వధువు మెడలో తాళి కడుతున్న వరుడు
సాక్షి, హుబ్లీ: హుబ్లీ కేశ్వాపురలోని అనాథ శరణాలయంలో గురుసిద్దమ్మ అనే యువతికి అందరూ పెద్దలై పెళ్లి చేశారు. బెంగళూరులో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖలో ఉద్యోగం చేస్తున్న హేమంత్‌కుమార్ అనే వరుణ్ని వెతికి వైభవంగా మూడుముళ్ల వేడుక పూర్తి చేశారు.వివరాలు.. కేశ్వపుర సేవా భారతీ ట్రస్ట్‌లో తల్లీతండ్రీ లేని బాలిక గురుసిద్దమ్మను చిన్నప్పుడే ఎవరో చేర్పించారు. ఇటీవలే 18 ఏళ్లు నిండడంతో ఆశ్రమ నిర్వాహకులు పెళ్లి ప్రయత్నాలను ప్రారంభించారు.
బెంగళూరులో సరస్వతి–నంజుండరావ్ అనే దంపతుల కుమారుడు హేమంత్‌తో ఖరారు చేశారు. అతడు మంచి ఉద్యోగం చేస్తున్నప్పటికీ గురుసిద్దమ్మ కులగోత్రాలతో హోదాతో సంబంధం లేకుండా పెళ్లికి అంగీకరించడం విశేషం. ఆర్‌ఎస్‌ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు, గతంలో పెళ్లయి జీవితంలో స్థిరపడిన అనాథాశ్రమ యువతులు ఎంతో మంది మధ్య ఘనంగా వివాహ వేడుక జరిగింది.
చదవండి: (రెండేళ్లుగా సహజీవనం.. వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని..!)
Comments
Please login to add a commentAdd a comment