ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు ఫ్రాంచైజీలు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఆటగాళ్లతో పాటు తమ కోచింగ్ స్టాప్‌లో కూడా మార్పులు దిశగా ఆయా ఫ్రాంచైజీలు ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ తమ హెడ్‌కోచ్ రికీ పాంటింగ్‌పై వేటు వేయగా.. గుజరాత్ టైటాన్స్ సైతం తమ ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రాను తప్పించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
మరోవైపు రాజస్తాన్ రాయల్స్ కూడా తమ హెడ్‌కోచ్‌గా ఉన్న కుమార సంగర్కరను తప్పించి రాహుల్ ద్రవిడ్‌కు కోచింగ్ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ద్రవిడ్‌తో రాజస్తాన్ ఫ్రాంచైజీ సంప్రదింపులు జరిపినట్లు వినికిడి.
ఢిల్లీ హెడ్‌కోచ్‌గా యువరాజ్ సింగ్..?
కాగా ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్‌కోచ్‌గా భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ బాధ్యతలు చేపట్టున్నట్లు తెలుస్తోంది. రికీ పాంటింగ్ స్ధానంలో యువరాజ్‌ను నియమించాలని ఢిల్లీ యాజమాన్యం యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే యువీతో ఢిల్లీ క్యాపిటల్స్ చర్చలు మొదలు పెట్టినట్లు స్పోర్ట్‌స్టార్ తమ కథనంలో పేర్కొంది.
అయితే యువీ నుంచి కానీ, ఢిల్లీ ఫ్రాంచైజీ నుంచి ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలవడలేదు. మొదటిలో గుజరాత్ టైటాన్స్‌గా ప్రధాన కోచ్‌గా యువరాజ్ సింగ్ వెళ్లనున్నాడని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఢిల్లీ కూడా అతడిని తమ హెడ్‌కోచ్‌గా నియమించుకునేందుకు ఆసక్తిగా ఉందంట.
కాగా యువీ ఇప్పటివరకు హెడ్‌కోచ్‌గా పనిచేయనప్పటకి.. చాలా మంది పంజాబ్ యువ క్రికెటర్లను తీర్చిదిద్దడంలో యువరాజ్‌ది కీలకపాత్ర. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లు యువరాజ్ గైడన్స్‌లో రాటుదేలిన వారే.
Comments
Please login to add a commentAdd a comment