సాక్షి, బెంగళూరు: శాండల్‌వుడ్ నటీ అదితి ప్రభుదేవ, పారిశ్రామికవేత్త యశష్ పట్లా దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. నవంబర్ 28, సోమవారం ఉదయం ప్యాలెస్ మైదానంలో ఘనంగా పెళ్లి వేడుక జరిగింది. ఈ వివాహానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో పాటు నటులు యష్, రాధిక పండిట్, జై జగదీష్, రచన ఇందర్, అభిషేక్ అంబరీష్, మేఘనా రాజ్ సర్జా వంటి పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ వివాహ వేడుకలో అదితి టెంపుల్ జ్యువెలరీతో.. తెలుపు, ఎరుపు రంగు పెళ్లి పట్టు చీరను ధరించగా, యశష్ పట్టు ధోతీ, చొక్కా ధరించి కనిపించారు. సోషల్ మీడియాలో వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో ఆదిత్, యశప్‌లు తమ నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: (Sai Pallavi: సాయిపల్లవి సంచలన నిర్ణయం.. ఇండస్ట్రీకి గుడ్‌బై?)
Comments
Please login to add a commentAdd a comment