రేపు పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ మేళా  | Police Clearance Mela Tomorrow | Sakshi
Sakshi News home page

రేపు పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ మేళా 

Published Fri, Mar 23 2018 2:57 AM | Last Updated on Tue, Aug 21 2018 6:02 PM

Police Clearance Mela Tomorrow - Sakshi

హైదరాబాద్‌: హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం, కేంద్ర ప్రభుత్వ విదేశీ వ్యవహారాల శాఖ పరిధిలోని హైదరాబాద్‌ సచివాలయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 24న పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ మేళా(పీసీసీ)ను నిర్వహిస్తున్నట్లు పాస్‌పోర్ట్‌ అధికారి డాక్టర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి గురువారం తెలిపారు. బేగంపేట్‌లోని పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రంలో ఈ మేళా జరుగుతుందన్నారు. ఈ మేళాలో ఎలాంటి రుసుము లేకుండానే బ్రాంచ్‌ సెక్రటెరీయెట్‌ అధికారులు పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ అటెస్టేషన్‌ చేస్తారన్నారు.

ఇటీవల రాష్ట్రం నుంచి గల్ఫ్‌కు వెళ్లే వారి సంఖ్య పెరగడంతో పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌కు డిమాండ్‌ పెరిగిందని.. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మేళాలో పాల్గొనే వారు వెబ్‌సైట్‌ www.passportindia.gov.in ద్వారా ఈ నెల 20 నుంచి అందుబాటులో ఉంచిన స్లాట్స్‌ను బుక్‌ చేసుకుని సరైన డాక్యుమెంట్లతో హాజరుకావాలని సూచించారు. 1,000 స్లాట్‌లు అందుబాటులో ఉంచగా ఇప్పటివరకు 250 స్లాట్‌లు బుక్‌ అయ్యాయన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement