
సాక్షి ప్రతినిధి, చెన్నై: సినీ సహాయ నటి అయిన భార్య వివాహేతర సంబంధాన్ని అతను తట్టుకోలేకపోయాడు. సినీ దర్శకుడైన భర్త ఆమెను దారుణంగా హత్యచేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా కోసి పలుచోట్ల పడేశాడు. పోలీ సులు 2 వారాల పాటు శ్రమించి నిందితుడిని బుధవారం అరెస్ట్ చేశారు. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. చెన్నై శివారు పెరుంగుడిలోని చెత్తకుప్పల్లో గుర్తుతెలియని యువతికి చెందిన రెండు కాళ్లు, ఒక చేయిని గత నెల 21న పోలీసులు గుర్తించారు. మృతురాలి ఆచూకీ కోసం అనేక చోట్ల వెతికారు. చెన్నై ఈక్కాడుతాంగల్‌లో నివసించే కన్యాకుమారీ జిల్లా నాగర్‌కోవిల్‌కు చెందిన సంధ్య (38) అనే యువతి కొన్నిరోజులుగా కనపడటం లేదని గుర్తించారు.
అదృశ్యమైన యువతి భర్త సినీ దర్శకుడైన బాలకృష్ణన్‌ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకుని కేసును ఛేధించారు. భార్య, భర్తలిద్దరూ సినీపరిశ్రమకు చెందిన వారే. సంధ్య కొందరితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్లు భర్త అనుమానించాడు. రాత్రివేళల్లో సెల్‌ఫోన్‌లో మాట్లాడటం, బయటకు వెళ్లడం వంటి చర్యలకు సంధ్య పాల్పడుతుండటంతో దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. భర్త అనేకసార్లు మందలించినా ఆమె వినిపించుకో లేదు. దీంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దశలో ప్రియునితోనే ఉంటానని సంధ్య తేల్చిచెప్పగా గత నెల 19న దంపతులు ఘర్షణపడ్డారు. అప్పటికే తగి న ఏర్పాట్లతో ఉన్న బాలకృష్ణన్ కత్తితో ఆమెను విచక్షణారహితంగా పొడిచి హతమార్చాడు.
Comments
Please login to add a commentAdd a comment