ఓపెన్‌కాస్ట్‌ల విధ్వంసం ఆపాలి | Planning the destruction of the open cast projects | Sakshi
Sakshi News home page

ఓపెన్‌కాస్ట్‌ల విధ్వంసం ఆపాలి

Published Mon, Jun 9 2014 3:55 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

ఓపెన్‌కాస్ట్‌ల విధ్వంసం ఆపాలి - Sakshi

ఓపెన్‌కాస్ట్‌ల విధ్వంసం ఆపాలి

గోదావరిఖని, న్యూస్‌లైన్ : సింగరేణిలో మానవ జీవితాలను కొల్లగొడుతున్న ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల విధ్వంసం ఆగాల్సిందేనని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. గోదావరిఖనిలోని పోచమ్మ మైదానం(యు.రాములు ప్రాంగణం)లో ఆదివారం రాత్రి భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇప్టూ) 8వ రాష్ట్ర మహాసభల సందర్భంగా బహిరంగ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ అధిక బొగ్గు ఉత్పత్తి పేరుతో పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ప్రజల జీవన విధానాన్ని బొందల గడ్డలలో కప్పిపడేస్తున్న పరిస్థితి పూర్తిగా మారాలన్నారు.
 
ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేలా భూగర్భ గనుల తవ్వకాన్ని పెంచాలని సూచించారు. ఇప్పటి వ రకు ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రకు చెందిన పది మంది కాంట్రాక్టర్లకే ఓసీపీలలో మట్టిని తొలగించే పనులు అప్పగించారని, ఇక నుంచి ఇలాంటి దోపిడీ విధానం పూర్తిగా మారాలన్నారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల అవసరం లేకుండా చేయాలని, సంస్థకు అవసరమైన పనిముట్లు, వస్తువులు సరఫరా చేసేందుకు అనుబంధ పరిశ్రమలు అధికంగా రావాలన్నారు.
 
 గోదావరిఖని నుంచి కాగజ్‌నగర్ వరకు కోల్‌కారిడార్ నిర్మించాలని, ఒక్కో ప్రాంతంలో ఒక్కో సెక్టార్‌ను అభివృద్ధి పరిచి, కాలుష్య రహిత పారిశ్రామికీకరణ చేపట్టాలన్నారు. సింగరేణి యాంత్రీకరణ వల్ల కార్మికుల్లో దాగి ఉన్న సృ జనాత్మకత తగ్గిపోతోందని, వారి ఆరోగ్యం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో ఎలా ఉండాలనే దానిపై కార్మికులు ఆలోచన చేయాలని, ప్రభుత్వం అడిగినప్పుడు ఏం కావాలో తెలపడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. సింగరేణిలో వెలుగులు నిండాలని జేఏసీ కోరుకుంటోందని తెలిపారు.
 
కార్మిక సంక్షేమాన్ని మరిచిన సింగరేణి... సంధ్య
సింగరేణిలో కార్మిక సంక్షేమాన్ని యాజమాన్యం మరిచిపోయిందని, వైద్య శాలలు, విద్యాసంస్థ లు మూసివేసి సింగరేణిని బొందల గడ్డగా మా ర్చి కార్మికుల జీవన విధానంపై గొడ్డలివేటు వేసిందని పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య ఆ రోపించారు. ఇన్నాళ్లుగా బొగ్గుబాయి అంటూ వేదికలపై ప్రసంగాలు చేసి నేడు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గని కార్మికుల సంక్షేమాన్ని బా ధ్యతగా తీసుకోవాలని కోరారు.
 
పారిశ్రామిక అ భివృద్ధి అన్ని ప్రాంతాల్లో సమానంగా జరగాల ని, ఖమ్మం జిల్లా బయ్యారంలోనే స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇఫ్టూ రా ష్ట్ర అధ్యక్షులు ఎస్.వెంకటేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగసభలో ప్రధాన కార్యదర్శి ఎస్‌కే ముక్తార్‌పాషా, జె.సీతారామయ్య, బి.సంపత్‌కుమార్, ఐ.కృష్ణ, కె.విశ్వనాథ్, ఎం డీ చాంద్‌పాషా, లక్ష్మణ్ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement