నేడు పీసీసీ విస్తృతస్థాయి సమావేశం | today pcc huge meeting with party leaders | Sakshi
Sakshi News home page

నేడు పీసీసీ విస్తృతస్థాయి సమావేశం

Published Sun, Jan 29 2017 2:53 AM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

నేడు పీసీసీ విస్తృతస్థాయి సమావేశం

నేడు పీసీసీ విస్తృతస్థాయి సమావేశం

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ వెల్లడి
సాక్షి, హైదరాబాద్‌: పీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ఈనెల 29న గాంధీభవన్‌లో జరుగుతుందని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. దేశ, రాష్ట్ర రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారని వివరించారు.

బీసీలపై చిన్నచూపెందుకు: వీహెచ్‌
బీసీలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఆరోపించారు. శనివారం ఆయన మాట్లాడుతూ, మైనారిటీ సమస్యలపై, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌.. బీసీలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. బీసీ సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement