
న్యూఢిల్లీ: మెగాస్టార్ చిరంజీవిని ఏపీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ కొత్త గుర్తింపు కార్డును జారీ చేసింది. కొవ్వూరు నుంచి చిరంజీవి పీసీసీ డెలిగేట్‌గా ఉన్నారు. 2027వరకు చిరంజీవిని పీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ కాంగ్రెస్ అధిష్టానం కొత్త ఐడీ కార్డు మంజూరు చేసింది.
ఈ డెలిగేట్లకు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుంది. దాదాపు తొమ్మిది వేల మంది డెలిగేట్లు త్వరలో జరగబోయే ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. అయితే చిరంజీవి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా.. రాజకీయంగా ఇన్ యాక్టివ్‌గా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17న జరగనున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉపసంహరణకు అక్టోబర్ 8వరకు గడువు. ఎన్నికల అనంతరం రెండు రోజుల తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు.
చదవండి: (కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు)