జాతి నిర్మాణంలో మహనీయులు చూపిన బాటలో నడవాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. బాబు జగ్జీవన్‌రాం 107వ జయంతిని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఘట్‌కేసర్, న్యూస్‌లైన్: జాతి నిర్మాణంలో మహనీయులు చూపిన బాటలో నడవాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. బాబు జగ్జీవన్‌రాం 107వ జయంతిని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం కోదండరాం మాట్లాడారు. పేద, బడు గు, బలహీన, దళితవర్గాల ఉన్నతికి జగ్జీవన్‌రామ్, అంబేద్కర్‌లాంటి నేతలెంతో కృషి చేశారని, వారిని నేటితరం నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నా రు.
పాలకులు కార్పొరేట్, అవినీతిపరులకు వత్తాసు పలుకుతూ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ను మేం అభివృద్ధి చేశామంటే మేమని గొప్పలు చెప్పుకోవడం కాదని.. పల్లెలు అభివృద్థి చెందినప్పుడే నిజమైన అభివృద్ధి అని అన్నారు. అభివృద్ధి ఫలాలు సామాన్యుడికి అందినప్పుడే సార్ధకత లభిస్తుందన్నారు.
తెలంగాణ నిర్మాణంలో అందరికీ లబ్ధి చేకూరాలన్నారు. చిన్నతరహా, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలని, చేతి వృత్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.బంగారు తెలంగాణ నిర్మాణంలో జేఏసీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకుడు చెల్మారెడ్డి, బీజేపీ జెడ్పీటీసీ అభ్యర్థి కంభం లక్ష్మారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి రేసు లక్ష్మారెడ్డి పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.