'ఆ రెండు బిల్లులను తిరస్కరించండి' | ap pcc chief raghu veera reddy blames chandra babu sarkar | Sakshi
Sakshi News home page

'ఆ రెండు బిల్లులను తిరస్కరించండి'

Published Fri, Dec 25 2015 6:09 PM | Last Updated on Sun, Sep 3 2017 2:34 PM

ap pcc chief raghu veera reddy blames chandra babu sarkar

హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించిన ప్రైవేట్ వర్సిటీల బిల్లు, రాజధాని భూములను 99 ఏళ్ల పాటు లీజ్ కు ఇచ్చే బిల్లు ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేవని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆ బిల్లులను తిరస్కరించాలని కోరుతూ గవర్నర్ నరసింహన్ కు రఘువీరా లేఖ రాశారు. పేదలకు ఉన్నత విద్యను దూరం చేసేలా చంద్రబాబు సర్కారు ప్రైవేటు వర్సిటీలను తెస్తోందని రఘువీరా ఆ లేఖలో పేర్కొన్నారు.

 

రాజధాని భూములను విదేశీ సంస్థలకు కట్టబెట్టేందుకే ఆ బిల్లును అసెంబ్లీలో హడావుడిగా ఆమోదం పొందేలా చేశారన్నారు. రాష్ట్రం ప్రయోజనాలను విఘాతం కల్గించేలా ఉన్న ఆ రెండు బిల్లులను నిలుపుదల చేయాలని గవర్నర్ కు రఘువీరా విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement