దేశంలో హిట్లర్‌ పాలన సాగుతోంది | Chenchala Babu fires on Central government | Sakshi
Sakshi News home page

దేశంలో హిట్లర్‌ పాలన సాగుతోంది

Published Wed, Dec 6 2017 12:40 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

Chenchala Babu fires on Central government

నెల్లూరు: దేశంలో హిట్లర్‌ పాలన నడుపుతున్న ప్రధాని నరేంద్రమోదీకి నెహ్రూ వంశాన్ని, రాహుల్‌గాంధీని విమర్శించే అర్హత లేదని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చెంచలబాబుయాదవ్‌ అన్నారు. నగరంలోని మైపాడుగేట్‌ సెంటర్‌ వద్ద ఉన్న తన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు గొప్ప నాయకులన్నారు. 

ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్‌ పీఠాన్ని అదిష్టించే రాహుల్‌ను చూచి ఓర్వలేక, గుజరాత్‌లో ఆదరణ తగ్గుతోందని మోదీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్‌పాలనలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 9 శాతంపైగా ఉండగా, ప్రస్తుతం మూడు శాతానికి తగ్గడం చూస్తే మోదీ పాలన ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌పార్టీ జిల్లా బీసీ సెల్‌ ఉపాధ్యక్షుడు ఉడతా నరసింహారావు, శ్రీధర్‌రెడ్డి, సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement