
యువతి గొంతు కోసిన ఉన్మాది
► రక్తపు మడుగులో విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచిన యువతి
► భైంసాలో పట్టపగలే దారుణం
► ప్రేమ పేరుతో వేధింపులు.. చివరకు కత్తితో దాడి
► గతంలో పెళ్లి సంబంధం చెడగొట్టిన యువకుడు
వద్దన్నా ఆమె వెంటపడ్డాడు.. పెళ్లి చేసుకోవాలని బలవంతపెట్టాడు.. ఓ పెళ్లి సంబంధం చెడగొట్టాడు.. చివరికి తనకు దక్కదేమోనన్న అనుమానంతో గొంతు కోసి చంపాడు.. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో శనివారం పట్టపగలే ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉన్మాది గొంతు కోయడంతో యువతి రక్తపు మడుగులో విలవిల్లాడుతూ ప్రాణాలొదిలింది! భైంసా మండలం వాలేగాం గ్రామానికి చెందిన మారుతి, సరుబాయి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. వీరు భైంసా గోపాల్‌నగర్‌లో ఇల్లు కట్టుకున్నారు. పెద్ద కుమారుడు సారుునాథ్ పట్టణంలోని ఓ స్టీల్ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తుండగా.. రెండో కూతురు సవితకు వివాహం జరిపించారు.
చిన్న కూతురు సంధ్య(18) తల్లితోపాటు బీడీలు చుడుతోంది. మారుతి చనిపోవడంతో సరుబారుు, సారుునాథ్ కుటుంబ పోషణ చూస్తున్నారు. వీరి ఇంటి ముందే లోకేశ్వరం మండలం పొట్‌పల్లికి చెందిన మహేశ్(21) తన సోదరులతో కలసి ఉంటున్నాడు. ముథోల్‌లోని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న మహేశ్.. ప్రేమ పేరుతో సంధ్యను తరచూ వేధించేవాడు. పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడేవాడు. ఏడాదిన్నర క్రితం ఆమెకు పెళ్లి సంబంధాలు చూడగా.. మహేశ్ చెడగొట్టాడు. దీనిపై సంధ్య బంధువులు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మహేశ్‌ను మందలించి వదిలేశారు.
వెంట తెచ్చుకున్న కత్తితో..
శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు సంధ్య ఇంటికి సమీపంలోని కిరాణం దుకాణానికి వెళ్లింది. అప్పటికే కొద్దిదూరంలోనే మహేశ్ ఆమె కోసం కాపుగాశాడు. సంధ్య రాగానే మాటల్లోకి దింపి.. వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా గొంతు కోసి పరారయ్యాడు. రక్తపుమడుగులో గిలగిలా కొట్టుకొని సంధ్య అక్కడికక్కడే మృతి చెందింది. చుట్టుపక్కలవారి అరుపులు విని ఇంట్లోంచి తల్లి పరుగెత్తుకుంటూ వచ్చేలోపే చనిపోరుుంది. మృతదేహంపై పడి తల్లి, సోదరుడు సాయినాథ్ గుండెలవిసేలా రోదించారు. డీఎస్పీ అందె రాములు, సీఐ రఘు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు మహేశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. పట్టపగలే నడిరోడ్డుపై యువతిని చంపిన ఉన్మాదిని ఉరితీయాలని మహిళా సంఘాలు, స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు.