పీసీసీ అధికార ప్రతినిధిగా పూజల హరికృష్ణ  | Poojala Harikrishna Appointed As PCC Spokesman | Sakshi
Sakshi News home page

పీసీసీ అధికార ప్రతినిధిగా పూజల హరికృష్ణ 

Jun 14 2020 8:35 AM | Updated on Jun 14 2020 8:35 AM

Poojala Harikrishna Appointed As PCC Spokesman - Sakshi

పూజల హరికృష్ణ

ప్రశాంత్‌నగర్‌ (సిద్దిపేట): తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధిగా పూజల హరికృష్ణను నియమిస్తూ టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో నియామక పత్రాన్ని అందించారు. అనంతరం సిద్దిపేటకు వచ్చిన హరికృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల కష్టాలపై గళం విప్పుతానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చి, వాటిని అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. తనకు రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించిన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. సిద్దిపేట పట్టణానికి చెందిన పూజల హరికృష్ణ ఎన్‌ఎస్‌యూఐలో చురుకుగా పాల్గొన్నారు. పట్టణ అధ్యక్షుడిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ యువజన కాంగ్రెస్‌ కార్యదర్శిగా విధులు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement