
సాక్షి, మహబూబ్‌నగర్ : చదువుల ఒత్తిడి తట్టుకోలేక మరో విద్యా కుసుమం నేల రాలింది. ఆదివారం పూట కూడా క్లాసులు నిర్వహిస్తుండటంతో మనస్తాపం చెందిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జిల్లాలోని జడ్చర్లలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న గోపాల్‌కు కూతురు సంధ్య(15) ఉంది. పట్టణంలోని ఉదయ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆదివారం కూడా పాఠశాలలో తరగతులు నిర్వహించడంతో మనస్తాపానికి గురై తమ కూతురు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సివుంది.