పీసీసీ పగ్గాలు స్వీకరించేందుకు రెడీ
ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
చండూరు: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ పగ్గాలు అప్పగిస్తే స్వీకరించేందుకు కోమటిరెడ్డి సోదరులు రెడీగా ఉన్నారని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. గురువారం నల్లగొండ జిల్లా చండూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షపదవి అందిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో పాదయూత్ర చేసైనా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని స్పష్టంచేశారు. ఎన్నికల్లో తమకు సీట్లు ఇవ్వకపోయినా అభ్యర్థుల గెలుపుకోసం శక్తివంచన లేకుండా కృషిచేస్తామన్నారు. పార్టీలో గ్రూపు తగాదాలకు నాయకులు, కార్యకర్తలు దూరంగా ఉండాలని కోరారు. కేసీఆర్ మాయ మాటలకు మోసపోయిన జనం నేడు టీఆర్‌ఎస్ పాలనలో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.