధ్య గోళ్లమూడి. అమ్మమ్మ... అభ్యాస పాఠశాలలు.. అటవీ ప్రాంతాలలో కొండ మీద నివసించేవారి కోసం అభ్యాస విద్యాలయాలు ఏర్పాటు చేశారు. ‘‘అందరూ నన్ను ‘మా అమ్మమ్మ’ అని ఎంతో ప్రేమగా అక్కున చేర్చుకుంటారు’’ అంటున్న సంధ్య గోళ్లమూడి, వివిధ సమస్యల మీద ఛందోబద్ధంగా 3000 కవితలు రాశారు. 65 సంవత్సరాల వయసులో కూచిపూడి నాట్యం చేసి, ఫేస్బుక్లో పెట్టారు. ఋతువులను అనుసరించి ఇల్లు సర్దుకుంటారు. ‘‘ప్రతిదీ ప్రభుత్వమే చేయాలంటే కుదరకపోవచ్చు. అందరం ప్రభుత్వంలో భాగస్వాములమే కనుక దేశపౌరులుగా ఇది మనందరి బాధ్యత’’ అంటారు ఎంతో హుందాగా. –వైజయంతి పురాణపండ లాక్డౌన్ విధించటానికి ముందే అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు కావలసిన నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్లు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్‌ని సప్లయి చేశాం. సమతుల ఆహారాన్ని అందించాం. వివిధ ప్రాంతాలకు చెందినవారు వారి ఇళ్లకు చేరుకోవటం కోసం రెండు బస్సులు ఏర్పాటు చేశాం. రెండు కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. మేం నడిపిన కోవిడ్ సెంటర్లలో అందరూ ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క మరణం కూడా లేదు. – సంధ్య గోళ్లమూడి సంధ్య గోళ్లమూడి -
అమృత సంధ్య ఇదీ జీవితం
‘నా భార్య నాకు అండగా నిలిచిన తీరు ఏ పెద్ద వాళ్లు చెప్పిన అప్పగింతలోనూ లేదు. బతుకు నావ ఒడిదొడుకులకు లోనయినప్పుడు తనకు తానుగా నాకు తోడు వచ్చింది. నేను ఈ రోజు ఇలా నవ్వుతూ ఉన్నానంటే కారణం మా సంధ్య ప్రోత్సాహం, సహకారమే’ అని ఓ భర్త తన భార్యను ప్రశంసల్లో ముంచెత్తాడు. భార్య గొప్పతనాన్ని చెప్పడానికి ఇష్టపడని మగ ప్రపంచంలో ఈ భర్త మాటలు వినడానికి మగవాళ్లకు ఎలా ఉందో కానీ ఆడవాళ్లు వినసొంపుగా ఆస్వాదిస్తున్నారు. ఆ భర్త కేరళ రాష్ట్రం, పాలక్కాడ్‌లోని శివకుమార్. నోరూరించే ఉపాధి ఓ పదహారేళ్ల కిందట... శివకుమార్ బీపీఎల్ లో ఉద్యోగం చేసేవాడు. ఆ బీపీఎల్ మూతపడడంతో అతడి ఉద్యోగం పోయింది. కొత్త ఉద్యోగం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఇంటిని నడపాల్సిన తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమవుతున్నానేమోననే ఆందోళనను అతడి భార్య సంధ్య పసిగట్టేసింది. ‘ఇల్లు గడవాలంటే ఉద్యోగమే చేయాలా? సొంతంగా మనకు వచ్చిన పని ఏదైనా చేయవచ్చు కదా’ అన్నదామె. శివకుమార్ ముఖంలో ప్రశ్నార్థకానికి బదులుగా ఆమె ‘చిరుతిండ్లు బాగా చేస్తాను. ఆ పనే మనకు అన్నం పెడుతుంది’ అన్నది. ‘మార్కెట్లో కొత్తరకాల స్వీట్లు ఎన్ని రకాలున్నప్పటికీ బాల్యంలో తిన్న రుచి కనిపిస్తే ఎవరికైనా నోరూరుతుంది. అదే మనకు బతుకుదెరువవుతుందని కూడా ఆమె భర్తకు భరోసానిచ్చింది. ప్రయోగాత్మంగా కొన్నింటిని చేసి బంధువులకు, స్నేహితులకు రుచి చూపించారు. వాళ్లు పాస్ మార్కులు వేయడంతో 2005లో అమృత ఫుడ్స్ పేరుతో చిరుతిళ్లను తయారు చేసే పరిశ్రమ మొదలైంది. పదిహేనేళ్లు గడిచేసరికి ఇప్పుడా దంపతులు ఏడాదికి పది లక్షల ఆదాయాన్ని చూడగలుగుతున్నారు. పదిమందికి పైగా ఉద్యోగం కల్పించారు. తమ ఆహార ఉత్పత్తులకు ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ గుర్తింపు కూడా వచ్చింది. వ్యక్తి వికాస పాఠం ఈ ఆధునిక యుగంలో నెలకు లక్షల జీతం తీసుకుంటున్న భార్యాభర్తలు ఎక్కువగానే ఉన్నారు. అంత సౌకర్యవంతమైన జీవితంలో కూడా నాలుగు నెలల పాటు ఉద్యోగంలో మాంద్యం ఏర్పడితే ఆ జీవితాలు తలకిందులవుతున్నాయి. మనోధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. శివకుమార్, సంధ్య దంపతుల జీవితం ఒక వ్యక్తిత్వ వికాస పాఠం అనే చెప్పాలి. ఉన్నత చదువు చదివిన భర్తతో ‘నాకు తెలిసిన పని, తక్కువ పెట్టుబడితో మన చేతుల శ్రమతో కొత్త వృత్తిని చేపడదా’మని చెప్పడంలో ఓ చొరవ ఉంది. తన చదువుకు తగిన ఉద్యోగం అని బేషజాలకు పోకుండా భార్య ప్రతిపాదనను గౌరవించడంలో అతడి పరిణతి ఉంది. -
139 మంది అత్యాచారం: ‘భూమి’కి న్యాయం చేయండి
సాక్షి, హైదరాబాద్: పీడిత వర్గాల అమ్మాయిలు చదువుకుందామని వస్తే కామాంధులు వేధింపులకు గురిచేస్తున్నారని పీఓడబ్ల్యూ సంధ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 139 అత్యాచారం బాధితురాలికి మద్దతుగా పలు కుల సంఘాలు, మహిళా సంఘాలు మద్దతు ప్రకటించాయి. సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా పీవోడబ్ల్యూ సంధ్య మాట్లాడారు. పదో తరగతి వరకు మిషనరీ స్కూల్లో చదువుకున్న బాధితురాలికి బయటి ప్రపంచం తెలియదని అన్నారు. కాలేజీ చదువుకని వెళితే దుర్మార్గుల చేతిలో అత్యాచారం, బ్లాక్మెయిల్ వేధింపులకు గురైందని తెలిపారు. ఇకపై బాధితురాలి పేరును ‘భూమి’ గా పేర్కొంటున్నట్టు సంధ్య తెలిపారు. (చదవండి: డాలర్ బాయ్ ఒత్తిడి మేరకే అలా చేశా: బాధితురాలు) డాలర్ బాయ్ అలియాస్ రాజ శ్రీకర్‌రెడ్డి భూమి బాధితురాలు కాదని, పోరాడుతున్న చైతన్యం అని వ్యాఖ్యానించారు. తనలా మరొకరికి అన్యాయం జరగొద్దని ఆమె మీడియా ఎదుటకు వచ్చారని తెలిపారు. చదువుపై మమకారంతో ఎన్ని అడ్డంకులెదురైనా భూమి ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎమ్ చదివారని సంధ్య అభినందించారు. బాధితురాలిని బంధించి మరీ లైంగిక వేధింపులకు గురి చేసిన డాలర్ బాయ్ అలియాస్ రాజ శ్రీకర్‌రెడ్డిని అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. డాలర్ బాయ్ తోపాటు 36 మంది ఆమెపై అత్యాచారం చేసి హింసించారని, వారికి శిక్ష పడేదాక పోరాడుతామని సంధ్య స్పష్టం చేశారు. నేరస్తులందరిపై చార్జ్‌షీట్ దాఖలు చేయాలని, భూమికి భద్రత కల్పించాలని సంధ్య పోలీసులను కోరారు. వాస్తవాల్ని వెలుగులోకి తీసుకురావాలని, అలాగే అమాయకుల పేర్లను ఫిర్యాదులో నుంచి తొలగించాలని చెప్పారు. (‘యాంకర్ ప్రదీప్‌కు ఈ కేసుతో సంబంధం లేదు’) -
వర్మా వర్మా వర్మా.. ఓ రాంగ్ గోపాల్ వర్మ
ప్రముఖ సినీ జర్నలిస్ట్ ప్రభు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రాంగ్ గోపాల్ వర్మ’. కమెడియన్ ‘షకలక’ శంకర్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా పోస్టర్‌ను మహిళాభ్యుదయవాది సంధ్య విడుదల చేసి, మాట్లాడుతూ– ‘మహిళల పట్ల చిన్న చూపు కలిగిన ఓ దర్శకుడి చేష్టల్ని ఎండగడుతూ ప్రభు రూపొందించిన ‘రాంగ్ గోపాల్ వర్మ’ చిత్రాన్ని నేను స్వాగతిస్తున్నాను’ అన్నారు. ‘ఓ ప్రముఖ దర్శకుడి విపరీత చేష్టలతో విసిగిపోయిన నేను ఈ చిత్రాన్ని తెరకెక్కించా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం కోసం నేను రాసిన ‘వర్మా వర్మా వర్మా... ఓ రాంగ్ గోపాల్ వర్మ... ఇలా కాలింది ఏమిటయ్యా మా ఖర్మ..’ అనే పాటను త్వరలో విడుదల చేస్తాం’ అని ప్రభు తెలిపారు. (రాంగ్ గోపాల్ వర్మ) -
కేసీఆర్.. ఇప్పటివరకు మాట్లాడలేదు
సాక్షి, హైదరాబాద్: మహిళలపై హింస పెరగడానికి గల కారణాలను ప్రభుత్వం వెలికితీయాలి... వాటిని అరికట్టాలే తప్ప ఎన్కౌంటర్లు చేయడం సరైందికాదని పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య అన్నారు. నేరస్తులు ఎవరైనా శిక్షించాలి. బాధితులు ఎవరైనా న్యాయం జరగాలని, అయితే చట్టాలను అతిక్రమించి నిర్ణయాలు తీసుకోవడం సరైందికాదని చెప్పారు. మంగళవారం సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో మహిళా ట్రాన్స్‌జెండర్ ఐక్య కార్యాచరణ సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంధ్య మాట్లాడుతూ... గత రెండు దశాబ్దాలుగా మహిళలపై జరుగుతున్న హింసకు కారణాలను ప్రభుత్వానికి వివరిస్తున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కేసీఆర్ సీఎం అయ్యాక ఇప్పటివరకు మహిళా సంఘాలతో మాట్లాడలేదని, మీ పాలనలో మహిళలు ఉండరా.. మీకు మా ఓట్లు కావాలి కానీ మా సమస్యలు పట్టవా అని విమర్శించారు. ఎన్‌కౌంటర్‌తో చేతులు దులుపుకుంటే సరిపోదని, 108 తరహాలో మహిళలకు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. భూమిక డైరెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ.. నేరం చేసిన వారిని న్యాయవ్యవస్థ ద్వారా శిక్షించకుండా మధ్యలోనే చంపడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. ఎన్కౌంటర్ చేయగానే సంబరాలు చేసుకోవడం ప్రమాదకరమని, చావును సంబరాలు చేసుకోవడమేంటని ఆమె ప్రశ్నించారు. ఇది ఉన్మాదానికి దారితీస్తుందని అన్నారు. తాము రేపిస్టులను సమర్ధించడంలేదని, కానీ ఈ సంఘటన వల్ల అత్యాచారాలు ఆగుతాయా అని ప్రశ్నించారు. ప్రముఖ రచయిత విమల మాట్లాడుతూ... మహిళలపై రోజురోజుకూ లైంగిక వేధింపులు పెరుగుతున్నా ప్రభుత్వాలు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు కొండవీటి సత్యవతి, జి.ఝాన్సీ, ఉషా సీతామహాలక్ష్మి, ఖలిదా ఫర్వీన్, మీరా సంఘమిత్ర, బండారు విజయ, శాంతి ప్రబోధ, సుజాత, అనురాధ, ఉషా, తేజస్విని, సుమిత్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆపదలో ఉన్నప్పుడు వెంటనే స్పందించే హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తేవాలని, అత్యవసర కాల్స్‌ను పర్యవేక్షించే వారే ప్రతిస్పందన చర్యలకు బాధ్యులుగా ఉండేలా చేయాలని, అన్ని పోలీస్స్టేషన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి, సైబర్ నేరాలను అరికట్టాలని తీర్మానించారు. -
వేధింపులు తాళలేక సంధ్య ఆత్మహత్య
కర్నూలు ,దేవనకొండ: కట్టుకున్న భర్త, అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని అలారుదిన్నె గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. తెలంగాణ రాష్ట్రం ఐజ మండలం పులికల్ గ్రామానికి చెందిన జంగం శంకరయ్య కుమార్తె జంగం సంధ్య(20)ను అలారుదిన్నె గ్రామానికి చెందిన జంగం జగదీష్‌కు ఇచ్చి గతేడాది వివాహం చేశారు. వీరి కాపురం కొంతకాలం సజావుగా సాగింది. అనంతరం భర్త జగదీష్ రోజూ సంధ్యను వేధించడం మొదలుపెట్టాడు. ఇటీవల వేధింపులు ఎక్కువ కావడంతో విసుగు చెందిన సంధ్య మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తమ కుమార్తెను భర్త, అత్తింటి వారే చంపేశారని మృతురాలి బంధువులు ఆరోపించారు. పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. ఎస్ఐ మారుతి, తహసీల్దార్ దోనీఆల్‌ఫ్రైడ్ ఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండకు తరలించి కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
లెక్చరర్ పార్వతి వేధింపుల కారణంగా..
బడంగ్పేట్: పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మీర్పేట్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బడంగ్‌పేటకు చెందిన ఎల్లయ్య, స్వప్న దంపతులు మీర్‌పేటలోని ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వీరి చిన్న కుమార్తె సంధ్య మీర్‌పేటలోని తీగల రాంరెడ్డి పాల్టెక్నిక్ (టీఆర్ఆర్) కాలేజీలో ఫైనలియర్(సీఎంఈ) చదువుతోంది. అదివారం తల్లిదండ్రులు బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లడంతో సంధ్య, ఆమె తాత మాత్రమే ఇంట్లో ఉన్నారు. తాత హాల్లో నిద్రిస్తుండగా, సంధ్య బెడ్రూమ్లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. మూడు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన ఆమె తల్లితండ్రులు సంధ్యను పిలిచినా తలుపులు తెరవకపోవడంతో బద్దలు కొట్టి చూడగా సంధ్య చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. ఆమెను కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది. హడావిడిగా అంత్యక్రియలు: దీంతో తల్లిదండ్రులు సమీపంలో బంధువులకు సమాచారం అందించారు. వారితో కలిసి హడావుడిగా సాయంత్రం బడంగ్‌పేట స్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. కాగా సంధ్య ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సివుంది. ఈ విషయంపై మీర్‌పేట పోలీసులను వివరణ కోరగా, తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. విద్యార్థుల ధర్నా సంధ్య ఆత్మహత్యపై సమాచారం అందడంతో సోమవారం కళాశాలలో విద్యార్థులు తరగతులను బహిష్కరించి కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. లెక్చరర్ పార్వతి వేధింపుల కారణంగా సంధ్య ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తూ ఆమెపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా లెక్చరర్ పార్వతిని సస్పెండ్ చేస్తున్నట్లు కళాశాల యాజమన్యం ప్రకటించింది. సంధ్య కుటుంబానికి న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు. -
బస్ భవన్ వద్ద ఉద్రిక్తతలకు దారితీసిన బీజేపీ ఆందోళన
-
అమెరికాలో వివాహిత ఆత్మహత్య
తొర్రూరు రూరల్: కొత్త జీవితంపై కోటి ఆశలతో అమెరికాలో అడుగుపెట్టిన ఓ అభాగ్యురాలికి ఆది నుంచే వరకట్న వేధింపులు మొదలయ్యా యి. భర్త, అత్తింటి వారి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కర్కాల గ్రామానికి చెందిన సేగ్యం మహేందర్, విమల దంపతుల ఆఖరి సంతానం సంధ్య (24) బీటెక్ చదువు కుంది. ఆమెకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఓ సంబంధాన్ని కుదిర్చారు. కానీ తొర్రూరులోని సాయినగర్‌కు చెందిన జోకుంట్ల రాజేశ్వర్, విజ య దంపతుల కుమారుడు శ్రీకాంత్... సంధ్యను వివాహం చేసుకుంటానని ఒత్తిడి తేవడంతో గతంలో కుదిర్చిన సంబంధాన్ని కాదని శ్రీకాంత్‌కు ఇచ్చి గతేడాది మే నెలలో వివాహం జరిపించారు. కట్న కానుకలు ఏమి వద్దని నమ్మబలికి సాదాసీదాగా మహబూబాబాద్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సంధ్యను వివాహం చేసుకోవడంతో ఆదర్శభావాలుగల అల్లుడు దొరికాడని అమ్మా యి తల్లిదండ్రులు సంబరపడ్డారు. ప్రస్తుతం శ్రీకాంత్ అమెరికాలోని టెన్నిసీలో రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. వివాహం అనంతరం అల్లుడితోపాటు కూతురును అమెరికాకు సాగనంపారు. ఇప్పుడు వారు మెంఫిస్ నగరంలో నివాసముంటున్నారు. అయితే వివా హమైన కొన్ని నెలల నుంచే భర్త, అత్తమామల నుంచి వరకట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. తల్లిదండ్రులను బాధ పెట్టొద్దని భావించి సంధ్య ఆ విషయాన్ని వారికి చెప్పలేదు. ఇంతలో వేధింపులు తీవ్రం కాగా.. సంధ్య శనివారం స్నానాల గదిలో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, అత్తామామల వేధింపులతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని.. ఈ ఘటనపై అనుమానాలు ఉన్నాయని సంధ్య తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని తొర్రూరు ఎస్సై నగేష్ తెలిపారు. అమెరికా కాన్సులేట్‌తో మాట్లాడిన కేటీఆర్ తమ కూతురు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు సహకరించాలని సంధ్య తల్లిదండ్రులు పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కోరారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డాతో చర్చించారు. బుధవారంలోగా మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు చర్య లు తీసుకుంటామని తెలిపినట్లు సమాచారం. -
అవకాశాలు లేకపోవడంతో బిరియానీ కొట్టు పెట్టుకున్నా..
చెన్నై , పెరంబూరు: భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చిన సినీ దర్శకుడు బాలకృష్ణన్ మిత్రులతో పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. వివరాలు.. సినీ సహాయనటి సంధ్య ఆమె భర్త దర్శకుడు బాలకృష్ణన్‌లది ప్రేమవివాహం. ప్రేమించి పెళ్లి చేసుకున్న అర్ధాంగిని అనుమానంతో ముక్కలు ముక్కలుగా నరికి కిరాతకంగా హత్య చేసిన దర్శకుడు బాలకృష్ణన్ తమ ప్రేమ కథను ఇటీవల మిత్రులతో వెల్లబోసుకున్నాడు. ‘‘ సంధ్య, నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. ఆ ప్రేమ సంధ్యను హత్యచేసే వరకూ తగ్గలేదు. నేనంటే సంధ్యకు ఎంతో ప్రేమ, నన్ను నిరంతరం మరచిపోకూడదని తన శరీరంపై మూడు చోట్ల పచ్చబొట్టు పొడిపించుకుంది. వద్దని వారించినా, వినలేదు. మాకు పరమశివుడంటే భక్తి. నిత్యం ఆయన్ని ప్రార్థించేవాళ్లం. సంధ్య తన కుడి చేతిపై శివపార్వతుల రూపాన్ని పచ్చబొట్టుగా పొడిపించుకుంది. మేమూ శివపార్వతుల్లా జీవించాలని కలలు కన్నాం. బిరియానీ కొట్టు పెట్టుకున్నా భార్య, పిల్లల కోసం ఎంతో శ్రమించేవాడిని. సినిమా అవకాశాలు లేకపోవడంతో బిరియానీ కొట్టు పెట్టుకున్నా. ఆ తరువాతనే సినిమాల్లో దర్శకుడిగా అవకాశం వచ్చింది. చాలా మంది కొత్త వారికి అవకాశాలు కల్పించాను. ఇటీవలే అన్ని సమస్యలు సమసిపోయి మరో చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ఆ ప్రయత్నాల్లో ఉండగా ఈ సంఘటన జరిగింది అని బాలకృష్ణన్ తన ప్రేమ కథను చెప్పాడు. ఇతను ముక్కలు ముక్కలుగా నరికిన భార్య తల, ఇతర భాగాలు ఇంకా పోలీసులకు లభ్యం కాలేదు. అందుకోసం పోలీసులు పగలనక రాత్రనక గాలిస్తూనే ఉన్నారు. అవయవాలు అమ్ముకున్నారేమో సంధ్య తల్లి ప్రసన్న కుమారి, బంధువులు నాగర్‌కోవిల్ సమీపంలోని జ్ఞాలం గ్రామంలో నివశిస్తున్నారు. తన కూతురి హత్య సంఘటనపై ప్రసన్నకుమారి స్పందిస్తూ తన కూతురిని కిరాతకంగా హత్య చేశారని, ఈ హత్యలో బాలకృష్టన్ మాత్రమే కాకుýండా మరికొందరు ఉంటారనే అనుమానం కలుగుతోందన్నారు. తన కూతురి అవయవాలు గుండె, కాలేయం వంటిని కనిపించకుండా పోవడంతో వాటిని అమ్ముకుని ఉంటారనే సందేహం కలుగుతోందన్నారు. ఈ సంఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించి హంతకులను శిక్షించాలని కోరారు. -
థ్రిల్లర్ సినిమా కోసం నటి సంధ్య హత్య?
చెన్నై ,టీ.నగర్: నటి సంధ్య హత్యను ఇతివృత్తంగా తీసుకుని థ్రిల్లర్ సినిమా రూపొందించేందుకు దర్శకుడు బాలకృష్ణన్ నిర్ణయించినట్లు సినీవర్గాలలో ఆదివారం సంచలన వార్తలందాయి. పెరుంగుడి చెత్తకుప్పలో ఇటీవల లభించిన నటి సంధ్య మృతదేహం విడిభాగాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ సంఘటనపై తీవ్ర విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.ఇలావుండగా సంధ్య మృతదేహాన్ని ఏడు భాగాలుగా కత్తిరించేందుకు అతని స్నేహితుడు ఒకరు చెప్పిన స్క్రీన్‌ప్లేనే కారణమని భావిస్తున్నారు. కాదల్ ఇలవశం పేరుతో చిత్రాన్ని నిర్మించిన బాలకృష్ణన్ అది పరాజయం పొందడంతో తీవ్ర నష్టాన్ని చవిచూశారనే విషయం గమనార్హం. -
నేను జైలుకు పోతున్నా !
చెన్నై , పెరంబూరు: నేను జైలుకు పోతున్నా.. నేను జైలుకు పోతున్నా... ఏంటీ ఈ మాటలు ఎక్కడో విన్నట్లు ఉందా? ఒక సినిమాలో హాస్య నటుడు వడివేలు చేయని నేరానికి కావాలనే అరెస్ట్ అయ్యి పోలీస్ జీప్‌లో వెళ్తూ.. నేను జైలుకు పోతున్నా అంటూ అందరీకీ వినిపించేలా అరుస్తాడు. ఇప్పుడు ఆ ప్రస్థావన ఎందుకొచ్చిందంటే ఇటీవల సహాయ నటి సంధ్యను ఆమె భర్త, సినీ దర్శకుడు బాలకృష్ణన్ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణను తీవ్రం చేశారు. అతనికి వ్యతిరేకంగా ఆధారాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే ఒక సారి బాలకృష్ణన్‌ను విచారించిన పోలీసులు గురువారం మరోసారి ఆలందూర్ కోర్టులో హాజరు పరిచారు. కోర్టులో న్యాయమూర్తి ఈ కేసులో మీపై నేరారోపణల గురించి తెలుసా? అని ప్రశ్నించగా తనకు తెలియదని బదులిచ్చాడు. దీంతో న్యాయమూర్తి 19వ తేదీ వరకూ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. పోలీసులు బాలకృష్ణన్‌ను పుళల్ జైలుకు తరలిస్తుండగా మీడియా వాళ్లు చుట్టిముట్టి బాలకృష్ణన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. అప్పుడు ఆయన సంధ్యను హత్య చేయలేదని చెప్పాడు. ఈ కేసు మలుపు తిరగనుందా? అని పోలీసులను అడగ్గా.. వారు అలాంటిదేమీ లేదన్నారు. ఆయన భార్యను హత్య చేశాడనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. భార్య శరీర భాగాలు ఎక్కడ పడేశాడన్న వివరాలను చెప్పి, ఆ ప్రాంతాలను చూపించాడని తెలిపారు. అవసరం వచ్చినప్పుడు వాటిని కోర్టుకు అందిస్తామన్నారు. కేకలు వేసిన బాలకృష్ణన్ కాగా బాలకృష్ణన్‌ను పల్లిక్కరన్ పోలీస్‌స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళుతుండగా నేను జైలుకు వెళ్తున్నాను అంటూ కేకలు పెట్టాడని తెలిపారు. దీంతో బాలకృష్ణన్ మతిస్థిమితం కోల్పోయాడా? అన్న అనుమానం కలుగుతోందని కొందరు అంటున్నారు. మరి ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. -
నటి హత్య: శరీరంలోని ఇతర భాగాల కోసం గాలింపు..
సాక్షి ప్రతినిధి, చెన్నై: సహాయనటిగా సహచరులతో పెట్టుకున్న వివాహేతర సంబంధాలు వివాహబంధానికి ఎసరుపెట్టాయి. సినీ జీవితంపై ఆమె పెంచుకున్న మోజు నిజజీవితాన్ని ఛిద్రం చేసింది. మూడుముళ్లు వేసిన భర్త చేతిలోనే ముక్కలుముక్కలుగా మారి ప్రాణాలు విడిచింది. తల్లి పరలోకానికి, తండ్రి కటకటాల వెనక్కి వెళ్లిపోగా ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు. చెన్నై పెరుంగుడి చెత్తకుప్పల్లో గత నెల 21వ తేదీన దొరికిన గుర్తుతెలియని యువతి అవయవాల మిస్టరీ ఎట్టకేలకూ రెండువారాల తరువాత వీడింది. దారుణమైన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై శివారు పెరుంగుడిలోని చెత్తకుప్పల్లో గుర్తుతెలియని యువతికి చెందిన రెండు కాళ్లు, ఒక చెయ్యిని గత నెల 21వ తేదీన పోలీసులు కనుగొన్నారు. మృతురాలి ఆచూకీ కోసం ఆనాటి నుంచి అనేక చోట్ల వెతికారు. పొరుగు రాష్ట్రాల్లో సైతం అన్వేషించారు. యువతి అదృశ్యం కేసులేవీ పోలీసుస్టేషన్లలో నమోదు కాకపోవడం, మృతురాలి చేతిపై ఉన్న టాటూ మినహా మరే ఆధారాలు లభించకపోవడంతో కేసు మిస్టరీగా మారింది. ఒక వేళ భర్త చేతిలోనే ఆమె హత్యకు గురికావడం వల్లనే పోలీసు కేసులేవీ నమోదు కాలేదనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. చివరకు అదే నిజమైంది. చెన్నై ఈక్కాడుతాంగల్‌లో నివసించే కన్యాకుమారీ జిల్లా నాగర్‌కోవిల్ చెందిన సంధ్య (38) అనే యువతి కొన్నిరోజులుగా కనపడడం లేదని స్థానిక ప్రజలు ఇచ్చిన సమాచారంతో తెలుసుకున్నారు. అదృశ్యమైన యువతి భర్త సినీ దర్శకుడైన బాలకృష్ణన్‌ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. రహస్యప్రదేశంలో ఉంచి తమదైన శైలిలో విచారించారు. తానే హత్య చేసినట్లు అతడు అంగీకరించాడు. నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం పోలీసుల కథనం ఇలా ఉంది. కన్యాకుమారీ జిల్లా నాగర్‌కోవిల్ అరుంనల్లూరుకు చెందిన సంధ్య సినీనటిగా చాన్సుల కోసం చెన్నైలో ప్రయత్నాలు చేసేటప్పుడు సినీ దర్శకుడైన బాలకృష్ణన్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమకు దారితీయగా ఇరు కుటుంబాల సమ్మతితో 2010లో వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడు, కుమార్తె తూత్తుకూడిలోని నాన్నమ్మ, తాత వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. చెన్నై ఈక్కాడుతాంగల్‌లో నివసించే బాలకృష్ణన్ కోసం ఇంటికి సినీరంగంతోపాటు పలురంగాలకు చెందిన వారు వచ్చి వెళుతుండేవారు. అలాగే నటిగా ఆమెకూ అనేక పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఆమె కొందరితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్లు సమాచారం. భర్త అనుమానించేలా రాత్రివేళల్లో సెల్ఫోన్లో గంటలతరబడి మాట్లాడడం, బయటకు వెళ్లడం వంటి చర్యలకు పాల్పడేది. దీంతో దంపతుల మధ్య విభేదాలు పొడచూపాయి. పద్ధతి మార్చుకోవాలని, సినిమాల్లో నటించడం మానేసి పిల్లలను చూసుకోవాలని బాలకృష్ణన్ అనేకసార్లు మందలించినా ఆమె వినిపించుకోలేదు. తన జీవితానికి అడ్డురావద్దని ఆమె ఎదురుతిరగడంతోపాటూ ఇరువురూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దశలో సంధ్య తన భర్త ఎదురుగానే ప్రియునితో మరింత విచ్చలవిడిగా వ్యవహరించడంతో బాలకృష్ణన్‌మరోసారి మందలించి కలిసి జీవిద్దామని కోరాడు. అయితే ఆమె ఇందుకు నిరాకరించి ప్రియునితోనే ఉంటానని తేల్చిచెప్పింది. దీంతో అప్పటికే తగిన ఏర్పాట్లలో ఉన్న బాలకృష్ణన్ గత నెల 19వ తేదీ రాత్రి జంతువులను వధించే కత్తితో ఆమెను విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు 20వ తేదీన మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నాలుగుపార్శిళ్లుగా నగరంలోని పలు ప్రాంతాల్లో పడేశాడు. ఇక తనను తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. 21వ తేదీన పెరుంగుడి చెత్తకుప్పల నుంచి హతురాలి అవయవాలు బైటపడడంతో పోలీసులు కూపీలాగి నిందితుడిని కటకటాల వెనక్కునెట్టారు. సంధ్య తల, పొట్టభాగాన్ని చెన్నై నుంగంబాక్కంలో పడేసినట్లు నిందితుడు చెప్పగా అక్కడ అవి దొరకలేదు. ఇప్పటి వరకు దొరికిన అవయవాలను మార్చురీలో భద్రం చేసి సంధ్య తల కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. సంధ్య హత్యవార్తను బుధవారం ఉదయం టీవీల్లో చూసిన తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కొందరు బంధువులను తోడుగా తీసుకుని సాయంత్రానికి చెన్నైకి చేరుకున్నారు. సినిమా వ్యామోహమే సంధ్యకు ప్రాణాంతకమైందని కన్నీరుమున్నీరయ్యారు. -
సహాయ నటి దారుణ హత్య
సాక్షి ప్రతినిధి, చెన్నై: సినీ సహాయ నటి అయిన భార్య వివాహేతర సంబంధాన్ని అతను తట్టుకోలేకపోయాడు. సినీ దర్శకుడైన భర్త ఆమెను దారుణంగా హత్యచేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా కోసి పలుచోట్ల పడేశాడు. పోలీ సులు 2 వారాల పాటు శ్రమించి నిందితుడిని బుధవారం అరెస్ట్ చేశారు. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. చెన్నై శివారు పెరుంగుడిలోని చెత్తకుప్పల్లో గుర్తుతెలియని యువతికి చెందిన రెండు కాళ్లు, ఒక చేయిని గత నెల 21న పోలీసులు గుర్తించారు. మృతురాలి ఆచూకీ కోసం అనేక చోట్ల వెతికారు. చెన్నై ఈక్కాడుతాంగల్‌లో నివసించే కన్యాకుమారీ జిల్లా నాగర్‌కోవిల్‌కు చెందిన సంధ్య (38) అనే యువతి కొన్నిరోజులుగా కనపడటం లేదని గుర్తించారు. అదృశ్యమైన యువతి భర్త సినీ దర్శకుడైన బాలకృష్ణన్‌ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకుని కేసును ఛేధించారు. భార్య, భర్తలిద్దరూ సినీపరిశ్రమకు చెందిన వారే. సంధ్య కొందరితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్లు భర్త అనుమానించాడు. రాత్రివేళల్లో సెల్ఫోన్లో మాట్లాడటం, బయటకు వెళ్లడం వంటి చర్యలకు సంధ్య పాల్పడుతుండటంతో దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. భర్త అనేకసార్లు మందలించినా ఆమె వినిపించుకో లేదు. దీంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దశలో ప్రియునితోనే ఉంటానని సంధ్య తేల్చిచెప్పగా గత నెల 19న దంపతులు ఘర్షణపడ్డారు. అప్పటికే తగి న ఏర్పాట్లతో ఉన్న బాలకృష్ణన్ కత్తితో ఆమెను విచక్షణారహితంగా పొడిచి హతమార్చాడు. -
సంధ్యకు స్వర్ణం
సాక్షి, విజయవాడ: ఆసియా అమెచ్యూర్ ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజయవాడ అమ్మాయి గోలి సంధ్య మహిళల విభాగంలో విజేతగా నిలిచింది. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో సంధ్య ఆరు పాయింట్లు సాధించింది. ఐదు గేముల్లో గెలిచిన ఆమె, రెండింటిని ‘డ్రా’ చేసుకొని... మరో రెండింటిలో ఓడిపోయింది. జావో యుజువాన్ (చైనా) రజతం, సన్ ఫురోంగ్ (చైనా) కాంస్యం గెలిచారు. ఈ విజయంతో సంధ్య ఈ ఏడాది మెక్సికోలో జరిగే ప్రపంచ అమెచ్యూర్ చాంపియన్ షిప్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. -
వాట్శాపం.. పెనుభూతం
అనుమానం పెనుభూతం అంటారు. వాట్సాప్ ఇప్పుడు శాపంలా, భూతంలా తయారైంది!భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తెస్తోంది. వీళ్ల అపోహల్ని, అపార్థాల్నీ చూస్తుంటే..పెళ్లి ముందా... అనుమానం ముందా.. అనే డౌట్ వస్తోంది.ఏది ముందైనా.. నమ్మకం వాటికి ముందుంటే...దంపతులను ఈ వాట్సాప్‌లు శపించలేవు.భూతాలై ఆలూమగల అనురాగాన్ని కబళించలేవు. ఇదే ఈవారం మైండ్ స్టోరీ. ‘డాక్టర్ ఇదీ కేసు’ అన్నాడు భార్యాభర్తలు వారిరువురూ. ఆమె పేరు సంధ్య. అతడి పేరు విజయ్. పదేళ్లయ్యింది పెళ్లయ్యి. ఆమె ఇంట్లో ఉంటుంది. అతడు ఆఫీసుకు వెళతాడు. వాళ్లకో పాప. మూడో క్లాస్ చదువుతోంది. సంధ్య ఉదయాన్నే లేచి పాపను నిద్రలేపి స్కూల్‌కు రెడీ చేస్తుంది. విజయ్ ఈలోపు కొంచెం టీ పెట్టుకొని తాగి పాపను స్కూల్ బస్‌లో చేరవేస్తాడు. పాప వెళ్లిపోయాక విజయ్ రెడీ అయ్యేంత సేపు వాళ్లు గతంలో బాగా కబుర్లు చెప్పుకునేవారు. విజయ్ బాగా నవ్విస్తాడు. సంధ్య బాగా నవ్వుతుంది. బ్రేక్‌ఫాస్ట్ చేసే సమయంలో ఈ పక్క ఫ్లాట్ వాళ్ల మీదో ఆ పక్క ఫ్లాట్ వాళ్ల మీదో ఏవో జోకులు నడుస్తాయి. ఆ తర్వాత అతను ఆఫీసుకు వెళ్లిపోతాడు. ఆమె ఇంటి పనుల్లో పడుతుంది. అయితే ఈ మధ్య బ్రేక్‌ఫాస్ట్ కబుర్లు నడవడం లేదు.ఆ సమయంలో ఇద్దరూ ఫోన్ చూసుకుంటూ ఉంటారు.అపార్ట్మెంట్లో ఉన్న 70 ఫ్లాట్లలోని ఆడవాళ్లందరూ ఒక గ్రూప్ పెట్టుకున్నారు. సంధ్య ఆ గ్రూప్‌లో బిజీగా ఉంటుంది. అది కాకుండా సంధ్య వాళ్ల పుట్టింటి గ్రూప్ ఒకటి ఉంది. ఆ తర్వాత కాలేజీ ఫ్రెండ్స్ గ్రూప్ ఒకటి ఉంది. ఇవి కాకుండా తెలిసినవాళ్లతో పిచ్చాపాటి చాటింగ్ కూడా ఉంటుంది.విజయ్ కూడా వాట్సాప్‌లో తక్కువ తినలేదు. ఆఫీస్ గ్రూప్ ఒకటి తప్పనిసరి. ఇది కాకుండా అతడికి చేపలు పట్టడం సరదా. రెండు మూడు వారాలకు ఒక గ్రూప్‌తో కలిసి చుట్టుపక్కల చెరువులకు, ఒక్కోసారి చాలా దూరం వెళ్లి నదుల ఒడ్డున చేపలు పడుతుంటాడు. అదో గ్రూప్ ఉంది. జోకుల గ్రూపులు కొన్ని ఉన్నాయి. ఆయుర్వేదం గ్రూప్ ఒకటి.ఈ గ్రూపుల్లోని బ్లింక్లతోటే కాలం గడుస్తూ ఉంది.కాలం అలాగే గడిచినా సమస్యలేమీ లేకపోవు.కానీ ఈలోపు ఉన్నట్టుండి ఒకరోజు సంధ్య స్నేహితురాలు భార్గవి సంధ్య ఇంటికి వచ్చింది. సమస్య అక్కణ్ణుంచే మొదలైంది. ‘ఓ... ఎంత బాగుందో మీ ఇల్లు’ అంది భార్గవి సంధ్య ఇంటిని చూస్తూ.‘ఇందులో నా టేస్ట్ కన్నా మా ఆయన టేస్టే ఎక్కువ’ అంది సంధ్య గర్వంగా.‘అబ్బో.. అంత మంచి టేస్ట్ ఉన్న మీ ఆయన్ను పరిచయం చేసుకోవాల్సిందే’ అంది భార్గవి.అది సాయంత్రం వేళ కావడం, ఆ రోజు విజయ్ అనుకోకుండా తొందరగా ఇల్లు చేరడంతో భార్గవికి విజయ్‌ని పరిచయం చేసింది సంధ్య.‘ఓ... మీరు కూడా గులాబీ టీమేనా?’ అన్నాడు నమస్తే పెడుతూ విజయ్.భార్గవి ఉలిక్కి పడింది.‘లె..లె..లేదే’‘మాకు తెలుసులేండీ. సంధ్య చెప్పింది. గులాబీ సినిమా చూసి ముక్కు మొహం తెలియనివారికి ఫోన్ చేసి ప్రేమిస్తున్నామంటూ ఏడిపించేవారంట గదా మీ ఫ్రెండ్సంతా. మీరా టీమ్‌లో లేరా?’‘నిజానికి ఆ అల్లరి మొదలెట్టిందే ఈ పిల్ల’ అంది సంధ్య.‘ఆ రోజుల్లో అంటే మీ అల్లరి నడిచింది. ఇప్పుడైతే ఏ నంబర్ నుంచి చేస్తున్నారో క్షణాల్లో తెలిసిపోతుంది’ నవ్వుతూ అన్నాడు విజయ్.‘తెలియని వాళ్లతో ఎందుకండీ. తెలిసినవాళ్లతోనే బోల్డన్ని కబుర్లు చెప్పుకోవచ్చు ఇప్పుడు. అన్నీ ఫ్రీ సిమ్‌లు. వైఫైలు. వాట్సాప్‌లు’ భార్గవి కూడా నవ్వింది.వాళ్లు ఈ ఊరు కొత్తగా వచ్చారట. దొరక్క దొరక్క సంధ్య దొరకడంతో తరచూ రాకపోకలు సాగాయి. సంధ్య ఊరికే ఉండకుండా ‘ఒక్కోసారి ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోతుంటాను. ఎందుకైనా మంచిది మా వారి నంబర్ కూడా పెట్టుకో’ అని విజయ్ నంబర్ ఇచ్చింది.‘మీ ఫ్రెండ్ మెసేజ్ పెట్టింది. బావగారూ ఇవాళ సంధ్య దోసకాయ కూర చేసిందట. మీకు పస్తే. దానికా కూర చేయడం రాదు’ అని నవ్వాడు విజయ్.‘దానికి వంకాయ కూర చేయడం కూడా రాదు. నాకు వంకలు పెడుతుందా’ సంధ్య కూడా నవ్వింది.‘మీ ఫ్రెండ్ బర్త్ డే విషెస్ చెప్పింది. పార్టీ కావాలట’‘దాందేముంది పచ్చిమిరపకాయ పులుసు రెడీగా ఉందని చెప్పండి’ సంధ్య జోక్‌గా అంది.వెంటనే భార్గవి వాట్సాప్ అకౌంట్లో విజయ్ పచ్చిమిరపకాయల గంప ఫొటో పెట్టి స్మైలీ పెట్టాడు. ఒకరోజు విజయ్ ఫోన్‌ను క్యాజువల్‌గా చూస్తూ ఉంది సంధ్య. ఫోల్డర్లో భార్గవి ఫొటో కనిపించింది. ఆశ్చర్యపోయింది. భార్గవి ఫొటో విజయ్ ఫోన్లో ఎందుకు ఉన్నట్టు?‘భార్గవి ఫొటో ఉందేంటి?’‘నీకు పెట్టబోయి నాకు పెట్టిందట. డిలీట్ చేసేలోపే నా ఫోల్డర్లో పడిపోయినట్టుంది’ అన్నాడు విజయ్ క్యాజువల్‌గా.సంధ్యకు కూడా గుర్తొచ్చింది అదే ఫొటోను తనకు కూడా పెట్టింది భార్గవి. కానీ ఎందుకో చిన్న అనుమానం.చిన్నదా?ఆ రోజు నుంచి సంధ్య గూఢచర్యం పెరిగింది. విజయ్ స్నానానికి వెళ్లినప్పుడు, వాకింగ్‌కు వెళ్లినప్పుడు, లేదా పాపను తీసుకుని కిందకు వెళ్లినప్పుడు ఫోన్ చెక్ చేసేది. వాట్సాప్‌లో భార్గవి అకౌంట్ ఓపెన్ చేసి చూసేది. గుడ్ మార్నింగ్ అని, నమస్తే అని, హ్యాపీ శాటర్డే అని ఇలాంటి మెసేజ్‌లు ఉండేవి. ఒక్కోసారి చాట్ క్లియర్ చేసినట్టుగా క్లీన్‌గా ఏ మెసేజ్ కనిపించేది కాదు. అంటే మాట్లాడుకుని చాట్ డిలీట్ చేశారా? అసలు వాళ్లు మాట్లాడుకునే ఉండకపోవచ్చు కదా అని ఆమె అనుకునేది కాదు. విజయ్ సైకియాట్రిస్ట్‌తో సంధ్యను తీసుకొచ్చి.తల ఒంచుకుని కూచున్న సంధ్య వెంటనే తల ఎత్తి ‘డాక్టర్ వాళ్లిద్దరికీ సంబంధం ఉంది. అది బయటపడకుండా ఉండటానికి నాకు పిచ్చి అనే ముద్ర వేసి మీ దగ్గరకు తీసుకొచ్చాడు ఈ దుర్మార్గుడు’ అంది.‘కొత్త ఫోన్ చాలా బాగుందండీ. థ్యాంక్యూ’‘నీ కోసమే కొన్నానోయ్. వాట్సాప్‌లో మాట్లాడుకోవచ్చుగా’‘అవును. అన్నింటికీ ఫోన్ చేయడం ఎందుకూ?’‘ఇక అన్నం పెడతావా?’‘అన్నం పెడతాను. దానికి ముందు హగ్ కూడా ఇస్తాను’ఆమె నవ్వేసింది. అతడు దగ్గరకు తీసుకున్నాడు. రాను రాను సంధ్యకు ఈ అనుమానం ముదిరింది.ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడల్లా తన ఫోన్లో వాట్సప్‌కు వెళ్లేది. అందులో విజయ్ అకౌంట్ చూసేది. లాస్ట్ సీన్ టైమ్‌కు, భార్గవి అకౌంట్లోని లాస్ట్ సీన్ టైమ్‌కు పొంతన లేకపోతే సంతృప్తిగా ఊపిరి పీల్చుకునేది. అవి రెండూ దగ్గర దగ్గరగా ఉంటే కలవర పడేది.ఇంకా ఘోరమైన విషయం ఎప్పుడు మొదలైందంటే ఒకరోజు విజయ్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆన్లైన్లో ఉన్నట్టుగా కనిపించింది. వెంటనే భార్గవి అకౌంట్ కూడా ఓపెన్ చేసింది. అదీ ఆన్లైన్ అని చూపిస్తూ ఉంది. ఒకేటైమ్‌లో ఆన్లైన్లో ఉన్నారంటే వీళ్లిద్దరూ చాటింగ్‌లో ఉన్నట్టేగా?ఆ క్షణమే ఆమె స్పృహ తప్పి పడిపోయింది.‘డాక్టర్ ఇదీ కేసు’ అన్నాడు విజయ్ సైకియాట్రిస్ట్‌తో సంధ్యను తీసుకొచ్చి.తల ఒంచుకుని కూచున్న సంధ్య వెంటనే తల ఎత్తి ‘డాక్టర్ వాళ్లిద్దరికీ సంబంధం ఉంది. అది బయటపడకుండా ఉండటానికి నాకు పిచ్చి అనే ముద్ర వేసి మీ దగ్గరకు తీసుకొచ్చాడు ఈ దుర్మార్గుడు’ అంది.‘మీరు బయటకెళ్లండి’ అన్నాడు విజయ్‌తో.ఆ తర్వాత సంధ్యతో మాట్లాడటం మొదలెట్టాడు. ‘చూడమ్మా... నీ భర్త సంగతి తర్వాత ఆలోచిద్దాం.. ముందు నువ్వు నీ స్నేహితురాలిని అవమానిస్తున్నావని అనుకోవడం లేదా? ఆమె నిన్ను అక్కగా నీ భర్తను బావగారిలా భావించి గౌరవిస్తుంటే నువ్వు అవమానిస్తావా? ఈ సంగతి ఆమెకు తెలిస్తే ఎంత బాధ పడుతుంది? ఇక నీ భర్త ఇన్నాళ్లలో ఎప్పుడూ అలా బిహేవ్ చేయలేదు. పరిచయం చేసింది నువ్వే. పలకరించేలా చేసిందీ నువ్వే. వాళ్లలా మాట్లాడుకుంటే కలవరపడుతున్నదీ నువ్వే. మనిషి కంటే ఎక్కువగా యంత్రాన్ని నమ్ముకుంటే వచ్చే ప్రమాదాలు ఇవి. వాట్సాప్ ఆన్ చేసి వేరే పనుల్లో పడినా ఆన్లైన్ అనే చూపిస్తుంది. ఆఫీస్ మెసేజుల్లో ఉన్నా ఆన్లైనే అని చూపిస్తుంది. అసలు మీ మధ్య ఫోన్ ఎప్పుడు వచ్చిందో అప్పుడే దూరం పెరిగి ఆ ఖాళీలో చేరవలసిన చెత్తంతా చేరుతోంది. టెక్నాలజీని ఎంత వాడుకోవాలో అంతే వాడుకోవాలి. ముందు మీరు చేయవలసిన పని ఏమిటంటే ఫ్రెండ్స్ పేరుతో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవడం. అందులో మీరూ మీ వారు భార్గవి భార్గవి భర్త ఉండండి. అక్కడ మాట్లాడుకోండి. మీ నలుగురూ కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడమే నేను ప్రిస్క్రైబ్ చేయగల మెడిసిన్. ఆ మెడిసిన్‌ను తీసుకుంటావా?’సంధ్య తెరిపిన పడ్డట్టు చూసి లేచింది.బహుశా వాళ్ల భోజనంలో ఏమేమి వండాలన్న చర్చ కొత్త గ్రూప్‌లో నలుగురి మధ్య నవ్వులతో సాగుతుండవచ్చు. – ఇన్పుట్స్: కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
ఆకాశమంత ఆర్తి
అభంశుభం తెలియని, ఆదుకునే వారే లేని ఆ చిన్నారులను ‘ఆర్తి’ ఆశ్రమం తన ఒడిలోకి తీసుకుంటోంది. అన్నీ తానే అయి వారిని ఆదరిస్తోంది. ఇప్పటివరకు దాదాపు పదిహేను వందల మంది బాలికల భవిష్యత్తును వెలిగించింది. ఆ దీపాలన్నీ నేడు ప్రపంచ వ్యాప్తంగా వెలుగులను పంచుతున్నాయి. ఆ వెలుగుల్లో ‘ఆర్తి’ ఆకాశమంత ఎత్తులో కనిపిస్తోంది. నగరం సద్దుమణుగుతోంది. రాత్రి 11 గంటలు. ఆ భవనం వద్ద జీరో బల్బు వెలుతురు. ఎవరో కంగారుగా వచ్చి అక్కడ ఏదో పడేసి అంతే కంగారుగా వెళ్లిపోయారు. అటుగా వచ్చిన వాచ్మెన్ అక్కడేదో కదులుతున్నట్లు గమనించాడు. దగ్గరికి వచ్చి చూశాడు. పాత చీరెలో చుట్టి ఉన్న నెలల వసిగుడ్డు! చలికి వణుకుతోంది. జాగ్రత్తగా రెండు చేతుల్లోకి లోపలికి తీసుకెళ్లాడు. అతడు ‘ఆర్తి’ వాచ్మెన్.ఇంకో ఘటన. ఇంకా చీకట్లు విచ్చుకోలేదు. కొద్దిగా తెరిచి ఉన్న గేటులో నుంచి ఏడు నెలల పాప బరాబరా దోగాడుతూ వచ్చేసింది. లోపలి నుంచి వచ్చిన వారు ఆ చిన్నారిని ఎత్తుకున్నారు. గేటు బయటికి చూసి ఎవరూ లేకపోవడం గమనించారు. విషయం అర్థమైంది. ఆ పాపను అందరూ కాసేపు ఎత్తుకున్నారు. ‘ఆర్తి’ హృదయానికి హత్తుకున్నది.కడప నగరంలో మున్సిపల్ స్టేడియం వద్ద ఉం టుంది ‘ఆర్తి’. ఈ చిన్నారుల ఆశ్రమాన్ని పీవీ సంధ్య నిర్వహిస్తున్నారు. పాతికేళ్ల క్రితం ఆవిర్భవించింది మొదలు నేటి వరకు ఆర్తి ఆదర్శప్రాయమైన ప్రయాణంలోని విశేషాలను ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు. బంధువులమ్మాయి ‘ఆర్తి’ ‘‘నేను ఇంగ్లీషు లెక్చరర్. నా భర్త శ్రీనివాసులురెడ్డి నేత్ర వైద్యులు. మాకు ఇద్దరు అమ్మాయిలు. 1992లో వారు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు.. మా ఇంటికి సమీపంలో ఓ పసిపాపకు ఎవరూ లేకపోవడం గమనించాను. ఆ చంటిబిడ్డను తెచ్చుకున్నాను. నా పిల్లలతో పాటు పెంచుకున్నాను. దీన్ని గమనించిన మరికొందరు తమ పిల్లలను రాత్రులు మా ఇంటి వద్ద వదిలేసేవారు. ఇలాంటి చిన్నారుల సంఖ్య పెరగడంతో స్నేహితులతో చర్చించి వారి సహకారంతో ప్రత్యేకంగా చిన్న ఇల్లు తీసుకుని బాలల ఆశ్రమం ప్రారంభించాను. మా బంధువుల అమ్మాయి ఆర్తి విదేశాల్లో తన స్నేహితుల నుంచి కొద్ది సొమ్మును సేకరించి మాకు పంపేది. దురదృష్టవశాత్తు ఆమె భౌతికంగా దూరం కావడంతో మా ఆశ్రమానికి ఆర్తి హోమ్ అని ఆమె పేరు పెట్టుకున్నాం. సంస్థ నిర్వహణకు విజయ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసుకున్నాం. వాళ్లకు ఎంతవరకు ఆశ్రయం, రక్షణ ఇవ్వగలనో, వారిని ఎంతవరకు చదివించగలనో, ఆ తర్వాత వారి జీవితం ఏమిటో.. ఏదీ ఆలోచించలేదు. హోమ్ నిర్వహిస్తున్నాం అంతే! ఇంటి బయట ఊయలతొట్టి ఓరోజు ఇంటి బయట ఎవరో నెలల పాపను ఉంచి వెళ్లారు. కొద్దిసేపటి ద్వారా కనుగొని చిన్నారి పరిస్థితి బాగా లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఎంత ప్రయత్నించినా చిన్నారిని నిలుపుకోలేక పోయాం. చాలా బాధ అనిపించింది. దాంతో ఇంటి బయట ఊయల తొట్టి ఏర్పాటు చేశాను. వాచ్‌మెన్‌ను నియమించాను. ఇక్కడ వదిలి వెళ్లే పిల్లల గురించి ఎవరూ ఏమి అడిగేది ఉండదని అక్కడ రాసి ఉంచాము. అలా హోమ్ పెరిగింది. 1993లో కలెక్టర్ సుబ్రమణ్యం హోమ్‌కు మున్సిపల్ స్టేడియం వద్ద కొద్దిగా స్థలాన్ని ఇచ్చారు. మెల్లిగా ఆ స్థలంలో ఇంటిని నిర్మించాం. 36 మంది చిన్నారులతో సొంత భవనంలో ఆశ్రమం పూర్తి స్థాయిలో మొదలైంది. ఇప్పటికి పదిహేను వందల మందికి పైగా ఆశ్రమం విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు. పలు దేశాల్లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. వీరిలో చాలామందికి మేమే వివాహాలు జరిపించాము. సీమంతాలు, పురుళ్లు చేస్తున్నాం. ఏ ఉద్యోగంలో, ఎంత దూరంలో ఉన్నా పుట్టినరోజులు, పండుగల సందర్భంగా వాళ్లు హోమ్ కు వస్తుంటారు. ప్రస్తుతం హోమ్‌లో 120 మంది ఉన్నారు. కుటుంబ జీవన గ్రామం పిల్లలందరినీ ఒకేచోట పెంచుతున్న విషయంగా నాలో ఆలోచన మొదలైంది. వారందరికీ బాధ్యతలు తెలిసేలా పెంచడంతో పాటు కుటుంబ జీవనంలోని మాధుర్యాన్ని చవి చూపాలని భావించాను. అందుకోసం ప్రత్యేకంగా ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసి అందులో వీరినే కుటుంబాలుగా ఏర్పాటు చేయాలని భావించాను. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని సహకరించాలని కోరాను. రిమ్స్ వద్ద స్థలం ఇచ్చారు. అక్కడ తొమ్మిది కుటీరాలు ఏర్పాటు చేశాం. ఒక్కొ దానిలో పదీపదిహేను మంది ఓ కుటుంబంగా ఉంటున్నారు. ఒకరి కుటుంబాలకు ఒకరు సహకరించుకుంటున్నారు. దీంతో అది ఒక గ్రామంగా, వీరంతా గ్రామస్థులుగా ఆత్మీయత అనుబంధాలతో జీవిస్తున్నారు. భ్రూణహత్యలపై ప్రాజెక్టు వర్క్ దక్షిణ ఏషియా స్థాయిలో కేవలం ఆర్తి హోమ్‌కు మాత్రమే భ్రూణహత్యల నిర్మూలనపై ప్రాజెక్టు వర్క్ లభించింది. 2015లో కేంద్ర పథకం బేటీ బచావో.. బేటీ పఢావోలో భాగంగా ‘మన బిడ్డ’ కార్యక్రమాన్ని జిల్లాలోని 51 మండలాల్లో ప్రతిభావంతంగా నిర్వహించాం. ఆర్తి విద్యార్థులే అన్ని విభాగాలకు వలంటీర్లుగా జిల్లాలో విస్తృతంగా పర్యటించి పథకాన్ని వంద శాతం అమలు చేసి మంచి ఫలితాలు రాబట్టారు. ఆ ప్రాంతాల్లో ప్రస్తుతం భ్రూణ హత్యల సంఖ్య గణనీయంగా తగ్గడం నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది’’ అని ముగించారు సంధ్య. – పంతుల పవన్‌కుమార్, సాక్షి, కడప ఆడబిడ్డ విలువను గుర్తించాలి భ్రూణహత్యలు అమానుషం. ఈ సమస్యను అధిగమించడానికి ప్రధాన గ్రామీణ ప్రాంతాల కుటుంబాలకు అవగాహన కల్పించాల్సి ఉంది. అంకురం దశలోనే ఆడబిడ్డను అంతం చేస్తుండటం సృష్టికి విరుద్ధం. స్త్రీలేని లోకాన్ని ఊహించనే లేము. ఆడబిడ్డను ఇంటికి వెలుగు అని అనుకోవాలి తప్ప గుండెపై కుంపటి అనే భావం రానీయకూడదు. మెరుగైన సమాజం కావాలనుకున్నప్పుడు ఆడపిల్లకు మెరుగైన అవకాశాలు కల్పించాలి. స్త్రీ విలువను గమనించేందుకు సమాజంలో నైతిక విలువలు పెరగాల్సి ఉంది. ఈ సమస్యకు మూలాలు వెతికి సరిదిద్దాల్సి ఉంది. – పీవీ సంధ్య, నిర్వాహకులు, ఆర్తి హోం -
నృత్యగాన చైతన్యం
సామాజిక సమస్యలపై స్పందించే గుణం లేకుంటే కళాకారులెలా అవుతారని ప్రశ్నించే సంధ్యామూర్తి (65) .. భారతీయ సంస్కృతికి దర్పణంగా నిలిచిన శాస్త్రీయ సంగీత, నృత్యాలలో ఎంతోమందిని నిష్ణాతులుగా తీర్చిదిద్దుతూనే మహిళాభ్యుదయ సాధన కోసం స్త్రీ చైతన్య కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ∙ బుడిబుడి అడుగులతోనే నా మూడేళ్ల ప్రాయం నుండే మా నాన్నగారు పీఎస్ శర్మ నన్ను నాట్య ప్రవేశం చేయించారు. నేను అనంతపురంలోనే పుట్టి పెరిగాను. మా నాన్న అప్పట్లో లలితకళాపరిషత్తు సెక్రటరీగా ఉండేవారు. మైసూరు నుండి అనంత కొచ్చిన నాట్యకోవిదులు వరదరాజఅయ్యంగార్ వద్ద భరతనాట్యం, కూచిపూడిలో పార్వతీశం వద్ద కూచిపూడి నేర్పించారు. చెన్నైకు చెందిన అన్నామలై చెట్టియార్ వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. అప్పటికి నా వయసు కేవలం ఐదేళ్లు మాత్రమే. అప్పట్లో భక్త కబీరు నాటకంలో కబీరు కుమారునిగా, భూకైలాస్ నాటకంలో బాల వినాయకునిగా నటించాను. దేవదాసీలనేవారు మా చిన్నప్పుడు మహిళలు రంగస్థలం ఎక్కే అర్హత లేదు. అలా చేశారంటే దేవదాసీలనో, భోగంవారనో సభ్యసమాజం భావించేది. దానికి భయపడి ఎవ్వరూ నాట్య రంగంలో ప్రవేశించలేదు. మా నాన్నగారికి కళపై ఉన్న అభిమానంతో నాకు పద్నాలుగేళ్లు వచ్చేవరకు చెప్పించి ఆ తర్వాత మానిపించారు. అది కూడా పెద్ద పెద్ద విద్వాంసులను ఇంటికే రప్పించి సంగీత నృత్యాలు నేర్పించారు. అప్పటికి ఊరంతా కలిపినా పట్టుమని పది మంది కూడా నృత్యం నేర్చుకునే వారు లేరంటే ఆశ్చర్యమనిపిస్తుంది. ఆనాటి సమాజానికి భయపడడం వల్ల ఇక నా నాట్యం ఆగిపోయిందనే భావించాను. అప్పట్లో భరతనాట్యమే నేను నాట్యం ప్రారంభించిన రోజుల్లో శాస్త్రీ నృత్యమంటే భరత నాట్యమే. అది కూడా పదేళ్లలోపు వారైతే ఆడపిల్లలు నేర్చుకోవచ్చు. ఆడవేషాలైనా మగవారే వేసేవారు. కూచిపూడి నాట్య సంప్రదాయమంటే యక్షగానం, వీధి భాగవతార్లు మాత్రమే వీధుల్లో ప్రదర్శించేవారు. అయితే వెంపటి చినసత్యం రాకతో కూచిపూడికి మహర్దశ పట్టింది. ప్రస్తుతం సినిమాలో ఉన్న మంజుభార్గవి, ప్రభతో పాటు శోభానాయుడు మొదలైన వాళ్లందరూ రంగస్థలం ఎక్కి కొత్త సంప్రదాయానికి నాంది పలికారు. వారి స్ఫూర్తి కారణంగానే నేను రంగస్థలంపై ప్రయోగాలు చేయగలిగాను. తొలి నాట్య పాఠశాల 1969లో మేము శ్రీ నృత్య కళానిలయం స్థాపించాము. బహుశా జిల్లాలోనే తొలి సంగీత, నాట్య పాఠశాల అదే కావొచ్చు. ఇప్పటి వరకు వేలాది మంది విద్యార్థులు కళానిలయంలో శాస్త్రీయ నృత్యాలు నేర్చుకున్నారు. ఎంతో మంది నాట్య గురువులుగా కూడా మారారు. ముఖ్యంగా ప్రత్యూష, మహాలక్ష్మీ ‘విదూషీ’ శిక్షణ పొందారు. విదేశాలలో ప్రదర్శనలు నాకు పెళ్లయిన తర్వాత మా వారి ఉద్యోగరీత్యా అనేక రాష్ట్రాలు తిరిగాము. అక్కడ కూడా నేను నాట్యం నేర్పించేదాన్ని. అనంతకొచ్చేసిన తర్వాత మా శిష్యబృందంతో న్యూఢిల్లీ, పుణే, బెంగళూరు, కోల్‌కతా, ఒడిశా లాంటి అన్ని ప్రధాన నగరాలతో పాటు సింగపూర్, మలేషియా, దుబాయ్ వంటి పలు దేశాలలో ప్రదర్శనలిచ్చాము. పరాయి రాష్ట్రాలలోనూ అనంత కీర్తి మా ఆయన కృష్ణమూర్తి ఏపీ లైటింగ్స్‌లో జీఎంగా ఉండేవారు. అంతకు ముందు వేరే ఉద్యోగాలు చేయడం వల్ల మా పెళ్లయిన తర్వాత కేరళలోని ఆళువా ప్రాంతంలో ఉండేవాళ్లం. కొన్ని నెలల కంతా చుట్టుపక్కల వారికి సంగీతం, నాట్యం నేర్పించడానికి అవకాశం రావడంతో ఏడేళ్ల పాటు గురువుగా మారిపోయాను. అలాగే గుజరాత్లో ఉన్నప్పుడు నడియాడ్ ప్రాంతంలో మరో మూడేళ్లు అక్కడా టీచర్ అవతారం ఎత్తి భరత నాట్యం నేర్పించాను. ఇప్పటికీ అక్కడి నా శిష్యులు నన్ను పలకరిస్తూనే ఉంటారు. 1969 తర్వాత పూర్తిగా అనంతపురంలోనే ఉంటూ సంగీత, నాట్యాలను నేర్పిస్తున్నాను. సమస్యల పట్ల స్పందించాలి ప్రస్తుత సమాజం గందరగోళంగా మారుతోంది. అడుగడుగునా బాలికలకు భద్రత లేకుండా పోతోంది. అవగాహన లేని వయసులో అర్థం పర్ధం లేని ప్రేమలతో కుటుంబ బాంధవ్యాలు దెబ్బతింటున్నాయి. వీటన్నిటికి పరిష్కారమార్గం కళలు చూపిస్తాయి. సమాజంలో సమస్యలు వచ్చినపుడు.. మహిళా సమస్యలపై కళాకారులు స్పందించాలి. వారైతేనే సమస్యను సున్నిత కోణంలో వివరించగలరు. మేము బాలికలకు ఇదే విషయమై రోజూ కొంత సమయమైనా కేటాయించి మాట్లాడుతుంటాం. – గుంటి మురళీకృష్ణ, సాక్షి, అనంతపురం -
తెలంగాణ జానపద కళాకారిణి మృతి
హసన్‌పర్తి : జానపదం మూగబోయింది. 30 ఏళ్ల పాటు తన గళంతో ప్రజలను మంత్ర ముగ్ధులను చేసిన తెలంగాణ జానపద కళాకారిణి సంధ్య (50)ఇక లేరు. అనారోగ్య కారణంతో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో తుది శ్యాస విడిచారు. జానపద కళాకారుడు దివంగత శంకర్ భార్య సంధ్య. ప్రస్తుతం చింతగట్టు క్యాంపులోని పే అండ్ అకౌంట్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఎస్సార్‌ఎస్సీ క్యాంప్ క్వార్టర్‌లోనే ఉంటున్నారు. కుమార్తె రఘమయ్ బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, కుమారుడు మింటు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. 2017లో సంధ్యకు ఉత్తమ జనపద కళాకారిణి అవార్డుతో సత్కరించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా అవార్డుతో పాటు రూ.లక్ష పురస్కారం అందుకున్నారు. సంధ్య మృతదేహాన్ని జానపద కళాకారులు, పే అండ్ అకౌంట్ అధికారులు, ఎస్సారెస్పీ, దేవాదుల, టీఎన్జీవోస్ నాయకులు సందర్శించి నివాళులర్పించారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌కుమార్, పే అండ్ అకౌంట్ అధికారిణి పద్మజ, టీఎన్జీవోస్ యూనిట్ అధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్, దేవరకొండ యాదగిరి, రాజమౌళితో పాటు నాగరి రికార్డింగ్ సెంటర్ నిర్వాహకుడు సీతా రాఘవేందర్, జడల శివ, దార దేవేందర్‌లు పాల్గొన్నారు. -
ఈ పాఠం మన పిల్లలూ చదవాలి
కష్టాలను గానుగలో వేసి పిండిన సంధ్య, దుర్గాభవానీల చాప్టర్ ఇది. పుస్తకం చదివేది జ్ఞానమూ, విజ్ఞానమూ, సంస్కారం కోసమే కదా! అయితే వీళ్ల చాప్టర్ స్ఫూర్తికోసం చదవాలి. మనందరం పాఠాలు నేర్చుకున్న వాళ్లమే. మన పిల్లలు కూడా. కానీ ఈ బంగారాలు జీవితానికే ఓ పాఠం నేర్పించారు. ‘ఆకాశంలో మెరుపు మెరిసినా, హరివిల్లు విరిసినా తమ కోసమేనని మురిసిపోయే బాల్యంలో ఈ చిన్నారులు ఇంటి బాధ్యతల్ని మోస్తూనే. చదువుల్లో మెరుపులయ్యారు. సర్కారీ బడిలో హరివిల్లులై విరబూశారు. వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఈ ఏడాది టెన్త్‌లో 9.7 జీపీఏ సాధించి సంధ్య, 9.5 జీపీఏతో మొదటి, రెండు స్థానాల్లో నిలిచారు. ఊహ తెలిసేనాటికి సంధ్యకు నాన్న లేడు. కానీ నాన్న నడిపిన పానీపూరీ బండి ఉంది. బండెడు భారాన్ని మీదేసుకున్న అమ్మ తోడుగా ఉంది. బండి నడిస్తేనే బడి. బండి నడిపితేనే బతుకు. అలా అక్షరాలు దిద్దే చేతులతోనే సంధ్య పానీపూరీ తయారు చేసింది. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు గప్చుప్పులు విక్రయించింది. అమ్మకు చేదోడుగా నిలిచింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బడి, సాయంత్రం ఐదింటి నుంచి రాత్రి పదింటి వరకు బండి. ఆ తర్వాత ఏ తెల్లవారు జామునో నిద్ర లేచి పుస్తకాలతో పోటీ పడిన చిన్నారి సంధ్య పదో తరగతిలో స్కూల్ టాపర్‌గా నిలిచింది. వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలకే వన్నె తెచ్చింది. అదే స్కూల్ నుంచి సెకెండ్ టాపర్‌గా నిలిచిన దుర్గాభవానీ కూడా తల్లిదండ్రులతో పాటు తనూ ‘బతుకు బండి’ని లాగుతూనే ఉంది. అమ్మతో పాటు చెరుకుబండిని నడుపుతూ ఉంది. వీరిద్దరి ప్రతిభపై సాక్షి ఫ్యామిలీ స్పెషల్ రిపోర్ట్. సంధ్య సికింద్రాబాద్‌లోని సంగీత్ చౌరస్తా నుంచి క్లాక్‌టవర్ వైపు వెళ్తుంటే ఎడమ వైపు ఓరియంటల్ బ్యాంకు మూలన ఉంటుంది ఆ పానీపూరీ బండి. భర్త దత్తూరాం ఉన్నప్పటి నుంచి అతనితో పాటే పానీపూరీ బండి నడిపింది రాధ. బతుకుదెరువు కోసం 20 ఏళ్ల క్రితం నారాయణ్‌ఖేడ్ నుంచి వీరి కుటుంబం నగరానికి వలస వచ్చింది. పెళ్లయిన ఆరేళ్లకే దత్తూరాం గుండెపోటుతో చనిపోయాడు. ఛాట్బండి, రెండు మూడేళ్ల వయస్సు తేడాతో ఉన్న ముగ్గురు కూతుళ్లు, ఆర్నెల్ల వయస్సున్న కొడుకు, ఒక అద్దె గది మిగిలాయి. దుఃఖాన్ని దిగమింగి, పిల్లల్ని భుజానేసుకొని బండిని ముందుకు కదిలించింది రాధ. ఆమెతో పాటు సంధ్య చిట్టి చేతులు కూడా బండిని ముందుకు తోశాయి. అలా ఆ బండి ఆకలికి అన్నం పెట్టింది. చదువు చెప్పించింది. పదోతరగతి కూడా పూర్తి చేయకుండానే పెద్దమ్మాయి అంబికకు పెళ్లి చేశారు కానీ, రెండో అమ్మాయి మనీష, మూడో అమ్మాయి సంధ్య మాత్రం ఇద్దరు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించారు. మనీష ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. సంధ్య ఈ ఏడాదే పదోతరగతి పూర్తి చేసింది. అబ్బాయి మహేశ్ సర్కారీ బడిలోనే ఏడో తరగతి చదువుతున్నాడు. ‘‘పిల్లలే నా కలల పంట, పెళ్లయిన ఆరేళ్లకే ఆయన పోయినప్పుడు ఇక బతికేదెట్లా అని భయపడ్డాను.అప్పటికి నా కొడుకు 20 రోజుల పసికందు. ఆదుకొనే వాళ్లు కనుచూపు మేరలో లేరు. ఉన్నదల్లా బండి ఒక్కటే. మరోదారి కనిపించలేదు. ఆ బండిని నమ్ముకొనే ఇంతవరకు లాక్కొచ్చాను. పెద్దమ్మాయిని చదివించలేకపోయాననే బాధ ఉంది. కానీ మిగతా ఇద్దరమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు. మనీషను ఇంజనీరింగ్ చదివించాలనుంది. సంధ్య సీఏ చేస్తానంటుంది. ఇంకెన్ని కష్టాలు, బాధలు వచ్చినా సరే వాళ్లను బాగా చదివిస్తాను’’ అంటున్నారు రాధ. దుర్గాభవానీ సికింద్రాబాద్‌లోనే రసూల్‌పురా పేదల బస్తీ. ఆ బస్తీలో వికసించిన విజ్ఞాన జ్యోతి దుర్గాభవానీ. వెస్ట్‌మారేడుపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలలోనే ఈ ఏడాది సంధ్యతో పాటు కలిసి చదువుకొని 9.5 జీపీఏతో సెకండ్ టాపర్‌గా నిలిచింది. ఐపీఎస్ ఆమె కల. కల మాత్రమే కాదు ఆశయం కూడా. గత 30 ఏళ్లుగా ప్యారడైజ్ సమీపంలో ఉన్న బీఎస్ఎన్ఎల్ బస్టాపు వద్ద పాన్ డబ్బా నడుపుకొంటున్న దుర్గ తండ్రి బాబూరావు, అక్కడే చెరుకు బండి ఏర్పాటు చేసుకున్న తల్లి రాణీల కల కూడా అదే. అక్షరం అంటే ఏంటో తెలియని తమ జీవితాల్లో అక్షర జ్యోతై వెలుగుతున్న దుర్గా భవానీ కోసం కొవ్వొత్తుల్లా కరిగిపోయి అయినా సరే ఆమెను ఐపీఎస్‌ను చేయాలని ఆకాంక్షిస్తున్నారా తల్లిదండ్రులు. ‘‘ఈ సిటీలో పుట్టి పెరిగినం. కానీ ఇప్పటికీ మాకు సొంత ఇల్లు లేదు. రెక్కల కష్టాన్నే నమ్ముకొని బతుకుతున్నవాళ్లం. ఎండాకాలం చెరుకుబండి. వానాకాలం ఛాట్ బండి. అదే మా ఉపాధి. మాతో పాటే పిల్లలు పని చేస్తారు ఇంటిల్లిపాది కష్టపడితేనే బతుకు బండి నడిచేది’’ అన్నారు దుర్గాభవాని తల్లి రాణి. కూతురు దుర్గతో పాటు, కొడుకు శివను కూడా కష్టపడి చదివిస్తున్నారు. ‘‘పదో తరగతిలో అమ్మాయి సాధించిన ఫలితాన్ని చూస్తే జీవితంలో నేనే గెలిచినంత సంతోషం కలిగింది. ఇంకెన్ని కష్టాలొచ్చినా సరే ఆమె కోరుకున్న చదువు చదివిస్తాను’’ అని చెప్పారు బాబూరావు. కష్టంతోనే జీవితం ‘‘చిన్నప్పటి నుంచి అమ్మ పడిన కష్టాలు తెలుసు. ఆమె బాధలు చూస్తూనే ఉన్నాం. ఆ కష్టాల్లో, బాధల్లోనే పుట్టి పెరిగిన వాళ్లం. కష్టపడి వచ్చిన ఫలితంలో ఉండే తృప్తి మరెందులోనూ ఉండదనిపిస్తుంది. చార్టర్డ్ అకౌంటెంట్ కావాలన్నది నా లక్ష్యం.’’ ఇంటర్లో చేరిన తరువాత ఆ లక్ష్యం దిశగా పట్టుదలతో చదువుతాను’’. – సంధ్య తప్పకుండా ఐపీఎస్ అవుతా ‘‘ఉదయం బడికి పోయి, సాయంత్రం ఇంటికి వచ్చి.. ఏ పనీ చేయకుండా ఉంటే ఇల్లెట్లా గడుస్తది. అమ్మతో పాటు ఇంటి పని చేస్తాను. సాయంత్రం బండి మీదకి వచ్చి చెరుకు రసం తీస్తాను. అప్పుడప్పుడు నాన్న బయటికెళితే పాన్ డబ్బాలో ఉంటాను. ఎందుకంటే ఇదే మా జీవితం కదా. నేను తప్పకుండా ఐపీఎస్‌ను అయితీరుతాను. – దుర్గాభవానీ చదువుల గుడి మారేడుపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాల అమ్మాయిల చదువులకు కల్పవల్లిగా ఉంది. అత్యుత్తమ బోధనతో పాటు పిల్లలకు చక్కటి క్రమశిక్షణను అలవరుస్తున్నారు. ఈ ఏడాది సంధ్య, దుర్గాభవానీలతో పాటు, శ్రీదేవి (9.2), జ్యోతి (9.2), రమ్య (9.0)లు కూడా మంచి ఫలితాలను సాధించారు. ‘‘ప్రతి ముగ్గురు పిల్లలకు ఒక టీచర్ బాధ్యత తీసుకుంటారు. ఉదయాన్నే ఇంటికి ఫోన్ చేసి చదువుకోవాలని చెబుతారు. మా టీచర్లు మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తారు. ఎక్కడా ఒత్తిడనిపించదు. చాలా సంతోషంగా, ఆడుతూ, పాడుతూ చదువుకున్నాం. మంచి ఫలితాలను తెచ్చుకున్నాం’’ అని చెప్పారు సంధ్య, దుర్గాభవానీలు. – పడిగిపాల ఆంజనేయులు, సాక్షి, హైదరాబాద్ సాక్షిలో సంధ్య, దుర్గా భవాని వార్త (ఈ పాఠం మన పిల్లలూ చదవాలి) చదివిన పలువురు దాతలు తాము సాయమందిస్తామంటూ ముందుకు వస్తున్నారు. వారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు కింద అందచేస్తున్నాం. సంధ్య ఫోన్ నెంబరు: 9959132466 దుర్గా భవానీ సెల్ నెంబర్: 9866160698 -
సంధ్యపై ఆరోపణలు సత్యదూరం
సినిమా అంటే వినోదం, విజ్ఞానం అనే మాటకు ఎప్పుడో కాలం చెల్లింది. ఇప్పుడంతా కాసుల కోసం వేట మాత్రమే ఇక్కడ నడుస్తోంది. ఈ రంగంలోకి రావాలనుకునే అతివలకు, ట్రాన్స్జెండర్లకు గౌరవం, భద్రత, ఆదాయం, ఆరోగ్యం, హక్కులు ఎక్కడుంటాయి? అదే కదా శ్రీరెడ్డి అడిగింది. అదే కదా మిగతా ఆర్టిస్టులు కడుపుచించుకుని, కన్నీళ్లపర్యంతమవుతూ చెప్పింది. తమని కళాకారులుగా గుర్తించండి. తమకి కూడా వెండితెర మీద కనిపించే అవకాశాలివ్వండి. తమ కడుపులు కొట్టకండి. తమ శరీరాలను పశువాంఛలకు బలిచేయకండి. ఇదే కదా వారు అడిగింది. శ్రీరెడ్డి ప్రశ్న అనేక ముసుగుల్ని చించేసింది. ఒక మౌనాన్ని బద్దలు చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి, ఇటీవల జరిగిన సంఘటనలపై చర్చల నేపథ్యంలో బాధిత మహిళలకు అండగా అనేక మహిళా సంఘాలు ముందుకొచ్చి నిలబడ్డాయి. వారి కన్నీటి ఘోష విన్నాయి. క్యాస్టింగ్ కౌచ్‌పై చర్చలు ఇంత తీవ్రమయ్యాకే, సమస్య తీవ్రత అర్థమయ్యాకే తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల నిరో«ధక కమిటీ (కాష్ కమిటీ)ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం జరిగింది. ఇది ఆహ్వానించదగిన పరిణామమే. అయితే, అదే సమయంలో ఈ కమిటీకి ఛైర్‌పర్సన్‌గా జీవిత రాజశేఖర్ పేరు వినిపించింది. ఈ అంశంపై ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ సంధ్య అభ్యంతరం వ్యక్తం చేసారు. అసలు సినిమారంగంలో క్యాస్టింగ్ కౌచ్ లేదని. కాష్ కమిటీ అవసరమే లేదన్న వ్యక్తిని చైర్‌పర్సన్‌గా ఎలా నియమిస్తారనే ప్రశ్నని సంధ్య లేవనెత్తారు. ఇదే విషయంపై ప్రెస్‌మీట్ పట్టిన జీవితా రాజశేఖర్, ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు సంధ్య మీద తీవ్రమైన పదజాలంతో పాటు, వ్యక్తిగతమైన అంశాలను కించపరిచేవిధంగా మాట్లాడటమే కాకుండా, విలేకరులు కనిపించినపుడల్లా సంధ్య మీద దూషణలకు దిగటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. సంధ్యపై జీవిత చేస్తున్న అసత్య ఆరోపణలను నిర్ద్వం దంగా ఖండిస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని ప్రముఖ మహిళా ఉద్యమ నాయకురాళ్లలో సంధ్య పేరు ముందు వరుసలో ఉంటుంది. ఇదే తెలుగు సినిమా రంగంలో, పెద్దమనుషులుగా చెప్పుకుంటున్న అనేక మంది తమ ఆడపిల్లలకి సమస్యలెదురైతే వచ్చి సలహా తీసుకునేది కూడా సంధ్యని ఇతర మహిళా సంఘాల నేతలనే. నిజానికి ఈ రోజు ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి గొంతెత్తిన వారు కూడా తమ సమస్యల పరిష్కారానికి మహిళా సంఘాల దగ్గరికే వచ్చారు కానీ, పరిశ్రమలో ఎప్పటినుంచో వున్న జీవిత దగ్గరకు ఎందుకు వెళ్ళలేదు? ఈ విషయాన్ని జీవిత ఇకనైనా అర్థం చేసుకుని తన ధోరణి మార్చుకోవాలి. పీవోడబ్ల్యూ సంధ్య మీద జీవితా రాజశేఖర్ చేసిన దుర్మార్గమైన ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా ఉద్యమాలలో ముందుండి నాయకత్వం వహిస్తున్న సంధ్యకు మేమంతా ఏకగ్రీవంగా మద్దతు తెలియచేస్తున్నాం. సంధ్యపై చేసిన ఫిర్యాదులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. (పీవోడబ్ల్యూ నేత సంధ్యపై సినీ నటి జీవితా రాజశేఖర్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ వందమంది మహిళా మేధావులు, రచయిత్రులు, కళాకారులు, కార్యకర్తలు పంపిన పత్రికా ప్రకటన ముఖ్యాంశాలు) -
మహిళ సంఘం నేత,మీడియా ఛానల్ పై జీవిత ఫిర్యాదు
-
కరాటేలో సంధ్యా కిరణం
కరాటే.. శారీరక, మానసిక సామర్థ్యాలను పెంచడంతో పాటు ఆత్మరక్షణకు దోహదపడుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఆత్మవిశ్వాసం, మనోధైరాన్ని పెంచుతుంది. అటువంటి క్రీడలో ఆసక్తితో ఆర్థిక ఇబ్బందులున్నా మొక్కవోని దీక్షతో పతకాలు సాధిస్తోంది. కుటుంబ పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా తల్లిదండ్రులు, తోబుట్టువుల ప్రోత్సాహంతో పతకాల పంట పండిస్తోంది. ఎంబీఏ చదువును పూర్తిచేసి ఉన్నత చదువులతో పాటు కరాటేలో మరింత స్థాయికి ఎదిగేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది భీమవరం హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన కొడమంచిలి సంధ్య. విజయగాథ ఆమె మాటల్లోనే.. భీమవరం: మాది భీమవరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీ. తల్లిదండ్రులు అక్కమ్మ, దేవుడు, అక్క, అన్న ఇది మా కుటుంబం. అక్క, అన్న చదువుపై పెద్దగా శ్రద్ధ పెట్టకపోయినా, నన్ను మాత్రం ఉన్నత స్థాయిలో చూడాలన్న కోరిక అమ్మా, నాన్నతో పాటు తోబుట్టువులకూ ఉంది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పాఠశాల విద్య పస్తుల సాగరం మున్సిపల్ హైస్కూల్లో సాగింది. ఇంటర్ నుంచి ఎంబీఏ వరకూ డాక్టర్ చీడే సత్యనారాయణ కళాశాలలో చదువుకున్నా. మంచి మార్కులతోనే ఉత్తీర్ణత సాధించా. ఇదే సమయంలో రైస్ మిల్లు కార్మికుడిగా పనిచేసే నాన్న దేవుడు ప్రమాదవశాత్తు కాలువిరిగి మంచానపడ్డారు. కుటుంబ పోషణ కష్టం కావడంతో అమ్మ అక్కమ్మ మిల్లులో పనికి వెళ్లేది. అక్క టైలరింగ్, అన్న తాపీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. నాకు చిన్నతనం నుంచి కరాటేలో మక్కువ ఉండటంతో కుటుంబసభ్యులు ప్రోత్సహించారు. స్థానికంగా ఉన్న కరాటే మాస్టార్ జోశ్యుల విజయభాస్కర్ వద్ద శిక్షణ ఇప్పించారు. పతకాల పంట విశాఖ, గుంటూరు, కరీంనగర్, తాడేపల్లిగూడెం, జొన్నాడ, తాళ్లరేవు, రాజమండ్రి, మల్కిపురం తదితర ప్రాంతాల్లో జరిగిన జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఎనిమిది స్వర్ణ, ఆరు రజత, రెండు కాంస్య పతకాలు సాధించాను. మరెన్నో ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందుకున్నా ను. ప్రముఖుల ప్రశంసలు పొందాను. అయితే దూరప్రాంతాల్లో జరిగే టోర్నమెంట్లకు హాజరయ్యేందుకు ఆర్థిక పరిస్థితి అడ్డంకిగా మారింది. చదువుతో పాటు కరాటేలో శిక్షణ తలకు మించిన భారమైంది. ప్రస్తుతం అన్న, అక్క సంపాదనతోనే ఇల్లు గడుస్తోంది. కరాటేలో మరింత రాణించి పోలీసు ఉద్యోగం సంపాదించడమే నా లక్ష్యం. ఇందుకు ఆర్థిక ఇబ్బందులు ప్రతి బంధకంగా మారాయి. ఇప్పటికే ఎన్నో కష్టాలకోర్చి కుటుంబసభ్యులు ఇక్క డి వరకూ తీసుకువచ్చారు. దాతలు సహకరిస్తే కరాటేలో మరింత రాణిస్తానన్న నమ్మకం.. ఆత్మవిశ్వాసం నాకుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నా లక్ష్యాన్ని తప్పక సాధిస్తాను. -
భంగ తపస్వి
పూర్వం కండు అనే ఒక తపస్వి ఉండేవాడు. గొప్ప వేదాంతి అయిన ఆ ముని, జగన్నాథుని మనసులో నిలిపి, నిష్ఠతో తపస్సు చేసేవాడు. ఆయన తపః ప్రభావానికి దేవేంద్రుడు భయపడి.. దానిని భంగం చేయడం కోసం మదన, వసంతులను తోడిచ్చి ప్రమ్లోచన అనే ఒక అప్సరసను కండుముని తపస్సు చేసే ప్రాంతానికి పంపించాడు. అక్కడికి వచ్చిన ప్రమ్లోచన ఆ వనసౌందర్యానికి ముగ్ధురాలయిపోయి, ఒక పూలచెట్టు కింద కూర్చుని.. లోకాలు పరవశించేటట్లుగా గానం చేసింది. కండుముని ఆ మనోహరమైన గానం విని, వెదుక్కుంటూ, ప్రమ్లోచన వద్దకు వెళ్లాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడే వున్న మన్మథుడు ముని హృదయంలో పూలబాణాలు నాటడంతో ముని మనసు అప్సరసపై లగ్నమైపోతుంది. ఆ పారవశ్యంతో ముని ఆమె పాణిగ్రహణం చేసి, తనతోపాటు ఆశ్రమ కుటీరానికి తీసుకుని వెళ్లాడు. మునివేషంలో ఉండటం వల్ల ప్రమ్లోద తనను అసహ్యించు కుంటుందేమోనని.. తన తపశ్శక్తిని అంతా వెచ్చించి యౌవనరూపాన్ని ధరించి.. ఆమెతో సుఖించాడు కండు ముని. అలా వందేళ్లు గడిచిన తరువాత ఆమె.. ‘‘ఇక నేను స్వర్గలోకానికి వెళతాను. సెలవివ్వండి’’ అని అడిగింది. ‘‘ఇంకొంత కాలం ఇక్కడే వుండు’’ అన్నాడు ముని. ఆయన మాటకు ఎదురు చెప్పలేక అతనితోనే వుండిపోతుంది. అలా ఆమె వెళ్తానన్నప్పుడల్లా. ముని వద్దంటూ తన దగ్గరే ఉండమంటాడు. ఒకనాటి సాయంత్రం కండుముని, ప్రమ్లోచనతో.. ‘‘ఓ వనితామణీ! సాయంకాలం అవుతోంది. సంధ్యవార్చి వస్తాను. ఉదయం నుంచి నీతోనే సరిపోయింది’’ అని అన్నాడు. ఆ మాటలకు ప్రమ్లోచన నవ్వుతూ... ‘‘మునీంద్రా! నువ్వు నన్ను ప్రభాతవేళ చూసింది నిజమే. అది ఎన్ని సంవత్సరాల కిందటి మాటో తెలుసా? ఈ మధ్యలో తొమ్మిదివందల సంవత్సరాలకు పైగా గడిచి పోయాయి.. అంటూ అసలు విషయమంతా చెప్పి, ముని ఏమంటాడోనన్న భయంతో గడగడ వణికిపోతుంది. కండుముని ఆమె చెప్పింది విని, సిగ్గుపడి, ‘ఓ తరుణీ! ఇదంతా నా దోషమే! ఇందులో నీ తప్పేమీ లేదు. నువ్వు ఇంద్రుడు చెప్పినట్టుగా నీ పనిని నెరవేర్చావు. ఇక నువ్వు నీ స్వర్గానికి వెళ్లు. ’’ అని అంటాడు. దాంతో ఆమె ఆకాశమార్గం ద్వారా అమరావతి చేరుకుంది. తీవ్ర పశ్చాత్తాపంతో వేగిపోతున్న కండుముని, పురుషోత్తమ క్షేత్రానికి వచ్చి, మనస్సంతటినీ పురుషోత్తముని మీద లీనం చేసి. తీవ్రమైన తపస్సు చేసి, భగవంతుని ప్రత్యక్షం చేసుకుని, మోక్షం పొందుతాడు. నీతి: కామక్రోధాల మీద అదుపు లేనివాడికి సమయం మీద కానీ, ప్రకృతి మీద కానీ, ఇంద్రియాల మీద కానీ అదుపు ఉండదు. భగవత్సాక్షాత్కారం లభించదు. – డి.వి.ఆర్. భాస్కర్ -
ఆడపిల్ల భారమన్నారు..!
హిమాయత్‌నగర్: ఆ బాలికలు ఎన్నో ఆశలు... ఆశయాలతోచదువుకుంటున్నారు. భవిష్యత్తుపై ఆకాంక్షలతో కలల సౌధాన్ని నిర్మించుకున్నారు. కానీ... ఆ ఆశలు అడియాసలయ్యాయి. కలల సౌధం కుప్పకూలింది. ఆర్థిక ఇబ్బందులు అడ్డొచ్చాయి. ఇక ఈదరిద్రాన్ని మేం భరించలేమని కుటుంబసభ్యులు తీసుకున్ననిర్ణయానికి ఆ చిన్ని హృదయాలు తల్లడిల్లాయి. బాలల హక్కుల సంఘం సహాయంతో బాల్య వివాహం బారి నుంచి బయటపడిన ఆ చిన్నారులు... అవమానాలను దిగమింగి, ఆటుపోట్లను అధిగమించి ఇప్పుడు చదువు, ఆటల్లో రాణిస్తున్నారు. చదువూ సంధ్య.. ‘తమ్ముడు.. నీ కూతుర్ని ఇంకెంత కాలం చదివిస్తావ్ రా? చదివించింది చాలు... ఇక పెళ్లి చేసేయ్. మంచి సంబంధం చూద్దాం. ఈ దరిద్రాన్ని ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటావ్. ’ – ఇదీ సంధ్యకు మేనత్త నుంచి ఎదురైన పరిస్థితి హయత్‌నగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వగ్లాపురం మల్లేష్, సూర్యకళల పెద్ద కుమార్తె సంధ్య. ‘మాకు ఆస్తి లేదు. పెళ్లి చేసి నన్ను వదిలించుకోవాలని మా మేనత్త, మామయ్యలు.. మా నాన్నకు చెప్పారు. 2016 ఏప్రిల్ 20న వివాహం నిశ్చయించారు. బాలల హక్కుల సంఘం ప్రతినిధులు అడ్డుకొని హోమ్‌కు తీసుకెళ్లారు. అయితే పెళ్లి ఆగిపోవడంతో మనస్తాపానికి గురై నాన్న చనిపోయారు. బంగారం లాంటి మనిషిని నువ్వే చంపేశావ్.. చదువుకొని ఏం సాధిస్తావ్ అంటూ సూటిపోటి మాటలతో నన్ను కుంగదీశార’ని ఆవేదన వ్యక్తం చేసింది సంధ్య. తిట్టినోళ్లే మెచ్చుకున్నారు... ‘నాకు ఏప్రిల్ 3న ఎంగేజ్మెంట్ నిశ్చయించారు. అప్పుడు పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. పెళ్లి చేసుకుంటాను అంటేనే.. నువ్వు పరీక్షలకు వెళ్లేది అంటూ ఇంట్లో షరతు పెట్టారు. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోనని సోషల్ పేపర్–1 పరీక్ష రాయలేదు. బాలల హక్కుల సంఘం కృషితో సోషల్ పేపర్–2 రాశాను. ఒక్క పేపర్ రాయకపోయినప్పటికీ 7.5 జీపీఏ సాధించాను. అప్పుడు అందరూ మెచ్చుకున్నారు. నన్ను తిట్టిన వాళ్లే.. నీలో ప్రతిభ ఉందని ప్రోత్సహించారం’టూ చెప్పింది సంధ్య. ఈమె ప్రస్తుతం బీఎన్‌రెడ్డినగర్‌లోని ఎన్ఆర్ఐ కళశాలలో ఇంటర్ చదువుతోంది. ఆటా అనూష... ‘తల్లి.. మీ నాన్న మిమ్మల్ని వదిలేశాడు. వేరే ఆమెతో ఉంటున్నాడు. అన్నీ చూసుకోవాల్సిన మీ నాన్న.. మిమ్మల్ని మాపై వదిలేశాడు. అందుకే నీకు పెళ్లి చేసేస్తాం. మా బరువు, బాధ్యత తీరిపోతుంది’ – ఇదీ అనూషకు అమ్మమ్మ–తాతయ్యల నుంచి ఎదురైన పరిస్థితి సరూర్‌నగర్‌లో నివసించే బొడ్డుపల్లి శ్రీను, అరుణల కుమార్తె అనూష. శ్రీను లారీ డ్రైవర్, అరుణ గృహిణి. ‘మా నాన్న మమ్మల్ని వదిలేశాడు. వేరే ఆమెతో కాపురం పెట్టాడు. ఇల్లు గడవడం కూడా కష్టమవడంతో నాకు త్వరగా పెళ్లి చేసి పంపేయాలనే ఆలోచన అమ్మమ్మ, తాతయ్యలకు వచ్చింది. గతేడాది మే 4న వివాహం చేసేందుకు సిద్ధమవగా, బాలల హక్కుల సంఘం ప్రతినిధులు అడ్డుకున్నారు. కాచిగూడలోని హోమ్‌లో 20 రోజులు ఉన్న తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. పెళ్లి చేసుకోకుండా ఇంకెంత కాలం ఉంటావే.. అంటూ తిట్టారు. వాటన్నింటినీ దిగమింగుతూ కాలేజీకి వెళ్తున్నాను. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాన’ని వివరించింది అనూష. క్రికెట్, రగ్బీలో మేటి.. ‘నాకు ఆటలంటే ఇష్టం. మా పీఈటీ రాఘవరెడ్డి సార్ నన్నెంతో ప్రోత్సహించారు. క్రికెట్ బాగా ఆడడం నేర్చుకున్నాను. ఇప్పుడు స్టేట్ టీమ్‌లో నేనొక ఫాస్ట్ బౌలర్‌ని. మధ్యప్రదేశ్, గుజరాత్, మన రాష్ట్రంలోని గుర్రంగూడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచాను. భారత్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో ఆడాలనేది నా కోరిక. క్రికెట్‌తో పాటు రగ్బీ అంటే కూడా నాకిష్టం. ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాన’ని చెప్పింది. -
ఆ రోజుల్లో దేవదాసీలనేవారు..
సుస్వరాల సంగీతం.. శాస్త్రీయ నృత్యం.. ప్రయోగాలు చేస్తూ అనంత కీర్తిపతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎగురవేసిన ఘనత. మూడేళ్ల ప్రాయంలో మొదలైన ప్రస్థానం.. కళకు వయస్సుతో నిమిత్తం లేదని చాటుతూ ఇప్పటికీ ఆ గళం గలగల పారుతుంటే.. ఆ పాదం ఎందరో కళాకారులకు స్ఫూర్తినిస్తోంది. దేశ విదేశాలకు ఇక్కడి చిన్నారుల ప్రతిభను పరిచయం చేస్తూనే.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే శాస్త్రీయ సంగీత, నృత్యాలలో లెక్కకు మించి నిష్ణాతులను తీర్చిదిద్దిన విదుషీమణి సంధ్యామూర్తి. అనంతపురం కల్చరల్: సంగీతమైనా, నాట్యమైనా గాంధర్వ కళ. జన్మతః అదృష్టం ఉంటేనే అబ్బుతుంది. మా పిల్లలెవరూ పూర్తిస్థాయి నాట్య రంగంలో లేకపోవడమే అందుకు నిదర్శనం. బంధాలు, బంధుత్వాలు శాశ్వతం కాకపోయినా.. కళను నమ్ముకుంటే జీవితాంతం తోడుంటుంది. జీవితాన్ని రంగులమయం చేయగలిగిన సత్తా ఒక్క కళకు మాత్రమే ఉంది. శిష్యులు కూడా గురువుల పట్ల గౌరవభావంతో మెలిగినప్పుడే నాట్యంలో ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశం దక్కుతోంది. నేను పుట్టి పెరిగింది అనంతలోనే. మూడేళ్ల ప్రాయంలోనే మా నాన్న పీఎస్ శర్మ ప్రోత్సాహంతో నాట్య ప్రవేశం చేశా. అప్పట్లో ఆయన లలిత కళాపరిషత్ సెక్రటరీ. మైసూరు నుంచి అనంతపురానికి వచ్చిన నాట్యకోవిదులు వరదరాజ అయ్యంగార్ వద్ద భరతనాట్యం, పార్వతీశం వద్ద కూచిపూడిలో శిక్షణ తీసుకున్నా. చెన్నైకి చెందిన అన్నామలై చెట్టియార్ వద్ద శాస్త్రీ సంగీతం నేర్చుకున్నా. అప్పటికి నా వయస్సు ఐదేళ్లు మాత్రమే. అప్పట్లో భక్త కబీరు నాటకంలో కబీరు కుమారునిగా, భూ కైలాస్ నాటకంలో బాల వినాయకునిగానూ నటించా. పరాయి రాష్ట్రాల్లోనూ అనంత కీర్తి మా ఆయన కృష్ణమూర్తి ఏపీ లైటింగ్స్‌లో జీఎంగా ఉండేవారు. అంతకు ముందు వేరే ఉద్యోగాలు చేయడం వల్ల మా పెళ్లయిన తర్వాత కేరళలోని ఆళువా ప్రాంతంలో ఉండేవాళ్లం. కొన్ని నెలలకంతా చుట్టుపక్కల వారికి సంగీతం, నాట్యం నేర్పించడానికి అవకాశం రావడంతో ఏడేళ్ల పాటు గురువుగా మారిపోయాను. అలాగే గుజరాత్లో ఉన్నప్పుడు నడియాడ్ ప్రాంతంలో మరో మూడేళ్లు అక్కడా టీచర్ అవతారం ఎత్తి భరతనాట్యం నేర్పించాను. ఇప్పటికీ నా శిష్యులు పలకరిస్తూనే ఉంటారు. 1969 తర్వాత పూర్తిగా అనంతపురంలోనే ఉంటూ సంగీత, నాట్యాలను నేర్పిస్తున్నా. భరతనాట్యమే నృత్యమనుకునేవారు నేను నాట్యం ప్రారంభించిన రోజుల్లో భరత నాట్యమంటేనే శాస్త్రీయ నృత్యం. అది కూడా పదేళ్లలోపు వారైతే ఆడపిల్లలు నేర్చుకోవచ్చు. ఆడవేషాలైనా మగవారే వేసేవాళ్లు. కూచిపూడి నాట్య సంప్రదాయమంటే యక్షగానం, వీధి భాగవతార్లు మాత్రమే వీధుల్లో ప్రదర్శించేవారు. అయితే వెంపటి చినసత్యం రాకతో కూచిపూడికి మహర్దశ వచ్చింది. ప్రస్తుతం సినిమాలో ఉన్న మంజుభార్గవి, ప్రభతో పాటు శోభానాయుడు మొదలైన వాళ్లంతా రంగస్థలం ఎక్కి కొత్త సంప్రదాయానికి నాంది పలికారు. ఆ స్ఫూర్తి నేను రంగస్థలంపై ప్రయోగాలు చేసేందుకు కారణమైంది. ఎన్నోమార్లు వెంపటి చినసత్యం నన్ను మెచ్చుకున్నారు. అలాగే వేదాంతం సత్యనారాయణ మా ఇంటికొచ్చేవారు. వారందరి చలువతో మహిళలు భరతనాట్యంతో పాటు కూచిపూడి నేర్చుకోగలుగుతున్నారు. 1969లోనే శ్రీ నృత్య కళా నిలయం వరదరాజ అయ్యంగార్ తర్వాత కృష్ణకుమార్ లలిత కళా పరిషత్‌లో, అప్పారావు కృష్ణ కళామందిరంలో శాస్త్రీయ నృత్యాలు నేర్పించారు. అమీర్‌బాషా కూడా నృత్యంలో శిక్షణిచ్చేవారు. వీరి స్ఫూర్తితో 1969లో శ్రీనృత్య కళానిలయాన్ని తీర్చిదిద్దాం. జిల్లాలోనే ఇది తొలి సంగీత, నాట్య పాఠశాలగా గుర్తింపు ఉంది. వేలాది మంది విద్యార్థులకు శాస్త్రీయ నృత్యం నేర్పిన మా పాఠశాల నుంచే నాట్య గురువులుగానూ ఎదిగారు. ముఖ్యంగా ప్రత్యూష, మహాలక్ష్మి ‘విదూషీ’ శిక్షణ పొందారు. నృత్యంతో ఆత్మవిశ్వాసం శాస్త్రీయ నృత్యంతో ఆధ్యాత్మిక భావజాలంతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. కళకు వయస్సుతో సంబంధం లేదని చాటడంలోనూ ఈ నృత్యం పాత్ర ఎనలేనిది. భారతీయ సంస్కృతీ, పురాణ ఇతిహాసాల విశిష్టత నృత్యాలలో ధరించే పాత్రలు కళ్లకు కడతాయి. ఆ రోజుల్లో దేవదాసీలనేవారు.. మా చిన్నప్పుడు మహిళలకు రంగస్థలం ఎక్కే అర్హత లేదు. అలా చేశారంటే దేవదాసీలనో, భోగంవారనో భావించేవారు. దానికి భయపడి ఎవ్వరూ నాట్య రంగంలో ప్రవేశించలేదు. కళపై ఉన్న అభిమానంతో మా నాన్న నాకు పద్నాలుగేళ్లు వచ్చే వరకు చెప్పించి ఆ తర్వాత మాన్పించారు. అది కూడా పెద్ద పెద్ద విద్వాంసులను ఇంటికే రప్పించి సంగీత నృత్యాలు నేర్పించారు. అప్పటికి ఊరంతా కలిపినా పట్టుమని పది మంది కూడా శాస్త్రీయ నృత్యం నేర్చుకునే వారు లేరంటే ఆశ్చర్యమనిపిస్తుంది. మేము ఆ రోజుల్లోనే వారికి రూ.25 ఇచ్చేవాళ్లం. ఇప్పుడది ఏ నాలుగైదు వేలకో సమానం. ప్రపంచ రికార్డు ప్రదర్శనలు పెళ్లయిన తర్వాత మా వారి ఉద్యోగ రీత్యా అనేక రాష్ట్రాలు తిరగాల్సి వచ్చింది. ఆయా ప్రాంతాల్లోనూ నేను నాట్యం నేర్పించాను. అనంతపురం చేరుకున్న తర్వాత మా శిష్య బృందంతో న్యూఢిల్లీ, పూణే, బెంగళూరు, కోల్‌కతా, ఒడిశా తదితర ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లోనూ ప్రదర్శనలిచ్చాం. ముఖ్యంగా 2014లో 155 మంది సంగీత కళాకారులతో ‘అన్నమయ్య శత అష్టోత్తర సంకీర్తనార్చన’ను ఏడు గంటల పాటు నిర్విరామంగా చేపట్టి ప్రపంచ రికార్డును నమోదు చేశాం. మరుసటి సంవత్సరం 2015లో 135 మంది శాస్త్రీయ నృత్య కళాకారులతో ‘దశదేవతా నృత్యారాధన’ను ఏడు గంటల పాటు నిర్వహించి మరో ప్రపంచ రికార్డును అనంత కీర్తిని విశ్వవ్యాప్తం చేశాం. వారసులంతా ఘనులే.. ఒక్కోసారి మా శిష్యులను తలచుకుంటే నాకే ఆశ్చర్యమనిపిస్తుంది. నా దగ్గర విద్య నేర్చుకున్న నాట్య మయూరి శోభారాణి హైదరాబాద్‌లో, ప్రసన్న లక్ష్మి మైసూరులో, శివప్రసాద్ అనంతపురంలో.. హరినాథబాబు, వారిజ హిందూపురంలో, ప్రత్యూష గుంతకల్లులో, మహాలక్ష్మి బెంగళూరులో గొప్ప శిక్షకులుగా శిక్షణాలయాలు నిర్వహిస్తున్నారు. ఇక మా అమ్మాయి అను«రాధ ఎంఏ డాన్స్ చేసి ఓ కార్పొరేట్ విద్యాసంస్థలో కల్చరల్ కోఆర్డినేటర్‌గా ఉంది. ఇలా మా విద్య కీర్తితో పాటు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. బయోడేటా పూర్తి పేరు : గుంటూరు సంధ్యామూర్తి జననం : అనంతపురం పుట్టిన తేదీ : 22–06–1953 తల్లిదండ్రులు : పీఎస్ శర్మ, సరస్వతమ్మ భర్త : కృష్ణమూర్తి సంతానం : నందకుమార్(కొడుకు), అనురాధ(కూతురు) తొలి ప్రదర్శన: 1956లో లలితకళా పరిషత్తులో అరంగేట్రం అవార్డులు : కళానీరాజనం, సంగీత నృత్య సరస్వతి, ఉగాది పురస్కారం, నాట్యరత్న, అనంత ఆణిముత్యం స్ఫూర్తి : నాన్నగారితో పాటు నాట్య విద్వాంసులు వరదరాజ అయ్యంగార్ -
పని జెండర్ ఎరగదు
‘ఎవరన్నారీ పని మగవాళ్లదని...’ సంధ్యా మారవి ఈ మాట అనలేదు. కానీ... ఇది మగవాళ్ల పని మాత్రమే కాదు, అవసరమైనప్పుడు ఆడవాళ్ల పని కూడా. అంతకంటే ముందు ఇది మనిషికి అన్నం పెట్టే పని... అని నిరూపించింది. ఒక చాదస్తపు సంప్రదాయ గిరిగీతను చెరిపివేసింది. కుటుంబాన్ని పోషించడానికి ఇంటి మగవాడు ఉన్న ఆడవాళ్లకు ఇది మగవాళ్ల పనిగానే కనిపిస్తుందేమో! అన్నం పెట్టే వాడు ‘పిల్లలకు ఇక నుంచి తల్లీతండ్రీ నువ్వే’ అని అకస్మాత్తుగా తనువు చాలించిన సంధ్య లాంటి వాళ్లకు మాత్రం కాదు.‘ఇది ఆడవాళ్లు చేసే పని కాదు’ అని చేతులు ఒడిలో పెట్టుకుని, మౌనంగా కూర్చుంటే పిల్లలకు వేళకింత అన్నం ఎవరు పెడతారు?... ఇవన్నీ సంధ్య మౌనంగా సంధించే ప్రశ్నలు. సంధ్యామారవి కాట్ని రైల్వే స్టేషన్లో కూలీ. ఆమెది మధ్యప్రదేశ్, జబల్పూర్ జిల్లా కుందం గ్రామం. జబల్పూర్ నుంచి కాట్నికి 90 కిలోమీటర్లు. ఆమె ఉద్యోగానికి వెళ్లాలంటే రోజూ బస్సులో సొంతూరు కుందం నుంచి జబల్పూర్కి, అక్కడి నుంచి రైల్లో కాట్నికి చేరుకోవాలి. డ్యూటీ ముగిసిన తర్వాత అదే రూట్లో తిరుగు ప్రయాణం. అటూఇటూ కలిపి రోజుకు 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి మరీ ఉద్యోగం చేస్తోంది. కాట్ని స్టేషన్లో 40 మంది పోర్టర్లున్నారు. వారిలో సంధ్య మాత్రమే అమ్మాయి. పసితనం పోని సంధ్య చేత పెట్టెలు మోయించుకోవడానికి ప్రయాణికులు ఇబ్బందిపడుతుంటారు. ఇంత బలహీనంగా ఉన్న అమ్మాయి తమ సామాను మోయలేక కిందపడేసి పాడు చేస్తుందేమోననే భయం కూడా. ‘నేను మోయగలను సార్’ అని వాళ్లకు భరోసా ఇచ్చి మరీ బరువులు మోస్తోంది. రోజంతా బరువులు మోయడం కష్టంగా అనిపించడం లేదా అని ఎవరైనా ఆత్మీయంగా అడిగితే... ‘ఇంకా లోకం తెలియని ముగ్గురు పిల్లల భారం మోస్తున్నాను’ అంటుంది. ఆమె మాటల్లో లోతు అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. ఆమెను చూస్తే బరువు మోయడానికి శక్తికంటే ఎక్కువగా ధైర్యం ఉండాలనిపిస్తుంది. ఆమె ఎవరి నుంచి కూడా సహాయాన్ని ఆశించడం లేదు. తన కుటుంబాన్ని తానే పోషించుకోగలను అంటోంది. అయితే ఆమె రైల్వే డిపార్ట్మెంట్ను కోరుతున్న సహాయం ఒక్కటే. అది కాట్ని స్టేషన్ నుంచి జబల్పూర్ స్టేషన్‌కి బదిలీ. అధికారులు స్పందించినప్పుడు ఆమెకి ఈ సుదీర్ఘమైన ప్రయాణం తప్పుతుంది. సంధ్యకు ఇద్దరు కొడుకులు, ఎనిమిదేళ్ల సాహిల్, ఆరేళ్ల హర్షిత్. కూతురు పాయల్‌కు నాలుగేళ్లు. సంధ్య ఉద్యోగానికి వేళ్లకు వెళ్లాలంటే తెల్లవారు జామున లేచి బయలుదేరాలి. సంధ్య అత్త ఇంట్లో ఉండి పిల్లలను చూసుకుంటుంది. ‘నా కొడుకు అర్థంతరంగా పోయాడు. ఇంటి బరువును కోడలు తలకెత్తుకుంది. పిల్లల్ని చక్కగా బడికి పంపించి చదివిస్తాం. పెద్దయిన తర్వాత వాళ్లమ్మ కష్టాలను ఈ పిల్లలే తీర్చాలి’ అంటోందామె. – మంజీర -
ఆ తృప్తే వేరు...
‘అందం, తెలివితో పాటు శక్తివంతంగా ఉండడమూ అవసరం. ఈ సూత్రాన్ని అందరికీ తెలియజేయాలంటే ఆ విధంగా నడుచుకోని చూపించాలి. మహిళలు మల్టీ టాలెంటెడ్. ఏ రంగంలోనైనా విజయం సాధించగలరు. ఈ రెండింటికీ నేనే ఉదాహరణ’ అని చెప్పారు ప్రముఖ మోడల్, నటి, కరాటే క్రీడాకారిణి సంధ్యాశెట్టి. మిస్ ఇండియా ఫైనలిస్ట్‌గా ఫ్యాషన్ రంగంలోకి అడుగేసి, 2003లో ఎంఎఫ్ హుస్సేన్ మీనాక్షి (హిందీ) సినిమాలో నటించి, 2015లో కరాటే చాంపియన్‌గా దేశానికి బంగారు పతకం సాధించి పెట్టింది. ఇటీవల నగరానికి వచ్చిన ఈ మల్టీ టాలెంటెడ్ ఉమన్ ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలివి... నేను ముంబైలో పుట్టి పెరిగాను. నేను అడుగేసిన అన్ని రంగాల్లో మంచి లైఫ్. అయితే శక్తివంతమైన మహిళగా నిరూపించుకోవాలనే తపన ఉండేది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించినా ఎన్సీసీ ఆర్మీ వింగ్‌లో కొనసాగాను. నాకు ఇద్దరు సోదరులు, సోదరి. వాళ్లలా నేనూ బలంగా ఉండాలని చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని. అది 2015లో కామన్వెల్త్ క్రీడల్లో కరాటేలో బంగారు పతకం సాధించినప్పుడు నిజమైంది. ఏదైనా సాధ్యమే... మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరు. మోడల్‌గా, క్రీడాకారిణిగా రాణించడం కష్టమేం కాదు. ఇందుకు మా అమ్మే నాకు స్ఫూర్తి. ప్రతి మహిళ అందంగా, ఫిట్‌గా ఉండడం సాధ్యమే. ఒక స్త్రీ కూతురిగా, భార్యగా, తల్లిగా అనేక బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఇన్ని పనులు చేయగలిగే వారికి టైమ్ మేనేజ్మెంట్ బాగా తెలుస్తుంది. ఆ తృప్తే వేరు... మోడలింగ్, యాక్టింగ్, స్పోర్ట్స్ దేనికదే ప్రత్యేకం. అయితే నేను చిన్నప్పటి నుంచి క్రీడాకారిణిని. దేశం కోసం ఆడినప్పుడు కలిగే సంతృప్తే వేరు. తల్లిదండ్రులు పిల్లల్ని ఆటల్లో ప్రోత్సహించాలి. క్రీడాకారులు శారీరకంగా, మానసికంగా శక్తివంతంగా ఉంటారు. క్లీన్ అండ్ ఫ్రెండ్లీ హైదరాబాద్‌కి చాలాసార్లు వచ్చాను. ఈ సిటీ ముంబై కంటే క్లీన్‌గా ఉంటుంది. ఇక్కడి వాళ్లు చాలా ఫ్రెండ్లీ. ఇక బిర్యానీ యమ్మీ. సిటీ క్రీడాకారిణి సింధూ జర్నీని గమనిస్తున్నాను. ఆమె స్త్రీ శక్తికి ప్రతీకగా నిలుస్తోంది. దేశం గర్వించదగ్గ ఆడబిడ్డ. అందరు తల్లిదండ్రులు అమ్మాయిలను క్రీడల్లో ప్రోత్సహించాలి. నో ఫియర్ క్యాంపెయిన్... ఈ క్యాంపెయిన్ ద్వారా మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తుంటాను. మన దేశంలో స్త్రీలపై జరుగుతున్న దాడులకు ఇతరులను నిందిచడం కంటే మనమే శక్తివంతంగా మారాలి. మహిళలు శారీరకంగా బలంగా తయారు కావాలి. ఇందుకు సెల్ఫ్ డిఫెన్స్, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. అలాగే తల్లులు తమ కొడుకులకు స్త్రీలను గౌరవించాలని చిన్నప్పటి నుంచే చెప్పాలి. రెండు విధాలుగా స్త్రీలే మార్పు తీసుకురాగలరు. చాలెంజెస్ తప్పవు.. కరాటే, మోడలింగ్ రెండు వేర్వేరు కావడంతో చాలెంజెస్ తప్పవు. కరాటేలో దెబ్బలు తగిలి కాలు ఫ్రాక్చర్ అయింది. రెండు రోజుల్లో షూటింగ్ ఉంది. ఇలాంటి చాలెంజెస్‌ని ఎదుర్కొని సాగడమే జీవితం. 2016లో నేషనల్ చాంపియన్‌షిప్, తర్వాత ఏసియన్ కరాటే ఫెడరేషన్లో బంగారు పతకం సాధించాను. దర్శకుడు ప్రియదర్శన్‌తో పనిచేయాలనే కోరిక తీరింది. ఆయన తమిళ చిత్రం టైటిల్‌సాంగ్‌లో ఉన్నాను. ఇది 2018 జనవరిలో విడుదల కానుంది. -
రజతం నెగ్గిన సంధ్య
విజయవాడ, స్పోర్ట్స్: ఆసియా అమెచ్యూర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి గోలి సంధ్య రజత పతకం గెలిచింది. థాయ్‌లాండ్‌లో జరిగిన ఈ టోర్నమెంట్లో సంధ్య నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత 7.5 పాయింట్లతో క్యూజోన్ లోరెషిల్ (ఫిలిప్పీన్స్)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. సంధ్య ఏడు గేముల్లో గెలిచి, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయింది. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా లోరెషిల్కు స్వర్ణం, సంధ్యకు రజతం ఖాయమయ్యాయి. భారత్‌కే చెందిన అపరాజిత గోచికర్ ఏడు పాయింట్లతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తాజా ప్రదర్శనతో సంధ్య వచ్చే ఏడాది ఇటలీలో జరిగే ప్రపంచ అమెచ్యూర్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. గతేడాది ఇరాన్లో జరిగిన ఆసియా అమెచ్యూర్ చాంపియన్‌షిప్‌లో సంధ్య కాంస్య పతకం గెలిచింది. -
చదువుల ఒత్తిడి తట్టుకోలేక..
-
చదువుల ఒత్తిడితో సంధ్య ఆత్మహత్య
సాక్షి, మహబూబ్‌నగర్ : చదువుల ఒత్తిడి తట్టుకోలేక మరో విద్యా కుసుమం నేల రాలింది. ఆదివారం పూట కూడా క్లాసులు నిర్వహిస్తుండటంతో మనస్తాపం చెందిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జిల్లాలోని జడ్చర్లలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. జడ్చర్ల పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న గోపాల్‌కు కూతురు సంధ్య(15) ఉంది. పట్టణంలోని ఉదయ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆదివారం కూడా పాఠశాలలో తరగతులు నిర్వహించడంతో మనస్తాపానికి గురై తమ కూతురు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సివుంది. -
మహిళకు స్ఫూర్తి.. సంధ్య.
కాకినాడ : ఓ మారుమూల కుగ్రామంలో పదో తరగతి పూర్తిచేసి ఉన్నత చదువుల కోసం విశాఖ వెళ్ళిన ఆమెకు బయటి ప్రాంతాలకు వెళ్ళి చదవడంలో అమ్మాయిలు ఎదుర్కొనే ఇబ్బందులను స్వయంగా అనుభవమైంది. పురుషులతో సమానంగా మహిళలకు ఉన్నత చదువులు చదవాలన్న ఆమె ఆకాంక్ష మహిళల కోసం ప్రత్యేక కళాశాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు బీజం పడింది. అలా ఓ చిన్న కళాశాల నుంచి ప్రారంభమై ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, బీఎడ్, డీఎడ్, ఎమ్బీఏ, ఎమ్సీఏ సహా ఎన్నో మహిళా కళాశాలలు ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగారు. ఆమే కాకినాడ కేంద్రంగా నడుస్తున్న వీఎస్లక్ష్మి కరస్పాండెంట్ సంధ్య. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని కోడూరు గ్రామంలో పదో తరగతి వరకు చదివిన ఆమె ఇంటర్, డిగ్రీలను క్రమ శిక్షణకు మారుపేరైన విశాఖ భారతీయ విద్యాకేంద్రంలో పూర్తి చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ (ఫిజిక్స్) పూర్తిచేసిన ఆమె 1990లో వివాహమయ్యాక కాకినాడలో స్థిరపడ్డారు. విద్యపట్ల ఉన్న మక్కువ, మనోస్థైర్యం గమనించిన ఆమె మామ డాక్టర్ వీవీ కృష్ణంరాజు ప్రోత్సాహంతో 1998లో వీఎస్లక్ష్మీ మహిళా విద్యాసంస్థల ఏర్పాటుకు తోడ్పాటునందించారు. అలా ప్రారంభమైన మహిళా కళాశాల ప్రస్థానం అంచెలంచెలుగా గడిచిన 19 ఏళ్ళలో ఎంతోమంది అమ్మాయిలను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. కేవలం మహిళల కోసమే ఏర్పాటైన ఈ విద్యాసంస్థ అమ్మాయిల అభిరుచులకు అనుగుణంగా ఇంటర్, డిగ్రీలతోపాటు వారివారి అభిరుచులకు అనుగుణంగా నచ్చిన కోర్సులో చేరేందుకు వీలుగా ఎన్నో అనుబంధ కోర్సులకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ చదివిన ఎంతో మంది అమ్మాయిలు ఇప్పుడు దేశ, విదేశాల్లో రీసెర్చ్ ఫ్రొఫెసర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డారు.దాదాపు 17 వేల మందికి పైగా మహిళలు సంధ్య పర్యవేక్షణలోని కళాశాలలో చదివి ఇప్పుడు పదిమందికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
కళాశాలపై నుంచి పడి విద్యార్థిని మృతి
-
ప్రాణం తీసిన ఫేస్బుక్ ప్రేమ.
-
ప్రాణం తీసిన ఫేస్బుక్ ప్రేమ
సంధ్య హత్య కేసులో స్నేహితుడే నిందితుడు కాణిపాకంలో ఉరేసుకున్న కిరణ్ తిరుపతి క్రైం/ కాణిపాకం: ఫేస్బుక్ పరిచయం ఆ యువతికి ప్రాణాల మీదికి తీసుకొచ్చింది.. ఫేస్ బుక్ద్వారా పరియచమైన యువకుడు ఓ యువతిని దారుణంగా హత్య చేసి చివరకు భయాందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు .. రెండు రోజుల క్రితం నగరంలోని దొడ్డాపురం వీధిలో ఏన్న ప్రైవేట్ డెంటల్ హాస్పిటల్లో దారుణ హత్యకు గురైన సంధ్య కేసులో అనుమానితుడిగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి కాణిపాకంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుభాష్‌నగర్‌కు చెందిన దొరసామిరెడ్డి లీలావతి దంపతుల కుమార్తె సంధ్య(19) దొడ్డాపురం వీధిలోని డెంటల్ ఆస్పత్రిలో హత్యకు గురైంది. ఆమె మెడకు చున్నీ వేసి హత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం డెంటల్ ఆసుపత్రి డాక్టర్ కె.వి కిశోర్ కుమార్‌రెడ్డి క్లినిక్ వచ్చి చూడగా లోపల సంధ్య మృతదేహం పడివుంది. సమాచారం అందుకున్న ఈస్ట్ పోలీసులు ఘటనను పరిశీలించి హత్య కేసును నమోదు చేశారు. ఫేస్ బుక్‌లో పరిచయమైన కిరణ్‌కుమార్‌రెడ్డి కర్ణాటక రాష్ట్రం చిక్బళ్లాపురం జిల్లా గుడిబల్ల తాలూకా ఎల్లోడు గ్రామానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి, సునందమ్మ దంపతుల కుమారుడు కిరణ్‌కుమార్‌రెడ్డి(25) బెంగళూరులో మెడికల్ రెప్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ద్వారా సంధ్య(19)తో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం కాస్త ఫోన్ నంబర్లు మార్చుకునే స్థారుుకి పెరిగింది. కొద్ది రోజులకు కిరణ్ కుమార్‌రెడ్డి తిరుపతి వచ్చి సంధ్యతో నేరుగా మాట్లాడి వెళ్లేవాడు. ఇలా తరచూ బెంగళూరు నుంచి నగరానికి వచ్చి ఆమెతో గడిపేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం సంధ్య పనిచేస్తున్న దంతవైద్య శాలకు ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం ఒక కూల్ డ్రింక్ తీసుకొచ్చి తాగారు. అనంతరం సంధ్య క్యారేజీ కొంత తిని బాగానే గడిపారు. ఇంతలో ఏమైందో ఏమో గాని సంధ్యను ఆమె చున్నీతోనే బిగించి దారుణంగా హత్య చేసి పారిపోయాడు. మరుసటి రోజు సంధ్య దారుణ హత్యకు గురైనట్లు హత్య కేసులో కీలక నిందితుడు కిరణ్‌కుమార్‌రెడ్డిగా ఉన్నట్లు వార్తలు వెలువడ్డారుు. దీన్ని చూసి భయాందోళనకు గురై గురువారం తన ద్విచక్ర వాహనంలో బెంగళూరు నుంచి పాకాలకు ఉదయం 10 గంటలకు చేరుకున్నాడు. అక్కడ స్థానికంగా ఉన్న లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. గురువారం ఉదయం 10 గంటలకు లాడ్జి వాళ్లతో మాట్లాడాడు. ఉదయం 10 గంటలకు లాడ్జి ఖాళీ చేయాల్సివుండడంతో లాడ్జి సిబ్బంది రూము తలుపులు తట్టినా కూడా తీయలేదు. కిటికీలోనుంచి చూడగా లోపల కిరణ్ కుమార్‌రెడ్డి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాణిపాకం పోలీసులు సంఘటనా స్థలానికి చేరకున్నారు. అతని చిరునామా తెలుసుకుని, అలానే తిరుపతి సంధ్య హత్య కేసులో నిందితునిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ రాంకిశోర్ పరిశీలించి మృతుడు కిరణ్‌కుమార్ రెడ్డిగా గుర్తించారు. ఫేస్బుక్లో ఇద్దరికి సంబంధించిన ఫొటోలు అందుబాటులో ఉండడంతో కిరణ్‌కుమార్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. పెళ్లికి సంధ్య నిరాకరించడంతోనే హత్యకు పాల్పడినట్టు తెలిసింది. కాణిపాకం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కాంస్యం నెగ్గిన సంధ్య
టెహ్రాన్ (ఇరాన్): ఆసియా అమెచ్యూర్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అమ్మారుు జి.సంధ్య రాణించింది. శుక్రవారం ముగిసిన ఈ టోర్నమెంట్లో సంధ్య కాంస్య పతకాన్ని సాధించింది. తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ఈ విజయవాడ అమ్మారుు 6.5 పారుుంట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఐదు గేముల్లో నెగ్గిన సంధ్య, మరో మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో ఓడిపోరుుంది. 7.5 పారుుంట్లతో లీ హొంగ్యాన్ (చైనా) స్వర్ణం... 7 పారుుంట్లతో అసాది మొతహరె (ఇరాన్) రజత పతకం సొంతం చేసుకున్నారు. -
యువతి గొంతు కోసిన ఉన్మాది
► రక్తపు మడుగులో విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచిన యువతి ► భైంసాలో పట్టపగలే దారుణం ► ప్రేమ పేరుతో వేధింపులు.. చివరకు కత్తితో దాడి ► గతంలో పెళ్లి సంబంధం చెడగొట్టిన యువకుడు వద్దన్నా ఆమె వెంటపడ్డాడు.. పెళ్లి చేసుకోవాలని బలవంతపెట్టాడు.. ఓ పెళ్లి సంబంధం చెడగొట్టాడు.. చివరికి తనకు దక్కదేమోనన్న అనుమానంతో గొంతు కోసి చంపాడు.. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో శనివారం పట్టపగలే ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉన్మాది గొంతు కోయడంతో యువతి రక్తపు మడుగులో విలవిల్లాడుతూ ప్రాణాలొదిలింది! భైంసా మండలం వాలేగాం గ్రామానికి చెందిన మారుతి, సరుబాయి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. వీరు భైంసా గోపాల్‌నగర్‌లో ఇల్లు కట్టుకున్నారు. పెద్ద కుమారుడు సారుునాథ్ పట్టణంలోని ఓ స్టీల్ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తుండగా.. రెండో కూతురు సవితకు వివాహం జరిపించారు. చిన్న కూతురు సంధ్య(18) తల్లితోపాటు బీడీలు చుడుతోంది. మారుతి చనిపోవడంతో సరుబారుు, సారుునాథ్ కుటుంబ పోషణ చూస్తున్నారు. వీరి ఇంటి ముందే లోకేశ్వరం మండలం పొట్‌పల్లికి చెందిన మహేశ్(21) తన సోదరులతో కలసి ఉంటున్నాడు. ముథోల్‌లోని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న మహేశ్.. ప్రేమ పేరుతో సంధ్యను తరచూ వేధించేవాడు. పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడేవాడు. ఏడాదిన్నర క్రితం ఆమెకు పెళ్లి సంబంధాలు చూడగా.. మహేశ్ చెడగొట్టాడు. దీనిపై సంధ్య బంధువులు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మహేశ్‌ను మందలించి వదిలేశారు. వెంట తెచ్చుకున్న కత్తితో.. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు సంధ్య ఇంటికి సమీపంలోని కిరాణం దుకాణానికి వెళ్లింది. అప్పటికే కొద్దిదూరంలోనే మహేశ్ ఆమె కోసం కాపుగాశాడు. సంధ్య రాగానే మాటల్లోకి దింపి.. వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా గొంతు కోసి పరారయ్యాడు. రక్తపుమడుగులో గిలగిలా కొట్టుకొని సంధ్య అక్కడికక్కడే మృతి చెందింది. చుట్టుపక్కలవారి అరుపులు విని ఇంట్లోంచి తల్లి పరుగెత్తుకుంటూ వచ్చేలోపే చనిపోరుుంది. మృతదేహంపై పడి తల్లి, సోదరుడు సాయినాథ్ గుండెలవిసేలా రోదించారు. డీఎస్పీ అందె రాములు, సీఐ రఘు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు మహేశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. పట్టపగలే నడిరోడ్డుపై యువతిని చంపిన ఉన్మాదిని ఉరితీయాలని మహిళా సంఘాలు, స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. -
పిడుగుపాటుకు మహిళ మృతి
- శంషాబాద్మండలం కవ్వగూడలో విషాదం శంషాబాద్(రంగారెడ్డి జిల్లా) పొలంలో పనిచేసుకుని వెళుతున్న ఇద్దరు మహిళలపై పిడుగుపడి ఒకరు మృతి చెందిన ఘటన శంషాబాద్ మండలం కవ్వగూడలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. కవ్వగూడకు చెందిన భార్గవి(28) సంధ్య (18) పొలంలో పనులు చేస్తున్నారు. మధ్యాహ్నం ఈదురుగాలులు ఉరుములతో కూడిన వర్షం మొదలు కావడంతో.. ఇంటికి వెళ్లేక్రమంలో మేడిచెట్టు వద్ద నిల్చున్నారు. ఆ సమయంలో పిడుగు పడి భార్గవి అక్కడిక్కడే మృతి చెందింది. సంధ్యకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన ఆమెను శంషాబాద్‌లోని స్థానిక ఆసుప్రతికి తరలించారు. -
తుర్కయాంజల్‌లో గృహిణి ఆత్మహత్య
వీపీఎస్ తుర్కయాంజల్- జనచైతన్యకాలనీలో ఉన్న ఓ ఇంట్లో సంధ్య అనే మహిళ శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. ఆరోగ్యం బాగా ఉండకపోవడంతోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ అర్హత నాకుందా?!
జ్ఞాపకం గుడిమెట్లు ఎక్కుతుంటే మనసులో చిన్న అలజడి మొదలైంది. మనసు భారమవ్వసాగింది. ఎందుకో అర్థం కాలేదు. అక్కడే నిలబడిపోయి చుట్టూ చూశాను. దూరంగా అమ్మ! బాగా చిక్కిపోయింది. ఏదో పిచ్చి చీర కట్టుకుంది. తననలా చూడగానే దుఃఖం పొంగుకొచ్చింది. పరిగెత్తుకుపోయి తనను వాటేసుకోవాలని, తన గుండెపై తలవాల్చి భోరున ఏడవాలని అనిపించింది. కానీ ఆ ధైర్యం చేయలేకపోయాను. ఎలా చేస్తాను? తను అలా అయిపోవడానికి కారణమే నేను. పెళ్లైన పదేళ్లకు పుట్టాను అమ్మానాన్నలకి నేను. పైగా డెలివరీ సమయంలో చాలా ఇబ్బంది అయ్యిందట. ఒక ప్రాణమే దక్కుతుంది అని డాక్టర్లు అంటే, ‘నా బిడ్డనే బతికించండి’ అందట అమ్మ. అలాంటి అమ్మని బతికుండగానే చంపేశాను నేను. ఆరోజు పురుట్లో నేనే చనిపోయినా బాగుండేదేమో. కళ్లలో పెట్టుకుని పెంచారు నన్ను. ఆడింది ఆట, పాడింది పాట. దాంతో గారం ఎక్కువైంది. ప్రతిదానికీ మారాం చేయడం అలవాటైంది. ఆ మారాం కాస్తా మొండితనమై కూర్చుంది. అందుకే, కృష్ణతో ప్రేమలో పడినప్పుడు అమ్మ వారిస్తే వినిపించుకోలేదు. ఆ అబ్బాయి గురించి ఎంక్వయిరీ చేశాను, అంత మంచివాడు కాదని తెలిసింది అని నాన్న మొత్తుకున్నా చెవికెక్కించు కోలేదు. పైగా వాళ్ల అంగీకారం లభించదని అర్థమై ఓ అర్ధరాత్రి పూట చెప్పకుండా కృష్ణ దగ్గరకు వెళ్లిపోయాను. రహస్యంగా గుళ్లో పెళ్లి చేసుకున్నాను. నాలుగు నెలల పాటు అతని ప్రేమలో మునిగి తేలాను. ఆ మత్తులో అమ్మానాన్నల్ని పూర్తిగా మర్చిపోయాను. ఓరోజు బయటకు వెళ్లి వస్తానన్న కృష్ణ ఎంతకీ తిరిగి రాలేదు. రాత్రయింది. ఉదయం అయ్యింది. మళ్లీ రాత్రి అయ్యింది. అలా ఎన్ని రాత్రులో, ఎన్ని ఉదయాలో! అతను మాత్రం రాలేదు. అతని ఫ్రెండ్స్ దగ్గర ఎంక్వయిరీ చేస్తే... ఇంట్లో చూసిన సంబంధం చేసుకుని విదేశాలకు వెళ్లిపోయాడని తెలిసింది. నాతో పెళ్లయిన సంగతి ఎవరికీ చెప్పనేలేదని అర్థమైంది. మోసపోయాను. ఎవరికీ ముఖం చూపించలేకపోయాను. స్నేహితుల దగ్గర చిన్నబోయాను. చివరికి అమ్మానాన్నలు ఎదురుపడినా పలకరించే అవకాశం లేకుండా చేసుకున్నాను. ప్రేమలో పడి చదువు కూడా మధ్యలోనే ఆపేశానేమో, మంచి ఉద్యోగం కూడా దొరకలేదు. ఓ చిన్న స్కూల్లో టీచరుగా పని చేస్తూ కడుపు నింపుకుంటున్నాను. అమ్మానాన్నల దగ్గరకు వెళ్తే ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. కానీ ఆ పని చేసే ధైర్యం మాత్రం లేదు. అంత అర్హతా లేదు. అమ్మానాన్నల అనురాగాన్ని కాలదన్నుకుని వెళ్లిపోయే ఏ అమ్మాయికి ఆ అర్హత ఉంటుంది చెప్పండి! - సంధ్య, తెనాలి -
ఎడ్లను అమ్ముకుని...
ప్రేమోన్మాది దాడిలో గాయపడిన సంధ్య కుటుంబం దీనగాథ ♦ ఆస్పత్రి ఖర్చుల కోసం జీవనాధారం విక్రయం ♦ తమ ఊరి నుంచి ఖమ్మంకు వెళ్లేందుకూ డబ్బులేని వైనం ♦ ఊరిలో అప్పు చేసి ఆస్పత్రికి వెళ్లిన కుటుంబసభ్యులు ♦ నిందితుడు శేఖర్‌ను అరెస్టు చేసిన పోలీసులు మంగపేట, ఇల్లందు : ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన తమ కుమార్తె సంధ్యను రక్షించుకొనేందుకు ఆమె కుటుంబం జీవనాధారమైన ఎడ్లను అమ్ముకుంది. ఆ సొమ్మును తీసుకుని ఆస్పత్రికి వచ్చింది. తమ బిడ్డ పరిస్థితిని చూసి కన్నీరుమున్నీరవుతోంది. శుక్రవారం ఖమ్మం జిల్లా ఇల్లెందులో డిగ్రీ విద్యార్థిని సంధ్య తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో శేఖర్ అనే యువకుడు లారీ కిందకు తోసేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన సంధ్యను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. బాధితురాలు సంధ్య వరంగల్ జిల్లా మంగపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన బడి గోవిందరావు, చంద్రమ్మ దంపతుల కుమార్తె. కనీసం వైద్యం చేయించలేని నిరుపేద గిరిజన కుటుంబం వారిది. తమ ఊరి నుంచి ఖమ్మం ఆస్పత్రికి వెళ్లేందుకు చార్జీలకు కూడా డబ్బు లేకపోవడంతో... తెలిసిన వారి వద్ద అప్పు చేశారు. కానీ ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులేని పరిస్థితి. దీంతో సంధ్య బావ బొగ్గం సురేందర్ శనివారం తన రెండు ఎడ్లను రూ.30 వేలకు అమ్మేసి... ఆస్పత్రి ఖర్చులకోసం తీసుకువచ్చాడు. కాగా సంధ్యను లారీ కిందకు తోసేసిన శేఖర్‌ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. సంధ్యపై దాడికి పాల్పడినది జూలూరుపాడు మండలం సత్యనారాయణ గ్రామానికి చెందిన ఈసం శేఖర్ అని డీఎస్పీ వీరేశ్వర్‌రావు వెల్లడించారు. దాడికి పాల్పడ్డ అనంతరం శేఖర్ కొరగుట్ట అటవీ ప్రాంతంలోని రహదారుల మీదుగా కాలినడకన ఇల్లెందుకు చేరుకున్నాడని.. మళ్లీ అదేరోడ్డు ద్వారా ఆటోలో తన గ్రామానికి వెళ్లిపోయాడని చెప్పారు. ఎడ్లను అమ్ముకున్నాం.. ఎన్నో ఆశలతో నా బిడ్డను పైచదువుల కోసం పంపాను. ఆమెను ఓ ప్రేమోన్మాది లారీ కిందకు తోసివేసినట్లు తెలిసి వణికిపోయాం. బిడ్డకు వైద్యం కోసం బిడ్డల్లాంటి ఎడ్లను అమ్ముకున్నాం. శేఖర్లాంటి రాక్షసుల్ని కఠినంగా శిక్షించాలి. ప్రేమ అంటూ ఆడపిల్లల వెంటపడే వారందరికీ అదొక హెచ్చరికలా ఉండాలి. - బడి గోవిందయ్య, సంధ్య తండ్రి ఈ బాధ మరెవరికీ రావద్దు నేను ఖమ్మం డిగ్రీ కాలేజీలో బీజెడ్సీ ఫైనలియర్ చదువుతూ సెల్ఫ్ మేనేజ్డ్ హాస్టల్లో ఉంటున్నా. మూడేళ్లుగా క్లాస్మేట్ కృష్ణవేణి కూడా మా హాస్టల్లోనే ఉంటోంది. ఆమెకు వరుసకు తమ్ముడైన శేఖర్ అప్పుడప్పుడు హాస్టల్ వద్దకు వచ్చేవాడు. కొన్ని రోజులయ్యాక నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. నేను నిరాకరించా ను. తర్వాత చాలాకాలం అతను నాకు కనిపించలేదు. మళ్లీ రెండు నెలలుగా వెంటపడుతున్నాడు. శుక్రవారం కాలేజీ నుంచి హాస్టల్‌కు వెళుతుండగా శేఖర్ వచ్చాడు. తనను ఎందు కు ప్రేమించడం లేదో చెప్పాలంటూ నా చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు. ఒక్కసారిగా కోపంతో నా చేతుల్ని విడిపించుకొని హాస్టల్ వైపు వెళుతున్నా. అంతే.. వెనకాలే వస్తున్న శేఖర్ నన్ను లారీ కిందకు తోసేశాడు. లారీ డ్రైవర్ అది చూసి వేగాన్ని తగ్గించాడు. లేకుంటే నేను ఆ లారీకిందే చనిపోయేదాన్ని. తలకు, ముఖానికి దెబ్బలు తగలడంతో షాక్‌లో స్పృహ తప్పిపడిపోయా.. ఇక అక్కడ ఏం జరిగిందో గుర్తులేదు. స్పృహలోకి వచ్చాక చూస్తే ఆస్పత్రిలో ఉన్నా. నాకు ఎదురైన ఇలాంటి భయంకరమైన సంఘటన మరెవరికీ రావద్దు. నన్ను చంపాలనుకున్న శేఖర్‌ను కఠినంగా శిక్షించాలి.. - బాధితురాలు బడి సంధ్య -
బాలుడి కిడ్నాప్ నకు యత్నం.. మహిళ అరెస్ట్
కోల్‌సిటీ-గోదావరిఖని: అప్పుడే పుట్టిన బాలుణ్ని అపహరించేందుకు ప్రయత్నించిన మహిళను బంధువులు, ఆస్పత్రి సిబ్బంది కలిసి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో బుధవారం జరిగింది. వివరాలు.. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం దానపల్లి గ్రామానికి చెందిన రాజలింగం భార్య సంధ్య రెండో కాన్పులో బాలుడికి జన్మనిచ్చింది. కాగా, ఆపరేషన్ అనంతరం సంధ్యను వేరే గదికి తరలిస్తుండగా బాలుడిని సంధ్య వాళ్ల అత్త కిట్టమ్మ పట్టుకుంది. అయితే.. రామగుండం మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన ఒక మహిళ ఆశ వర్కర్‌గా కిట్టమ్మను పరిచయం చేసుకుంది. బాలుడు పుట్టినందుకు రూ.10వేలు వస్తాయని నమ్మించింది. బాలుడిని సార్‌కు చూపిస్తానని చెప్పి కిట్టమ్మ దగ్గర నుంచి తీసుకుంది. ఈ క్రమంలోనే ఆ మహిళ బాలుడిని తీసుకొని పరుగెత్తసాగింది. అనుమానం వచ్చిన బంధువులు ఆమెను పట్టుకొని ఆస్పత్రి సిబ్బంది దగ్గరకు తీసుకెళ్లారు. కాగా, ఆస్పత్రి సిబ్బంది ఆమె ఆశ వర్కర్ కాదని తేల్చడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మహిళను అదుపులోకి తీసుకొని విచారించగా, ఇద్దరు వ్యక్తుల ప్రోద్బలంతోనే తాను ఈ పని చేశానని తెలిపింది. -
జర్నలిజం వదిలేయమని చెప్పా...
భోపాల్: ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మైనింగ్, ల్యాండ్ మాఫియా ఆగడాలకు బలైన జర్నలిస్టుల ఉదంతాలు మీడియా స్వేచ్ఛను మరోసారి చర్చనీయాంశంగా మార్చాయి. దేశంలో జర్నలిస్టులపై పెరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తమ అవినీతి చరిత్రను బట్టబయలు చేస్తున్న విలేకరులపై విచక్షణ రహితంగా దాడులు చేసి హతమారుస్తున్నారు. ఓపక్క ఉత్తరప్రదేశ్‌లో జోగిందర్ సింగ్ అనే జర్నలిస్టును హతమార్చిన ఘటనపై పోలీసులు విచారణ జరుపుతుండగానే.. మధ్యప్రదేశ్ కు చెందిన విలేకరి సందీప్ కొఠారి (44) హత్య కలకలం రేపింది. ఈనెల 19 నుంచి కనిపించకుండా పోయిన సందీప్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలోని ఓ అటవీ ప్రాంతంలో శవమై తేలడంతో మరో జర్నలిస్టు కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఏం నేరం చేశాడని తన సోదరుడిని హతమార్చారని సందీప్ కొఠారియా సోదరి సంధ్య ప్రశ్నిస్తున్నారు. ''జర్నలిజం వదిలేయ్... లేకపోతే చంపేస్తారని అన్నకు చాలా సార్లు చెప్పాను. అయినా అన్నయ్య లక్ష్యపెట్టలేదు. చివరకు ల్యాండ్ మాఫియా అక్రమాలకు అన్నయ్య బలైపోయాడు'' అంటూ సందీప్ కొఠారి సోదరి సంధ్య వాపోయారు. తన సోదరుడు నేరస్తుడు కాదని, ఎవ్వరూ చేయనంత సాహసం చేసి ఎన్నో అక్రమాలకు వెలుగులోకి తీసుకొచ్చాడని తెలిపారు. అతనిపై ఎన్నో అక్రమ కేసులు బనాయించి, వేధించి చివరికి ప్రాణాలు తీశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 25 కేసులు నమోదు చేశారని 17 నెలలు జైల్లో పెట్టారని ఆరోపించారు. ల్యాండ్ మాఫియాకు వ్యతిరేకంగా పని చేసినందుకు తమ కుటుంబానికి మంచి మూల్యం లభించిందని సందీప్ సోదరుడు రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రాణం తీసిన సరదా
చీటకోడూరు రిజర్వాయర్ కాల్వలోకి దిగిన విద్యార్థిని మృతి వడ్లకొండ, మరిగడి గ్రామాల్లో విషాద ఛాయలు జనగామ రూరల్ : సరదా కోసం వెళ్లిన ఓ డిగ్రీ విద్యార్థిని రిజర్వాయర్‌లో పడి మృతిచెందిన సంఘటన జనగామ మండలంలోని చీటకోడూరు గ్రామం వద్ద గురువారం జరిగింది. వడ్లకొండ గ్రామానికి చెందిన చిలుక సంధ్య(18) జనగామలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బీకాం సెకండియర్ చదువుతోంది. ఈమె శామీర్‌పేట గ్రామానికి చెందిన తన స్నేహితురాలు సృజన కుటుంబంతో కలుపుగోలుగా ఉండేది. ఈ క్రమంలో సృజన తల్లి ఏస్తేరు, సోదరుడు సిరోలు జనగామలో బ్యాంక్ పనులు చూసుకుని వడ్లకొండలోని సంధ్య ఇంటికి వెళ్లారు. అక్కడ కొద్దిసేపు మాట్లాడక సరదాగా చీటకోడూరు రిజర్వాయర్ వద్దకు వెళ్లాలని నిశ్చయించుకుని బైక్‌పై వెళ్లారు. డిగ్రీ పరీక్షలు దగ్గరపడ్డాయి చదువుకోవచ్చనే ఉద్దేశంతో సంధ్య పుస్తకాలు కూడా వెంట తీసుకెళ్లింది. చీటకోడూరు రిజర్వాయర్‌కు వచ్చే నీటి కాల్వ వద్ద కూర్చొని మాట్లాడుతుండగా కొద్దిసేపటికి సంధ్య కాల్వ లోతును గమనించకుండానే దిగింది. కాల్వలోకి అడుగుపెట్టగానే ఒక్కసారిగా సంధ్య అందులో మునిగిపోయింది. దీంతో ఆమెను రక్షించేందుకు ఏస్తేరు ప్రయత్నించగా ఆమె కూడా కాల్వలోకి కూరుకుపోయింది. ఇది గమనించిన సిరోలు తన తల్లి ఏస్తేరును బయటకు లాగాడు. సంధ్యను బయటకు తీసేందుకు అతడితోపాటు అక్కడే ఉన్న మరికొందరు కాల్వలోకి దూకినప్పటికీ ఫలితం లేకుండా పోరుుంది. అప్పటికే సంధ్య గల్లంతైంది. సమాచారం తెలుసుకున్న సంధ్య బంధువులు, వడ్లకొండ, చీటకోడూరు గ్రామాల సర్పంచ్‌లు ఎల్లబోయిన ఎల్లమ్మ, కొమురయ్య, కొర్నెపాక లక్ష్మి, ఉపేందర్ అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. గజ ఈతగాళ్ల సాయంతో సంధ్య మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని చూసిన బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నాడు తల్లిదండ్రులు.. నేడు కూతురు మృతి మరిగడి గ్రామానికి చెందిన చిలుక మల్లయ్య, కమలమ్మ దంపతులకు కూతుర్లు రేణుక, సంధ్య ఉన్నారు.పదేళ్ల క్రితం అనారోగ్యంతో కొమురయ్య, కొన్నేళ్ల క్రితం తల్లి కమలమ్మ మృతిచెందింది. దీంతో వడ్లకొండ గ్రామంలోని మేనమామ అయిన గుండె రత్నం ఇంట్లో ఉంటూ సంధ్య చదువు కొనసాగిస్తుంది. నాడు తల్లిదండ్రులు, నేడు కూతురు మృతితో వడ్లకొండలో, మరిగడి గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
వైద్యురాలి నిర్లక్ష్యంతో పసికందు మృతి
మంచిర్యాల టౌన్ : మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన గట్టు సంధ్య తొమ్మిది నెలల గర్భిణి. డిసెంబర్ 30వ తేదీన నొప్పులు తీవ్రం కావడంతో భర్త రాజ్‌కుమార్, తన సోదరి లావణ్యతో కలిసి ప్రసవం కోసం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. అయితే.. ప్రసూతి వైద్యురాలు పద్మజ అందుబాటులో ఉండడంతో ఆమెను పరీక్షించి ప్రమాదం ఏమీ లేదని చెప్పింది. 31న (బుధవారం) రాత్రి 3 గంటల ప్రాంతంలో సంధ్యకు తిరిగి నొప్పులు తీవ్రమయ్యాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. వారు వైద్యురాలికి సమాచారం ఇచ్చినా ఆమె కనీసం ఆస్పత్రికి రాలేదు. గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో వచ్చి.. ప్రసవం సాఫీగా జరగాలంటే ఆపరేషన్ చేయాలని.. అందుకు తనకు రూ.4 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో చేసేదేం లేక వారు ఆమెకు రూ.4 వేలు ఇచ్చారు. అయితే.. ఆపరేషన్ చేస్తున్న సమయంలో గర్భసంచి పగిలిపోయి కడుపులోని శిశువు మృతిచెందింది. తదుపరి సంధ్యకు తీవ్ర రక్తస్రావమైంది. శిశువు మృతిచెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వైద్యురాలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతిచెందిందని నిలదీశారు. ఈ మేరకు వైద్యురాలిపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాగా.. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీకంఠేశ్వర్రావును వివరణ కోరగా డబ్బులు అడిగినట్లు ఆధారాలు లేవని, వారు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారని, ఈ మేరకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అప్పటి వరకు డాక్టర్ పద్మజ డిప్యుటేషన్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. -
కార్మికుల శ్రమ దోపిడీకే ‘మేకిన్ ఇండియా’
జవహర్‌నగర్: కార్మికుల శ్రమను దోచిపెట్టేందుకే ప్రధాన మంత్రి మోదీ ‘మేకిన్ ఇండియా’ అంటున్నారని, చట్టాల సవరణకు వ్యతిరేకంగా కార్మికులు పోరాడాలని ప్రగతిశీల మహిళా సంఘం తెలంగాణ అధ్యక్షురాలు సంధ్య పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం బాలాజీనగర్‌లో భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టూ) ఆధ్వర్యంలో కార్మిక చట్టాల సవరణలను, ఎఫ్‌డీఐల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంధ్య మాట్లాడుతూ.. తెల్లదొరల కాలంలోనే దేశంలోని కార్మికవర్గం ఉద్యమాలు చేసి చట్టాలను సాధించిందన్నారు. కార్మిక చట్టాల అడ్డు తొలగించుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం తీవ్రంగా యత్నిం స్తోందని.. దీనిని కార్మికులంతా అడ్డుకోవల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాన మంత్రి మోదీ విదేశాలలో సమావేశాలు నిర్వహిస్తూ ఇండియాలో కార్మిక చట్టాన్ని రద్దు చేయాలని చెప్పడం విచారకరమన్నారు. కార్మికుల శ్రమను దోచిపెట్టడానికే మోదీ మేకిన్ ఇండియా నినాదం ఎత్తుకున్నారని ఆమె దుయ్యబట్టారు. డిసెంబర్ 5న హైదరాబాద్‌లో నిర్వహించే కార్మిక ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇప్టూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.నరేందర్, జంటనగరాల ఉపాధ్యక్షుడు సీహెచ్ బాలనర్సింహ, జిల్లా నాయకులు జయసుధ, వెంకన్న,రామిరెడ్డి, అరుణోదయ జిల్లా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. -
పడి లేచి... లేచి పడిన జయ
అక్రమ ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితా దోషిగా తేలింది. హీరోయిన్గా అటు చలన చిత్రసీమలో, ఏఐఏడీఎంకే పార్టీ అధ్యక్షరాలిగా ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఇటు రాజకీయాలలో తనదైన ప్రముఖ పాత్ర పోషించిన జయలలిత జీవితంపై చిన్న కథనం.... నాటి మైసూర్ రాష్ట్రంలోని మాండ్యా జిల్లా పండవపురా తాలుకాలోని మెల్కొటేలో 1948 ఫిబ్రవరి 24న జన్మించింది. ఆమె తల్లిదండ్రులు జయరాం, వేదవల్లి (సంధ్య)లు. సంధ్య పాత చిత్రాలలో ప్రముఖ నటిగా పేరు పొందారు. జయరాం తాతగారు మైసూర్ సామ్రాజ్యంలో వైద్యునిగా పని చేశారు. జయలలిత రెండేళ్ల వయస్సులోనే తండ్రి జయరాం మరణించారు. దీంతో ఆమె బెంగళూరులోని తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకుంది. చెన్నై కేంద్రంగా ఉన్న తమిళ చిత్రాలలో నటించడం ప్రారంభించింది. ఆ సమయంలో వేదవల్లి తన పేరును సంధ్యగా మార్చుకుంది. ఇక జయలలిత చెన్నైలోని సేక్క్రేడ్ హార్ట్ మెట్రిక్యూలేషన్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించింది. అనంతరం జయలలిత చదువులో ప్రతిభ పాటవాలు కనబర్చడంతో ఆమెకు ప్రభుత్వం స్కాలర్షిప్ మంజూరు చేసింది. మరోవైపు తల్లి నటిస్తున్న చిత్రాలలో జయలలిత కూడా నటిస్తుండేంది. అయితే ఆమె చదువుకు ఎటువంటి ఆటంకం ఏర్పడకుండా దర్శకుల వద్ద ముందస్తుగా అనుమతి తీసుకుని నటింప చేసేది. ఆ క్రమంలో ఆమె నటించిన ఈపిస్ట్లీ అనే ఇంగ్లీషు చిత్రం 1961లో విడుదలైంది. హీరోయిన్గా కన్నడంలో మొట్టమొదట నటించిన చిత్రం చిన్నదా గంబి. ఈ చిత్రం 1964లో విడుదలైంది. ఆ తర్వాత ఏడాది తమిళంలో విడుదలైన వెన్నెరా అదాయి చిత్రంలో నటించారు. అదే ఏడాది తెలుగులో వచ్చిన మనషులు మమతలులో నటించారు. అలా ఆమె తెలుగు, తమిళ, కన్నడ భాషలో దాదాపు 140 చిత్రాలలో నటించారు. ఆమె జాతీయ అవార్డ్‌తోపాటు పలు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు. 1977లో ఎంజీ రామ్‌చంద్రన్ తమిళనాడుకు మఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1982లో ఏఐఏడీఎంకే పార్టీలో చేరారు. 1983లో తిరుచండుర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. కానీ 1984లో ఆమెను పార్టీ తరపున రాజ్యసభకు ఎంపిక చేశారు. దాంతో ఆమె ఏఐఏడీఎంకే తరఫున రాజ్యసభలో అడుగు పెట్టారు. అంతేకాదు సభలో ఆ పార్టీకి ఓ విధమైన గుర్తింపు తీసుకువచ్చారు. 1987లో రామచంద్రన్ మరణించారు. దీంతో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. మొదటి వర్గానికి రామచంద్రన్ భార్య జానకీ రామచంద్రన్ నేతృత్వం వహించారు. రెండో వర్గానికి జయలలిత సారథ్యం వహించారు. కాగా జనకీకి ఆ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. దీంతో ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఆ మె ప్రభుత్వాన్ని అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం రద్దు చేసింది. 1989లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. 1989లో బొడినాయకన్నూర్ నుంచి ఏఐఏడీఎంకే తరపున శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆమె నేతృత్వంలోని పార్టీ 27 స్థానాలను కైవసం చేసుకుంది. సభలో మొట్టమొదటి ప్రతిపక్ష నేతగా రికార్డు సృష్టించారు. 1991లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఏఐఏడీఎంకే పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు 225 స్థానాలను కైవసం చేసుకుంది. ( రాజీవ్ గాంధీ హత్య అనంతరం జరిగిన ఎన్నికలు) .ఈ సమయలో ఆమె ఆదాయానికి మించిని ఆస్తులు సంపాదించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 1996లో జరిగిన ఎన్నికల్లో ఆమె కేవలం నాలుగు సీట్లను మాత్రమే కైవసం చేసుకుంది. 2001లో మళ్లీ జయలలిత ముఖ్యమంత్రి అయింది. ఇంతలో అవినీతి ఆరోపణలు నేపథ్యంలో ఆమె పదవి నుంచి తప్పుకుని... ఆ స్థానంలో మంత్రివర్గంలోని ఓ పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రిగా నియమించింది. 2011లో ముచ్చటగా మూడో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టింది. ఈ క్రమంలో పేద, మధ్య తరగతి వర్గాల వారి మనసులు చోరగోనేందుకు 'అమ్మ' పేరిట పలు సంక్షేమ పథకాలు చేపట్టింది. కానీ ఇంతలో బెంగళూరు కోర్టు జయలలితను దోషిగా నిర్థారించింది. -
అరుణోదయం
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ఐదవ మహాసభలు పురస్కరించుకొని స్థానిక ఏబీఎం జూనియర్ కాలేజీ నుంచి కళాకారులు మహా ప్రదర్శనగా బయలుదేరారు. అక్కడ నుంచి కలెక్టర్ బంగ్లారోడ్డు, చర్చి సెంటర్, ప్రకాశం భవనం, నెల్లూరు బస్టాండు మీదుగా మిరియాలపాలెం సెంటర్, ట్రంకురోడ్డు, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, అద్దంకి బస్టాండు, ఆర్టీసీ బస్టాండు మీదుగా సభా వేదికైన హెచ్‌సీఎం జూనియర్ కాలేజీ వరకు ర్యాలీ చేపట్టారు. ఆంధ్రతో పాటు తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపు వెయ్యి మంది కళాకారులు ఉత్తేజం రేకెత్తించారు. గజ్జె కట్టడం, కోలాటం, గొంగడి నాట్యం, కాళ్లకు రింగులతో గారడీ నృత్యం, కోయ కళాకారుల విన్యాసాలు, డప్పు కళాకారులు, కాటి కాపరులు విశేషంగా ఆకట్టుకున్నారు. ముందు వరుసలో పీఓడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బీ రమాసుందరి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, అరుణోదయ రాష్ట్ర నాయకులు సీహెచ్ జాలన్న, ఎం. వేణు, అరుణోదయ అంజయ్య నుంచొని ఉత్సాహం నింపారు. కళా ప్రదర్శనలు భళా.. సభా వేదిక ఏర్పాటు చేసిన హెచ్‌సీఎం జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లోని గాండ్ల వెంకట్రావు నగర్ (ప్రాంగణం)లో నిర్వహించిన కళాప్రదర్శనలను భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు తిలకించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుబ్బారావు, పాణిగ్రాహి వారసుడు సుబ్బారావు బృందం ప్రదర్శించిన ‘జముకల కథ’ ఆకట్టుకుంది. శ్రీకాకుళం జిల్లా రైతాంగ పోరాటం, మన్నేకల్లి గ్రామంలో జరిగిన ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. తూర్పుగోదావరి జిల్లా కందులపాలేనికి చెందిన గారడి బృందం ప్రదర్శన అలరించింది. ‘ఆడపిల్లవని బాధపడకూ’ అంటూ నేటి రోజుల్లో ఆడపిల్లల వెతలకు నృత్య రూపకం ఇచ్చారు. వరంగల్ జిల్లా కొత్తగూడెంకు చెందిన కోయ కళాకారులు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన డప్పు దళం, అదే జిల్లాకు చెందినవారి కోలాటం, సంతనూతలపాడు మండలం మద్దులూరుకు చెందిన బాలికల కోలాట ప్రదర్శనలకు హర్షధ్వానాలు మిన్నంటాయి. అరుణోదయ అంజయ్య ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నీయలో’ విశేషంగా ఆకట్టుకుంది. నాటి నక్సల్బరి నుంచి నేటి గోదావరి పోరాటం వరకు జరిగిన పోరాటాల్లో అమరులకు జోహార్లు అర్పిస్తూ చేసిన ప్రదర్శన చలించేలా చేసింది. హైదరాబాద్‌కు చెందిన కళాకారుల నృత్య రూపకంలోని ‘బతుకమ్మ’ పండగలో సంధ్య కూడా జత కలిశారు. ప్రజా గాయకురాలు చైతన్య సమకాలీన అంశాలపై గీతం ఆలపించారు. సినీనటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి, ప్రముఖ కవి, కళాకారుడు గొరటి వెంకన్నలు ఆసక్తిగా తిలకించారు. -
ఆ బాధ నన్నెప్పటికీ వదలదేమో!
అవి నేను జూనియర్ కాలేజీలో చదివే రోజులు... నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే రెండో సంవత్సరం చదువుతోన్న ఓ అబ్బాయి నాకు ప్రపోజ్ చేశాడు. నేను ఓకే చెప్పేద్దామనుకునేంతలో నా స్నేహితురాలు సంధ్య నా దగ్గరకు వచ్చింది. నన్ను ఇష్టపడుతోన్న అబ్బాయికి సంధ్య చుట్టం. అందుకే తన దగ్గర నేను ఆ అబ్బాయి గురించి మాట్లాడేదాన్ని కాదు. కానీ ఆ రోజు తనే నా దగ్గర తన గురించి ప్రస్తావించింది. ‘తను నీకు ప్రపోజ్ చేసిన విషయం నాకు తెలుసు, కానీ ఒప్పుకోవద్దు, తనకు చిన్నప్పుడే పెళ్లయిపోయింది’ అని చెప్పింది. నేను షాకైపోయాను. అలా ఎలా జరిగిందని ప్రశ్నించాను. చిన్నప్పుడే కొన్ని పరిస్థితుల్లో ఆ అబ్బాయికి తన మరదలితో పెళ్లి జరిగిందట. పిల్లలు పెద్దయ్యేవరకూ కావాలని దూరంగా పెట్టారట పెద్దలు... అంటూ జరిగినదంతా చెప్పింది సంధ్య. నాకు మతి పోయింది... విషయం తెలిశాక కూడా అడుగు వేయడం తప్పు కాబట్టి నా మనసులో నుంచి వెంటనే ఆ ఆలోచన తీసేశాను. ఆ రోజు నుంచీ అతడి వైపు చూసేదాన్ని కాదు. అతడు మాట్లాడాలని ప్రయత్నించినా స్పందించేదాన్నీ కాదు. అది తెలిసీ తెలియని వయసు కావడం వల్ల తనని త్వరగానే మర్చిపోయాను. కానీ తను మాత్రం నన్ను మర్చిపోలేదు. దాదాపు నా డిగ్రీ పూర్తయ్యేవరకూ కూడా నా వెంట పడుతూనే ఉండేవాడు. నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తూనే ఉండేవాడు. కానీ ఏ ఒక్కరోజూ నేను తనకి అవకాశం ఇవ్వలేదు. డిగ్రీ పూర్తవ్వగానే నాన్నగారు చూసిన వ్యక్తితో తాళి కట్టించుకుని, కాపురానికి వెళ్లిపోయాను. ఆ తర్వాత రెండు నెలలకు సంధ్య నుంచి ఫోన్ వచ్చింది. నా గొంతు వినగానే చాలాసేపు ఏడుస్తూనే ఉంది. తర్వాత చెప్పింది... ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడని. నివ్వెరపోయాను. నేనేదో అనబోతుండగా ‘క్షమించు రాధా... ఇదంతా నావల్లే జరిగింది’ అంది సంధ్య. అలా ఎందుకందో తెలిశాక నేను మామూలుగా షాకవ్వలేదు. ఆ అబ్బాయికి చిన్నప్పుడు పెళ్లి కాలేదట. అదంతా అబద్ధమట. తనకు అతనంటే ఇష్టమట. అతనికి నేనంటే ఇష్టం కాబట్టి మా ఇద్దరినీ కలవనివ్వకుండా చేసేందుకే అలా చేశానని చెప్పింది. మౌనంగా ఫోన్ పెట్టేశాను. అపరాధభావం దహించివేసింది. సంధ్య చెప్పిన ఒక్క మాటతో అతన్ని దూరంగా నెట్టేశాను. ఒక్కసారైనా అతడికి మాట్లాడే అవకాశం ఇచ్చివుంటే బాగుండేది. నా మౌనం అతడి మనసును కాల్చేసి ఉంటుంది. నా పెళ్లి అతడి మనసును ముక్కలు చేసుంటుంది. అందుకే ప్రాణాలు తీసుకున్నాడు. పాతికేళ్లు గడచిపోయినా ఈ విషయం నన్ను వేధిస్తూనే ఉంటుంది. అతను నాకు ప్రపోజ్ చేయడం, సంధ్య నాకు ఫోన్ చేయడం గుర్తుకొస్తూ, నన్ను అశాంతికి గురి చేస్తుంటాయి. - లక్ష్మీకళ్యాణి, నూజివీడు -
మాకు దిక్కెవరు నాన్నా
వీరజవాను అంతిమ యాత్రలో తల్లి హృదయ వేదన మదనపల్లె/ మదనపల్లె క్రైం: ‘మీ నాన్న మనల్ని అందరికన్నా ముందు వదిలేసి వెళ్లిపోయాడు. 13 సంవత్సరాలుగా ఈ కుటుంబానికి నువ్వే పెద్దదిక్కుగా ఉన్నాయి.. ఇప్పుడు ఆ దేవుడు నిన్ను కూడా తీసుకెళ్లాడా నాన్నా..? ఇక మాకు దిక్కెవర్రా భాను.. ఆ దేవుడు ఎంత అన్యాయం చేశాడో చూడండి.. నాలుగు రోజుల క్రితం ఫోన్‌చేసి మా బెటాలియన్‌లో నాకు ఉత్తమ అవార్డు వచ్చిందమ్మా.. ఇంటికొచ్చినప్పుడు తీసుకొచ్చి చూపిస్తానని చెప్పావు కదరా.. ఇప్పుడు శవమై వచ్చావా తండ్రీ.. ఇంతలోనే మమ్మల్ని అన్యాయం చేసి వెళ్లావా..కొడుకా.. మాకు ఎందుకింత దుఃఖాన్ని మిగిల్చావురా నాన్నా..’ అంటూ వీరజవాను వాకా భానుప్రకాష్ తల్లి నిర్మల గుండెలవిసేలా రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. మిలిటరీలోనే చనిపోతే చిరునవ్వుతో సాగనంపండి ‘దేశ రక్షణ కోసం సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్నా.. ఒకవేళ మిలిటరీలోనే చనిపోతే నన్ను చిరునవ్వుతో సాగనంపండి’ అంటూ భానుప్రకాష్ కుటుంబ సభ్యులతో అన్న మాటలు నిజమయ్యాయి. మరో 121 రోజుల్లో రిటైర్మెంట్ ప్రకటించి స్వగ్రామానికి వచ్చేయాల్సిన ఆయనను విధి వెక్కిరించింది. ఉదయాన్నే విధులకు వెళ్లిన భాను శిబిరానికి చేరేలోపు మృత్యువాత పడ్డాడు. ఈయన తాత వాకా లక్ష్మీనారాయణ వైఎస్సార్ జిల్లాలో సబ్‌కలెక్టర్‌గా పనిచేసేవాడు. తండ్రి వాకా రామ్మోహన్ 30 ఏళ్లక్రితం మదనపల్లెకు చెందిన నిర్మలను వివాహం చేసుకుని ఇక్కడికే కాపురం వచ్చేశాడు. రామ్మోహన్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేవాడు. నిర్మల ప్రైవేటు టీచర్‌గా పనిచేసేది. వీరికి కుమారుడు వాకా భానుప్రకాష్, కుమార్తె భవ్య పిల్లలు. వాకా భానుప్రకాష్‌కు చిన్ననాటినుండే దేశభక్తి ఎక్కువ. స్కూల్, కళాశాలలో ఎన్సీసీలో చేరి సేవ చేసేవాడు. డిగ్రీ వరకు చదివాడు. సైన్యం లో చేరాలనే ఆశతో ప్రవేశ పరీక్షలు రాసి, 1998లో మిలిటరీలో చేరాడు. విధుల్లో చేరిన నాలుగేళ్లకు తండ్రి రామ్మోహన్ అనారోగ్య కారణంగా మృతి చెందాడు. అప్పటి నుంచి భానుప్రకాష్ ఇంటికి పెద్దదిక్కుగా ఉన్నాడు. తనపై ఉన్న బాధ్యతతో చెల్లెలికి పెళ్లిచేశాడు. తర్వాత 2009లో కర్ణాటకకు చెందిన సంధ్యను వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు వాకా సాయిపార్థ్దీవ్(3) ఉన్నాడు. బిడ్డకు దిక్కెవరు భాను నీవేమో దేశం కోసం ప్రాణాలు వదిలావు.. ఇక నాకు, బిడ్డకు దిక్కెవ్వరు భాను అంటూ భార్య సంధ్య రోదించడం పలువురిని కదిలించింది. విధులకు వెళ్లేపుడు రైల్వే స్టేషన్ దాటేవరకు పరుగెడుతూ నిన్ను సాగునంపుతుంటినే.. బిడ్డను చూసి ఎంతో మురిసిపోయేవాడివే.. సెలవులకు వచ్చిననాటి నుండి బండిలో తిప్పేవాడివి.. ఇక నా బండి నీకేరా నాయనా అనే వాడివే.. ఇక వాడ్ని ఎలా పెంచాలి చెప్పురా దేవుడా.. అంటూ సంధ్య రోదిస్తూ పలుమార్లు స్పృహ కోల్పోయింది. ఆరోజు బయల్దేరకున్నా ఈరోజు నీవు మాకు దక్కేవాడివేమో ఎంత పనిచేశావు భాను అంటూ ఆమె భర్తకు కన్నీటి వీడ్కోలు పలికింది. ముక్కు పచ్చలారని భాను కుమారుడు వాకా సాయిపార్థీవ్ తల్లి, నాన్నమ్మ, బాబాయ్, పిన్ని, అత్త, మామ, పెద్దోళ్లంతా ఎందుకేడుస్తున్నారో తెలియక బిక్కముఖం వేసుకుని చూస్తుండిపోయాడు. వచ్చినవారంతా ఆ బిడ్డను చూసి కన్నీళ్లు ఆపుకోలేక పోయారు. ప్రభుత్వమే అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్‌తిప్పారెడ్డి వీరజవాను మృతదేహానికి ఘన నివాళి అర్పించారు. ఎమ్మెల్యే స్వయానా డాక్టర్కావడంతో పీఎం రిపోర్టును పరిశీలించారు. మృతుడి తల్లి, భార్య, చెల్లెలిని ఓదార్చారు. సబ్‌కలెక్టర్ డాక్టర్ నారాయణ్‌భరత్‌గుప్తా, డీఎస్పీ కే.రాఘవరెడ్డి జవాను మృతదేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘన నివాళులు అర్పించారు. బీజేపీ జాతీయ నాయకులు చల్లపల్లె నరసింహా రెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ కల్నల్ కేజేఎం రాయ్, మదనపల్లె మున్సిపల్ చైర్మన్ కొడవలి శివప్రసాద్, వైస్ చైర్మన్ భవానీప్రసాద్, మాజీ చైర్మన్ డాక్టర్ ఎన్.రవికుమార్, సీఐలు శివన్న, చంద్రశేఖర్, రూరల్ ఎస్ఐ రవిప్రకాష్‌రెడ్డి, మృతుడి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
ఓపెన్‌కాస్ట్‌ల విధ్వంసం ఆపాలి
గోదావరిఖని, న్యూస్‌లైన్ : సింగరేణిలో మానవ జీవితాలను కొల్లగొడుతున్న ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల విధ్వంసం ఆగాల్సిందేనని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. గోదావరిఖనిలోని పోచమ్మ మైదానం(యు.రాములు ప్రాంగణం)లో ఆదివారం రాత్రి భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇప్టూ) 8వ రాష్ట్ర మహాసభల సందర్భంగా బహిరంగ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ అధిక బొగ్గు ఉత్పత్తి పేరుతో పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ప్రజల జీవన విధానాన్ని బొందల గడ్డలలో కప్పిపడేస్తున్న పరిస్థితి పూర్తిగా మారాలన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేలా భూగర్భ గనుల తవ్వకాన్ని పెంచాలని సూచించారు. ఇప్పటి వ రకు ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రకు చెందిన పది మంది కాంట్రాక్టర్లకే ఓసీపీలలో మట్టిని తొలగించే పనులు అప్పగించారని, ఇక నుంచి ఇలాంటి దోపిడీ విధానం పూర్తిగా మారాలన్నారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల అవసరం లేకుండా చేయాలని, సంస్థకు అవసరమైన పనిముట్లు, వస్తువులు సరఫరా చేసేందుకు అనుబంధ పరిశ్రమలు అధికంగా రావాలన్నారు. గోదావరిఖని నుంచి కాగజ్‌నగర్ వరకు కోల్‌కారిడార్ నిర్మించాలని, ఒక్కో ప్రాంతంలో ఒక్కో సెక్టార్‌ను అభివృద్ధి పరిచి, కాలుష్య రహిత పారిశ్రామికీకరణ చేపట్టాలన్నారు. సింగరేణి యాంత్రీకరణ వల్ల కార్మికుల్లో దాగి ఉన్న సృ జనాత్మకత తగ్గిపోతోందని, వారి ఆరోగ్యం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో ఎలా ఉండాలనే దానిపై కార్మికులు ఆలోచన చేయాలని, ప్రభుత్వం అడిగినప్పుడు ఏం కావాలో తెలపడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. సింగరేణిలో వెలుగులు నిండాలని జేఏసీ కోరుకుంటోందని తెలిపారు. కార్మిక సంక్షేమాన్ని మరిచిన సింగరేణి... సంధ్య సింగరేణిలో కార్మిక సంక్షేమాన్ని యాజమాన్యం మరిచిపోయిందని, వైద్య శాలలు, విద్యాసంస్థ లు మూసివేసి సింగరేణిని బొందల గడ్డగా మా ర్చి కార్మికుల జీవన విధానంపై గొడ్డలివేటు వేసిందని పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య ఆ రోపించారు. ఇన్నాళ్లుగా బొగ్గుబాయి అంటూ వేదికలపై ప్రసంగాలు చేసి నేడు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గని కార్మికుల సంక్షేమాన్ని బా ధ్యతగా తీసుకోవాలని కోరారు. పారిశ్రామిక అ భివృద్ధి అన్ని ప్రాంతాల్లో సమానంగా జరగాల ని, ఖమ్మం జిల్లా బయ్యారంలోనే స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇఫ్టూ రా ష్ట్ర అధ్యక్షులు ఎస్.వెంకటేశ్వర్రావు అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగసభలో ప్రధాన కార్యదర్శి ఎస్కే ముక్తార్‌పాషా, జె.సీతారామయ్య, బి.సంపత్‌కుమార్, ఐ.కృష్ణ, కె.విశ్వనాథ్, ఎం డీ చాంద్‌పాషా, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
పూసలు గుసగుసలాడే...
రాతికి ప్రాణం పోసే సుగుణం... లోహాలకు లాలిత్యం అద్దే నేర్పు అతివకు సొంతం. గాజు, ప్లాస్టిక్, ముత్యం... పూసలేవైనా.. రంగులెన్నయినా... పడతుల మెడలో చేరితే అవి చెప్పే ఊసులెన్నో..! చెప్పకుండానే ఒలికే భాషలెన్నో..! వర్ణాలన్నీ ఒద్దికగా జట్టు కట్టి... శంఖమంటి మెడలో హారమై రూపుకడితే దివిలోన తారకలను మించిన మెరుపులతో పూసలు నిత్యం తళుక్కుమంటూనే ఉంటాయి. గిరిజన స్త్రీ నుండి ఆధునిక యువతి వరకు పూసల హారాలను ధరించడం తెలిసిందే! పూసలను ఎక్కువగా గాజు, ప్లాస్టిక్, రాళ్లతో తయారుచేస్తారు. కొన్ని పూసలు ఎముక, కొమ్ము, దంతం, లోహాలు, ముత్యాలు, మట్టి, పింగాణీ, లక్క, కర్ర, విత్తనాలతోనూ తయారుచేస్తారు. పూసలను గుచ్చడానికి నైలాన్ లేదా ప్లాస్టిక్ దారాన్ని ఉపయోగించి గుచ్చుతారు. ఆభరణాలలో అయితే బంగారు లోహపు తీగతో గుచ్చి రాలిపోకుండా ముడివేస్తారు. బంగారు తీగ స్థానంలో రాగి, ఇత్తడి.. కట్టు తీగలను కూడా ఉపయోగిస్తుంటారు. దుస్తులకు తగిన ఎంపిక: డ్రెస్ కలర్, ప్రింట్, పాశ్చాత్యం, సంప్రదాయం.. ఇలా అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బీడ్స్‌ను ఎంచుకోవాలి ప్లెయిన్ రంగుల దుస్తుల మీదకు మల్టీకలర్ బీడ్స్ బాగా కనిపిస్తాయి ఎక్కువ ప్రింట్లున్న దుస్తుల మీదకు మల్టీకలర్ కాకుండా, దుస్తుల్లోని ఏదో ఒక సెంటర్ కలర్ బీడ్స్ తీసుకొని హారాలను, లోలాకులను తయారుచేసుకోవచ్చు టెంపుల్ జువెల్రీ అయితే కంచిపట్టు, ఉప్పాడ.. వంటి సంప్రదాయ తరహా దుస్తుల మీదకు బాగుంటాయి కెంపులు, ముత్యాలు సాధారణంగా అన్ని రకాల దుస్తుల మీదకు బాగా నప్పుతాయి పచ్చలు మాత్రం మ్యాచింగ్ డ్రెస్సుల మీదకు బాగుంటాయి జీన్స్ వంటి ఆధునిక వస్త్రాలంకరణకు పూసలు ఎక్కువగా ఉన్న ఆభరణాలను ఎంచుకోవద్దు. పూసలు లేకుండా ఒక పెద్ద లాకెట్ ఉన్న చైన్స్, లోలాకులు బాగుంటాయి. సాయంకాలపు వేడుకలకు ముత్యాలు సంద ర్భోచితంగా ఉంటాయి లాకెట్లో ఉన్న రంగును పోలిన పూసలను హారం తయారీకి ఉపయోగిస్తే మరింత ఆకర్షణీయంగా ఆభరణం కనిపిస్తుంది చెక్క పూసలు, రాయి, స్ఫటికం.. ఇతర పెద్ద పెద్ద పూసలు మోడ్రన్ దుస్తుల మీదకు బాగా నప్పుతాయి. పూసల నాణ్యతను బట్టి ఖరీదు ఉంటుంది. తగినవి: నచ్చిన పూసలు(బీడ్స్), బాల్స్, లోహపు తీగ /దారం/ నైలాన్ వైర్, రౌండ్నోస్ ప్లైర్, కటర్, ప్లాట్ ప్లైర్. తయారీ: పూసల బరువును బట్టి లోహపు తీగ(సన్నం/లావు) ను తగినంత కట్ చేసి, తీసుకోవాలి. తీగ చివరల్లో రౌండ్నోస్ ప్లైర్తో ఒక రౌండ్ మెలితిప్పి, పూసకు గుచ్చి, పై భాగంలోనూ ముడిలా తిప్పాలి. ఇలాగే తీగకు ఒక్కో పూసను గుచ్చుతూ, తగినంత పరిమాణంలో హారాన్ని తయారుచేసుకోవాలి. ఇలాగే జూకాలనూ తయారుచేసుకోవచ్చు. ఎప్పటికీ...: సాధారణంగా చెమట, ఉప్పునీరు ఆభరణం అందాన్ని దెబ్బతీస్తాయి. కొనుగోలు చేసినదైనా, సొంతంగా తయారుచేసుకున్నదైనా.. ఆభరణం ఎప్పటికీ ఆకర్షణను కోల్పోకుండా ఉండాలంటే... ప్లాస్టిక్, గాజు, చెక్క.. పూసలు, గవ్వలు, శంఖులు, నవరత్నాలు.. ఏ తరహా ఆభరణం అయినా ధరించిన తర్వాత దూది ఉండతో లేదా కాటన్ క్లాత్‌తో తుడిచి, గాలి చొరబడని ప్లాస్టిక్ బ్యాగ్/బాక్స్‌లలో భద్రపరుచుకోవాలి. పెర్ఫ్యూమ్స్, రసాయనాలు ఆభరణాలకు తగలకూడదు. సుధా రెడ్డి ఆభరణాల నిపుణురాలు, హైదరాబాద్ www.facebook.com/jewelpatterns మోడల్: సంధ్య; ఫొటోలు: శివ మల్లాల -
కడుపు కోత
కేసముద్రం, న్యూస్‌లైన్ : సరదాగా ఈత పండ్ల కోసమని వెళ్లిన ముగ్గురు చిన్నారులు కొద్ది గంటల్లోనే విగతజీవులయ్యూరు. ఈత కొట్టేందు కు చెరువులో దిగి మృత్యు ఒడికి చేరారు. కనిపెంచిన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. ఈ హృదయవిదారక సంఘటన మండలంలోని రంగాపురం గ్రామశివారు రాజీవ్ నగర్ తండాలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... రాజీవ్‌నగర్‌తండాకు చెందిన లకావత్ బావుసింగ్‌కు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య లక్ష్మికి కుమార్తెలు శాంతి, కావేరి, సంధ్య(13) ఉండగా, చిన్నభార్య సాల్కికి కుమారులు సురేష్, తరుణ్(10) ఉన్నారు. ఉమ్మడి కుటుంబంలోనే కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు. కాగా ఇదే తండాకు చెందిన దేవోజీ, చిలుకమ్మ దంపతుల కుమార్తె నీలకు ఇదే మండలం మహముద్‌పట్నం తండాకు చెందిన హరితో వివాహమైంది. ఆ దంపతులకు కుమార్తె శారద, కుమారులు సురేష్, నరేష్(9) ఉన్నారు. తన తల్లిదండ్రులు తిరుపతికి వెళుతుండడంతో వారిని సాగనంపేందుకు నీల శనివారం పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం బావుసింగ్ కుమార్తె సంధ్య, కుమారుడు తరుణ్ , నీల కుమారుడు నరేష్‌తోపాటు ఇదే తండాకు చెందిన భద్రు కుమారుడు రమేష్, కుమార్తె మౌనిక, గుగులోతు నంద కుమార్తె శిరీష కలిసి ఈత పండ్ల కోసం సమీపంలోని ఎదళ్ల చెరువు కట్ట మీదకు వెళ్లారు. అందరు కలిసి ఒక కవర్లో ఈత పండ్లను ఏరుకున్నారు. తిరిగి ఇంటికొస్తుండగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో చెరువులో ఈత కొడదామంటూ నీళ్లలోకి దిగా రు. ముందుగా తరుణ్, సంధ్య, నరేష్, శిరీష లోపలికి వెళ్లగా గుంత ఉండటంతో ఒక్కసారిగా మునిగిపోయారు. కొంతదూరం వెళ్లిన రమేష్, మౌనిక మునుగుతున్న మిత్రులను చూసి కేకలు పెట్టారు. ఇంతలో అటుగా బహిర్భూమికి వెళ్లిన దారావత్ వీరన్న వారిని గమనించి పరుగుపరుగున చెరువులో దూకాడు. అప్పటికే మునిగిపోయి అపస్మారక స్థితికి చేరుకున్న శిరీషను ఒడ్డుకు చేర్చాడు. అలాగే రమేష్, మౌనికను ఒడ్డుకు తీసుకొచ్చాడు. చెరువులో మునిగిపోయిన వారిని గాలించి బయటకు తీసుకొచ్చినప్పటికీ అప్పటికే తరుణ్, సంధ్య, నరేష్ ప్రాణాలు విడిచారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపిస్తూ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలు సంధ్య కేసముద్రంవిలేజ్లోని కస్తూర్భా పాఠశాలలో ఏడో తరగతి పూర్తి చేయగా, తరుణ్ ధన్నసరి గ్రామంలోని సెయింట్‌జాన్స్ స్కూల్లో 2వ తరగతి చదివాడు. నరేష్ మహముద్‌పట్నం తండాలోని మూడో తరగతి పూర్తి చేశాడు. తాత దగ్గరకుపోతనని వత్తివి కదరా.. మీ తాతను చూత్తానికి పోతనని గార్బం చేసి వత్తివి కదరా కొడుకా.. ఇప్పుడు మమ్మల్ని ఒక్కసారి సూడ్రా కొడుకా.. మమ్మల్ని వదిలిపెట్టి పోదానికే వచ్చినవారా కొడుకా.. అంటూ నరేష్ తండ్రి హరి కొడుకును ముద్దాడుతూ విల పించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. నా కొడుకుకు ఎండగొడతాందంటూ తల్లి తన చీరకొంగును కొడుకు శవం పై కప్పుతూ రోదించడం స్థానికులను కలచివేసింది. నాకెమయిందో తెల్వలే : శిరీష చెరువులో అందరితో కలిసి దిగిన.. ఒక్కసారే పెద్ద బొంద వచ్చింది. అందరం మునిగినం. ఏడుసుకుంటూ అరిసిన ం. నీళ్లన్ని మింగినంక నాకు ఏమైందో తెల్వలే. వీరన్న నన్ను బయటకు తీసి నా పొట్టమీద గట్టిగా వత్తిండు. మెలకువ వచ్చింది. నా దోస్తులు చచ్చిపోయిండ్రని తెల్వంగనే నాకు భయమైంది. మృతులంతా బంధువులే.. సంధ్య, తరుణ్ తండ్రి అయిన బావుసింగ్‌కు నరేష్ అమ్మమ్మ చిలుకమ్మ స్వయూన సోదరి. మృతుల కుటుంబాల మధ్య దగ్గరి బంధుత్వం ఉండటంతో వారి బంధువుల ఇళ్లల్లో విషాదం అలుముకుంది. సంఘటన స్థలానికి రూరల్ సీఐ వాసాల సతీష్, ఏఎస్సై రాంజీనాయక్ చేరుకుని కేసు నమో దు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఆస్పత్రికి తరలించారు. నరేష్ మృతదేహన్ని తరలించే క్రమంలో అతడి తండ్రి తన కొడుకుకు పోస్టుమార్టం వద్దని వాదించాడు. తన తండాకు తీసుకెళ్తానని చెప్పి ఆటోలో తీసుకెళ్లాడు. అయితే అక్కడి నుంచి పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. ముందుగా వచ్చుంటే అందర్ని కాపాడేటోన్ని పిల్లలు మునిగినంక కొద్దిసేపటి వరకు కేకలు వినపడలేదు. తీరా చెరువు దగ్గరకు వచ్చినంక వారిని చూసి ఒక్కసారిగా చెరువులోకి దూకిన. అప్పటికే ఒడ్డుకున్న ఇద్దరితోపాటు, స్పృహ కోల్పోయిన శిరీషను కాపాడిన. ఇంకా ముందు వచ్చి ఉంటే ఆ ముగ్గుర్ని కాపాడేటోన్ని. అమ్మమ్మ, తాతను తిరుపతికి సాగనంపడానికి వచ్చి... మహముద్‌పట్నం గ్రామశివారు తండా కు చెందిన గుగులోతు నీల తన తల్లిదండ్రులు దేవోజీ, చిలుకమ్మ తిరుపతికి వెళ్తుండటంతో శనివారం తన కొడు కు నరేష్‌తో కలిసి రాజీవ్‌నగర్ తండాకు వచ్చింది. రోజంతా తాతతో సరదాగా గడిపిన నరేష్ ఆదివారం తాత, అమ్మమ్మకు టాటా చెప్పి పంపాడు. ఆ తర్వా త ఉన్నంటుండి బయటకు వెళ్లిన నరేష్ చెరువులో మునిగి ప్రాణాలొదిలాడు. అయితే కేసముద్రంకు చేరుకున్న దేవోజీ, చిలుకమ్మ రైలు రావడంలో ఆలస్యం కావడంతో రైల్వేస్టేషన్లోనే ఉండిపోయారు. ఇంతలో మనవడి మరణవార్త తెలియడంతో వారు బోరున విలపిస్తూ తిరిగొచ్చారు. -
'ఫైర్' సినిమా స్టిల్స్
-
పర్సాయపల్లి స్టేజీ వద్ద చైన్ స్నాచింగ్
అర్వపల్లి, న్యూస్‌లైన్: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి అపహరించుకెళ్లాడు. సూర్యాపేట - జనగాం ప్రధాన రహదారిపై పర్సాయపల్లి స్టేజీ సమీపంలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మండలంలోని పర్సాయపల్లికి చెందిన బైరబోయిన సైదులు కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ శివారులోని బస్ స్టేజీ వద్ద నివాసం ఉంటున్నారు. సంక్రాంతి పండగకు ఇల్లు అలుక్కోవడానికి ఎర్రమట్టి కోసమని సైదులు భార్య సంధ్య కొత్తపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వద్దకు వెళ్తోంది. మార్గమధ్యంలో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు పుస్తలతాడును కత్తిరించుకొని పరారయ్యా డు. వెంటనే ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరిగెత్తుకొచ్చి దొంగను తిరుమలగిరి వరకు వెంబడించినా ఫలితం లేకపోయింది. గొలుసును కత్తిరించే సమయంలో వారి మధ్య పెనుగులాట జరగడంతో సంధ్యకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఏఎస్ఐ లక్ష్మీనారాయణ సిబ్బందితో కలిసి సంఘట న స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. -
ఆదివాసీ హక్కుల కోసం.. త్యాగాలకు వెనుకాడం
ఇల్లెందు అర్బన్, న్యూస్‌లైన్: ఆదివాసీల హక్కుల సాధనకు ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడేది లేదని పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య అన్నారు. గిరిజనుల హక్కులను కాపాడేది విప్లవ పార్టీలేనని చెప్పారు. శుక్రవారం రాత్రి ఇల్లెందు కొత్తబస్టాండ్ ఆవరణంలో జరిగిన ఎన్డీ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. అడవులను పరిరక్షించుకునేందుకు ఆదివాసీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వారికి ఏ కష్టమొచ్చినా అండగా ఉంటామన్నారు. ఆదివాసీల చట్టాలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గిరిజన పోరాటాల ఫలితంగా వారి రక్షణ కోసం 1920 నుంచే చట్టాలు చేశారని, అయితే పాలకుల నిర్లక్ష్యంతో అవి అమలు కావడం లేదని ఆరోపించారు. 1/70 చట్టం వచ్చినా భూ బదలాయింపును అడ్డుకోలేకపోతోందన్నారు. ప్రజల ఒత్తిడి ఫలితంగా 2006 డిసెంబర్ 29న అటవీ హక్కుల గుర్తింపు చట్టం వచ్చిందని గుర్తు చేశారు. ఈ చట్టం వల్ల 10 ఎకరాలు అనుభవించే హక్కు గిరిజనుడికి ఉందన్నారు. జిల్లాలో బీడీ ఆకు అధికంగా లభ్యమవుతున్నందున బీడీ పరిశ్రమలను నెలకొల్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సబ్‌ప్లాన్ నిధులను ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికే కేటాయించాలన్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు సాధినేని వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం ఓపెన్‌కాస్టుల పేరుతో పచ్చని పల్లెలను బొందలగడ్డగా మారుస్తోందని, అడవులు అంతరిస్తున్నాయని ఆరోపించారు. ఓపెన్‌కాస్టులు ఏర్పడిన ప్రాంతాల్లో జలవనరులు కూడా అడుగంటిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీల కింద వేల ఎకరాల సాగుభూమి పోతోందన్నారు. సింగరేణి సంస్థ ఏజెన్సీ ప్రాంతాల్లో గనులను ప్రారంభిస్తున్నదే తప్ప ఆయా ప్రాంతాల గిరిజనులకు ఉపాధి కల్పించడం లేదని విమర్శించారు. అధిక ఉత్పత్తి, లాభాల కోసం గిరిజన ప్రాంతాలను ఓసీలతో విధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓసీలతో బొందల గడ్డగా మార్చొద్దని సింగరేణి యాజమాన్యానికి సూచించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లయినా నేటికీ అందరికీ ఆహార భద్రత లేదని వాపోయారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గోవర్ధన్ మాట్లాడుతూ.. సీల్డ్ కవర్లో సీఎం పదవి దక్కించున్న కిరణ్ కుమార్‌రెడ్డి తెలంగాణ విషయంలో రోజుకొక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. అధిష్టానం మాట గౌరవిస్తానని నాడు చెప్పిన కిరణ్.. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా తెలంగాణ బిల్లును తిప్పి పంపుతానని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరికీ మరో తోడు దొంగలా అశోక్‌బాబు తయారయ్యాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం 1969లో 369 మంది మృతి చెందితే, నేడు వెయ్యి మందికి పైగా అమరులయ్యారని, ఈ విషయాన్ని సీమాంధ్రులు గుర్తుంచుకోవాలని అన్నారు. సభలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, నాయకులు ముక్తార్‌పాషా, వెంకటేశ్వర్లు, వెంకన్న, గౌని ఐలయ్య, జడ సత్యనారయణ, విశ్వనాథం, సీతారామయ్య, యదళ్లపల్లి సత్యం, భూక్యా లక్ష్మణ్, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎరుపెక్కిన బొగ్గుట్ట బహిరంగ సభకు ముందు సుమారు ఆరువేల మంది ఎన్డీ కార్యకర్తలు అరుణ పతాకాలు చేబూని భారీ ప్రదర్శన నిర్వహించారు. జేకే కాలనీ నుంచి జగదాంబ సెంటర్, పాత బస్టాండ్ ,బుగ్గవాగు బ్రిడి మీదుగా కొత్త బస్టాండ్ సెంటర్ వరకు ప్రదర్శన సాగింది. అరుణ పతాకాల రెపరెపలతో బొగ్గుట్ట ఎరుపెక్కింది. ఈ సందర్భంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, భూగర్భ గనులను ఏర్పాటు చేయాలని, దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం బహిరంగ సభ వేదికపై అరుణోదయ కళకారులు చేసిన నృత్యాలు, గేయాలు ఉర్రూతలూగించాయి. -
మగ మహారోజు!
ఏం తక్కువైంది ఈ మగమహారాజులకు?! ఏం మునిగిందని వీళ్లకో ‘ఇంటర్నేషనల్ మెన్స్‌డే’?! జెంట్స్ సీట్లో కూర్చొని, లేడీస్ ఎవరైనా లేవట్లేదా? ఆఫీస్‌లో ‘ముద్దారగా నేర్పిస్తాం’ అని చెప్పి... ఫిమేల్ స్టాఫ్ వచ్చి మీద మీద పడుతున్నారా?! క్యాబ్స్‌లో ప్రయాణిస్తున్న మగవాళ్లపై... లేట్ నైట్ అఘాయిత్యాలు జరుగుతున్నాయా?! ఆడవాళ్లకు ‘మహిళా దినోత్సవం’ ఉన్నట్లే... మగవాళ్లకు ‘మెన్స్‌డే’ ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనిపై మన స్త్రీవాదులు, మానవవాదులు ఏమంటున్నారు? ఇదే ఈవారం మన ‘ప్రజాంశం’ నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. 1999లో ట్రినిడాడ్ టొబాగో దేశంలో మొదటిసారి అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అరవై దేశాల్లో ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా స్త్రీల హక్కుల కోసం పోరాడుతున్న కొందరు సుప్రసిద్ధ మహిళల అభిప్రాయాలివి. ఇద్దరూ అభివృద్ధి చేతి పావులే ప్రకృతిపరంగా ఆడ, మగ తేడాలేమీ ఉండవు. జీవులన్నీ ఒక్కటే. సమాజంలో మనుషులు కృత్రిమంగా సృష్టించిన అంతరాలలో కులం, వర్గం, జాతి, మతం వంటి అణచివేతల్లో జెండర్ కూడా ఒకటి. ఆడ, మగ అనే జెండర్ వ్యత్యాసం కూడా నిర్మాణాత్మకమైనదే. స్త్రీలు, బలహీన పురుషులు బలమైన పురుషాహంకార బాధితులే. ఎక్కువ క్రూరంగా ఉండమని రాజ్యాల్ని, మరింత మగవాడిగా ఉండమని పురుషుల్ని అభివృద్ధి నిర్దేశిస్తుంది. ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ప్రపంచీకరణ, కులస్వామ్యాలన్నీ పురుషస్వామ్య రక్తమాంసాలతో నిర్మిస్తున్నవే. ఈ నిర్మాణాలు స్త్రీలనే కాదు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలహీనులైన మగవాళ్లను కూడా నిర్ధేశిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి నుంచి రాజకీయ ఎన్జీవోల వరకూ స్త్రీల సాధికారం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా... మహిళలు మానవహక్కులు లేకుండా విధ్వంసమవుతున్నారంటే పితృస్వామ్యంలో నిజాయితీ లేకపోవడం వల్లనే. పురుషుల్లో మార్పు రావాలి. ఇంటి పని, వంట పని, పిల్లల పెంపకంలో మగవారి పాత్ర పెరగాలి. ఆధునిక ఉత్పాదక రంగంలో, వ్యవసాయక రంగంలో, రాజకీయాల్లో మహిళల నాయకత్వాన్ని అంగీకరించాలి. వాళ్ల ప్రాతినిధ్యాన్ని, ప్రవేశాల్ని ప్రోత్సహించాలి. మన దేశంలో 22 నిమిషాలకొక లైంగికదాడి జరుగుతోంది. ఇది మానవ నాగరికతకు సిగ్గుచేటు. కాని... ప్రతి 22 గంటలకూ కనీసం 22 రోజులకు ఒక బాలికను పాఠశాలలో చేర్పించగలిగితే, ఒక మహిళకు ఉపాధి అవకాశాన్ని అందించగలిగితే ఈ దేశంలోనే సమానత్వం సిద్ధిస్తుంది. - జూపాక సుభద్ర, రచయిత్రి రెండు దినోత్సవాలెందుకు? ‘మగవాళ్లు’ అనగానే పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్న వేమన గుర్తుకొస్తాడు నాకు. నిజంగానే పురుషులు అనేకరకాలు. నా మటుకు నాకు కొందరిని చూస్తే గౌరవం, కొందరిని తలుచుకుంటేనే అసహ్యం, కొందరిని చూస్తే జాలి, ఇంకా కొందరంటే ఇష్టం. ఏమైనా... ఈ రోజుల్లో పురుషులు కొంత అయోమయంలో ఉన్నారనిపిస్తుంది. వాళ్లకు పాత తరాలవారి కంటే తాము ఉన్నతం (వారి భాషలో ఆదర్శప్రాయం) గా ఉండాలని ఉంటుంది. కానీ తరతరాలుగా నరనరాల్లో జీర్ణించుకుపోయిన పురుషత్వం ఆ ఉదాత్తతను నీరుగార్చేస్తుంటుంది. ఈ రెండింటి మధ్య ఇరుక్కుని నేటి పురుషులు (20 -50 మధ్య వయస్కులు) తికమకపడిపోతున్నారు. తను స్త్రీలను గౌరవంగా, తనతో సమానంగా చూస్తే గౌరవించబడతాడో లేక చులకనకు గురౌతాడో సగటు పురుషుడికి అర్థం కావడం లేదు. మొత్తానికి ఈనాటి స్త్రీలకు తమ వ్యక్తిత్వాల పట్ల, జీవనవిధానం పట్ల, పురుషులతో సంబంధాల పట్ల ఉన్నంత స్పష్టత ఇంకా ఈనాటి పురుషులకు రాలేదు. అంతేనా, పురుషులు అబలలు. (వ్యాకరణం మాట చిన్నయసూరి ఎరుగు) - ఎందుకంటే స్త్రీల కంటే ఎక్కువగా వాళ్లు సమాజానికి భయపడతారు. సంప్రదాయానికి వెరుస్తారు. స్త్రీ పురుష సంబంధాల్లో తెగింపు అన్నది ఎప్పుడైనా మనకు కనిపిస్తే అది స్త్రీ చొరవ తీసుకున్నప్పుడే, స్త్రీ సమాజాన్ని లెక్కచేయనపుడే సాధ్యం. మగవాళ్లకు సంబంధించి ప్రచారంలో ఉన్న సామెత ‘ఏడ్చే మగవాడిని నమ్మకు’ అన్నదాన్ని నేను నమ్మను. మగవాళ్లకు కూడా ఏడ్చే హక్కు ఉంది. దొంగ ఏడుపు అంటారా? అది ఆడవాళ్లు కూడా ఏడవగలరు కనక, కన్నీళ్లలోని నిజాయితీని గుర్తించాలి తప్ప, ఏడ్చింది పురుషుడా, స్త్రీనా అన్నది కాదు. పురుషుల దినోత్సవం సందర్భంగా తోటి పురుషులకు చిన్న సూచన: స్త్రీలను మీతో సరిసమానంగా చూడడం వల్ల మీ ఔన్నత్యం పెరుగుతుందే తప్ప, తరగదు. స్త్రీపురుషుల మధ్య అధికార సంబంధాల వల్ల స్త్రీలు మాత్రమే కాదు నష్టపోయేది, పురుషులు కూడ ఎంతో జీవితానందాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే అసమ సంబంధాల్లో ఇరుపక్షాలూ బాధే తప్ప ఆనందాన్ని పొందలేవు. ఆ స్పష్టత స్త్రీపురుషులిద్దరిలోనూ వస్తే, ఇక స్త్రీల దినోత్సవాలూ, పురుష దినోత్సవాలూ అని రెండూ వేర్వేరుగా జరుపుకోవలసిన అవసరం ఉండదు. - ప్రొఫెసర్ మృణాళిని, కేంద్రసాహిత్య అకాడెమీ జనరల్ కౌన్సెల్ సభ్యురాలు అర్థం చేసుకొనేలా ఎదగాలి అంతర్జాతీయ పురుష దినోత్సవం సందర్భంగా వారిలో మానవ త్వం మేలుకోవాల ని కోరుకుంటున్నా ను. మగవాళ్లకు తరతరాలుగా సమాజం ఇచ్చిన అనవసరమైన, అన్యాయమైన అహంకారాన్ని పెంచే అవకాశాలను వాళ్లు ఐచ్ఛికంగా వదులుకుని సమానత్వం వైపుగా అడుగులు వేయడం నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. తమలో పేరుకుపోయిన వివక్షాపూరితమై న ఆలోచనలను, హింసాత్మక ఆచరణను అమానుష వైఖరిని కడిగి వేసుకుని స్త్రీల స్వేచ్ఛా కాంక్షను అర్థం చేసుకునేలా ఎదగాలని కాంక్షిస్తున్నాను. యుద్ధాన్ని వదిలి శాంతిని, ద్వేషాన్ని వదిలి స్నేహాన్ని మనసులో నింపుకుని ప్రపంచాన్ని... శాంతి, సమానత్వం దిశగా అభివృద్ధి చేయడంలో స్త్రీలతోపాటు భాగస్వామ్యం పంచుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే ఈ పనులు చేస్తున్న సంస్కారవంతులైన కొందరు పురుషులకు నా అభినందనలు. - ఓల్గా, స్త్రీవాద రచయిత్రి Olga ఆధిపత్యం అడగడం లేదు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా పురుషులకు కొన్ని విషయాలు చెప్పదలచుకున్నాను. స్త్రీపురుష వివక్ష మొదట్నించీ ఉన్నది కాదు. ఆదిమ వ్యవస్థలో ఆహారాన్ని కనిపెట్టింది స్త్రీ. కానీ సమాజం పురోగమనంలో మాతృస్వామిక వ్యవస్థ దాటి పితృస్వామిక వ్యవస్థ ఏర్పడింది. అప్పటినుంచి స్త్రీ అణచివేత ప్రారంభమైంది. తర్వాత నాగరిక సమాజంలో స్త్రీ, పురుష సమానత్వం ఒక హక్కుగా రాజ్యాంగం ఇచ్చింది. ఈనాటికీ ఆ సమానత్వాన్ని గుర్తించలేకపోవడం బాధాకరం. స్త్రీలు తమ హక్కుల గురించి మాట్లాడినప్పుడల్లా ఆధిపత్యం కోరుకుంటున్నట్లుగా భావిస్తున్నారు. కాని స్త్రీకి కావాల్సింది పురుషులపై ఆధిపత్యం కాదు, కేవలం సమానత్వం మాత్రమే. సమాజంలో పురుషాధిపత్య భావజాలం భారంగా మారితే పురుషులు కూడా బాధితులవుతారు. చాలామంది ఒంటరిస్త్రీలు, వితంతువులు... భర్త తోడు లేకుండా కుటుంబాల్ని నెట్టుకొస్తున్నారు. ఎవరి అండా లేకుండానే పిల్లల్ని పెంచి ప్రయోజకుల్ని చేస్తున్నారు. పురుషులు ఆ పని చేయలేకపోతున్నారు, ఎవరో ఒకరిద్దరు తప్ప. స్త్రీ తోడు లేకుండా బతకగలిగే పురుషులెందరు? కనీసం ఈ వాస్తవాైన్నైనా ఎందుకు గుర్తించరు? సమాజంలో హింసలేని జీవితాన్ని మనుషులందరూ కోరుకుంటున్నారు. అది మానవహక్కు కూడా. కాని స్త్రీలు, పిల్లలు హింసలేని జీవితాన్ని తమ హక్కుగా గుర్తించలేకపోతున్నారు. సమాజంలో శాంతియుత కుటుంబాలు కావాలి. అది ఆధిపత్య సంబంధాలు రద్దయినపుడే సాధ్యమవుతాయి. ఆడవాళ్లయినా, మగవాళ్లయినా ఆధిపత్యం కోరుకోకూడదు. బాధ్యతాయుతమైన మానవ సంబంధాలు మాత్రమే ఉండాలి. మానవజాతి మనుగడ కోసం త్యాగాలు చేసిన పురుషులు, స్త్రీలు ఉన్నారు. పురుష వ్యతిరేకత కాకుండా పురుషాధిపత్య భావజాలాన్ని తొలగించినపుడు మిగిలేది స్త్రీ, పురుషులు. ఎక్కువ తక్కువలు కాదు. - సంధ్య, ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు Sandhya రెండుముఖాలు వద్దు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా మనదేశంలోని పురుషులందరికీ నా అభినందనలు. ఈరోజైనా పురుషులందరూ ఒక ఆత్మపరిశీలన చేసుకోవాలి. ‘మీరూ మేము సగం సగం... మీరూ మేము సమం సమం’ అనే మహిళల మాటతో పురుషులందరూ గొంతు కలపాలని ఊరుకుంటే సరిపోదు, ఆచరించాలి. మన సమాజంలో రెండుముఖాలున్న మగవారి సంఖ్య బాగా ఎక్కువ. కొందరు మగవాళ్లు బయటికి స్త్రీవాద కబుర్లు చెప్పి ఇంటికెళ్లి భార్యల్ని హింసిస్తారు. మనసా వాచా మహిళల్ని గౌరవించే మగవారి సంఖ్య చాలా తక్కువ. దీనికి అనాదిగా వస్తున్న పురుష ప్రాధాన్య కట్టుబాట్లే కారణం కాదు, మహిళ తమని మించిపోతోందన్న అభద్రతా భావం కూడా. చదువుల్లో, ఉద్యోగాల్లో, తెలివితేటల్లో మహిళలు రోజురోజుకీ మెరుగవుతున్నారు. కాని మగవారి ఆలోచనలు మాత్రం ఏ కాలంలోనో ఆగిపోయాయి. మహిళల్లో వస్తున్న మార్పుకు తగ్గట్టు మగవారి ఆలోచనతీరు మెరుగవడం లేదు. కొందరిలో మైండ్‌సెట్ మారుతోంది కాని మనసు మారడం లేదు. బిడ్డగా స్త్రీ ఎదుగుదలను కోరుకుంటున్న మగవాళ్లే, భార్యగా ఎదిగితే మాత్రం అడ్డుపడుతున్నారు. మగవారి హృదయం మారడం లేదనడానికి ఇలాంటి ధోరణులే ఉదాహరణలు. వారి అభద్రతాభావం ఏస్థాయికి చేరిందంటే.. స్త్రీల కోసం కొత్త చట్టాలు వచ్చినప్పుడల్లా వాటిని పురుష వ్యతిరేక చట్టంగా భావిస్తున్నారు. అవి కేవలం స్త్రీలను రక్షించడానికి వచ్చిన చట్టాలు కాని పురుషుల్ని వ్యతిరేకించేవి కావు. ఆ మధ్య ఢిల్లీలో నిర్భయ ఘటన సందర్భంగా చాలామంది మగవాళ్లు ‘తాము మగవాళ్లుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం’ అంటూ తమ సానుభూతిని వ్యక్తం చేశారు. అలాంటి సందర్భాల్లో పురుషుల నుంచి స్త్రీలు ఆశించేది సానుభూతి కాదు, తిరుగుబాటు. పురుషుడిగా తోటి పురుషులలో మార్పు తేవాలి. దాని కోసం ఎంతటి పోరాటాలైనా చేయాలి. లేదంటే స్త్రీల రక్షణకోసం పోరాడుతున్నవారికి సాయంగానైనా ఉండాలి. దాన్నే సమానత్వం అంటారు. స్త్రీలకు అన్యాయం జరిగితే తోటి స్త్రీలు స్పందించడం, పురుషులకు అన్యాయం జరిగితే పురుషులు స్పందించడం సమానత్వంలోకి రాదు. దేశంలో ఎవరికి అన్యాయం జరిగినా లింగభేదం లేకుండా అంతా అండగా నిలబడాలి. అప్పుడే ఆడ, మగ అనే భేదం పోయి అందరం ఒక్కటేనన్న భావం వస్తుంది. - కొండవీటి సత్యవతి, కోఆర్డినేటర్ ‘భూమిక’ హెల్ప్‌లైన్ Kondaveeti Satyavati