రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి అపహరించుకెళ్లాడు.
అర్వపల్లి, న్యూస్‌లైన్: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి అపహరించుకెళ్లాడు. సూర్యాపేట - జనగాం ప్రధాన రహదారిపై పర్సాయపల్లి స్టేజీ సమీపంలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మండలంలోని పర్సాయపల్లికి చెందిన బైరబోయిన సైదులు కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ శివారులోని బస్ స్టేజీ వద్ద నివాసం ఉంటున్నారు. సంక్రాంతి పండగకు ఇల్లు అలుక్కోవడానికి ఎర్రమట్టి కోసమని సైదులు భార్య సంధ్య కొత్తపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వద్దకు వెళ్తోంది.
మార్గమధ్యంలో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు పుస్తలతాడును కత్తిరించుకొని పరారయ్యా డు. వెంటనే ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరిగెత్తుకొచ్చి దొంగను తిరుమలగిరి వరకు వెంబడించినా ఫలితం లేకపోయింది. గొలుసును కత్తిరించే సమయంలో వారి మధ్య పెనుగులాట జరగడంతో సంధ్యకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఏఎస్‌ఐ లక్ష్మీనారాయణ సిబ్బందితో కలిసి సంఘట న స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.