
కోల్‌కతా: ప్రముఖ గాయని, బంగ బిభూషణ్ సంధ్యా ముఖర్జీ(91) కోల్‌కతాలో మంగళవారం రాత్రి 7.30 గంటలకు గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందారు. ఎస్.డి.బర్మన్, నౌషద్, సలీల్ చౌదరి తదితరుల సంగీత దర్శకత్వంలో హిందీ, బెంగాలీ భాషల్లో ఎన్నో మధురైన పాటలు పాడిన సంధ్యా ముఖర్జీ దశాబ్దాలపాటు అభిమానులను అలరించారు. సంధ్యా ముఖర్జీ మృతిపట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సంతాపం ప్రకటించారు.
చదవండి: (యాంకర్ శ్రీముఖి పెళ్లి చేసుకోనుందా? ఆ ఫోటోతో సర్‌ప్రైజ్)