శంషాబాద్: ఢిల్లీలో సీట్ల పంపకాలపై ఎలాంటి చర్చ జరగలేదని టీజేఎస్ అధినేత కోదండ రాం స్పష్టం చేశారు. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన ఆయనకు ఆ పార్టీ నేతలు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోదండరాం మీడియాతో మాట్లాడారు. కూటమి ఏర్పాటులో జరుగుతున్న జాప్యం.. కూటమితో కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి వివరించినట్లు చెప్పారు. కూటమి ఏర్పాటు త్వరగా పూర్తయితే తద్వారా మంచి ఫలితాలు పొందవచ్చనే అంశంపై చర్చించినట్లు తెలిపారు.
‘కాంగ్రెస్‌తో పొత్తుపై పునరాలోచించండి’
కాజీపేట: కాంగ్రెస్‌తో పొత్తుపై పునరాలోచించాలని సీపీఐ, టీజేఎస్‌ను బీఎల్‌ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం కోరారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భావసారూప్యత లేని కాంగ్రెస్ పార్టీ వేసే నాలుగు సీట్ల కోసం పాకులాడటాన్ని వదిలి తమతో కలసి వస్తే సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తామన్నారు. బీసీలకే రాజ్యాధికారం అనే నినాదాన్ని బలపర్చడం కోసం ప్రొఫెసర్ కోదండరాం, చాడ వెంకటరెడ్డి పెద్ద మనసుతో ఆలోచించాలని మరోమారు విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment