deligates
-
సహృదయంతో ఆహ్వానించాం! కానీ..సారీ అంటూ సీఎం క్షమాపణలు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ల్లో సోమవారం అట్టహాసంగా 17వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఐతే పలువురు ప్రవాసులు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలో పాల్గొన లేకపోయారు. స్థలం కొరత కారణంగా పలువురు ప్రవాసులను సదస్సులోకి ప్రవేశించనీయకుండా అడ్డుకున్నారు పోలీసులు. పైగా వారిని బయట స్క్రీన్లోనే ఆ కార్యక్రమాన్ని వీక్షించమన్నారు. దీంతో చాలా మంది ప్రవాసులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ హజరుకాలేకపోయిన పలువురు ప్రవాసులకు క్షమాపణలు చెప్పారు. విమ్మల్ని ఆహ్వానించడం కోసం ఇండోర్ సహృదయంతో సదా తలుపులు తెరిచే ఉంచింది. కానీ స్థలం కొరత కారణంగా అందర్నీ లోనికి రానివ్వలేకపోయాం అని చెప్పారు. తొక్కిసలాట జరుగుతుందనే ఉద్దేశంతో పోలీసులు అలా చేసినట్లు వివరణ ఇచ్చారు చౌహన్. వాస్తవానికి ఈ సదస్సు కోసం దాదాపు 70 దేశాల నుంచి సుమారు మూడు వేల మంది ప్రతినిధులను ఆహ్వనించారు. ఐతే వారిలో కొందర్నే సదస్సులోకి అనుమతించారు మిగతా వారిని గేటు వద్దే అడ్డుకుని స్కీన్లో చూడమని చెప్పారు పోలీసులు. దీంతో చాలా మంది ప్రవాస ప్రతినిధులు షాక్‌కి గురయ్యారు. కానీ మధ్యప్రదేశ్ సీఎం చౌహన్ క్షమాపణలు చెప్పినప్పటికీ..పలువురు ప్రవాసులు సోషల్ మీడియా వేదిక తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ఈ మేరకు ఒక ప్రవాసుడు తాను రిజస్టర్డ్ డెలిగేట్నని కాలిఫోర్నియా నుంచి వచ్చానని చెప్పారు. చక్కగా ఆహ్వానించి స్కీన్లో చూడమంటే చాలా అవమానంగా ఉంటుందని వాపోయారు. మరో ప్రవాసుడు దేవేశ్ తాను నైజీరియా నుంచి ఈ కార్యక్రమం కోసం వచ్చానని, అంత డబ్బు ఖర్చుపెట్టి వస్తే ఇంతలా అమానిస్తారా అని మండిపడ్డాడు. ఇలా పలువురు ప్రవాసులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ... సామాజిక మాధ్యమాల్లో తమ ఆగ్రహన్ని వెళ్లగక్కారు. (చదవండి: మీరంతా భారత్ అంబాసిడర్లు: మోదీ) -
Chiranjeevi: ఏపీసీసీ డెలిగేట్‌గా మెగాస్టార్ చిరంజీవి
న్యూఢిల్లీ: మెగాస్టార్ చిరంజీవిని ఏపీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ కొత్త గుర్తింపు కార్డును జారీ చేసింది. కొవ్వూరు నుంచి చిరంజీవి పీసీసీ డెలిగేట్‌గా ఉన్నారు. 2027వరకు చిరంజీవిని పీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ కాంగ్రెస్ అధిష్టానం కొత్త ఐడీ కార్డు మంజూరు చేసింది. ఈ డెలిగేట్లకు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుంది. దాదాపు తొమ్మిది వేల మంది డెలిగేట్లు త్వరలో జరగబోయే ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. అయితే చిరంజీవి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా.. రాజకీయంగా ఇన్ యాక్టివ్‌గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17న జరగనున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉపసంహరణకు అక్టోబర్ 8వరకు గడువు. ఎన్నికల అనంతరం రెండు రోజుల తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. చదవండి: (కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు) -
గ్లోబల్... సక్సెస్ఫుల్
అతివకు అందలం..ఆవిష్కరణలకు ప్రోత్సాహం...స్టార్టప్స్‌కు సహాయం...ఇవే ప్రధాన ఇతివృత్తంగా సాగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. మూడురోజుల సందడికి గురువారం తెరపడింది. భాగ్యనగరి అందాలు, దేశీయ ఆవిష్కరణలను చూసి అబ్బురపోయిన విదేశీ ప్రతినిధులు... భారంగా బై..బై.. చెప్పారు. మెట్రో నగరికి మళ్లీ వస్తామంటూ దేశవిదేశీయులు వీడ్కోలు పలికారు. అవకాశాలు పుష్కలం.. అందుకోవాలి ‘నైపుణ్యానికి అద్దం పడుతూ ఎందరో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. స్టార్టప్స్‌తో అసామాన్య ఫలితాలు సామాన్యులకు చేరువవుతాయి. వీటికి పెట్టుబడులతో ప్రోత్సాహం అందిస్తే విజయం సొంతమవుతుంది. ఉద్యోగం చేయడం కంటే.. పది మందికి ఉపాధి కల్పించడంలోనే సంతృప్తి ఉంటుంది. వ్యవసాయం, వైద్యం తదితర రంగాల్లో నూతన స్టార్టప్‌లకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకోవాల’ని జీఈఎస్‌కు హాజరైన పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. తమ ఆవిష్కరణలపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. డిజిటల్ అగ్రికల్చర్ వ్యవసాయానికి ఐటీని తోడు చేయాలనే సంకల్పంతో రెండేళ్ల క్రితం ఓ ప్రత్యేక యాప్ రూపొందించాం. సీజన్‌కు అనుగుణంగా ఏయే పంటలు వేయాలి? చీడపీడలకు ఏయే క్రిమిసంహార మందులు వాడాలి? తదితర సమాచారం ఇందులో ఉంటుంది. రైతులు, కంపెనీలు వివరాలూ ఉంటాయి. త్వరలోనే మార్కెటింగ్ అవకాశాలనూ చేర్చనున్నాం. పెట్టుబడి దొరికితే మా యాప్‌ను సామాన్యులకు చేరువ చేస్తాం. – జయ వల్లపు, ఫౌండర్, స్టాంప్ ఐటీ సొల్యూషన్స్ బొమ్మల తయారీ.. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో పిల్లలు ఆడుకునే చెక్క బొమ్మలు తయారు చేస్తాం. ఏ చెక్కతో ఏ బొమ్మలు తయారు చేయాలో తెలియజేస్తాం. 3–13 ఏళ్ల పిల్లలు ఆడుకునే బొమ్మలు తయారు చేసేందుకు వీలుంటుంది. ఇప్పటికే ఒక మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాం. – అశ్విని కుమార్, కో–ఫౌండర్, స్మార్టివిటీ ఇవాంకా స్ఫూర్తి... జీఈఎస్ సద్సులో ఇవాంకా ప్రసంగం నాకెంతో స్ఫూర్తినిచ్చింది. ఈ సదస్సులో చాలా నేర్చుకున్నాను. వ్యాపార రంగంలో మహిళలు రాణించేందుకు ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. – అబ్బిగేల్ లాంక్, గయానా టెలీ మెడిసిన్.. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా డాక్టర్ల వివరాలు సామాన్యులకు ఇప్పటికీ అందుబాటులో లేవు. ఆస్పత్రులు ఎక్కడుంటాయో? ఏ జబ్బుకు ఎక్కడికి వెళ్లాలో? తెలియని పరిస్థితి ఉంది. సామాన్యులకు వైద్య సమాచారం అందించేందుకు ‘ఇంటెలె హెల్త్’ పేరుతో టెలీ మెడిసిన్ సర్వీస్‌ను ఒడిశాలో ప్రారంభించాం. పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నాం. – నేహా గోయల్, సీఈఓ, ఇంటెలె హెల్త్ అవకాశాలెన్నో... వ్యాపార రంగంలో మహిళలకు ఎన్ని అవకాశాలున్నాయో జీఈఎస్ సదస్సులో స్పష్టంగా అర్థమైంది. వివిధ దేశాల బృందాలు తమ అనుభవాలు పంచుకున్నాయి. గోల్కొండ విందు బాగుంది. సదస్సుకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు సూపర్. – ప్రభా రాఘవ, యూఎస్ఏ నైపుణ్యానికి కొదవలేదు ఇండియాలో నైపుణ్యానికి కొదవలేదు. ఎందరో ఇండియాలో ఇప్పుడిప్పుడే స్టార్టప్‌లపై దృష్టిసారిస్తున్నారు. యువత స్టార్టప్‌లపై ఉత్సా హం చూపుతోంది. అయితే ప్రభుత్వాలు, కంపెనీల ప్రోత్సాహం ఉంటేనే స్టార్టప్‌లు నిలబడతాయి. – కార్ల్ బిజ్లాండ్, స్వీడన్ గ్రీన్ టీ ఫ్లేవర్స్.. వివిధ ఫ్లేవర్లలో గ్రీన్ టీ తయారు చేసే విధానాన్ని వివరిస్తాం. గ్రీన్ టీ అంటే.. చేదు, వగరు అనుకుంటారు. కానీ దీన్ని వివిధ ఫ్లేవర్లలో అందించొచ్చు. మెక్సికో, అమెరికా దేశాలకు చెందిన ప్రతినిధులకు టీ ఫ్లేవర్లను వివరించాం. – నీలిమా చౌదరి, ఫౌండర్, ఎగ్జాటిక్ బ్లూమింగ్ టీస్ -
డెలిగేట్లతో కలసి హైదరాబాద్‌కు..
సాక్షి, హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా పెద్దగా ఆర్భాటమేమీ లేకుండా.. మిగతా అమెరికన్ డెలిగేట్లతో కలసి హైదరాబాద్‌కు రానున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. 27వ తేదీ అర్ధరాత్రి సుమారు 180 మంది పారిశ్రామికవేత్తలు, డెలిగేట్లతో కలసి ప్రత్యేక విమానంలో ఆమె శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మాదాపూర్‌లోని వెస్టిన్ హోటల్‌కు చేరుకుని బస చేస్తారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారు. ఇవాంకా పర్యటనలో భాగంగా చార్మినార్‌ను, గోల్కొండ కోటను సందర్శించే అవకాశమున్నట్లు నిఘావర్గాలు పేర్కొంటున్నాయి. ప్రయాణమంతా రోడ్డు మార్గంలోనే.. అమెరికన్ డెలిగేట్లతో కలసి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న ఇవాంకా ట్రంప్.. అక్కడి నుంచి 36.1 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెస్టిన్ హోటల్‌కు, దాని నుంచి 3.7 కిలోమీటర్ల దూరంలోని హెచ్ఐసీసీకి, విందుకోసం ఫలక్‌నుమా ప్యాలెస్‌కు 33 కిలోమీటర్లు పూర్తిగా రోడ్డు మార్గంలోనే ప్రయాణించనున్నారు. వాస్తవానికి ప్రధాని మోదీ, ఇవాంకాల కోసం హెచ్ఐసీసీ నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు హెలికాప్టర్ ఏర్పాటు చేయాలని భావించారు. అక్కడ హెలిప్యాడ్స్ లేకపోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. అయితే విందు రాత్రివేళ జరుగనుండడం, హెలికాప్టర్ ల్యాండింగ్‌కు ఇబ్బందుల తలెత్తే అవకాశం ఉండడంతో.. రోడ్డు మార్గంలోనే ప్రయాణించాలని భద్రతాధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఇవాంకా కాన్వాయ్ అత్యంత వేగంగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా రహదారుల అభివృద్ధి, అడ్డంకుల తొలగింపు, బందోబస్తును సిద్ధం చేస్తున్నారు. ఇక ఇవాంకా ఏ ప్రాంతానికి వెళ్లనున్నా.. కనీసం రెండు గంటల ముందే సీక్రెట్ సర్వీస్ బృందం అక్కడికి చేరుకుంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించడంతోపాటు ప్రత్యేక పరికరాల ద్వారా ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత, కాలుష్యం స్థాయి తదితరాలనూ గుర్తిస్తారని పేర్కొంటున్నారు. వీటి ఆధారంగా ఇవాంకా పాల్గొనే కార్యక్రమాల సమయాలను మారుస్తుంటారు. ఇందుకోసం ఇవాంకా షెడ్యూల్లో అవసరమైన సమయాన్ని రిజర్వ్‌లో ఉంచుతున్నారు. భద్రతా ఏర్పాట్లు ముమ్మరం ఇవాంకా పర్యటన కోసం అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, రాష్ట్ర పోలీసులు భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఆమెను కలిసే.. బస సమీపంలో ఉండే వారి వివరాలను సేకరిస్తున్నారు. ఆమెకు అందించనున్న బహుమతుల జాబితాలనూ పరిశీలిస్తున్నారు. ఇక వెస్టిన్ హోటల్లో 28 నుంచి 30వ తేదీ వరకు ఎవరికీ బుకింగ్స్ ఉండకూడదని ఆదేశించారు. ఈ మేరకు హోటల్ యాజమాన్యం ఆ మూడు రోజులు రూమ్స్ బుకింగ్ లేవని వెబ్సైట్లో పొందుపరిచింది. మరోవైపు అధికారిక విందు జరుగనున్న ఫలక్‌నుమా ప్యాలెస్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. కొత్తవారు, అనుమానితుల కదలికలపై నిఘా పెట్టారు. ఇక ప్రధాని మోదీ, ఇవాంకా పర్యటనల నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ విభాగం అధికారులు చర్యలు చేపట్టారు. 27న అర్ధరాత్రి చేరుకోనున్న ఇవాంకా హెచ్ఐసీసీలో 28వ తేదీ నుంచి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. దానికి కొన్ని గంటల ముందు.. అంటే 27న అర్ధరాత్రి 1.45 గంటల సమయంలో ఇవాంకా, అమెరికన్ డెలిగేట్లు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారని నిఘావర్గాలు తెలిపాయి. ఇవాంకాతో పాటు వచ్చే డెలిగేట్ల పూర్తి వివరాలను సీక్రెట్ సర్వీస్ ఇప్పటికే తనిఖీ చేసుకుందని.. తర్వాతే వారితో కలసి ప్రయాణించే ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నాయి. ఇవాంకా తన భద్రతాధికారులు ఏర్పాటు చేసిన 26 వాహనాల కాన్వాయ్‌లో వెస్టిన్ హోటల్‌కు చేరుకోనున్నారు. ఆమెతో పాటు వస్తున్న డెలిగేట్లకు శంషాబాద్‌లోని నోవాటెల్, రాడిసన్ తదితర హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. వారంతా 28న మధ్యాహ్నం 12 గంటల సమయంలో పారిశ్రామికవేత్తల సదస్సు జరిగే హెచ్ఐసీసీ ప్రాంగణానికి చేరుకుంటారు. రెండు వేల మందితో భద్రత రాష్ట్రాభివృద్ధికి, పెట్టుబడులకు కీలకమైన పారిశ్రామికవేత్తల సదస్సును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో 28న రాత్రి జరిగే విందుకు ప్రధాని మోదీ, ఇవాంకాతోపాటు రెండు వేల మంది వరకు అతిథులు హాజరుకానున్నారు. మరుసటి రోజు గోల్కొండ కోటలో జరుగనున్న విందులో అతిథులు పాల్గొంటారు. అయితే ఆ విందుకు ప్రముఖుల రాకపై ఎలాంటి సమాచారం లేదు. మొత్తంగా ఈ రెండు ప్రాంతాల్లో రెండు వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఎస్పీజీ, నీతి ఆయోగ్, అమెరికన్ అధికారులతో సమన్వయంతో పనిచేస్తున్నాం.. – శ్రీనివాసరావు, హైదరాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ వెస్టిన్‌లో స్పెషల్ ప్రెసిడెన్షియల్ సూట్ సిద్ధం ఇవాంకా బస కోసం మాదాపూర్‌లోని ది వెస్టిన్ హోటల్లో స్పెషల్ ప్రెసిడెన్షియల్ సూట్‌ను అధికారులు సిద్ధం చేశారు. నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఆ సూట్‌ను గురువారం మరోసారి పరిశీలించిన అమెరికన్ సీక్రెట్ సర్వీస్ (ఎస్ఎస్) ఏజెంట్లు ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ సూట్‌కు అన్నివైపులా ఉన్న అద్దాలకు అదనంగా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ ప్రెసిడెన్షియల్ సూట్లో సాధారణ సమయంలో ఎవరైనా బస చేయాలంటే రోజుకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇక వెస్టిన్ హోటల్ పైభాగంతో పాటు చుట్టుపక్కల ఉన్న భవనాలపై అమెరికన్ సాయుధ సిబ్బంది ప్రత్యేక ఆయుధాలతో కాపలా కాస్తారు. హోటల్ కింది భాగంలో ఇవాంకా వాహనాలను ఆపడం కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. -
ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల పర్యటన
అమరావతి: మండలంలోని జూపూడిలో గురువారం ప్రపంచబ్యాంకు ప్రతినిధులు, అధికారులు పర్యటించి పేదల జీవన స్థితిగతులపై అధ్యయనం చేశారు. వరల్డ్‌బ్యాంకు ప్రతినిధులు సాహితి, జాన్సన్, అభిషేక్ గుప్తా సయ్యద్, పాల్ ఆదాయ వనరులు, కుటుంబ పరిస్థితి, సామాజిక అభివృద్ధి వంటి అంశాలపై ప్రజల నుంచి వివరాలు సేకరించారు. డీఆర్డీఏ పీడీ హబీబ్‌బాషా మాట్లాడుతూ వరల్డ్ బ్యాంకు సహకారంతో వెలుగు ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో నిరుపేదలు ఎక్కువగా ఉన్న 150 మండలాలను ఎంపిక చేశారన్నారు. అందులో భాగంగా జూపూడి గ్రామాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ఐదేళ్లపాటు ఈ గ్రామాలాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారని వెల్లడించారు. అనంతరం అమరావతి వెలుగు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ఏరియా కో-అర్డినేటర్ సత్యసాయి, డీపీఎం గౌరీనాయుడు, కిరణ్‌కుమార్, శర్మ, ఏపీఎం సునీత పాల్గొన్నారు.