
Yuvraj Singh- Rishabh Pant: ‘‘ఇప్పుడిప్పుడే అడుగులు వేయడం మొదలుపెట్టాడు!!! ఈ చాంపియన్ మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు’’ అంటూ భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. టీమిండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్‌తో ఉన్న ఫొటోను పంచుకున్నాడు. ఎల్లవేళలా సానుకూల దృక్పథంతో ముందడుగు వేసే పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు.
కాగా గతేడాది డిసెంబరులో రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం విదితమే. కొత్త సంవత్సర వేడుకలు జరుపుకొనేందుకు స్వస్థలం ఉత్తరాఖండ్‌కు వెళ్తున్న పంత్ కారుకు యాక్సిడెంట్ జరిగింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడు.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు.
కోలుకుని తిరిగి రావాలి
అనేక చికిత్సల అనంతరం ఇప్పుడిప్పుడే నడవడం మొదలుపెట్టాడు. ఇటీవలే ఓ వీడియోతో తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్ ఇచ్చాడు. ఈ క్రమంలో పంత్‌ను కలిసిన యువీ అతడితో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
రిషభ్ ఎల్లప్పుడూ సరదాగా ఉంటాడని, ప్రతికూల ఆలోచనలు దరిచేరనీయడంటూ ప్రశంసించాడు. పూర్తిగా కోలుకుని తిరిగి మునపటి పంత్‌లా మారాలని ఆకాంక్షించాడు. కాగా అభిమానులను ఆకర్షిస్తున్న యువీ- పంత్ ఫొటో వైరల్‌గా మారింది. ఇక గాయాల కారణంగా టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ప్రతిష్టాత్మక సిరీస్‌లతో పాటు ఐపీఎల్-2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
పంత్ స్థానంలో
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో అతడి స్థానంలో టీమిండియా తరఫున ఆంధ్ర వికెట్ కీపర్ కేఎస్ భరత్ అరంగేట్రం చేశాడు. ఇక ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్.. పంత్ స్థానంలో ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను సారథిగా నియమించింది. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్-2023కి కూడా పంత్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు.
చదవండి: Ind Vs Aus: అప్పటి మ్యాచ్‌లో విజయం వాళ్లదే! కానీ ఈసారి.. పిచ్ ఎలా ఉందంటే!
ICC WC Qualifier: డక్‌వర్త్ రూపంలో అదృష్టం.. ఐసీసీ వరల్డ్‌కప్ క్వాలిఫయర్‌కు అర్హత