సెల్కాన్ కప్ వన్డే సిరీస్లో జింబాబ్వేపై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వన్డే సిరీస్లో భారత్ హ్యాట్రిక్ సాధించింది. 35.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి భారత్ విజయం సాధించింది. వరుసగా మూడు మ్యాచ్లు గెలుచుకొని భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. ఇంకా రెండు మ్యాచ్లు ఉండగానే భారత్ సిరీస్ గెలుచుకుంది.