రిషభ్ పంత్
IPL 2023- Delhi Capitals- Rishabh Pant: ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ చర్యపై భారత క్రికెట్ నియంత్రణ మండలి గుర్రుగా ఉన్నట్లు సమాచారం. జట్టుకు దూరమైన తమ కెప్టెన్ రిషభ్ పంత్‌కు గుర్తుగా అతడి జెర్సీని డగౌట్‌లో వేలాడదీయడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో క్యాపిటల్స్ యాజమాన్యాన్ని బీసీసీఐ మందలించినట్లు ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
టీమిండియా స్టార్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషభ్ పంత్ గతేడాది డిసెంబరులో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ పంత్ ఇప్పుడిప్పుడే నడవగలుతున్నాడు. ఇక అతడు పూర్తిగా కోలుకుని మైదానంలో అడుగుపెట్టాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందేనని ఇప్పటికై వైద్యులు వెల్లడించారు.
PC: IPL
ఈ నేపథ్యంలో ఐపీఎల్-2023 సీజన్ మొత్తానికి దూరమైన పంత్.. అదే విధంగా స్వదేశంలో జరుగనున్న వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్‌కు కూడా పంత్ దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తమ సారథి పంత్ తమతోనే ఉన్నట్లు భావిస్తున్నామన్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఈ సీజన్‌లో తమ ఆరంభ మ్యాచ్ సందర్భంగా అతడి జెర్సీని డగౌట్‌లో వేలాడదీసింది.
బుద్ధుందా? చీవాట్లు పెట్టిన ఫ్యాన్స్.. ఎందుకంటే..
17వ నెంబర్‌తో పంత్ పేరిట ఉన్న జెర్సీని ప్రదర్శించింది. అయితే, ఢిల్లీ మేనేజ్‌మెంట్ చర్యను ఇప్పటికే కొంతమంది అభిమానులు స్వాగతించగా.. మరికొంత మంది ఫైర్ అయ్యారు. బీసీసీఐ కూడా ఈ విషయంలో ఆగ్రహంతో ఉన్నట్లు తాజాగా వార్తలు వెలువడుతున్నాయి. ‘‘ఇది కాస్త ఓవర్‌గా అనిపించింది. తీవ్ర విషాద సమయం(ఓ ఆటగాడు ఇక లేడన్న సందర్భం)లో లేదంటే రిటైర్మెంట్ నేపథ్యంలో.. సాధారణంగా ఇలా ట్రిబ్యూట్ ఇస్తారు.
అయితే, పంత్ విషయంలో ఈ రెండు సందర్భాలకు తావు లేదు. తను త్వరలోనే పూర్తిగా కోలుకుని మునుపటిలా ఆడాలని అంతా కోరుకుంటున్నారు. కానీ.. సదుద్దేశంతో చేసిందే అయినా ఈ చర్య ఆమోదనీయం కాదని బీసీసీఐ ఫ్రాంఛైజీని మందలించినట్లు సమాచారం అందింది.
ఈసారికి సున్నితంగా మందలించిన బోర్డు.. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం చేయొద్దని చెప్పినట్లు తెలుస్తోంది’’ అని ఈ మేరకు ఐపీఎల్ సన్నిహిత వర్గాలు స్పందించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ మంగళవారం (ఏప్రిల్ 4) గుజరాత్ టైటాన్స్‌తో సొంత మైదానంలో మ్యాచ్ ఆడనుంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కు పంత్ స్వయంగా హాజరుకానున్నట్లు సమాచారం.
చదవండి: WC 2023: వాళ్లిద్దరు చెలరేగితే ఈసారి ట్రోఫీ ఆసీస్‌దే: రిక్కీ పాంటింగ్
Comments
Please login to add a commentAdd a comment