పొన్నాల, డీఎస్ లతో విభేదాలు లేవు: జానారెడ్డి | I dont have any differences with Ponnala Lakshmaiah, D.Srinivas: Jana Reddy | Sakshi
Sakshi News home page

పొన్నాల, డీఎస్ లతో విభేదాలు లేవు: జానారెడ్డి

Published Wed, Aug 6 2014 5:43 PM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM

పొన్నాల, డీఎస్ లతో విభేదాలు లేవు: జానారెడ్డి

పొన్నాల, డీఎస్ లతో విభేదాలు లేవు: జానారెడ్డి

న్యూఢిల్లీ:  తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి ఆశించడంలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడ్ని ఒకవేళ అధిష్టానం మార్చాలనుకుంటే సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని జానా అన్నారు. ప్రస్తుత తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య,  మాజీ పీసీసీ చీఫ్ డీ శ్రీనివాస్తో నాకు ఎలాంటి విభేదాలు లేవని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
సందర్భానుసారంగా పొన్నాల మాట్లాడలేకపోతున్నారని, మేధోమథనం సదస్సు ఎప్పుడనేది పొన్నాల నాతో చెప్పలేదని జానా అన్నారు. సీఎల్పీ కమిటీ ఏర్పాటుపై ఆయనతో నేను చర్చించలేదన్నారు. పీఎసీ ఛైర్మన్ ఎవరనేది నేనే నిర్ణయిస్తానని మరో ప్రశ్నకు  జానారెడ్డి సమాధానమిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement