Accenture software employee
-
సాధారణ టెకీ.. రూ.5 కోట్ల నెట్‌వర్త్..
కోటీశ్వరులు కావాలని, సంపద పెంచుకోవాలని చాలా మంది కలలు కంటారు. కానీ కొంత మంది మాత్రమే వాటిని నిజం చేసుకుంటారు. అలాంటి వారిలో ఒకరు గుర్గావ్కు చెందిన యాక్సెంచర్ ఉద్యోగి గుర్జోత్ అహ్లువాలియా. కేవలం 11 ఏళ్లలో జీరో నుండి రూ. 5 కోట్ల నెట్‌వర్త్‌ను నిర్మించుకున్నారు. తన అద్భుతమైన ఆర్థిక ప్రయాణాన్ని ఆయనే వెల్లడించారు.2025లో ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్న అహ్లువాలియా.. తాను సాధించిన మైలురాయిని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 2024 తనకు అతిపెద్ద విజయంగా అభివర్ణించారు. రూ. 5 కోట్ల నెట్‌వర్త్‌ను చూపుతున్న తన ఆర్థిక ట్రాకింగ్ యాప్ స్క్రీన్‌షాట్‌ను కూడా అహ్లువాలియా పోస్ట్ చేశారు. ఇందులో రూ. 2.7 లక్షల మేర మాత్రమే అప్పులు చూపుతోంది.మూడే సూత్రాలు తన విజయానికి మూడు అంశాల విధానం కారణమని అహ్లువాలియా చెబుతున్నారు. అవి అధిక ఆదాయాల కోసం కెరీర్ పురోగతి, ఆలస్యమైన సంతృప్తి ద్వారా క్రమశిక్షణతో కూడిన పొదుపు, వ్యూహాత్మక ఈక్విటీ పెట్టుబడులు. ఇవే కేవలం 11 ఏళ్లలో తాను రూ. 5 కోట్ల నెట్‌వర్త్‌ను చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన చెబుతున్నారు.జీతం పొందే మధ్యతరగతి వ్యక్తి నుండి రూ. 5 కోట్ల నెట్‌వర్త్‌కు చేరడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయని ఆయన గుర్తించారు. ఒకటి అప్పు లేకపోవడం (విద్యకు తల్లిదండ్రులు నిధులు సమకూర్చినందున) అద్దె ఖర్చు లేకపోవడం (ఆయన తల్లిదండ్రులతో కలిసే ఉంటున్నారు). అయితే ఇటీవలి మార్కెట్ దిద్దుబాట్లు తన నెట్‌వర్త్‌లో 8-10% క్షీణతకు దారితీశాయని కూడా ఆయన అంగీకరించారు.Hitting this milestone was my biggest achievement in 2024.A salaried middle class person like me went from 0 to ₹5,00,00,000 in 11 years.3 Key Elements1. Professional Growth - high income2. Aggressive savings - delay gratification3. Equity investing - owning businesses pic.twitter.com/t3niPluPW7— Gurjot Ahluwalia (@gurjota) February 2, 2025 -
ఆసుపత్రి బిల్లు రూ.9.5 కోట్లు
బనశంకరి: కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఓ వివాహిత ఏడేళ్లుగా కోమాలో ఉండి, ప్రాణాలు విడిచింది. వైద్యానికి రూ.9.5 కోట్లు ఖర్చు అయినట్లు ఆమె భర్త తెలిపారు. ఈ సంఘటన బెంగళూరులో వెలుగుచూసింది. కేరళకు చెందిన రాజేశ్‌నాయర్, పూనమ్‌రాణా(35) దంపతులు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. వీరికి సంతానం లేదు. పూనమ్ నగరంలోని అక్సెంచర్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిని. ఆమె 2015 అక్టోబరు 2న కడుపునొప్పితో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా వైద్యులు స్వల్ప శస్త్రచికిత్స చేశారు. వ్యాధి నయం కాకపోగా కోమాలోకి వెళ్లింది. ఈ నెల 24న పరిస్థితి విషమించి మృతి చెందినటు రాజేశ్‌నాయర్ చెప్పారు. ఆసుపత్రిలో రూ.7.5 కోట్ల బిల్లు చెల్లించామని, ఇంకా రూ.2 కోట్లు చెల్లించాల్సి ఉందని అన్నారు. ముంబై ఆసుపత్రిలో 42 ఏళ్లుగా కోమాలో ఉన్న అరుణా శానుబాగ్ తర్వాత దీర్ఘకాలం కోమాలో ఉన్న పూనమ్ కేసు రెండోది అని వైద్యులు వెల్లడించారు. -
ఉద్యోగాలు, బోనస్ ఇస్తున్నాం: యాక్సెంచర్
ఐటీ సర్వీసుల గ్లోబల్ దిగ్గజం యాక్సెంచర్ గత కొద్ది వారాలుగా తమ సిబ్బందిలో అత్యధిక శాతం మందికి ప్రమోషన్లు ఇవ్వడంతోపాటు.. బోనస్‌లు చెల్లించినట్లు తెలుస్తోంది. దేశీయంగా కంపెనీకున్న 2,00,000 మంది ఉద్యోగులలో సగానికంటే ఎక్కువమందికి ప్రమోషన్లు, బోనస్‌లు లభించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దేశీయంగా ఐటీ సర్వీసుల రంగంలో అత్యధిక శాతం మందికి ఉపాధి కల్పించడం ద్వారా యాక్సెంచర్ సైతం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఏడాదికి కనీసం 2,500 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇస్తోంది. సుమారు 45 లక్షల మంది ఉద్యోగులకు ఆవాసమైన దేశీ ఐటీ రంగం సగటున నెలకు 20,000 కొత్త ఉద్యోగాలకు దారి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో 2020 మార్చితో ముగిసిన గతేడాదిలోనూ 2.05 లక్షల మందికి కొత్తగా ఉపాధి కల్పించినట్లు ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ వెల్లడించింది. కొత్త వారికి సై గత కొద్ది రోజుల్లో కొత్తగా ఆఫర్ లెటర్లు ఇచ్చిన వారందరికీ ఉద్యోగ అవకాశాన్ని కల్పించనున్నట్లు యాక్సెంచర్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అంతేకాకుండా కంపెనీలో చేరిన మరుక్షణం నుంచీ అన్ని రకాల వేతన సౌకర్యాలూ అందించనున్నట్లు తెలియజేశారు. కాగా.. కోవిడ్-19 విస్తృతి, లాక్‌డవున్ ప్రభావంతో బిజినెస్‌లు మందగించడంతో పలు కంపెనీలు సిబ్బంది కోతలను అమలు చేస్తున్న విషయం విదితమే. ఐటీ రంగంలోనూ కొన్ని కంపెనీలు వేతన పెంపును నిలిపివేయడంతోపాటు.. ప్రమోషన్లను వాయిదా వేశాయి. ఇప్పటికే ఆఫర్ లెటర్లు జారీ చేసిన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు దేశీ ఐటీ దిగ్గజం విప్రో కంపెనీ ప్రతినిధి ఒకరు తెలియజేశారు. అయితే వేతన పెంపు, ప్రమోషన్లను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ సైతం ఇటీవల ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించింది. వ్యయాల అదుపునకు ఇతర చర్యలను సైతం చేపడుతున్నట్లు తెలియజేసింది. పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించనున్నట్లు పేర్కొంది. కాగా.. జూనియర్ స్థాయి ఉద్యోగులకు విధానాలకు అనుగుణంగా వేతన చెల్లింపులను చేపడుతున్నట్లు టెక్ మహీంద్రా పేర్కొంది. అయితే అత్యున్నత, సీనియర్ స్థాయిలో పనితీరు ఆధారంగా ఇచ్చే వేతన చెల్లింపులలో కోత పెడుతున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలియజేశారు. ఇక ఫ్రెంచ్ కంపెనీ క్యాప్‌జెమినీ.. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, బోనస్‌లను చెల్లిస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించింది. మొత్తం సిబ్బందిలో 70 శాతంవరకూ లబ్ది పొందినట్లు తెలుస్తోంది. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్య
సాక్షి, బెంగళూరు : బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మడివాళ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తావరకెరెలోని చాక్లెట్ ఫ్యాక్టరీ వద్ద సోమవారం చోటు చేసుకుంది. నగరంలోని అక్సెంచర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న ప్రణవ్మిత్ర (26) ఆదివారం రాత్రి తావరెకెరెలో స్నేహితుడి ఇంట్లో పార్టీకి వెళ్లాడు. ఈరోజు తెల్లవారుజామున బైక్‌పై ఇంటికి బయలుదేరి వస్తుండగా చాక్లెట్ ఫ్యాక్టరీ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు అడ్డుకుని కత్తితో దారుణంగా పొడిచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన ప్రణవ్ను సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని డీసీపీ బోర లింగయ్య పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
యాక్సెంచర్‌లో ఉద్యోగం...విలాసాల కోసం చోరీలు
బెంగళూరు : స్నేహితుల ఇళ్లో చోరీలకు పాల్పడిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను హెణ్ణూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితురాలిని గోవిందశెట్టిపాళ్యలో నివాసముంటున్న ఎలిజబెత్ అలియాస్ మారీ(22)గా గుర్తించినట్లు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ తెలిపారు. నిందితురాలి వివరాలను ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బెంగళూరులోని యాక్సెంచర్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్న ఎలిజబెత్, నాలుగు నెలలుగా పలుమార్లు హెణ్ణూరులోని తన స్నేహితురాలు పూజాశర్మ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో పూజాశర్మ కుటుంబసభ్యుల కళ్లు కప్పి బంగారు నగలు, విలువైన వస్తువులను తన వ్యానిటీ బ్యాగ్‌లో వేసుకుని గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయేది. పదేపదే ఇంటిలో నగలు చోరీ అవుతుండడంతో పూజాశర్మ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఇంటిలో పనిచేస్తున్న వారిని ప్రశ్నించి వారి ప్రమేయం లేదని తెలుసుకున్నారు. అనంతరం నాలుగు నెలలుగా పూజాశర్మ ఇంటికి వచ్చివెళ్లిన వారిపై నిఘా పెంచారు. ఆ సమయంలో ఎలిజబెత్ వైఖరిపై అనుమానం కలిగింది. ఆమె గురించి వాకాబు చేశారు. ఎలిజబెత్ తండ్రికి తాహతుకు మించి అప్పులు ఉన్నాయని, అయితే ఎలిజబెత్ మాత్రం విలాసవంతమైన జీవనం గడుపుతోందని గుర్తించారు. అనుమానితురాలిగా అదుపులో తీసుకుని పోలీసులు తమదైన శైలీలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఆమె వద్ద నుంచి పోలీసులు నాలుగున్నర లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన ఆభరణాలను తాకట్టు వ్యాపారికి అమ్మి ఆ డబ్బుతో ఖరీదైన సెల్ఫోన్లు కొనుగోలు చేయటంతో పాటు, విలాసవంత జీవితం గడపటం చేసేంది. అంతేకాకుండా తండ్రి అప్పులను కూడా ఎలిజబెత్ తీర్చేది.