కాంస్యం నెగ్గిన సంధ్య | Sandhya, won bronze | Sakshi
Sakshi News home page

కాంస్యం నెగ్గిన సంధ్య

Published Fri, Nov 18 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM

కాంస్యం నెగ్గిన సంధ్య

కాంస్యం నెగ్గిన సంధ్య

టెహ్రాన్ (ఇరాన్): ఆసియా అమెచ్యూర్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అమ్మారుు జి.సంధ్య రాణించింది. శుక్రవారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో సంధ్య కాంస్య పతకాన్ని సాధించింది. తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ఈ విజయవాడ అమ్మారుు 6.5 పారుుంట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది.

ఐదు గేముల్లో నెగ్గిన సంధ్య, మరో మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో ఓడిపోరుుంది. 7.5 పారుుంట్లతో లీ హొంగ్యాన్ (చైనా) స్వర్ణం... 7 పారుుంట్లతో అసాది మొతహరె (ఇరాన్) రజత పతకం సొంతం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement