ఆసుపత్రి బిల్లు రూ.9.5 కోట్లు | 7 Year Stay And a Rs 9. 5 Cr Bill in Karnataka | Sakshi
Sakshi News home page

ఆసుపత్రి బిల్లు రూ.9.5 కోట్లు

Published Fri, May 27 2022 5:45 AM | Last Updated on Fri, May 27 2022 10:52 AM

7 Year Stay And a Rs 9. 5 Cr Bill in Karnataka - Sakshi

బనశంకరి: కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఓ వివాహిత ఏడేళ్లుగా కోమాలో ఉండి, ప్రాణాలు విడిచింది. వైద్యానికి రూ.9.5 కోట్లు ఖర్చు అయినట్లు ఆమె భర్త తెలిపారు. ఈ సంఘటన బెంగళూరులో వెలుగుచూసింది. కేరళకు చెందిన రాజేశ్‌నాయర్, పూనమ్‌రాణా(35) దంపతులు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. వీరికి సంతానం లేదు. పూనమ్‌ నగరంలోని అక్సెంచర్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగిని.

ఆమె 2015 అక్టోబరు 2న కడుపునొప్పితో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా వైద్యులు స్వల్ప శస్త్రచికిత్స చేశారు. వ్యాధి నయం కాకపోగా కోమాలోకి వెళ్లింది. ఈ నెల 24న పరిస్థితి విషమించి మృతి చెందినటు రాజేశ్‌నాయర్‌ చెప్పారు. ఆసుపత్రిలో రూ.7.5 కోట్ల బిల్లు చెల్లించామని, ఇంకా రూ.2 కోట్లు చెల్లించాల్సి ఉందని అన్నారు. ముంబై ఆసుపత్రిలో 42 ఏళ్లుగా కోమాలో ఉన్న అరుణా శానుబాగ్‌ తర్వాత దీర్ఘకాలం కోమాలో ఉన్న పూనమ్‌ కేసు రెండోది అని వైద్యులు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement