సారయ్యపై సస్పెన్షన్ వేటు | suspention in sarayya | Sakshi
Sakshi News home page

సారయ్యపై సస్పెన్షన్ వేటు

Published Wed, Feb 24 2016 3:59 AM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM

suspention in sarayya

సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత బస్వరాజు సారయ్యను పీసీసీ సస్పెండ్ చేసింది. పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆమోదం మేరకు పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ చర్య తీసుకున్నట్టుగా గాంధీభవన్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. బస్వరాజు సారయ్య టీఆర్‌ఎస్‌లో చేరిక గురించి వాస్తవాలు తెలుసుకోవడానికి పీసీసీ ప్రయత్నించినా ఆయన ఉద్దేశపూర్వకంగానే అందుబాటులోకి రావడం లేదని ఖరారు చేసుకున్న తర్వాత పీసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement