
కోల్‌కతా: కరోనా ఉదృతి నేపథ్యంలో మెజారిటీ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. కాగా ఉద్యోగాలు కోల్పోయిన 3,000 మంది ఐటీ ఉద్యోగులకు ప్రభుత్వం కర్మో భూమి పథకం ద్వారా ఉపాధి కల్పించింది. కాగా ఇతర రాష్ట్రాలలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న పశ్చిమ బెంగాల్ వాసులకు ఈ పథకం ద్వారా ఉద్యోగాలు ఇవ్వనున్నారు. మరోవైపు ఇప్పటి వరకు కర్మో భూమి పథకం ద్వారా ఉపాధి పొందేందుకు 37,000 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆర్థిక శాఖ మంత్రి అమిత్ మిశ్రా తెలిపారు.
రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు సిలిగిరి, కల్యాణి, దుర్గాపూర్ తదితర ప్రాంతాలలో 17 ఐటీ పార్క్‌లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ద్వితీయ, తృతీయ నగరాలలో ఐటీ పార్క్‌లు ఏర్పాటు చేయాలని సీఐఐ(కాన్పడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్)ను కోరామని మిత్రా తెలిపారు. మరోవైపు సిలికాన్ వ్యాలీలో 20 ఎకరాల భూమిని ఐటీ దిగ్గజం టీసీఎస్‌కు కేటాయించామని అన్నారు. టీసీఎస్ ఏర్పాటుతో రాష్ట్రంలోని ఐటీ ఉద్యోగుల కావాలనుకునే ఆశావాహులకు భారీగా ఉద్యోగాలు పొందనున్నారని పేర్కొన్నారు. (చదవండి: ఐటీ ఉద్యోగులకు హోం ఐసోలేషన్)
Comments
Please login to add a commentAdd a comment