
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రపతి ఆమోదించిన కొత్త జోనల్ వ్యవస్థ గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న స్థానికత విషయంలో మరింత స్పష్టత అవసరమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ ఇచ్చిన ఉత్తర్వుల్లోని అంశాలపై న్యాయవాదులు, ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత మరింత లోతుగా మాట్లాడుతానన్నారు. 95% స్థానిక రిజర్వేషన్ మంచిదేనన్నారు.
తెలంగాణ కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన అమరులకు గౌరవం దక్కడంలేదని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోలేదని కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. హరికష్ణ స్మతివనానికి స్థలం కేటాయించి గౌరవించినట్లే తెలంగాణ కోసం జీవితాలను త్యాగం చేసిన కొండాలక్ష్మణ్ బాపూజీ, ప్రొఫె సర్ కేశవరావు జాదవ్, గూడ అంజన్న వంటి వారిని కూడా గౌరవించాలన్నారు. తెలంగాణ అమర వీరుల స్మారక చిహ్నం ఏర్పాటు కోసం సెప్టెంబరు 12న పార్టీ కార్యాలయంలో ఒకరోజు నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment