శ్రేయస్ అయ్యర్‌తో అమిత్ మిశ్రా(PC: IPL)
Hat trick in IPL: అమిత్ మిశ్రా.. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్. క్యాష్ రిచ్ లీగ్‌లో 154 మ్యాచ్‌లు ఆడిన అతడు 7.35 ఎకానమీతో 166 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఐపీఎల్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక తన కెరీర్‌లో ఎక్కువ కాలం పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ టీమిండియా వెటరన్ ఆటగాడికి మెగా వేలం-2022లో చుక్కెదురైన విషయం తెలిసిందే.
రూ. 1.5 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అమిత్ పట్ల ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపకపోవడంతో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఇలా అమిత్ మిశ్రాకు ఈ ఏడాది చేదు అనుభవం మిగిల్చింది. అయితే, లీగ్ చరిత్రలో తన పేరిట ఉన్న చెక్కు చెదరని రికార్డును గుర్తుచేసుకుంటూ అభిమానులు అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. కాగా ఐపీఎల్‌లో అత్యధిక హ్యాట్రిక్‌లు సాదించిన ఆటగాడిగా అమిత్ మిశ్రా రికార్డులకెక్కాడు.
అతడి పేరిట మూడు హ్యాట్రిక్‌లు ఉన్నాయి. ఆ తర్వాత యువరాజ్ సింగ్(2), మఖయా ఎంతిని(1), అజిత్ చండీలా(1), సామ్యూల్ బద్రీ(1) టాప్-5లో ఉన్నారు. ఇక ఎక్కువ కాలం పాటు తమతో ప్రయాణం సాగించిన ఈ టీమిండియా వెటరన్ లెగ్ స్పిన్నర్‌ను వదిలేయడం పట్ల.. ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని పార్థ జిందాల్ భావోద్వేగ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ జట్టు ఎప్పటికీ నీదే.. నీ సేవలు ఉపయోగించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ ఆయన పేర్కొన్నారు. ఇక ఇందుకు స్పందించిన అమిత్.. ఢిల్లీకి ఎప్పుడు తన సేవలు అవసరమైనా సరే.. అందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానంటూ బదులిచ్చాడు. ఈ నేపథ్యంలో అమిత్ రానున్న కాలంలో ఢిల్లీ సిబ్బందిలో చేరే అవకాశం ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే ప్రాక్టీసు మొదలెట్టేసింది.
చదవండి: IPL 2022: అందరూ ధోని కెప్టెన్సీలో ఆడాలని కోరుకుంటారు.. కానీ నేను మాత్రం: రషీద్ ఖాన్
First Speech of #IPL2022 and we're already battling limitless emotions & infinite goosebumps 🥺@RickyPonting addresses the DC Squad with his first Training Speech ahead of #TATAIPL 💪#YehHaiNayiDilli #IPL2022 pic.twitter.com/ltVNhCsRUJ
— Delhi Capitals (@DelhiCapitals) March 21, 2022
Comments
Please login to add a commentAdd a comment