extensive meeting
-
భారత్‌తో సంబంధాలు కీలకం: ఓలీ
-
బలమైన బంధం పునరుద్ధరణకు!
న్యూఢిల్లీ: నేపాల్ సర్వతోముఖాభివృద్ధిలో భారత్ మొదట్నుంచీ అండగా నిలబడుతూ వస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్–నేపాల్ మధ్య సహకారం పెరగటం ద్వారా నేపాల్‌లో ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందన్నారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ కూడా భారత్‌తో విశ్వాసం పెంచుకునేలా సత్సంబంధాల కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. భారత్–నేపాల్ మధ్య గతంలో ఉన్న బలమైన సత్సంబంధాలను పునరుద్ధరించేదిశగా మోదీ, ఓలీ మధ్య శనివారం ఢిల్లీలో విస్తృతమైన చర్చలు జరిగాయి. చర్చలు అత్యంత సంతృప్తికరంగా సాగాయని భారత విదేశాంగ కార్యదర్శి గోఖలే చెప్పారు. రక్షణ, భద్రత, వ్యవసాయం, వాణిజ్యం, రైల్వేల అనుసంధానత తదితర అంశాలపై చర్చలు జరిగాయన్నారు. అనంతరం ఇరుదేశాల సరిహద్దుల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వీరిద్దరూ రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించారు. భారత్‌తో సంబంధాలు కీలకం: ‘21వ శతాబ్దపు వాస్తవాలకు అనుగుణంగా భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే మిషన్‌తోనే ఈసారి భారత పర్యటనకు వచ్చాను. రెండు సన్నిహిత పొరుగుదేశాల మధ్య బలమైన సంబంధాలను నెలకొల్పటమే మా (భారత్–నేపాల్) ఉద్దేశం. ఇతర దేశాలతో పోలిస్తే పొరుగున ఉన్నదేశాలతో సంబంధాలు కీలకం’ అని చర్చల అనంతరం సంయుక్త మీడియా ప్రకటనలో ఓలీ అన్నారు. కేపీ ఓలీ నేతృత్వంలో వామపక్ష పార్టీ నేపాల్‌లో అధికార పగ్గాలు చేపట్టాక భారత్‌తో సంబంధాలు బలహీనమవుతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం పెరిగిపోతోందంటూ 2016లో ఓలీ బహిరంగంగానే విమర్శించిన సంగతి తెలిసిందే. ‘తాజా ఎన్నికల తర్వాత నేపాల్‌లో రాజకీయ స్థిరత్వం వచ్చింది. దీంతో సామాజిక, ఆర్థికాభివృద్ధిపై ప్రస్తుతం దృష్టిపెట్టాం’ అని కోలీ తెలిపారు. కాగా, నేపాల్‌లో పర్యటించాలంటూ మోదీని ఓలీ ఆహ్వానించారు. ఈ ఏడాది మోదీ నేపాల్‌లో పర్యటించే అవకాశముంది. వాణిజ్యలోటుపై ఓలీ ఆందోళన నేపాల్‌లో వాణిజ్యలోటు పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఓలీ.. దేశ ఎగుమతులు వృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా నేపాల్ అభివృద్ధికి అవసరమైన సాయం చేసేందుకు మోదీ సంసిద్ధత తెలిపారు. ఓలీ ‘నేపాల్ శ్రేయస్సు. నేపాల్ అభివృద్ధి’ నినాదం, తమ ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ నినాదంతో దగ్గరగా ఉందన్నారు. భారతభూభాగంలోని రాక్సౌల్ నుంచి కఠ్మాండుకు.. భారత ఆర్థిక సహకారంతో విద్యుత్ రైల్వేలైను వ్యవస్థను నిర్మించేందుకు మోదీ అంగీకరించారు. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతానికి కార్గోలు ప్రయాణించేలా జలమార్గాలను వృద్ధి చేసుకోవాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. -
నేడు పీసీసీ విస్తృతస్థాయి సమావేశం
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: పీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ఈనెల 29న గాంధీభవన్‌లో జరుగుతుందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. దేశ, రాష్ట్ర రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారని వివరించారు. బీసీలపై చిన్నచూపెందుకు: వీహెచ్ బీసీలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఆరోపించారు. శనివారం ఆయన మాట్లాడుతూ, మైనారిటీ సమస్యలపై, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్.. బీసీలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. బీసీ సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
వైఎస్సార్సీపీలో... నూతనోత్తేజం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సాధారణ ఎన్నికల తర్వాత సోమవారం మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం పార్టీ యంత్రాంగంలో కొత్త ఉత్సాహం నింపింది. సాధారణ ఎన్నికల తర్వాత వివిధ పార్టీల నుంచి ద్వితీయ, తృతీయశ్రేణి నాయకత్వం అధికార పార్టీలోకి వలస పోతున్నా వైఎస్సార్సీపీ కేడర్ చెక్కు చెదరలేదని సోమవారం జరిగిన సమావేశం నిరూపించింది. నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున సమావేశానికి తరలిరావడం ద్వారా జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పురోగతికి అవకాశముందని ముఖ్య నేతలు అంచనాకు వచ్చారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వివిధ పార్టీలు తమపై మోపిన ‘బదనాం’ నుంచి బయట పడతామనే ధీమా పార్టీ శ్రేణుల్లో కనిపించింది. ‘సంక్షేమ కార్యక్రమాలకు చిరునామా దివంగత సీఎం వైఎస్. పింఛన్లు, రేషన్ కార్డుల పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటాన్ని చూస్తూ జనం వైఎస్‌ను గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్ హయాంలో లబ్ధిపొందిన అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపచేయటంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇదే అంశం రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి దోహదం చేస్తుందని’ పార్టీ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. ‘కొత్త రాష్ట్రంలో అనేక సవాళ్లు వున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకరిస్తాం. అదే సమయంలో ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై క్షేత్రస్థాయిలో ఉద్యమిస్తామని’ నేతలు దిగువస్థాయి కేడర్‌కు పార్టీ వైఖరిపై దిశా నిర్దేశం చేశారు.