Kodhanda Ram
-
‘ఆ సమయంలో మోదీ చెవులు మూసుకున్నారు’
సాక్షి, ఖమ్మం : సీపీఐ (ఎంల్) అఖిల భారత రైతు కూలి సంఘం అధ్యర్యంలో ఖమ్మం నగరంలో పెవిలియన్ గ్రౌండ్లో రైతు గర్జన బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు ఢిల్లీ రైతు ఉద్యమ నేత ఆశిష్ మిట్టల్, అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు వెంకట రామయ్య, ప్రోపెసర్ కోదండరామ్‌తో పాటు ఇతర నేతలు పాల్గోన్నారు. రైతులు కూడ భారీ ఏత్తున తరలివచ్చారు. పంజాబ్ నుంచి మొదలైన ఈ ఉద్యమం, హర్యానా, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతంతో పాటు దేశం లోని అన్ని ప్రాంత రైతులు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారన్నారు. ఢిల్లీ రైతు ఉద్యమ నేత ఆశిష్ మిట్టల్ మాట్లాడుతూ.. ఈ ఉద్యమం సిక్కులదని ప్రధాని మోదీ శక్తులు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దేశ స్వాతంత్య్రంలో కూడా సిక్కులు ప్రముఖ పాత్ర పోషించారన్న విషయం గుర్తించుకోవాలన్నారు. రైతు చట్టంలో రైతులకు నష్టం చేసే విషయాలు మేము చెప్పే సమయంలో మోదీ మా మాటలు చెవులు మూసుకొని విన్నారని ఎద్దేవ చేశారు. ప్రోఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. ఢిల్లీలో మూడు నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలపడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఊళ్ళలో భార్యలు, కొడుకులు వ్యవసాయం చేస్తుంటే రైతులు ఢిల్లీలో పోరు సాగిస్తున్నారన్నారు. కేంద్రం తెచ్చిన చట్టాలతో కార్పొరేట్ శక్తులకు స్వేచ్చ వచ్చిందన్న కోదందరామ్.. ఈ చట్టాలు రైతులను, రైతు కుటుంబాలను రోడ్డు మీద పడివెస్తున్నయని అందుకే రైతులు ఉద్యమాలు చేస్తున్నారన్నారు. కార్పొరేట్ శక్తులు చెప్పిన పంట పండించాల్సి వస్తోందని, వాళ్ళు చెప్పిన రేటుకే అమ్మలని ఈ చట్టం చెబుతున్నాయన్నారు. -
ప్రగతి భవన్ ముట్టడి భగ్నం
సాక్షి, హైదరాబాద్/ముషీరాబాద్ : ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన వివిధ పార్టీల నాయకులను పోలీసులు శుక్రవారం ఎక్కడికక్కడే అరెస్ట్ చేసి నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేశారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, ప్రజా సంఘాలు, తెలంగాణ జన సమితి (టీజేఎస్), టీటీడీపీల ఆధ్వర్యంలో ‘ముఖ్యమంత్రి మేలుకో.. ప్రజల ప్రాణాలు కాపాడు.. బతుకులు నిలబెట్టు’అనే నినాదంతో ప్రగతి భవన్ వద్ద నిరసనకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తారని భావించిన ఆ పార్టీల నేతలు గురువారం రాత్రే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో నేరుగా ప్రగతి భవన్ వద్ద ప్రత్యక్షమయ్యారు. మొదటగా టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, ఆ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు ఎం.నర్సయ్యలతో పాటు న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు గోవర్ధన్, ప్రసాద్, పీవోడబ్ల్యూ నేత వి.సంధ్య తదితరులు ప్రగతి భవన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు. ఇక పంజాగుట్ట చౌరస్తాలో సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్, ఈశ్వర్రావు తదితరులను అరెస్ట్ చేసి అక్కడికే తరలించారు. పీపీఈ కిట్ ధరించి ప్రగతి భవన్ ముట్టడికి వచ్చిన సీపీఐ నేత కె.నారాయణ, ఆ పార్టీ నాయకులు అజీజ్ పాషా, బాలమల్లేశ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో, సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని గోల్కొండ చౌరస్తా వద్ద అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద అడ్డుకొని నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నగరంలో ఎల్బీ నగర్, ఉప్పల్, ముషీరాబాద్, ఎంజే మార్కెట్, సికింద్రాబాద్, చాంద్రాయణగుట్టలతో పాటు పలు ప్రాంతాల్లో నల్ల బెలూన్లను ఎగురవేశారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని, కోవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అమెరికాలో వైట్‌హౌస్ ముందు నిరసనలకు అవకాశం ఉండగా, తెలంగాణలో మాత్రం సీఎం నివాసం వద్ద నిరసనలు తెలిపే అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. -
‘ఆర్టీసీ కార్మికుల సమ్మెకు గొప్ప విశిష్టత’
సాక్షి, సంగారెడ్డి: ఆర్టీసీ కార్మికులు 25 రోజులుగా చేపడుతున్న నిరవధిక సమ్మెను చూస్తుంటే గర్వంగా ఉందని టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సంగారెడ్డి బస్టాండ్‌లో మంగళవారం ఆర్టీసీ కార్మికులను కలిసి సంఘీభావం తెలిపిన ఆయన సమ్మెకు టీజేఎస్ తరఫున మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు చేసే సమ్మెకు గొప్ప విశిష్టత ఉందని అభిప్రాయపడ్డారు. బుధవారం హైదరాబాద్ సరూర్‌నగర్ గ్రౌండ్లో.. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే సకలజనుల భేరి సభకు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ సమ్మెకు మద్దతిచ్చి ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవాలని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. సమ్మె విరమించకపోతే ప్రైవేట్ బస్సులను నడిపిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులను బెదిరిస్తున్నారని కోదండరాం విమర్శించారు. సమ్మె ముందు ఆర్టీసీ 25 రోజుల ఆదాయం.. సమ్మెలో ఉన్నప్పుడు 25 రోజుల ఆదాయాన్ని కేసీఆర్ గమనించాలని అన్నారు. సీఎం కేసీఆర్‌కు పరిపాలన ఎలా చేయాలో చెప్పాల్సిన దుస్థితి వచ్చిందని కోదండరాం మండిపడ్డారు. ఎంతో మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు అనంతరం చర్చలకు పోతే.. 500 మంది పోలీసులను చుట్టూ పెట్టుకొని చర్చలు జరుపుతారా అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు ప్రత్యేక జీత భత్యాల కోసం సమ్మె చేయడం లేదని, న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నారని పేర్కొన్నారు. -
4 లక్షల మందితో సకల జనుల సమర భేరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బంద్‌కు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించిన నేపథ్యంలో సమ్మె మలిదశ కార్యాచరణ పటిష్టంగా ఉండేలా చూడాలని ఆర్టీసీ కార్మికులు సంఘాల జేఏసీ తీర్మానించింది. సమ్మెపై హైకోర్టులో జరిగే తదుపరి విచారణ వరకు ఉధృతంగా నిరసనలు కొనసాగించాలని ఆదివారం జరిగిన రాజకీయ అఖిలపక్ష నేతలతో సమావేశంలో నిర్ణయించింది. దీనికి సంపూర్ణ మద్దతు అందిస్తామని రాజకీయ పార్టీలు కూడా తేలి్చచెప్పాయి. సమ్మె కార్యాచరణలో భాగంగా ఈ నెల 30న కనీసం 4 లక్షల మందితో సకల జనుల సమర భేరీ పేరుతో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో 3 లక్షల మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులు, మరో లక్ష మంది సాధారణ ప్రజలు హాజరయ్యేలా రాజకీయ పారీ్టలతో కలసి జనసమీకరణ జరపాలని నిశ్చయించారు. ఈలోగా ఇతర నిరసన కార్యక్రమాలు కొనసాగించనున్నారు. అఖిలపక్ష భేటీలో ఎవరేమన్నారంటే... కోర్టు తీర్పును కూడా ప్రభుత్వం గౌరవించకపోవడం దారుణం. ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారు. దానికి మద్దతు ఇస్తున్నట్టుగా పోలీసులు దమనకాండను కొనసాగిస్తున్నారు. ప్రజలు మా ఉద్యమానికి మద్దతుగా నిలిచి ఆరీ్టసీని విధ్వంసం చేసే కుట్రను అడ్డుకొని ప్రజారవాణా సంస్థను కాపాడుకునేందుకు సహకరించాలి.– ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వీఎస్‌రావు, సుధ కార్మికుల వెంట నడుస్తాం ఆర్టీసీ కార్మికులు చేపట్టే అన్ని నిరసన కార్యక్రమాల్లో మా నేతలు పాల్గొంటారు. ప్రజాప్రతినిధుల ములాఖత్‌లో మేమూ పాల్గొంటాం. వారికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. – తమ్మినేని వీరభద్రం (సీపీఎం), చాడ వెంకట్‌రెడ్డి (సీపీఐ), ఎస్.వెంకటేశ్వరరావు (న్యూడెమొక్రసీ) ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి ఆర్టీసీ పరిరక్షణకు నడుంబిగించాలని కోర్టు చెప్పినా ప్రభుత్వం వినకపోవడం విడ్డూరం. ఆర్టీసీ ఆస్తులు, అప్పులపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఉద్యమానికి పౌరసమాజం మద్దతు ఉంది. – ఎల్.రమణ, టీడీపీ కోర్టు తీర్పును గౌరవించాలి. కోర్టు ఆదేశాన్ని గౌరవించి కారి్మకులను ప్రభుత్వం చర్చలకు పిలవాలి. ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఆర్టీసీ జేఏసీకి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. – కోదండరాం, టీజేఎస్ పుస్తకాలు చదివి నేర్చుకున్నదిదేనా? వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే ముఖ్యమంత్రి నేర్చుకున్నది ఇదేనా? ప్రజలు శక్తిమంతులు, వారి ఆగ్రహాన్ని తట్టుకోవడం కష్టమంటూ హైకోర్టు వ్యాఖ్యానించినా కేసీఆర్ పెడచెవిన పెట్టడం వల్ల ఆయనకే నష్టం. – డాక్టర్ చెరుకు సుధాకర్, ఇంటి పార్టీ న్యాయవ్యవస్థపై గౌరవం లేకుంటే ఎలా? న్యాయవ్యవస్థపైనా ప్రభుత్వానికి గౌరవం లేకుంటే ఎలా? ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలని హైకోర్టు ఆదేశించినా చర్చలకు ఎందుకు పిలవట్లేదు. లోటు బడ్జెట్‌తో ఉన్న ఏపీని అక్కడి ముఖ్యమంత్రి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తుంటే మిగుల బడ్జెట్ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎందుకొస్తోంది. – మంద కృష్ణమాదిగ . మలిదశ సమ్మె కార్యాచరణ ఇలా.. నేడు అన్ని డిపోల వద్ద కారి్మకుల కుటుంబ సభ్యులు బైఠాయించి దీక్షలు. 22న అద్దె బస్సుల డ్రైవర్లు, యజమానులు, తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు (ఇక నుంచి విధులకు హాజరు కావద్దని, తమ పొట్ట కొట్టొద్దని) విన్నపాలు. 23న మండలస్థాయి ప్రజాప్రతినిధులు మొదలు ఎంపీల వరకు కలసి ఆర్టీసీ పరిస్థితిపై వివరణ. 24న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు సహా అన్ని డిపోల వద్ద ఆర్టీసీ మహిళా ఉద్యోగుల నిరాహార దీక్షలు. 25న ప్రజాసంఘాలు, సాధారణ ప్రజలతో కలసి రాస్తారోకోలు. 26న ఆర్టీసీ కారి్మకుల పిల్లల ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు. 27న దీపావళి వేడుకలకు దూరం. కొన్ని పారీ్టల నేతలు మాత్రం కార్మికుల కుటుంబాలను తమ ఇళ్లకు ఆహా్వనించి వారితో కలిసి దీపావళి జరుపుకోనున్నట్టు ప్రకటించారు. 28న (సోమవారం) సమ్మెపై హైకోర్టులో ఒకవైపు వాదనలు కొనసాగిస్తూనే మరోవైపు నిరసన కార్యక్రమాలు కొనసాగింపు. 30న సకల జనుల సమర భేరీ బహిరంగ సభ నిర్వహణ. -
కోదండరాం అరెస్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని సోమ వారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన కొద్దిసేపటికే అధ్యక్షుడు ప్రొ.కోదండరాంను పోలీసులు అరెస్ట్ చేసి రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇంటర్ ఫలితాల గందరగోళానికి బాధ్యులపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకో వాలని, బాధిత విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం ఇంటర్‌బోర్డు కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ, టీడీపీ పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల ముఖ్య నేతల గృహనిర్బంధం, విద్యార్థి, ప్రజాసంఘాల వారిని ఎక్కడికక్కడే అరెస్ట్‌లు, ఇంటర్ బోర్డు వద్ద నిరసనలకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పలు పోలీసు స్టేష న్లకు తరలించారు. తార్నాకలోని నివాసంలో కోదండరాంను ఉదయం నుంచి గృహ నిర్బంధంలోనే ఉంచడంతో టీజేఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంటి ఆవరణలోనే పార్టీ జెండాను ఆయన ఎగురవేశారు. పోరాటాలతోనే జన సమితి ఆవిర్భవించిందని, పార్టీ తొలి ఆవిర్భావ దినోత్సవం కూడా నిర్బంధాల మధ్య జరుపుకోవాల్సి వచ్చిందని కోదండరాం పేర్కొన్నారు. భూరికార్డుల ప్రక్షాళన కోసం టీజేఎస్ పోరాటాలు చేసిందని, ప్రజల భావవ్యక్తీకరణకు అనుగుణంగా పార్టీ ప్రయాణం సాగుతోందన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరే వరకు పోరాటాలు చేస్తామన్నారు. టీజేఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నాంపల్లిలోని కార్యాల యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం గురించి తెలియజేయడంతో అక్కడకు వెళ్లేందుకు కోదండరాంను పోలీసులు అనుమతించారు. అక్కడ ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన్ను, ఇతర నాయకులను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం సాయంత్రం కోదండరాంను, ఇతర పార్టీల నేతలను రాంగోపాల్‌పేట పోలీసు స్టేషన్ నుంచి విడుదల చేశారు. బాధితులకు న్యాయమేదీ... ఇంటర్ ఫలితాల విషయంలో తప్పు జరిగిందని అం గీకరించాక, సమస్య పరిష్కారానికి చర్యలతోపాటు బాధితులకు న్యాయం చేసేందుకు కార్యాచరణను ప్రకటించాల్సిన ప్రభుత్వం అటువంటిదేమీ చేయలేదని కోదండరాం విమర్శించారు. విడుదలయ్యాక ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఫలితాల గందరగోళానికి కారణమైన కంపెనీకి సామర్థ్యం లేకపో యినా బాధ్యతలు అప్పగించిన కార్యదర్శిపై చర్యలు తీసుకోకపోవడం, విద్యార్థుల పరీక్షాపత్రాల మూ ల్యాంకనంపై సమీక్ష నిర్వహించపోవడం, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు నష్టపరిహారంపై కార్యాచరణను ప్రకటించకపోవడం ప్రభుత్వ తప్పిదమన్నారు. దీనిపై శాంతియుతంగా, చట్టబద్ధంగా నిరసనలు తెలిపేందుకు ప్రయత్నించిన రాజకీయ పార్టీలు, విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులను ఆదివారం అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు చేయడం అక్రమమన్నారు. అక్రమ నిర్బంధాన్ని ప్రయోగించి ఇదే తమ నిర్ణయం అని పోలీసుల ద్వారా ప్రభుత్వం ప్రకటించినట్లు అయిందని ఆయన పేర్కొన్నారు. -
రాజకీయాల్లో కొత్త పంథా.. ఆవిష్కరించాం
సాక్షి, హైదరాబాద్: ‘రాజకీయాల్లో కొత్త పంథాను ఆవిష్కరించాలనే మా ప్రయత్నం విజయవంతం అయిందనే భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కేవలం సంక్షేమానికే పరిమితం కాకుండా పింఛన్లు, రైతుబంధు పెంపు, నిరుద్యోగ భృతి లాంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చేలా అధికార పార్టీపై ఒత్తిడి తేవడంలో సఫలీకృతమయ్యాం. ఉద్యమ ఆకాంక్షలు, వెలుగుల ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాం. ఏడాది కాలంలో రాజకీయంగా ఎంతో నేర్చుకున్నాం. గుణపాఠాల నుంచి వచ్చిన అనుభవాలు మమ్మల్ని మరింత రాటుదేలుస్తున్నాయి. ప్రజలపక్షాన నిలబడేందుకు బలంగా ముందుకెళ్లే తోవ చూపెడుతున్నాయి’అని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆ పార్టీ అధినేత ఎం. కోదండరాం తెలిపారు. టీజేఎస్ ఏర్పాటైన నాలుగు నెలలకే వచ్చిన అసెంబ్లీ ఎన్నికలను దీటుగా ఎదుర్కోలేకపోయామన్నారు. అయితే ఓ రాజకీయ పార్టీగా ఎన్నికల్లో ఎలా పాల్గొనాలో నేర్చుకున్నామని, జూన్‌లో జరిగే ప్లీనరీలో గత కార్యక్రమాలను సమీక్షించుకొని కొత్త ఎజెండాతో ప్రజల ముందుకు వెళ్తామని చెప్పారు. టీజేఎస్ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా కోదండరాం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. పార్టీ ప్రస్థానంతోపాటు టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యవహార శైలి, అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి వైఫల్యం, రాజకీయాల్లోకి మధ్యతరగతి, యువత రావాల్సిన ఆవశ్యకత లాంటి అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇంటర్వూ్యలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... కొత్తవారు రాజకీయాల్లో చేరాలి... రాజకీయాలు అనగానే భయపడాల్సిన అవసరం లేదు. మధ్యతరగతికి చెందిన వారు, డిగ్రీలు, పీజీలు లేకుండానే సమాజంలో తమ పద్ధతిలో కార్యక్రమాలు చేపడుతున్న వారు రాజకీయాల్లోకి రావాలి. తమకు జరుగుతున్న అన్యాయంపై 125 మంది నిజామాబాద్ జిల్లా రైతులు లోక్‌సభ ఎన్నికల్లో నామినేషన్లు వేయడం, మహబూబాబాద్ జిల్లాలో ఆదివాసీలు అటవీ హక్కుల చట్టంపై కదలడం దేశ చరిత్రలోనే అపూర్వమైన ఘటనలు. సమస్య ప్రాతిపదికగా కదిలితే ఎన్నికల్లో, రాజకీయాల్లో పైసలు కీలకం కాదని, ప్రత్యామ్నాయ రాజకీయం సాధ్యమని నిరూపించారు. అన్యాయాలను ఎలుగెత్తి చూపాం... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష చాలా బలీయమైనది. సామాజిక, ఆర్థిక దోపిడీలకు వ్యతిరేకంగా నిలబడ్డ తెలంగాణ సమాజం సాధించుకున్న రాష్ట్రంలో రాజకీయంగా మా వంతు పాలుపంచుకోవాలనే ఉద్దేశంతోనే పార్టీని ఏర్పాటు చేశాం. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా కుంగిపోలేదు. తెలంగాణ సమాజం కోరుకున్న రాష్ట్రాన్ని సాధించాలనే తపనతోనే పార్టీని ఏర్పాటు చేశాం. అందులో భాగంగా చాలా ప్రజాసమస్యలను ఎజెండాపైకి తీసుకువచ్చాం. ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ఓ మార్గాన్ని నిర్మించగలిగాం. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చూపగలిగాం. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి వైఫల్యం మాకో గుణపాఠం లాంటిది. భవిష్యత్తులో కూడా ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలపైనే దృష్టి సారించి ముందుకెళ్తాం. ఆ పార్టీల స్ఫూర్తితో ముందుకు... ప్రజల ఆకాంక్షలకు రాజకీయ దృక్పథం ఇవ్వడం మా బాధ్యత. దాన్ని రాజకీయ పార్టీగా నిర్వర్తించడం పెద్ద సవాలే. రాజకీయమంటే డబ్బు వెదజల్లి మళ్లీ డబ్బు దండుకోవడమే అనే స్వభావంలో కూడా మార్పు రావాలి. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా నైతిక ఆచరణను ఎంచుకొని నిలబడే వాళ్లు తక్కువగానే కనిపిస్తున్నారు. అయినా టీజేఎస్ నైతికత, విలువలతో కూడిన రాజకీయాలే ప్రధాన ఎజెండాగా ఎలాంటి అండదండలు లేకుండానే పెద్ద రాజకీయ శక్తిగా అవతరించిన ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీల స్ఫూర్తితో ముందుకెళ్తాం. ఆయన మాట ఎప్పటికీ గుర్తుంటుంది... రాష్ట్రం ఏర్పడ్డాక దాని నిర్మాణం ప్రజాస్వామ్య స్వరూపం సంతరించుకునేలా చేయడం చాలా కష్టం. దాని కోసం సుదీర్ఘ పోరాటం చేయాల్సి ఉంటుందని ఆచార్య జయశంకర్ చెప్పిన మాట ఎప్పటికీ గుర్తుంటుంది. ఆయన ఆశయాలకు భిన్నంగా రాష్ట్రంలో ప్రస్తుతం విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో గెలిచాక కూడా బలాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో అధికార పార్టీ ముందుకెళ్తోంది. రాష్ట్రంలో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణి ప్రభుత్వంలో కనిపిస్తోంది. అయితే సంక్షేమ పథకాల అమలే కాకుండా ప్రజాస్వామికంగా వ్యవహరించడం ప్రభుత్వ బాధ్యత. దీన్ని మర్చిపోయి వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరు. ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ప్రజలకుండాలి. ప్రభుత్వాలు ప్రజాస్వామికంగా వ్యవహరించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. నేడు టీజేఎస్ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆవిర్భావ దినోత్సవం సం దర్భంగా సోమవారం ఉదయం 9 గంటలకు అధ్యక్షుడు కోదండరాం పార్టీ జెండాను ఎగురవేస్తారు. కార్యక్రమాల్లో ఆయనతోపాటు ఇతర నేతలు హాజరవుతారని టీజేఎస్ అధికార ప్రతినిధి, మీడియా కోఆర్డినేటర్ వి.యోగేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ విద్య సంక్షోభం, విద్యార్థుల ఆత్మహత్యలు, విద్యార్థుల పోరాటాలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ ఉత్సవాలను భారీగా నిర్వహించకుండా స్థానికంగా ఎక్కడికక్కడ పార్టీ జెండాలు ఎగురవేయాలని పార్టీకేడర్‌కు ఇదివరకే కోదండరాం విజ్ఞప్తిచేసిన విషయం తెలిసిందే. -
చదువుకుంటే చనిపోవాల్సి వస్తోంది..
హైదరాబాద్(పంజగుట్ట): ఈ నెల 29న ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టాలని తెలంగాణ జనసమితి(టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజమే ఈ ధర్నాకు పిలుపునిచ్చిందని భావించి విద్యార్థి సంఘాలు, అన్ని పార్టీల నాయకులు హాజరు కావాలని కోరారు. ఇంటర్ పరీక్షాఫలితాల్లో 61 వేల తప్పిదాలు వచ్చాయని, దీనికి అనుభవంలేని గ్లోబరీనా సంస్థే కారణమని అన్నారు. ‘చదువుకుంటే బాగుపడతారని అనుకుంటాం, కానీ చదువుకుంటే చనిపోతాం’అని ఇప్పుడే తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి జనసమితి అధ్యక్షుడు నిజ్జన రమేశ్ ముదిరాజ్ అధ్యక్షతన శుక్రవారం ఇక్కడి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘ఇంటర్ ఫలితాలు... దోషులు ఎవరు? పరిష్కారం ఏది?’అనే అంశంపై జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్, టీజేఎస్ నేత ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్రావుతోపాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు హాజరయ్యారు. అన్ని సంఘాలను, పార్టీలను ఏకం చేసి ఉద్యమించే బాధ్యతను కోదండరాంకు అప్పగించాలని, ఇంటర్ ఫలితాల అంశంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని సమావేశం తీర్మానించింది. కోదండరాం మాట్లాడుతూ గతంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎంతో బాధ్యతగా పనిచేసిందని, దాన్ని కాదని గ్లోబరీనా అనే ప్రైవేట్ సంస్థకు ఇంటర్ పరీక్షల బాధ్యత అప్పగించినప్పటి నుండీ ఎన్నో సమస్యలు వచ్చాయన్నారు. పరీక్ష ఫీజు చెల్లించే సమయంలోనూ తీవ్ర గందరగోళం జరిగిందని, అప్పుడే ఇంటర్ బోర్డు మేల్కొని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదన్నారు. సంస్థ వెనక ఎవరో ఉన్నారని, వారి స్వార్థ ప్రయోజనాల కోసం పిల్లల జీవితాలతో ఆడుకున్నారని, లక్షలాదిమంది పిల్లల ప్రాణాలను పణంగా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లోబరీనా సంస్థ చేస్తున్న తప్పుల గురించి ముందే తెలుసుకున్న కాలేజీ ప్రిన్సిపాళ్లు ఏదైనా తప్పులు జరిగితే తమకు సంబంధంలేదని, వారి సంఘం తరపున తీర్మానం చేసి బోర్డు సెక్రటరీకి ఇచ్చారని, అయినా ప్రభుత్వంలో ఉలుకూపలుకూ లేదని దుయ్యబట్టారు. సమాజానికి పిల్లర్ల వంటి పిల్లలకు అన్యాయం జరుగుతుంటే ఆవేదనగా ఉందన్నారు. గ్లోబరీనాకు పర్చేస్ ఆర్డరే ఉంది.. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ ‘గ్లోబరీనా, రాష్ట్ర ప్రభుత్వం ఐక్యంగా పనిచేస్తున్నాయి. కానీ మనమే సంఘాలుగా విడిపోయి నిరసనలు చేస్తున్నాం, ఇప్పటికైనా అందరం ఐక్యమై ఉద్యమించాలి’అని అన్నారు. ‘ఇంత జరుగుతున్నా ఏం జరగలేదు, అన్ని అపోహలు, రాజకీయం చేస్తున్నారని అంటున్నారు, ఏం జరగకపోతే ఇన్ని ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయి?, ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి’అని ప్రశ్నించారు. గ్లోబరీనా సంస్థకు కేవలం పర్చేస్ ఆర్డర్ మాత్రమే ఉందని, అగ్రిమెంట్ లేదని, అగ్రిమెంట్ లేకుండా ఎంతో గోప్యంగా ఉంచాల్సిన విద్యార్థుల మార్కుల జాబితా వ్యవహారాన్ని ఒక ప్రైవేట్ సంస్థకు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. ఎంసెట్ లీకేజీ, నయీం కేసు మాదిరిగా ఈ కేసు కూడా నీరుగారిపోకుండా ఐక్యంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. రమేష్ ముదిరాజ్ మాట్లాడుతూ మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని, గ్లోబరీనా సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, టీడీఎఫ్ అధ్యక్షుడు డీపీ రెడ్డి, ప్రొఫెసర్ రమేశ్‌రెడ్డి, నాయకులు బైరి రమేశ్, వెంకట్, భవాని, మమత, సత్యనారాయణ, అరుణ్ కుమార్, వెంకట్ స్వామి, గోపాల్ శర్మ, తదితరులు పాల్గొన్నారు. నియంత పాలన నడుస్తోంది... మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ తెలంగాణలో నియంత పాలన నడుస్తోంది. క్యాబినెట్ లేదు, ఎవ్వరూలేరు. అన్ని నేనే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 23 మంది విద్యార్థుల ఆత్మహత్యకు కారణం ముఖ్యమంత్రే అని, ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గ్లోబరీనా సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో నిషేధానికి గురైందని, అలాంటి దానికి కాంట్రాక్ట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీని వెనక ఎవరు ఉన్నారనే విషయంపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘మంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని అందరూ అంటున్నారు, కాని నిర్ణయాలన్నీ ప్రగతిభవన్ నుండి ముఖ్యమంత్రే చేస్తున్నారు. తెలంగాణలో వ్యవస్థ నడవడంలేదు, కేవలం నేను, నా కుటుంబం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’అని అన్నారు. -
బోర్డు రద్దు యోచన సమర్థనీయం కాదు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్‌బోర్డు బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించాయని తెలంగాణ జన సమి తి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ధ్వజమెత్తారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిగితేనే అన్ని విషయాలు బయటికి వస్తాయని, విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. పరీక్షల ఫీజుల వసూలు మొదలు ఫలితాల ప్రకటన వరకు విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాల్సింది పోయి, బోర్డునే రద్దు చేయాలని ఆలోచించడం సమర్థనీయం కాదన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ చేస్తున్నట్టుగా వస్తున్న ప్రతిపాదనలను తాము అంగీ కరించే ప్రసక్తి లేదన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన విధులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలన్న ఆలోచన సరికాదన్నారు. గురువారం పార్టీ నాయకులు ప్రొ.పీఎల్ విశ్వేశ్వర్రావు, రమేశ్‌రెడ్డి, భావనారెడ్డి, రమేశ్ ముదిరాజ్‌లతో కలసి కోదండరాం విలేకరులతో మాట్లాడారు. ఇంటర్ ఫలితాల గందరగోళానికి టీఆర్ఎస్ అధినాయకత్వం, బోర్డు కార్యదర్శి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బాధ్య త వహించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై నైతికబాధ్యత వహించి విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గ్లోబరీనాను ఎందుకు వెనుకేసుకొస్తున్నారు... బోర్డు కార్యదర్శి, ఇతర అధికారులు ఎవరి ప్రయోజనాలు కాపాడడానికి గ్లోబరీనా సంస్థను వెనకేసుకొస్తున్నారో చెప్పాలని కోదండరాం డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో నైపుణ్యం, సామ ర్థ్యం లేని ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడిన కీలకబాధ్యతలు ఇంటర్ బోర్డ్ ఎలా అప్పగించిందని ప్రశ్నించారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి అన్ని విషయాలు తెలుసని, అయినా చర్యలు తీసుకోలేకపోయారని ఆరోపించారు. రీవాల్యుయేషన్, రీ వెరిఫికేషన్‌కు పట్టే సమయం, ఇతరత్రా విషయాల్లోనూ హైకోర్టుకు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చిందని, ఈ వ్యవహారంలో తాము కూడా ఇంప్లీడ్ అవుతామని వెల్లడించారు. చివరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేసే దుస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద టీజేఎస్ రిజిస్టర్ పార్టీ అని, అయినా జెడ్పీటీసీ అభ్యర్థులకు అగ్గిపెట్టె, ఎంపీటీసీ అభ్యర్థులకు గ్యాస్‌సిలిండర్ గుర్తులు కేటాయించారని, ఎన్నికల కమిషన్ చేసిన లోపం వల్ల తమ అభ్యర్థులు, పార్టీ ఇబ్బందులు పడాల్సి వస్తోం దని కోదండరాం అన్నారు. గురువారం ఈ అంశాన్ని తాము కమిషనర్ నాగిరెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. -
టీజేఎస్‌కు షాకిచ్చిన రచనా రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ జన సమితి (టీజేఎస్)కు భారీ షాక్ తగిలింది. పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు, న్యాయవాది రచనా రెడ్డి ఆదివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీజేఎస్ ఛైర్మన్ కోదండరాంపై తీవ్ర విమర్శలతో మండిపడ్డారు. ఎన్నికలకు ముందే మహాకూటమి ఫిక్స్ అయ్యిందని, కోదండరాం కూటమితో అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నారని ఆమె ఆరోపించారు. మహాకూటమిలో సామాజిక న్యాయం జరగలేదని, కోదండరాంను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆమె అన్నారు. మైనార్టీలకు టీజేఎస్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని.. ఇక మైనార్టీలకు ఏవిధంగా న్యాయం జరిగినట్లని ఆమె ప్రశ్నించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూటమిలో టికెట్లు ఇచ్చారని, ఈ కుమ్మక్కులో కోదండరాం కూడా భాగస్వామిగా ఉన్నారని పేర్కొన్నారు. కూటమిలో చాలామంది నేతలను బలిపశువులను చేశారని మండిపడ్డారు. కోదండరాం కాంగ్రెస్‌తో కలిసి తనకు తానే ఓటమి చెందుతున్నారని, అసలు కూటమి గెలవడానికా లేక ఓడిపోవడానికా అని ఆమె ప్రశ్నించారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కూటమి కూర్పు లేదని, దానిలో నేతలు రాజకీయ బ్రోకర్లుగా తయారయ్యారని ఆమె ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలకు ఇంగితజ్ఞానం ఉందని, చంద్రబాబు ప్రచారాన్ని తిరస్కరిస్తారని అన్నారు. -
టీజేఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
టీజేఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహబూబ్‌నగర్ టిక్కెట్ రాజేందర్‌కు ఇవ్వాలని ఆ పార్టీ కార్యకర్త మల్లేష్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుకుసున్న కోదండరాం వెంటనే నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుని కార్యకర్తలను బుజ్జగిస్తున్నారు. సీట్ల సర్దుబాట్లపై మరోసారి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్ రమణతో కోదండరాం భేటీ కానున్నారు. నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో వీరు సమావేశం కానున్నారు. సీట్లపై క్లారిటీ.. మహాకూటమి సీట్ల సర్దుబాటు అంశం చివరి దశకు చేరింది. నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో కోదండరాం, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఎల్ రమణ భేటీ అయ్యారు. మరోవైపు సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో చాడ వెంకట్‌రెడ్డితో ఏఐసీసీ కార్యదర్శి పాల్గొన్నారు. ఈరోజు రాత్రి వరకు సీట్ల విషయం తెల్చాలని సీపీఐ, టీజేఎస్ డిమాండ్ చేస్తున్నాయి. సీట్లపై క్లారిటీ ఇవ్వని పక్షంలో తాము వేరు కుంపటి పెట్టుకుంటామని భాగస్వామ్య పార్టీలు తేల్చిచెప్పడంతో కాంగ్రెస్ వేగం పెంచింది. దీంతో సీట్ల విషయం తుది దశకు చేరుకుందని కూటమి నేతలు భావిస్తున్నారు. -
‘సీట్ల పంపకాలపై చర్చ జరగలేదు’
శంషాబాద్: ఢిల్లీలో సీట్ల పంపకాలపై ఎలాంటి చర్చ జరగలేదని టీజేఎస్ అధినేత కోదండ రాం స్పష్టం చేశారు. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన ఆయనకు ఆ పార్టీ నేతలు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోదండరాం మీడియాతో మాట్లాడారు. కూటమి ఏర్పాటులో జరుగుతున్న జాప్యం.. కూటమితో కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి వివరించినట్లు చెప్పారు. కూటమి ఏర్పాటు త్వరగా పూర్తయితే తద్వారా మంచి ఫలితాలు పొందవచ్చనే అంశంపై చర్చించినట్లు తెలిపారు. ‘కాంగ్రెస్‌తో పొత్తుపై పునరాలోచించండి’ కాజీపేట: కాంగ్రెస్‌తో పొత్తుపై పునరాలోచించాలని సీపీఐ, టీజేఎస్‌ను బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం కోరారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భావసారూప్యత లేని కాంగ్రెస్ పార్టీ వేసే నాలుగు సీట్ల కోసం పాకులాడటాన్ని వదిలి తమతో కలసి వస్తే సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తామన్నారు. బీసీలకే రాజ్యాధికారం అనే నినాదాన్ని బలపర్చడం కోసం ప్రొఫెసర్ కోదండరాం, చాడ వెంకటరెడ్డి పెద్ద మనసుతో ఆలోచించాలని మరోమారు విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. -
స్థానికతపై స్పష్టత అవసరం
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రపతి ఆమోదించిన కొత్త జోనల్ వ్యవస్థ గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న స్థానికత విషయంలో మరింత స్పష్టత అవసరమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ ఇచ్చిన ఉత్తర్వుల్లోని అంశాలపై న్యాయవాదులు, ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత మరింత లోతుగా మాట్లాడుతానన్నారు. 95% స్థానిక రిజర్వేషన్ మంచిదేనన్నారు. తెలంగాణ కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన అమరులకు గౌరవం దక్కడంలేదని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోలేదని కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. హరికష్ణ స్మతివనానికి స్థలం కేటాయించి గౌరవించినట్లే తెలంగాణ కోసం జీవితాలను త్యాగం చేసిన కొండాలక్ష్మణ్ బాపూజీ, ప్రొఫె సర్ కేశవరావు జాదవ్, గూడ అంజన్న వంటి వారిని కూడా గౌరవించాలన్నారు. తెలంగాణ అమర వీరుల స్మారక చిహ్నం ఏర్పాటు కోసం సెప్టెంబరు 12న పార్టీ కార్యాలయంలో ఒకరోజు నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు. -
కొలువు కొట్లాట సభకు శ్రీకాంతాచారి పేరు
-
గోడలు, కిటికీలను విచారిస్తారా?
యూనివర్సిటీలో ఉన్నప్పుడే కమిటీని పంపాలి: ప్రొ. కోదండరాం వరంగల్: సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ మృతికి కారుకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థులు ఈనెల 23న ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారని, అయితే కేంద్ర ప్రభుత్వం ఆ రోజే విచారణ కమిటీని హైదరాబాద్‌కు పంపించడం ఏమిటని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు. విద్యార్థులు లేనప్పుడు విచారణ ఎలా జరుపుతారన్నారు. వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తెలంగాణ ఉద్యమ అమరుడు పిల్లి గిరిబాబు వర్ధంతి సభను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. 23న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులంతా ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేపడుతున్నారని, ఆ రోజు విచారణకు వచ్చి గోడలు, కిటికీలను విచారిస్తారా? అని ఎద్దేవా చేశారు. రోహిత్ మృతిపై వాస్తవాలు మరుగనపడేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈనెల 23న కాకుండా.. విద్యార్థులు యూనివర్సిటీలో ఉండే.. మరో రోజు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. -
ముగిసిన ఇఫ్టూ రాష్ట్ర మహాసభలు
గోదావరిఖని : సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ అనుబంధంగా పనిచేస్తున్న భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టూ) రాష్ట్ర 8వ మహాసభలు సోమవారం జరిగిన ప్రతి నిధుల మహాసభతో ముగిశాయి. ఆదివారం భారీ ప్రదర్శనతోపాటు పోచమ్మ మైదానంలో బహిరంగ సభ నిర్వహిం చగా.. ఈ సభకు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య హాజరయ్యారు. సోమవారం కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని రాజస్థాన్భవన్లో జరిగిన ప్రతినిధుల సభలో తెలంగాణ జేఏసీ కో-చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రొఫెసర్ సూరెపల్లి సుజాత పాల్గొన్నారు. రెండు రోజులపాటు సాగిన ఈ మహాసభలో సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు కార్మిక వర్గం చైతన్యవంతమైన పాత్రను పోషించాలని, ఇందుకు ఇఫ్టూ నాయకత్వం వహించాలని అతిథులు సూచించారు. సింగరేణిలో ఓసీపీల వల్ల విధ్వంసం జరుగుతోందని, యాంత్రీకరణ పేరుతో కార్మికుల సజనాత్మకతను దెబ్బతీస్తూ వారు అనారోగ్యాల బారిన పడేలా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని, దీనిని కార్మిక సంఘాలు అడ్డుకోవాలన్నారు. కొత్తగా భూగర్భ గనులు ప్రారంభించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని అతిథులు ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీలో చీలిక ఏర్పడి చంద్రన్న వర్గం, రాయల సుభాష్ వర్గంగా మారిన క్రమంలో చంద్రన్న వర్గానికి చెందిన నాయకత్వం గోదావరిఖనిలో మహాసభలను ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించింది. ఈ మహాసభలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరు కావడం గమనార్హం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కొత్త కమిటీలను రూపొందించే పనిలో నాయకత్వం నిమగ్నమైంది. ఈ వివరాలను మంగళవారం వెల్లడించనున్నారు. -
ఓపెన్‌కాస్ట్‌ల విధ్వంసం ఆపాలి
గోదావరిఖని, న్యూస్‌లైన్ : సింగరేణిలో మానవ జీవితాలను కొల్లగొడుతున్న ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల విధ్వంసం ఆగాల్సిందేనని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. గోదావరిఖనిలోని పోచమ్మ మైదానం(యు.రాములు ప్రాంగణం)లో ఆదివారం రాత్రి భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇప్టూ) 8వ రాష్ట్ర మహాసభల సందర్భంగా బహిరంగ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ అధిక బొగ్గు ఉత్పత్తి పేరుతో పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ప్రజల జీవన విధానాన్ని బొందల గడ్డలలో కప్పిపడేస్తున్న పరిస్థితి పూర్తిగా మారాలన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేలా భూగర్భ గనుల తవ్వకాన్ని పెంచాలని సూచించారు. ఇప్పటి వ రకు ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రకు చెందిన పది మంది కాంట్రాక్టర్లకే ఓసీపీలలో మట్టిని తొలగించే పనులు అప్పగించారని, ఇక నుంచి ఇలాంటి దోపిడీ విధానం పూర్తిగా మారాలన్నారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల అవసరం లేకుండా చేయాలని, సంస్థకు అవసరమైన పనిముట్లు, వస్తువులు సరఫరా చేసేందుకు అనుబంధ పరిశ్రమలు అధికంగా రావాలన్నారు. గోదావరిఖని నుంచి కాగజ్‌నగర్ వరకు కోల్‌కారిడార్ నిర్మించాలని, ఒక్కో ప్రాంతంలో ఒక్కో సెక్టార్‌ను అభివృద్ధి పరిచి, కాలుష్య రహిత పారిశ్రామికీకరణ చేపట్టాలన్నారు. సింగరేణి యాంత్రీకరణ వల్ల కార్మికుల్లో దాగి ఉన్న సృ జనాత్మకత తగ్గిపోతోందని, వారి ఆరోగ్యం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో ఎలా ఉండాలనే దానిపై కార్మికులు ఆలోచన చేయాలని, ప్రభుత్వం అడిగినప్పుడు ఏం కావాలో తెలపడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. సింగరేణిలో వెలుగులు నిండాలని జేఏసీ కోరుకుంటోందని తెలిపారు. కార్మిక సంక్షేమాన్ని మరిచిన సింగరేణి... సంధ్య సింగరేణిలో కార్మిక సంక్షేమాన్ని యాజమాన్యం మరిచిపోయిందని, వైద్య శాలలు, విద్యాసంస్థ లు మూసివేసి సింగరేణిని బొందల గడ్డగా మా ర్చి కార్మికుల జీవన విధానంపై గొడ్డలివేటు వేసిందని పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య ఆ రోపించారు. ఇన్నాళ్లుగా బొగ్గుబాయి అంటూ వేదికలపై ప్రసంగాలు చేసి నేడు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గని కార్మికుల సంక్షేమాన్ని బా ధ్యతగా తీసుకోవాలని కోరారు. పారిశ్రామిక అ భివృద్ధి అన్ని ప్రాంతాల్లో సమానంగా జరగాల ని, ఖమ్మం జిల్లా బయ్యారంలోనే స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇఫ్టూ రా ష్ట్ర అధ్యక్షులు ఎస్.వెంకటేశ్వర్రావు అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగసభలో ప్రధాన కార్యదర్శి ఎస్కే ముక్తార్‌పాషా, జె.సీతారామయ్య, బి.సంపత్‌కుమార్, ఐ.కృష్ణ, కె.విశ్వనాథ్, ఎం డీ చాంద్‌పాషా, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
టీడీపీ పాలనలో వనరుల విధ్వంసం
ఉద్యోగులకు ఆప్షన్లు వ్యతిరేకిస్తున్నాం: కోదండరాం జమ్మికుంట, తెలుగుదేశం పాలనలో తెలంగా ణలోని సహజ వనరులను కొల్లగొట్టి సీమాంధ్రకు కట్టబెట్టారని టీ-జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలతో పాటు తెలంగాణ ఉద్యోగాలను సైతం దోచుకున్నారన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆదివారం ప్రారంభమైన డీటీఎఫ్ జిల్లా మహాసభల్లో ‘తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం-ప్రజల ఆకాంక్షలు’ అనే అంశం పై ఆయన మాట్లాడారు. రాష్ట్రవిభజన తర్వాత ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వడం వాంఛనీయం కాదని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో సీమాంధ్ర పెట్టుబడిదారిశక్తులు చొరబడి ప్రభుత్వ రంగాన్ని విధ్వంసం చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ పునర్నిర్మాణం విషయం లో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. త్వరలో తెలంగాణలో అధికారం చేపట్టే ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు కృషి చేయాలన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజల ఆకాంక్షను గుర్తించకపోతే మరోసారి ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. విరసం నేత వరవరరావు ‘ఉపాధ్యాయుడు-సామాజిక బాధ్యత’ అనే అంశంపై ప్రసంగించారు. తెలంగాణలో ప్రజాస్వామిక పోరాటాన్ని పూర్తిచేసే బాధ్యత ఉపాధ్యాయులతో పాటు ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో మూడు లక్షల మంది ఆదివాసులు ఆవాసం కోల్పోతుంటే టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వారి తరఫున మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఆది నుంచి పాలకవర్గాలు విప్లవకారులను అణచివేస్తున్నాయని చెప్పారు. డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ.. పాలకవర్గాలు విద్యా ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ నైతికంగా విలువలను పాతరేస్తున్నాయని విమర్శించారు. -
మహనీయుల బాటలో నడవాలి
ఘట్కేసర్, న్యూస్‌లైన్: జాతి నిర్మాణంలో మహనీయులు చూపిన బాటలో నడవాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. బాబు జగ్జీవన్‌రాం 107వ జయంతిని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం కోదండరాం మాట్లాడారు. పేద, బడు గు, బలహీన, దళితవర్గాల ఉన్నతికి జగ్జీవన్‌రామ్, అంబేద్కర్‌లాంటి నేతలెంతో కృషి చేశారని, వారిని నేటితరం నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నా రు. పాలకులు కార్పొరేట్, అవినీతిపరులకు వత్తాసు పలుకుతూ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ను మేం అభివృద్ధి చేశామంటే మేమని గొప్పలు చెప్పుకోవడం కాదని.. పల్లెలు అభివృద్థి చెందినప్పుడే నిజమైన అభివృద్ధి అని అన్నారు. అభివృద్ధి ఫలాలు సామాన్యుడికి అందినప్పుడే సార్ధకత లభిస్తుందన్నారు. తెలంగాణ నిర్మాణంలో అందరికీ లబ్ధి చేకూరాలన్నారు. చిన్నతరహా, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలని, చేతి వృత్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.బంగారు తెలంగాణ నిర్మాణంలో జేఏసీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకుడు చెల్మారెడ్డి, బీజేపీ జెడ్పీటీసీ అభ్యర్థి కంభం లక్ష్మారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి రేసు లక్ష్మారెడ్డి పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.