
బెంగళూరు: పొత్తిళ్లలో వేసి పెంచిన కొడుకుతో పడక సుఖాన్ని కోరుకుందో దుర్మార్గపు తల్లి. తండ్రి చనిపోయాక కన్నతల్లితోనే కామవాంఛలు తీర్చుకోవాలనుకున్నాడా కొడుకు. కొడుకుతోనే కాకుండా మరికొందరితోనూ సంబంధాలు పెట్టుకుని సమాజం సిగ్గుపడేలా చేసిందా మాతృమూర్తి. చివరకు తనను చెరిపిన కొడుకు చేతిలోనే ఆమె హత్యకు గురైంది. సమాజం ఛీ కొట్టే ఈ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. (చదవండి: కాసేపట్లో పెళ్లి.. అంతలోనే మరో యువతి ఎంట్రీ)
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హవేరీ జిల్లాలోని వనహల్లి గ్రామానికి చెందిన 21 ఏళ్ల శివప్ప తండ్రి ఏడాది క్రితం మరణించాడు. అప్పటి నుంచి కన్న తల్లితోనే అక్రమ సంబంధానికి తెర దీశాడు. ఆమె కూడా దీనికి అడ్డు చెప్పాల్సింది పోయి అతనితో సుఖాన్ని కోరుకుంది. శివప్పతో పాటు మరికొంతమందితోనూ సంబంధాలు పెట్టుకుంది. ఇది శివప్ప సహించలేకపోయాడు. ఇకపై ఎవరినీ కలవడానికి వీల్లేదని, తనతో మాత్రమే ఉండిపోవాలని తల్లిని హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె అతడి మాటను లెక్క చేయలేదు. దీంతో ఉక్రోషంతో ఉడికిపోయిన శివప్ప తల్లిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై అత్యాచారం, హత్య కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడు నేరం అంగీకరించినట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. (చదవండి: దారుణం: యువకుడిని చంపి భక్షించి..)
Comments
Please login to add a commentAdd a comment