లోకేష్, చంద్రబాబు జైళ్లకు వెళ్లడం ఖాయం | Lokesh , Naidu would be sent to prison | Sakshi
Sakshi News home page

లోకేష్, చంద్రబాబు జైళ్లకు వెళ్లడం ఖాయం

Published Sun, Jul 3 2016 7:50 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Lokesh , Naidu would be sent to prison

-పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
మడకశిర (అనంతపురం)

 అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ 2019లో జైళ్లకు వెళ్లడం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. రెండేళ్ల టీడీపీ పాలనలో సీఎం చంద్రబాబు అవినీతికి పాల్పడుతూ దేశంలోనే రాష్ట్రాన్ని అవినీతి రాష్ట్రంగా తీర్చిదిద్దారని ఆయన ఆరోపించారు. ఆదివారం ఆయన తన స్వగ్రామం అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

 

గ్రామస్థాయి నుంచి టీడీపీ నాయకులు అవినీతికి పాల్పడుతూ అభివృద్ధిని విస్మరిస్తున్నారన్నారు. హెరిటేజ్ కంపెనీని ప్రోత్సహించేందుకే విజయా డెయిరీ రైతులకు ఇచ్చే పాలధరను తగ్గించి పాడి రైతులను నట్టేట ముంచుతున్నారన్నారు. గోదావరి పుష్కరాల్లో అరకొరగా భక్తులకు సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం రూ.1,600 కోట్లు అవినీతికి పాల్పడి 27 మందిని పొట్టను పెట్టుకుందన్నారు. ఇక కృష్ణా పుష్కరాల్లో కూడా భారీగా అవినీతికి పాల్పడటానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారన్నారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకుండా బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు పోటీ పడి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు.

 

సీఎం చంద్రబాబు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తూ విదేశీ పర్యటనలు చేయడం వల్ల రాష్ట్రానికి నష్టమే తప్ప, లాభమేమీ ఉండబోదన్నారు. విజయవాడలో దేవాలయాలు కూల్చకూడదంటూ పీఠాధిపతులు, మతాధిపతులు ధర్నాలు చేస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంలో అవినీతికి రహస్య ట్రెజరర్‌గా ఉన్న సీఎం కుమారుడు నారా లోకేష్, సీఎం 2019 తర్వాత జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. దేశంలో అవినీతిలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని సర్వేలు చెబుతున్నాయని గుర్తు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement