amith mishra
-
పాకిస్తాన్ నటికి టీమిండియా మాజీ క్రికెటర్ దిమ్మతిరిగే కౌంటర్
టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా పాకిస్తాన్ నటికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. మిశ్రాను ట్రోల్ చేయాలని ప్రయత్నించిన యువతి.. తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డట్లయింది. విషయంలోకి వెళితే.. ఆసియా కప్ టోర్నీలో భాగంగా బుధవారం అఫ్గనిస్తాన్.. పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలవ్వడంతో టీమిండియా టోర్నమెంట్ నుంచి అధికారికంగా నిష్ర్కమించినట్లయింది. ఆఫ్గన్ గెలిచి ఉంటే భారత్‌కు ఎంతో కొంత ఫైనల్ అవకాశాలు మిగిలి ఉండేవి. కానీ ఆఖర్లో పాకిస్తాన్ బౌలర్ నసీమ్ షా రెండు సిక్సర్లు బాది తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు అఫ్గనిస్తాన్ మ్యాచ్ గెలవాలని టీమిండియా అభిమానులు బలంగా కోరుకున్నారు. అలా కోరుకున్నవారిలో టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా కూడా ఉన్నాడు. ఒకవేళ అఫ్గనిస్తాన్ పాక్‌పై గెలిస్తే మాత్రం.. ఈ వారం మొత్తం ''అఫ్గన్ చాప్''ను తింటానని ట్వీట్ చేశాడు. అయితే అఫ్గనిస్తాన్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన నటి సెహర్ షిన్వరీ అమిత్ మిశ్రాను ట్రోల్ చేయడానికి ప్రయత్నించింది. ''అఫ్గనిస్తాన్ ఓడిపోయింది.. పూర్ మిశ్రా.. ఈ వారం మొత్తం ఆవు పేడ తినాల్సిందే'' అంటూ కామెంట్ చేసింది. కాగా సెహర్ ట్వీట్‌కు వెంటనే బదులిచ్చిన అమిత్ మిశ్రా.. అయ్యో నాకు పాకిస్తాన్ వచ్చేందుకు ఎలాంటి ప్లాన్స్ లేవు అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 129 పరుగులు మాత్రమే చుసింది. అయితే బ్యాటింగ్‌లో తక్కువ స్కోరే చేసినప్పటికి ఆఫ్గన్ బౌలర్లు వికెట్లు తీసిన ప్రతీసారి టీమిండియా అభిమానులు పండగ చేసుకున్నారు. దాదాపు పాక్‌ను ఓడించినంత పని చేసిన అఫ్గనిస్తాన్‌ను ప్రశంసించారు. 119కే 9 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన నసీమ్ షా చివరి ఓవర్లో తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలచడంతో అఫ్గనిస్తాన్ ఓటమిపాలైంది. ఇక విజయంతో పాక్ ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ ఆదివారం(సెప్టెంబర్ 11న) పాకిస్తాన్, శ్రీలంక మధ్య ఫైనల్ పోరు జరగనుంది. Will eat Afghani chaap whole week if Afganistan defeats Pakistan today. Fingers crossed. #AFGvsPAK — Amit Mishra (@MishiAmit) September 7, 2022 No, I have no plans of coming to Pakistan. 👍 https://t.co/HbFWeZSjij — Amit Mishra (@MishiAmit) September 8, 2022 చదవండి: Naseem Shah: మ్యాచ్‌ను శాసించిన సిక్సర్ల కోసం బ్యాట్‌ను అప్పుగా.. ఆస్ట్రేలియానే దారుణమనుకుంటే.. అంతకన్నా చెత్తగా ఆడి! -
IPL 2022: వేలంలో అమ్ముడుపోలేదు.. కానీ ఇప్పటికీ అమిత్ పేరిట చెక్కు చెదరని రికార్డు
Hat trick in IPL: అమిత్ మిశ్రా.. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్. క్యాష్ రిచ్ లీగ్‌లో 154 మ్యాచ్‌లు ఆడిన అతడు 7.35 ఎకానమీతో 166 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఐపీఎల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక తన కెరీర్లో ఎక్కువ కాలం పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ టీమిండియా వెటరన్ ఆటగాడికి మెగా వేలం-2022లో చుక్కెదురైన విషయం తెలిసిందే. రూ. 1.5 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అమిత్ పట్ల ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపకపోవడంతో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఇలా అమిత్ మిశ్రాకు ఈ ఏడాది చేదు అనుభవం మిగిల్చింది. అయితే, లీగ్ చరిత్రలో తన పేరిట ఉన్న చెక్కు చెదరని రికార్డును గుర్తుచేసుకుంటూ అభిమానులు అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. కాగా ఐపీఎల్లో అత్యధిక హ్యాట్రిక్‌లు సాదించిన ఆటగాడిగా అమిత్ మిశ్రా రికార్డులకెక్కాడు. అతడి పేరిట మూడు హ్యాట్రిక్‌లు ఉన్నాయి. ఆ తర్వాత యువరాజ్ సింగ్(2), మఖయా ఎంతిని(1), అజిత్ చండీలా(1), సామ్యూల్ బద్రీ(1) టాప్-5లో ఉన్నారు. ఇక ఎక్కువ కాలం పాటు తమతో ప్రయాణం సాగించిన ఈ టీమిండియా వెటరన్ లెగ్ స్పిన్నర్‌ను వదిలేయడం పట్ల.. ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని పార్థ జిందాల్ భావోద్వేగ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ జట్టు ఎప్పటికీ నీదే.. నీ సేవలు ఉపయోగించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ ఆయన పేర్కొన్నారు. ఇక ఇందుకు స్పందించిన అమిత్.. ఢిల్లీకి ఎప్పుడు తన సేవలు అవసరమైనా సరే.. అందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానంటూ బదులిచ్చాడు. ఈ నేపథ్యంలో అమిత్ రానున్న కాలంలో ఢిల్లీ సిబ్బందిలో చేరే అవకాశం ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే ప్రాక్టీసు మొదలెట్టేసింది. చదవండి: IPL 2022: అందరూ ధోని కెప్టెన్సీలో ఆడాలని కోరుకుంటారు.. కానీ నేను మాత్రం: రషీద్ ఖాన్ First Speech of #IPL2022 and we're already battling limitless emotions & infinite goosebumps 🥺@RickyPonting addresses the DC Squad with his first Training Speech ahead of #TATAIPL 💪#YehHaiNayiDilli #IPL2022 pic.twitter.com/ltVNhCsRUJ — Delhi Capitals (@DelhiCapitals) March 21, 2022 -
అమిత్ మిశ్రాను ఆడించాలి
ముంబై : ఎక్కువ వయసు ఉన్న ఆటగాళ్లతో నిండిన చెన్నై జట్టు యువకులతో కూడిన ఢిల్లీతో పోరుకు సిద్ధమైంది. అయితే టి20ల్లో యువకులకే మంచి అవకాశం ఉందని దీనర్థం కాదు. ఇన్నేళ్లుగా బాగా ఆడుతున్న చెన్నై బలం, చురుకుదనంకంటే ప్రతిభ, పట్టుదల కీలకమని నిరూపించింది. ముంబైతో మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్ తీసిన పీయూష్ చావ్లాను చూస్తే ఇది అర్థమవుతుంది. అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఢిల్లీ, ఇవే అంశాల్లో ఎంతో అనుభవం ఉన్న చెన్నైనుంచి సవాల్ ఎదురు కానుంది. గత మ్యాచ్‌లో రాజస్తాన్ చేతిలో ఓడినా చెన్నైకి కొన్ని సానుకూలతలు కూడా ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడిన డు ప్లెసిస్ రెండో మ్యాచ్‌లో దానికి పూర్తి భిన్నంగా దూకుడుగా చెలరేగిపోయాడు. వాట్సన్ కూడా ఫామ్‌లోకి వచ్చాడు. అవుట్ అయ్యాక అతనిలో అసహనం చూస్తే 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలమని భావించి ఉంటాడు. ఇలాంటిదే చెన్నైకి కావాలి. ముంబైపై అద్భుతంగా ఆడిన రాయుడు దురదృష్టవశాత్తూ గాయపడటం కొంత ఇబ్బందిగా మారింది. సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి దిగినా...తొలి మ్యాచ్‌లోనే అతను ఆడిన చూడచక్కటి షాట్లని బట్టి చూస్తే రాయుడు ఎంత సన్నద్ధంగా ఉన్నాడో అర్థమవుతుంది. ఢిల్లీతో పోలిస్తే బౌలింగ్‌లో చెన్నై బలహీనంగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై జడేజా సహా ఐదుగురు బౌలర్లనే వాడటం అంత మంచి వ్యూహం కాదు. గత మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో గెలిచిన ఢిల్లీకి ఈ పిచ్ బాగా సహకరిస్తుంది. ముఖ్యంగా స్టొయినిస్‌కు ఇది మరో మంచి అవకాశం. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీశాక అశ్విన్ గాయపడటం బాధాకరం. అతని స్థానంలో రెగ్యులర్ స్పిన్నర్‌కే అవకాశం ఇవ్వాలి. అమిత్ మిశ్రా అందుకు సరిపోతాడు. డీన్ జోన్స్ మరణ వార్త నన్ను బాగా కలచివేసింది. ఆటగాడిగా ఉన్నప్పుడు నేను తీసిన ఏకైక వికెట్ అతనిదే. కామెంటరీ సహచరుడిగానే కాకుండా బయట కూడా నాకు ఆప్తమిత్రుడు. ఎప్పుడూ నవ్వుతూ, నవి్వస్తూ ఉండేవాడు. సచిన్‌కంటే నువ్వే గొప్ప అంటూ ఒకసారి నవజ్యోత్ సిద్ధూను ఎగదోసి మేమిద్దరం పెద్ద రచ్చ చేసి తర్వాత బాగా నవ్వుకున్న ఘటన అందులో ఒకటి. డీన్...నువ్వు ఎప్పటికీ గుర్తుండిపోతావు. -
3 వేల ఐటీ నిపుణులకు తిరిగి ఉద్యోగాలు..
కోల్‌కతా: కరోనా ఉదృతి నేపథ్యంలో మెజారిటీ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. కాగా ఉద్యోగాలు కోల్పోయిన 3,000 మంది ఐటీ ఉద్యోగులకు ప్రభుత్వం కర్మో భూమి పథకం ద్వారా ఉపాధి కల్పించింది. కాగా ఇతర రాష్ట్రాలలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న పశ్చిమ బెంగాల్ వాసులకు ఈ పథకం ద్వారా ఉద్యోగాలు ఇవ్వనున్నారు. మరోవైపు ఇప్పటి వరకు కర్మో భూమి పథకం ద్వారా ఉపాధి పొందేందుకు 37,000 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆర్థిక శాఖ మంత్రి అమిత్ మిశ్రా తెలిపారు. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు సిలిగిరి, కల్యాణి, దుర్గాపూర్ తదితర ప్రాంతాలలో 17 ఐటీ పార్క్‌లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ద్వితీయ, తృతీయ నగరాలలో ఐటీ పార్క్‌లు ఏర్పాటు చేయాలని సీఐఐ(కాన్పడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్)ను కోరామని మిత్రా తెలిపారు. మరోవైపు సిలికాన్ వ్యాలీలో 20 ఎకరాల భూమిని ఐటీ దిగ్గజం టీసీఎస్‌కు కేటాయించామని అన్నారు. టీసీఎస్ ఏర్పాటుతో రాష్ట్రంలోని ఐటీ ఉద్యోగుల కావాలనుకునే ఆశావాహులకు భారీగా ఉద్యోగాలు పొందనున్నారని పేర్కొన్నారు. (చదవండి: ఐటీ ఉద్యోగులకు హోం ఐసోలేషన్) -
మిశ్రా అరెస్ట్, విడుదల
* మూడు గంటల విచారణ * వివరాలు తెలుసుకుంటున్నాం: బీసీసీఐ సాక్షి, బెంగళూరు: తన స్నేహితురాలు, బాలీవుడ్ నిర్మాత వందనా జైన్‌పై దాడి చేశాడన్న కారణంతో భారత క్రికెటర్ అమిత్ మిశ్రాను బెంగళూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మూడు గంటల విచారణ అనంతరం ‘స్టేషన్ బెయిల్’పై విడుదల చేశారు. ‘మిశ్రా వాదనను విన్నాం. సంఘటనకు సంబంధించి అతని నుంచి కొన్ని విషయాలను సేకరించాం. విచారణ పూర్తి చేసి త్వరలోనే చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేస్తాం. తర్వాత కోర్టు సమన్లు జారీ చేసి కేసును విచారిస్తుంది’ అని సిటీ సెంట్రల్ డిప్యూటీ కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు. అనుమతి లేకుండా క్రికెటర్ల గదిలోకి రాకూడదనే నిబంధన ఉన్న నేపథ్యంలో తాను వందనా జైన్‌ను మందలించానే తప్ప ఆమెపై దాడికి పాల్పడలేదని విచారణలో మిశ్రా పేర్కొన్నట్లు సమాచారం. విచారణ అనంతరం మంగళవారం మధ్యాహ్నం మిశ్రా అరెస్ట్‌ను చూపారు. అనంతరం మిశ్రా, వందనాల స్నేహితుడైన రాఘవన్ బెయిల్ ష్యూరిటీ ఇవ్వడంతో విడుదల చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 325, 354 (ఎ) ప్రకారం పోలీసులు మిశ్రాపై కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే ఆరు నుంచి ఏడేళ్లు శిక్ష పడే అవకాశముందని పాటిల్ తెలిపారు. సెప్టెంబర్ 25న శిక్షణ కోసం బెంగళూరుకు వచ్చిన తనను కలిసేందుకు హోటల్ రూమ్‌కు వచ్చిన వందనపై మిశ్రా దాడి చేశాడని సమాచారం. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దాడికి పాల్పడినట్లు సెప్టెంబర్ 27న అశోక్ నగర్ పోలీసు స్టేషన్లో వందన ఫిర్యాదు చేసింది. దీన్ని విచారించిన పోలీసులు ఈనెల 20న విచారణకు హాజరుకావాలని క్రికెటర్‌కు నోటీసులు జారీ చేశారు. మరోవైపు క్రికెటర్‌పై పెట్టిన కేసుకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నామని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. ‘కేసు విషయం బీసీసీఐ దృష్టికి వచ్చింది. అన్ని అంశాలను తెలుసుకుంటున్నాం. విషయాలు పూర్తిగా తెలిశాకే దాని గురించి మాట్లాడుతాం. పోలీసులు వాళ్ల పని చేస్తున్నారు. నేరంతో క్రికెటర్‌కు సంబంధం ఉందో లేదో మేం తెలుసుకుంటున్నాం. కచ్చితమైన విషయాలు తెలిసిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటాం’ అని శుక్లా వ్యాఖ్యానించారు. -
క్రికెటర్ అమిత్ మిశ్రా అరెస్టు
-
మిశ్రాపై పెట్టిన వేధింపుల కేసు ఉపసంహరణ!
బెంగళూరు: భారత్ స్పిన్నర్ అమిత్ మిశ్రాకు ఊరట లభించనుంది. ఆయనపై ఓ మహిళ పెట్టిన లైంగిక వేధింపుల కేసును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది. తాను మిశ్రా మంచి మిత్రులమని, మున్ముందు కూడా మంచి మిత్రులుగానే కొనసాగుతామని చెప్పింది. తాను కేసు ఉపసంహరించుకోవడం వెనుక ఎలాంటి ఒత్తిడిలు లేవని, స్వచ్ఛందంగానే విత్ డ్రా చేసుకుంటున్నానని కూడా స్పష్టం చేసింది. గత సెప్టెంబర్‌లో బెంగళూరులోని ఓ హోటల్లో బస చేసిన అమిత్ మిశ్రాను చూసేందుకు వెళ్లిన తనను లైంగిక వేధించాడని ఓ మహిళ బెంగళూరు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై ఐపీసీ సెక్షన్లు 354, 328 కింద కేసు నమోదు చేశారు. తమముందు హాజరుకావాలని సమన్లు కూడా పంపించారు. ఈ లోగానే ఆ మహిళ స్వయంగా కేసు విత్ డ్రా చేసుకోనుండటంతో మిశ్రాకు ఉపశమనం లభించనున్నట్లయింది. 'ఫిర్యాదు చేసిన రెండు రోజుల తర్వాత నేను పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను. కేసు ఉపసంహరించుకుంటానని చెప్పాను. మిశ్రాకోసం పోలీస్ స్టేషన్ లో ఎదురు చూస్తున్నాను. కేసు విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మేం స్నేహితులం. పోట్లాడాం. అయినా మా స్నేహం తర్వాత కూడా కొనసాగుతుంది' అంటూ ఆ మహిళ చెప్పుకొచ్చింది. -
మిశ్రాపై విచారణకు ఆదేశించిన బీసీసీఐ
బెంగళూరు: భారత లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా దక్షిణాఫ్రికాతో జరగనున్న నాలుగో వన్డేలో ఆడతాడా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. గత నెలలో ఓ మహిళను దుర్భాషలాడమే కాకుండా దాడి చేసిన ఘటనలో మిశ్రాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మిశ్రాకు నోటీసులు జారీ చేశారు. ఎఫ్ఐఆర్ కాపీని బీసీసీఐకి బెంగళూరు సెంట్రల్ డివిజన్ డీసీపీ సందీప్ పంపించినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన బీసీసీఐ.. బౌలర్ మిశ్రాపై విచారణకు బుధవారం ఆదేశించింది. దీంతో టీమిండియా-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న గాంధీ-మండేలా సిరీస్‌లో గురువారం జరగనున్న నాల్గో వన్డేలో మిశ్రా ఆడుతాడా లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. కాగా, బాధిత మహిళ నుంచి ఫిర్యాదు స్వీకరించిన బెంగళూరు పోలీసులు అతడిపై ఐపీసీ సెక్షన్లు 354, 328 కింద మిశ్రాపై కేసు నమోదు చేసిన విషయం విదితమే. -
క్రికెటర్ అమిత్ మిశ్రాపై లైంగిక వేధింపుల కేసు
బెంగళూరు: భారత స్పిన్నర్ అమిత్ మిశ్రా ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. మిశ్రా తనను లైంగికంగా వేధించినట్టు ఓ మహిళ ఆరోపించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు.. విచారణకు హాజరు కావాల్సిందిగా మంగళవారం మిశ్రాకు సమన్లు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి. గత సెప్టెంబర్‌లో బెంగళూరులోని ఓ హోటల్లో బస చేసిన అమిత్ మిశ్రాను చూసేందుకు వెళ్లిన తనను లైంగిక వేధించాడని ఓ మహిళ బెంగళూరు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బెంగళూరు సెంట్రల్ డీసీపీ సందీప్ పాటిల్ ఈ విషయాన్ని మీడియాకు చెప్పారు. ఐపీసీ సెక్షన్లు 354, 328 కింద మిశ్రాపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. గత నెలలో శిక్షణ కోసం మిశ్రా బెంగళూరుకు వచ్చినట్టు చెప్పారు. సమన్లకు స్పందించకుంటే మిశ్రాపై కఠిన చర్యలు తీసుకుంటామని సందీప్ పాటిల్ తెలిపారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో భారత జట్టుకు అమిత్ మిశ్రా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. -
సెల్కాన్ సిరీస్ విజేత భారత్